న్యూఢిల్లీ: హై–స్పీడ్ అల్యుమినియం రైలు కోచ్‌ల తయారీకి సంబంధించి ఇటలీకి చెందిన మెట్రా సంస్థతో సాంకేతిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు హిందాల్కో ఇండస్ట్రీస్ తెలిపింది. దీనితో ఎక్స్‌ట్రూషన్, ఫ్యాబ్రికేషన్ టెక్నాలజీ విషయంలో హిందాల్కోకు మెట్రా సహకారం అందించనుంది.
వాణిజ్య వాహనాలు, ఫ్రైట్ వ్యాగన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, ప్యాసింజరు రైళ్లలో అల్యూమినియం వినియోగాన్ని పెంచే దిశగా తాము చేస్తున్న ప్రయత్నాలకు ఇది ఉపయోగపడగలదని హిందాల్కో ఎండీ సతీష్ పాయ్ చెప్పారు. అల్యూమినియం వినియోగంతో రైల్వే కోచ్‌ల బరువు కొంత తగ్గగలదని ఆయన పేర్కొన్నారు.
వందే భారత్ రైళ్ల కోచ్‌ల నిర్మాణం ప్రాజెక్టుపై రూ. 2,000 కోట్లు ఇన్వెస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు పాయ్ వివరించారు. అల్యుమినియం కోచ్‌లకు ముందు కాస్త ఎక్కువగా వెచ్చించాల్సి వచ్చినా, దీర్ఘకాలంలో పలు ప్రయోజనాలు ఉంటాయని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment