Italian company
-
ఇండియాలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న ఇటలీ టూ వీలర్ బ్రాండ్
ఇటాలియన్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ బ్రాండ్ వీఎల్ఎఫ్.. ఇండియన్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లోకి ప్రవేశించినట్లు ప్రకటించింది. అద్భుతమైన డిజైన్‌కు ప్రసిద్ధి చెందిన వీఎల్ఎఫ్ కేఏడబ్ల్యు వెలోస్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో జట్టుకట్టింది. ఈ భాగస్వామ్యంతో కంపెనీ ఓ సరికొత్త వెహికల్ లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.భారతదేశంలో మొదలయ్యే పండుగ సీజన్ సమయానికి కంపెనీ తన స్కూటర్ లాంచ్ చేయనున్నట్లు సమాచారం. కంపెనీ ప్రధానంగా టైర్ 1, టైర్ 2 నగరాలను లక్ష్యంగా చేసుకుని ఈ స్కూటర్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. దీనికోసం సంస్థ డీలర్ నెట్‌వర్క్‌ను కూడా ఏర్పాటు చేయడానికి సంకల్పించింది.వీఎల్ఎఫ్ కంపెనీ 2024 నాటికి 15 డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయాలని, అదే విధంగా ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి డీలర్‌షిప్‌ల సంఖ్యను 50కి పెంచనున్నట్లు సమాచారం. కేఏడబ్ల్యూ వెలోస్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ తుషార్ షెల్కే దీని గురించి మాట్లాడుతూ.. వీఎల్ఎఫ్ భారతీయ వినియోగదారులకు ఎలక్ట్రిక్ స్కూటర్లను త్వరలోనే అందిస్తుందని పేర్కొన్నారు. -
ఇటాలియన్ సంస్థతో హిందాల్కో జట్టు - కోట్లు ఇన్వెస్ట్ చేసే యోచన
న్యూఢిల్లీ: హై–స్పీడ్ అల్యుమినియం రైలు కోచ్‌ల తయారీకి సంబంధించి ఇటలీకి చెందిన మెట్రా సంస్థతో సాంకేతిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు హిందాల్కో ఇండస్ట్రీస్ తెలిపింది. దీనితో ఎక్స్‌ట్రూషన్, ఫ్యాబ్రికేషన్ టెక్నాలజీ విషయంలో హిందాల్కోకు మెట్రా సహకారం అందించనుంది. వాణిజ్య వాహనాలు, ఫ్రైట్ వ్యాగన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, ప్యాసింజరు రైళ్లలో అల్యూమినియం వినియోగాన్ని పెంచే దిశగా తాము చేస్తున్న ప్రయత్నాలకు ఇది ఉపయోగపడగలదని హిందాల్కో ఎండీ సతీష్ పాయ్ చెప్పారు. అల్యూమినియం వినియోగంతో రైల్వే కోచ్‌ల బరువు కొంత తగ్గగలదని ఆయన పేర్కొన్నారు. వందే భారత్ రైళ్ల కోచ్‌ల నిర్మాణం ప్రాజెక్టుపై రూ. 2,000 కోట్లు ఇన్వెస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు పాయ్ వివరించారు. అల్యుమినియం కోచ్‌లకు ముందు కాస్త ఎక్కువగా వెచ్చించాల్సి వచ్చినా, దీర్ఘకాలంలో పలు ప్రయోజనాలు ఉంటాయని ఆయన తెలిపారు. -
ఇటాలియన్ బ్రాండ్ ‘టోడ్స్’తో రిలయన్స్ జట్టు
న్యూఢిల్లీ: ఇటాలియన్ లగ్జరీ లైఫ్‌స్టయిల్ బ్రాండ్ టోడ్స్ ఎస్‌పీఏతో రిలయన్స్ బ్రాండ్స్ (ఆర్బీఎల్) దీర్ఘకాలిక ఫ్రాంచైజీ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం భారత మార్కెట్లో టోడ్స్ ఉత్పత్తులకు (పాదరక్షలు, హ్యాండ్ బ్యాగ్‌లు, యాక్సెసరీలు మొదలైనవి) ఆర్బీఎల్ అధికారిక రిటైల్ విక్రేతగా ఉంటుంది. అలాగే టోడ్స్కి ప్రస్తుతం భారత్‌లో ఉన్న స్టోర్స్ మేనేజ్మెంట్ను టేకోవర్ చేస్తుంది. 2008 నుంచి టోడ్స్ భారత్‌లో న్యూఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల్లో మోనో–బ్రాండ్ స్టోర్స్ ఉన్నాయి. అజియో లగ్జీ మల్టీ బ్రాండ్ ఈ–కామర్స్ ప్లాట్ఫారం ద్వారా కూడా విక్రయాలు సాగిస్తోంది. మిలన్ స్టాక్ ఎక్సే్చంజీలో లిస్టయిన టోడ్స్కి ప్రపంచవ్యాప్తంగా 318 సొంత స్టోర్స్, 88 ఫ్రాంచైజీ స్టోర్స్ ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్)కి చెందిన రిటైల్ విభాగం రిలయన్స్ రిటైల్ వెంచర్స్ అనుబంధ సంస్థ ఆర్బీఎల్. 2007లో కార్యకలాపాలు ప్రారంభించింది. చదవండి: బ్రిటన్–భారత్ పరిశ్రమల టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు -
100 ఏళ్లు మన్నికయ్యే రంగులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెయింట్స్ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ టెక్నో పెయింట్స్ లైమ్ ఆధారిత ఇటాలియన్ ఫినిషెస్‌ను భారత్‌లో ప్రవేశపెట్టింది. వారసత్వ కట్టడాలకు లైమ్ ఆధారిత పెయింట్స్‌ను వాడతారని, 100 ఏళ్లకుపైగా మన్నికగా ఉండడం వీటి ప్రత్యేకత అని కంపెనీ తెలిపింది. రసాయనాలు లేకుండా సహజ ఖనిజాలు, వర్ణ ద్రవ్యాలతో వీటిని తయారు చేస్తారు. ఖరీదైన భవంతులు, విల్లాలకూ ఈ రంగుల వినియోగం పెరుగుతోందని కంపెనీ వివరించింది. లైమ్ ఆధారిత రంగుల తయారీ భారత్‌లో లేదని, కొన్ని కంపెనీలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నాయని తెలిపింది. చదరపు అడుగుకు అయ్యే ఖర్చు రూ.150–400 మధ్య ఉంటుంది. లైమ్ ప్లాస్టర్స్, డెకోరేటివ్ ఫినిషెస్, వెనీషియన్ ప్లాస్టర్స్, మెటాలిక్ స్టకోస్ సైతం కంపెనీ విక్రయించనుంది. ఆర్డర్ బుక్ రూ.600 కోట్లు..: ఇటలీ కంపెనీ రియాల్టోతో టెక్నో పెయింట్స్ సాంకేతిక సహకారం కుదుర్చుకుంది. లైమ్ ఆధారిత ఫినిషెస్‌ను తొలుత దిగుమతి చేసుకుంటామని టెక్నో పెయింట్స్‌ను ప్రమోట్ చేస్తున్న ఫార్చూన్ గ్రూప్ ఫౌండర్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ‘అమ్మకాలు పెరిగిన తర్వాత వీటిని ఉత్పత్తి చేస్తాం. రియాల్టో సాంకేతిక పరిజ్ఞానంతో ఖరీదైన డిజైనింగ్ ఫినిషెస్‌ను తయారు చేస్తున్నాం. హైదరాబాద్ సమీపంలోని పటాన్చెరు వద్ద ఉన్న కొత్త ప్లాంటు వార్షిక సామర్థ్యం ఒక లక్ష మెట్రిక్ టన్నులు. తొలి దశలో రూ.75 కోట్లు వెచ్చించాం. ప్లాంటు వినియోగం 2023 మార్చికల్లా 100 శాతానికి చేరుతుంది. 2023–24లో మరో రూ.75 కోట్లు ఖర్చు చేస్తాం. తద్వారా సామర్థ్యం రెండింతలు అవుతుంది. ఆర్డర్ బుక్ రూ.600 కోట్లు ఉంది’ అని వివరించారు. -
ఇటలీ కంపెనీతో టెక్నో పెయింట్స్ జోడీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెయింట్స్ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ టెక్నో పెయింట్స్ తాజాగా ఇటలీ సంస్థతో చేతులు కలిపింది. ఇటలీ సంస్థ సాంకేతిక సహకారంతో సూపర్ ప్రీమియం పెయింట్ల తయారీలోకి అడుగుపెట్టనుంది. ఇందుకోసం కొత్త ప్లాంటుకు రూ.75 కోట్లు వెచ్చించనున్నట్టు టెక్నో పెయింట్స్‌ను ప్రమోట్ చేస్తున్న ఫార్చూన్ గ్రూప్ ఫౌండర్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం తెలిపారు. ప్రస్తుతం కొన్ని కంపెనీలు మాత్రమే సూపర్ ప్రీమియం పెయింట్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని దేశంలో విక్రయిస్తున్నాయి. తాము మాత్రమే ఈ విభాగంలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ఆయన వెల్లడించారు. నూతన తయారీ కేంద్రంలో.. కంపెనీ 6వ ప్లాంటును హైదరాబాద్ పటాన్చెరు సమీపంలోని చేర్యాల్ వద్ద స్థాపిస్తోంది. దీని వార్షిక సామర్థ్యం 2 లక్షల మెట్రిక్ టన్నులు. 200 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఇక్కడ సూపర్ ప్రీమియం కోటింగ్స్, హై ఎండ్ లగ్జరీ ఎమల్షన్స్, డెకోరేటివ్ పెయింట్స్, స్పెషల్ టెక్స్చర్ ఫినిషెస్, లగ్జరీ, అల్ట్రా లగ్జరీ ఎమల్షన్స్, డిజైనర్ ఫినిషెస్ తయారు చేస్తారు. ఇరవయ్యేళ్ల ప్రయాణంలో.. టెక్నో పెయింట్స్ ఆగస్ట్ 25న రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంటోంది. 650 ప్రాజెక్టులను పూర్తి చేసింది. చేతిలో 120 ప్రాజెక్టులు ఉన్నాయి. ఆర్డర్ బుక్ రూ.600 కోట్లుంది. హైదరాబాద్‌లో పెయింటింగ్ సేవల్లో అగ్ర స్థాయిలో ఉన్న టెక్నో పెయింట్స్ 2021–22లో టర్నోవర్‌లో 50 శాతం వృద్ధి ఆశిస్తోంది. ఇక నుంచి చిన్న ప్రాజెక్టులను సైతం చేపట్టనుంది. కస్టమర్ల నమ్మకంతోనే విజయవంతంగా రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్నామని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. -
మహీంద్రా నుంచి ₹17 కోట్ల ఎలక్ట్రిక్ సూపర్ ఫాస్ట్ కారు
దేశీయ ఆటో మొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా 2015లో ఇటాలియన్ ఆటోమొబిలి కంపెనీ పినిన్ఫరీనాను కొనుగోలు చేసింది. ఫెరారీ, మసెరాటి, రోల్స్ రాయిస్, ఆల్ఫా రోమియో, కాడిలాక్ వంటి ఉత్తమ బ్రాండ్లకు ప్రసిద్ధి చెందిన ఇటాలియన్ ఆటోమొబైల్ డిజైనింగ్ కంపెనీకి $185 మిలియన్లు(సుమారు ₹1,240 కోట్లు) చెల్లించి ఆ కంపెనీని మహీంద్రా గ్రూప్ సొంతం చేసుకుంది. ఈ ఎలక్ట్రిక్ వాహనం(ఈవీ) పేరును కంపెనీ వ్యవస్థాపకుడు బాటిస్టా పినిన్ఫరీనాకు నివాళిగా పెట్టారు. సింగిల్ చార్జ్ తో 450 కి.మీ ప్రయాణం బాటిస్టాను ఆవిష్కరించిన రెండు సంవత్సరాల తర్వాత పినిన్‌ఫరీనా ఆగస్టు 12 - ఆగస్టు 15 మధ్య జరగబోయే మాంటెరీ కార్ వీక్(యుఎస్)లో బాటిస్టా హైపర్ జీటీని అధికారికంగా సంస్థ ప్రారంభించనుంది. ఈ ఎలక్ట్రిక్ కారులో ప్రతి చక్రం వద్ద నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లును అమర్చారు. దీని వల్ల మొత్తం 1,400కెడబ్ల్యు(కిలోవాట్) శక్తి బయటకు వస్తుంది. ఇది 1,900 హార్స్ పవర్(బిహెచ్ పీ)కు సమానం. ఇది 120 కిలోవాట్-అవర్ బ్యాటరీ నుంచి శక్తిని పొందుతుంది. అయితే, ప్రముఖ టెస్లా మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ లలో 100 కిలోవాట్ బ్యాటరీని ఉపయోగిస్తున్నారు. ఈ కారు 2,300 ఎన్ఎమ్(న్యూటన్ మీటర్లు) టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అంతే కాదు, ఇది గరిష్టంగా 350 కిలోమీటర్ల(217 మైళ్ళు) వేగాన్ని అందుకోనుంది. అనేక ఇంధన ఆధారిత సూపర్ కార్ల కంటే దీని వేగం ఎక్కువ. ఉదాహరణకు, ఫెరారీ 812 సూపర్ ఫాస్ట్ గంటకు 340 కిలోమీటర్లు (211 మైళ్ళు) అధిక వేగంతో వెళ్ళగలదు. బాటిస్టాను ఒకేసారి ఛార్జ్ చేస్తే సుమారు 450 కిలోమీటర్లు(280 మైళ్ళు) వెళ్లగలదు అని సంస్థ పేర్కొంది. దీనిలో ఆకట్టుకునే ఇంటీరియర్ కూడా ఉంది. ఇది ఎలక్ట్రిక్ లగ్జరీ కారు కాబట్టి ఇందులో క్విల్టెడ్ సీట్లు, మూడు డ్రైవర్ సైడ్ స్క్రీన్లు, ప్రీమియం డ్యాష్ బోర్డ్ తో వస్తుంది. బాటిస్టా పరిమిత ఎడిషన్ మోడల్ పినిన్‌ఫరీనా బాటిస్టా 2022 ప్రారంభంలో అమ్మకానికి రానుంది. దీని ధర $2.2 మిలియన్లకు పైగా (సుమారు ₹17 కోట్లు) ఉండే అవకాశం ఉంది. మహీంద్రా ఇంకా భారతదేశంలో ఈ కారు గురుంచి ప్రణాళికలను ధృవీకరించలేదు, కానీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిష్ షా మాట్లాడుతూ.. దేశంలోకి తీసుకొనిరావడానికి వ్యూహాన్ని రచిస్తున్నట్లు పేర్కొన్నారు. బటిస్టా ఉదాహరణను ఇస్తూ.. భారతదేశం వెలుపల మహీంద్రా ఈవి టెక్ గొప్పదని, ఇది త్వరలో భారతదేశానికి వస్తుందని ఆయన అన్నారు. బాటిస్టా పరిమిత ఎడిషన్ మోడల్ అని, కేవలం 125 మోడల్స్ మాత్రమే తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఆటోమొబిలి పినిన్‌ఫరీనా చీఫ్ ఇంతకు ముందు 150 మోడల్స్ తయారు చేస్తామని చెప్పారు. -
సిటీలో ఇటాలియన్ బైక్స్
నాగోలు: సిటీలో ఇటాలియన్ బ్రాండ్ బైకులు అందుబాటులోకి వచ్చాయి. నాగోలులో సోమవారం బెనెల్లీ బైక్స్ షోరూం ప్రారంభమైంది. బెనెల్లీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ జబక్ దీన్ని ప్రారంభించారు. గూంచా మోటార్స్‌తో కలిసి నగరంలో రెండో షో రూమ్‌ను ప్రారంభించామని ఆయన దేశమంతటా బెనెల్లీ 3–ఎస్ బైకులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎల్బీనగర్ బెనెల్లీ షో రూమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ భర్వాణి మాట్లాడుతూ బెనెల్లీ కంపెనీకి చెందిన అన్ని మోడల్స్ బైకులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. -
అపార్ట్మెంట్లలో అడవి!
అపార్ట్మెంట్లలో మొక్కలు పెంచుకోవడమే కష్టమని అనుకుంటున్నారా...? మరి ఇటలీ కంపెనీ ఒకటి ఏకంగా అడవినే పెంచే ప్రయత్నాలు చేస్తోంది. బాస్కో వర్టికాలీ (ఎత్తై అడవి) అనే పేరుతో మిలాన్‌లోని పోర్టా నువోవా జిల్లాలో 80,112 మీటర్ల ఎత్తు ఉండే రెండు అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లలో వివిధ రకాల చెట్లు, పూలమొక్కల్ని పెంచే ప్రాజెక్టును చేపట్టింది. నిర్మాణం దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లలో ఇప్పటికే 900 చెట్లను పెంచుతున్నారు. వీటితోపాటు పొదలు, 11 వేల పూల మొక్కలు కూడా ఉంటాయి. ఈ చెట్లు, మొక్కలను నేలపై పెంచాలంటే 2.68 ఎకరాల నేల కావాలట.