hindalco
-
ఇటాలియన్ సంస్థతో హిందాల్కో జట్టు - కోట్లు ఇన్వెస్ట్ చేసే యోచన
న్యూఢిల్లీ: హై–స్పీడ్ అల్యుమినియం రైలు కోచ్‌ల తయారీకి సంబంధించి ఇటలీకి చెందిన మెట్రా సంస్థతో సాంకేతిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు హిందాల్కో ఇండస్ట్రీస్ తెలిపింది. దీనితో ఎక్స్‌ట్రూషన్, ఫ్యాబ్రికేషన్ టెక్నాలజీ విషయంలో హిందాల్కోకు మెట్రా సహకారం అందించనుంది. వాణిజ్య వాహనాలు, ఫ్రైట్ వ్యాగన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, ప్యాసింజరు రైళ్లలో అల్యూమినియం వినియోగాన్ని పెంచే దిశగా తాము చేస్తున్న ప్రయత్నాలకు ఇది ఉపయోగపడగలదని హిందాల్కో ఎండీ సతీష్ పాయ్ చెప్పారు. అల్యూమినియం వినియోగంతో రైల్వే కోచ్‌ల బరువు కొంత తగ్గగలదని ఆయన పేర్కొన్నారు. వందే భారత్ రైళ్ల కోచ్‌ల నిర్మాణం ప్రాజెక్టుపై రూ. 2,000 కోట్లు ఇన్వెస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు పాయ్ వివరించారు. అల్యుమినియం కోచ్‌లకు ముందు కాస్త ఎక్కువగా వెచ్చించాల్సి వచ్చినా, దీర్ఘకాలంలో పలు ప్రయోజనాలు ఉంటాయని ఆయన తెలిపారు. -
ఈవీలపై దేశీ కార్పొరేట్ల దృష్టి
ముంబై: దేశీయంగా పలు కార్పొరేట్ దిగ్గజాలు ఇటీవల కొంత కాలంగా ఎలక్ట్రిక్ వాహనా(ఈవీ)లవైపు దృష్టి సారిస్తున్నాయి. తమ ప్లాంట్లు కార్యాలయాల్లో ఉద్యోగుల రవాణాకు ఇవి అనుకూలమని భావిస్తున్నాయి. దీంతో మెటల్ దిగ్గజాలు టాటా స్టీల్, హిందాల్కోతోపాటు ఐటీ బ్లూచిప్ కంపెనీలు క్యాప్‌జెమిని, కాగ్నిజెంట్, గ్లోబల్ బ్యాంకింగ్ సంస్థలు బార్క్లేస్, బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ మెలన్, అలియంజ్ టెక్నాలజీస్ ఎలక్ట్రిక్ వాహన పాలసీలకు తెరతీస్తున్నాయి. తద్వారా ఉద్యోగులను ఈవీలను కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పటికే ఈవీల అమ్మకాలు ఊపందుకున్న నేపథ్యంలో పలు కార్పొరేట్ల తాజా ప్రణాళికలు పరిశ్రమకు జోష్‌నిచ్చే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరిన్ని సంస్థలు రెడీ బ్యాటరీ ఆధారంగా నడిచే ఈవీలు కొంతకాలంగా భారీగా విక్రయమవుతున్నాయి. మారియట్, నోవాటెల్ తదితర ఆతిథ్య రంగ కంపెనీలు సైతం ఈవీలను కొనుగోలు చేస్తున్నాయి. ఐటీ, బ్యాంకింగ్ సంస్థల బాటలో హోటల్ చైన్ కంపెనీలు ఈవీలను మాత్రమే వినియోగించవలసిందిగా విక్రేతలు(వెండార్ల)కు సూచిస్తున్నాయి. ఇక మరోపక్క ఎన్ఎంసీలు తమ కార్యకలాపాలలో ఈవీల వినియోగ ప్రభావాన్ని పరిశీలిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఈవీల వినియోగానికి మరింత మద్దతివ్వనున్నట్లు తెలియజేశాయి. పర్యావరణ పరిరక్షణ బాటలో ఈవీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నాయి. డిసెంబర్లో డీలా రూ. 1,100 కోట్ల సబ్సిడీ పంపిణీ నిలిచిపోయిన నేపథ్యంలో గత నెల(డిసెంబర్)లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విక్రయాలు క్షీణించాయి. 2022 నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్లో 20 శాతం నీరసించాయి. రోడ్, రవాణా, జాతీయ రహదారుల శాఖ వాహన పోర్టల్ గణాంకాల ప్రకారం స్థానిక మార్కెట్లో నవంబర్‌లో 76,162 వాహనాలు అమ్ముడుపోగా.. డిసెంబర్లో ఇవి 59,554 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఈవీలను ప్రోత్సహించేందుకు తీసుకువచ్చిన ఫేమ్–2 విధానాలలో భాగంగా ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తుంది. అయితే 2022 ఏప్రిల్ నుంచి సబ్సిడీలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. స్థానిక విలువ జోడింపు నిబంధనల ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో సబ్సిడీ చెల్లింపులు నిలిచిపోయినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. హీరో ఎలక్ట్రిక్, ఓకినావా ఆటోటెక్, రివోల్ట్, యాంపియర్ తదితర 6 కంపెనీలకు సబ్సిడీలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఓవైపు ఈ అంశాలపై ప్రభుత్వం దర్యాప్తు చేపట్టగా.. మరోపక్క సబ్సిడీలు ఆగిపోవడంతో క్యాష్ ఫ్లోలపై ఒత్తిడి పడుతున్నట్లు కంపెనీల ప్రతినిధులు తెలియజేశారు. సమస్య త్వరగా పరిష్కారంకాకుంటే అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంటున్నారు. ప్రోత్సాహకాలు ఇలా ప్రభుత్వం ద్విచక్ర ఈవీలకు కిలోవాట్‌కు రూ. 15,000 చొప్పున ప్రోత్సాహకం అందిస్తోంది. అయితే మొత్తం వాహన వ్యయంలో 40 శాతం మించకుండా పరిమితి విధించింది. ఇందుకు స్థానికతకు ప్రాధాన్యతనిస్తూ విలువ జోడింపును చేపట్టవలసి ఉంటుంది. ఈ విషయంలో వాహన విక్రయం తదుపరి కంపెనీలు సంబంధిత ఆధారాలు దాఖలు చేయవలసి ఉంటుంది. ఆపై 45–90 రోజుల్లోగా వాహనం రిటైల్ ధరపై ప్రభుత్వం ప్రోత్సాహకాలను విడుదల చేస్తుంది. ఈవీ కంపెనీలకు ప్రభుత్వం అవాంతరాలు సృష్టించబోదని, దేశీయంగా పరిశ్రమలో సానుకూల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకే ప్రాధాన్యత ఇస్తుందని అధికారిక వర్గాలు వివరిస్తున్నాయి. 2023లో రెట్టింపునకు ఈ క్యాలండర్ ఏడాది(2023)లో ఎలక్ట్రిక్ వాహన రిటైల్ విక్రయాలు రెట్టింపునకు జంప్‌చేయనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. వెరసి 2.2 మిలియన్ యూనిట్లకు తాకనున్నట్లు అంచనా. ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీల సొసైటీ(ఎస్ఎంఈవీ) గణాంకాల ప్రకారం 2022లో ఈవీ రిటైల్ అమ్మకాలు మిలియన్ యూనిట్లకు చేరాయి. కాగా.. గత నెలలోనే వేదాంతా గ్రూప్ ఉద్యోగులకు ఈవీ పాలసీని ప్రవేశపెట్టింది. నెట్ జీరో కర్బన విధానాలకు అనుగుణంగా తాజా పాలసీకి తెరతీసింది. -
హిందాల్కో మిశ్రమ ఫలితాలు
న్యూఢిల్లీ: హిందాల్కో ఇండస్ట్రీస్ సెప్టెంబర్ త్రైమాసికానికి మిశ్రమ ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ లాభం 35 శాతం తగ్గిపోయి రూ.2,205 కోట్లకు పరిమితం కాగా, ఆదాయం మాత్రం 18 శాతం పెరిగి రూ.56,176 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.3,417 కోట్లు, ఆదాయం రూ.47,665 కోట్ల చొప్పున ఉండడం గమనించాలి. మెరుగైన అమ్మకాలు ఆదాయంలో వృద్ధికి తోడ్పడినట్టు కంపెనీ తెలిపింది. రూ.5,743 కోట్ల ఎబిట్డా (పన్నులు, వడ్డీకి ముందస్తు) నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 29 శాతం తక్కువ. ‘‘తయారీ వ్యయాలు పెరగడం, అననుకూల ఆర్థిక పరిస్థితులు ప్రభావం చూపించాయి. కాపర్ వ్యాపారంలో మెరుగైన నిర్వహణ పనితీరు, విక్రయాలు బలంగా ఉండడంతో ఈ ప్రభావాన్ని కొంత వరకు అధిగమించగలిగాం’’అని హిందాల్కో ఎండీ సతీష్ పాయ్ తెలిపారు. గత కొన్నేళ్లుగా కంపెనీ వ్యాపారం మరింత బలోపేతంగా, సమగ్రంగా మార్పు చెందడం సవాళ్ల వాతావరణంలోనూ బలమైన ఫలితాలు సాధించేందుకు అనుకూలించినట్టు వివరించారు. -
ఎలక్ట్రిక్ వాహనాల దెబ్బకు ఆ కంపెనీలకు భారీ నష్టాలు..!
కరోనా మహమ్మారి కాలంలో వేగంగా వృద్ది చెందుతున్న రంగం ఏదైనా ఉంది అంటే ఎలక్ట్రిక్ వాహన రంగం అని చెప్పుకోవాలి. అయితే, గ్లోబల్ మొబిలిటీలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) వాటా పెరగడంతో హిందాల్కో వంటి అల్యూమినియం ఉత్పత్తిదారులు లాభపడితే.. ఉక్కు తయారీదారులు నష్టపోతున్నట్లు ఒక కొత్త పరిశోధన నివేదిక పేర్కొంది. మెటల్ రంగంలో ఉన్న దిగ్గజ టాటా స్టీల్, జెఎస్ డబ్ల్యు స్టీల్ వంటి ఉక్కు ఉత్పత్తిదారుల కంటే హిందాల్కో ధర సుమారు 30% పేరుగుతున్నట్లు గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ జెఫెరీస్ తెలిపింది. అల్యూమినియం తేలికైన లోహాలలో ఒకటి. ఈ లోహాన్ని ఈవీల తయారీలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇనుముతో పోలిస్తే దీని బరువు తక్కువగా ఉండటం వల్ల ఈ లోహాన్ని ఏరోస్పేస్ పరిశ్రమలో కూడా ఉపయోగిస్తారు. సాదారణ వాహనాలలో సగటున అల్యూమినియం వినియోగం కారులో సుమారు 50-70 కిలోగ్రాములు, ద్విచక్ర వాహనాల 20-30 కిలోలుగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఎలక్ట్రిక్ కారులో సగటున 250 కిలోల అల్యూమినియం ఉపయోగిస్తున్నారు. ఫలితంగా, అల్యూమినియం బాడీలతో తయారు చేసే వాహనాలు ఇతర వాహనాల కంటే ఖరీదైనవిగా మారుతున్నాయి. అల్యూమినియం వినియోగం పెరగడం వల్ల ఉక్కు వంటి లోహానికి డిమాండ్ సెప్టెంబర్ 2021 నుంచి తగ్గుతూ వస్తుంది. ఈవీలలో అల్యూమినియం ఎక్కువగా వినియోగించడానికి రేంజ్ ఒక ప్రధాన కారణం. ఎలక్ట్రిక్ వాహన బరువు తగ్గడం వల్ల ఆ మేరకు వాహనం రేంజ్ అనేది పెరుగుతుంది. ఈవీ అమ్మకాలలో వాహన రేంజ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. (చదవండి: అదానీ గ్రూప్స్ మరో రికార్డు..! ఏకంగా రూ. 10 లక్షల కోట్లు..!) -
హిందాల్కో చేతికి ఏపీలోని కుప్పం ప్లాంటు
న్యూఢిల్లీ: అల్యూమినియం, కాపర్ తయారీలో ఉన్న హిందాల్కో ఇండస్ట్రీస్ తాజాగా నార్వే కంపెనీ హైడ్రోకు చెందిన భారత్‌లోని అల్యూమినియం ఎక్స్‌ట్రూజన్స్ వ్యాపారాన్ని కొనుగోలు చేయనుంది. డీల్ విలువ రూ.247 కోట్లు. వచ్చే త్రైమాసికంలో లావాదేవీ పూర్తి అవుతుందని కంపెనీ వెల్లడించింది. ఈ డీల్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం వద్ద ఉన్న హైడ్రోకు చెందిన ప్లాంటు హిందాల్కో చేతికి రానుంది. ఈ కేంద్రం సామర్థ్యం 15,000 టన్నులు. ఈ తయారీ కేంద్రంలో ఆటో, బిల్డింగ్, కన్స్ట్రక్షన్, ఇండస్ట్రియల్ అప్లికేషన్లకు కావాల్సిన ఉత్పత్తులు, పరిష్కారాలను ప్లాంటు అందిస్తోంది. ప్లాంటు చేరికతో హై–ఎండ్ ఎక్స్‌ట్రూజన్స్, ఫ్యాబ్రికేటెడ్ సొల్యూషన్స్ విభాగాల్లో ప్రత్యేక ఉత్పత్తుల తయారీ సామర్థ్యం అధికమవుతుందని హిందాల్కో ఎండీ సతీశ్ పాయ్ తెలిపారు. హిందాల్కోను ఆదిత్యా బిర్లా గ్రూప్ ప్రమోట్ చేస్తోంది. -
37 శాతం తగ్గిన హిందాల్కో లాభం
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన ప్రధాన కంపెనీ, హిందాల్కో ఇండస్ట్రీస్ నికర లాభం (స్టాండ్ అలోన్) గత ఆర్థిక సంవత్సరం (2018–19) నాలుగో త్రైమాసిక కాలంలో 37 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) క్యూ4లో రూ.377 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.236 కోట్లకు తగ్గిందని హిందాల్కో తెలిపింది. ఆదాయం మాత్రం రూ.11,892 కోట్ల నుంచి రూ.12,733 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎమ్డీ సతీశ్ పాయ్ చెప్పారు. . ఉత్పత్తి వ్యయాలు పెరగడం, ఆర్థిక స్థితిగతులు బలహీనంగా ఉండటం వల్ల నికర లాభం తగ్గిందని వివరించారు. ఒక్కో షేర్‌కు రూ.1.20 డివిడెండ్(120 శాతం)ను ఇవ్వనున్నామని తెలిపారు. వ్యాపార పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ, మంచి ఫలితాలు సాధించామని సతీష్ సంతృప్తి వ్యక్తం చేశారు. -
హిందాల్కో చేతికి అమెరికా కంపెనీ
ముంబై: ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రధాన కంపెనీ హిందాల్కో.. అమెరికాకు చెందిన అల్యూమినియమ్ కంపెనీ ‘అలెరిస్’ను కొనుగోలు చేయనున్నది. వాహన, విమానయాన రంగాల ఉత్పత్తులను అందించే అలెరిస్ కంపెనీని 258 కోట్ల డాలర్లకు(సుమారుగా రూ.17,800 కోట్లు) కొనుగోలు చేయడానికి తమ విదేశీ అనుబంధ కంపెనీ నొవాలిస్ ఒక నిశ్చయాత్మకమైన ఒప్పందాన్ని కుదుర్చుకుందని హిందాల్కో గురువారం తెలిపింది. క్లీవ్‌ల్యాండ్‌లోని ఓహియో కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అలెరిస్ కంపెనీ చేరికతో హిందాల్కో కంపెనీ ప్రపంచంలోనే రెండో అతి పెద్ద అల్యూమినియమ్ కంపెనీగా నిలుస్తుందని కంపెనీ చైర్మన్ కుమార మంగళం బిర్లా వివరించారు. అంతేకాకుండా విలువ ఆధారిత ఉత్పత్తుల సెగ్మెంట్లో మరిన్ని విభిన్నమైన ఉత్పత్తులను అందించడానికి వీలవుతుందని పేర్కొన్నారు. ఈ లావాదేవీ 9–15 నెలల్లో పూర్తవ్వగలదని తెలిపారు. ఈ కంపెనీ కొనుగోలుకు కావలసిన నిధులను రుణాల ద్వారా సమీకరిస్తామని వివరించారు. కాగా, అమెరికా విధిస్తున్న దిగుమతి సుంకాలు స్వల్పకాలిక చర్యేనని, స్వల్ప ప్రభావమే ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. అలెరిస్ కంపెనీకి ఉత్తర అమెరికా, చైనా, యూరప్ దేశాల్లో మొత్తం 13 ప్లాంట్లున్నాయి. హిందాల్కో కంపెనీ పదేళ్ల క్రితం అమెరికాకు చెందిన నొవాలిస్ కంపెనీని 600 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత మళ్లీ ఇదే అతి పెద్ద కొనుగోలు. -
హిందాల్కో లాభం రూ.377 కోట్లు
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన హిందాల్కో కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలం(2017–18, క్యూ4)లో రూ.377 కోట్ల నికర లాభం(స్డాండెలోన్) సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2016–17) క్యూ4లో వచ్చిన నికర లాభం, రూ.503 కోట్లతో పోల్చితే 25 శాతం క్షీణించిందని హిందాల్కో వివరించింది. మొత్తం ఆదాయం కూడా రూ.11,970 కోట్ల నుంచి రూ.11,886 కోట్లకు తగ్గిందని తెలిపింది. మొత్తం వ్యయాలు ఎలాంటి మార్పు లేకుండా రూ.11,330 కోట్లుగా ఉన్నాయని పేర్కొంది. నిర్వహణ లాభం రూ.1,347 కోట్ల నుంచి 7 శాతం తగ్గి రూ.1,258 కోట్లకు తగ్గిందని తెలిపింది. నిర్వహణ మార్జిన్ 12.2 శాతం నుంచి 10.8 శాతానికి చేరిందని పేర్కొంది. అల్యూమినియం వ్యాపారానికి సంబంధించిన ఇబిట్ ఫ్లాట్‌గా రూ.920 కోట్లుగా ఉండగా, కాపర్ వ్యాపారం ఇబిట్ 34 శాతం క్షీణించి రూ.329 కోట్లకు తగ్గిందని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో అల్యూమినియం వ్యాపార విభాగం ఆదాయం రూ.21,089 కోట్లుగా ఉందని హిందాల్కో తెలిపింది. అలాగే రాగి విభాగం ఆదాయం 15 శాతం వృద్ధితో రూ.22,371 కోట్లకు పెరిగిందని తెలిపింది. రాగి ఉత్పత్తి 410 కిలో టన్నులుగా ఉందని, కంపెనీ చరిత్రలో ఇదే అత్యధికమని పేర్కొంది. -
హిందాల్కో నికరలాభం 25 శాతం అప్
న్యూఢిల్లీ: బేస్ మెటల్స్ ఉత్పాదక కంపెనీ హిందాల్కో నికరలాభం స్టాండెలోన్ ప్రాతిపదికన 2017 మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో 25% వృద్ధితో రూ. 502 కోట్లకు చేరింది. గతేడాది ఇదేకాలంలో కంపెనీ రూ.401 కోట్ల లాభాన్ని ఆర్జించింది. తాజాగా ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 9,472 కోట్ల నుంచి రూ. 11,969 కోట్లకు చేరింది. 2016–17 పూర్తి ఆర్థిక సంవత్సరంలో నికరలాభం 182% వృద్ధితో రూ. 1,557 కోట్లకు చేరింది. ఉత్పాదక వ్యయం తగ్గడం, అల్యూమినియం అమ్మకాల పరిమాణం, మార్జిన్లు అధికంగా వుండటంతో పూర్తి సంవత్సరంలో తమ ఇబిటా 25% వృద్ధితో రూ. 5,819 కోట్లకు పెరిగినట్లు హిందాల్కో విడుదల చేసిన ప్రకటన తెలిపింది. స్టాండెలోన్ ప్రాతిపదికన రూ.39,383 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో కన్సాలిడేటెడ్ ఆదాయం రూ. 1,02,631 కోట్లుకాగా, ఇబిటా 36% వృద్ధితో రూ.13,558 కోట్లకు పెరిగింది. రూ.1,900 కోట్ల కన్సాలిడేటెడ్ నికరలాభాన్ని నమోదుచేసింది. -
స్టాక్స్ వ్యూ
హిందాల్కో బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.172 టార్గెట్ ధర: రూ.234 ఎందుకంటే: హిందాల్కో.. పటిష్టమైన బిజినెస్ మోడల్ కంపెనీ సొంతం. మైనింగ్ కార్యకలాపాలు, వాహనాలకు, బేవరేజేస్ క్యాన్లకు అవసరమయ్యే అల్యూమినియం ఉత్పత్తులందిస్తోంది. స్పెషల్ గ్రేడ్ అల్యూమినాను తయారు చేస్తోంది. కంపెనీ పూర్తి రుణభారాన్ని తీర్చివేయగలిగే స్థాయిలో స్పెషల్ గ్రేడ్ అల్యూమినా వ్యాపారం ఉంది. దేశీయంగా బొగ్గు, బాక్సైట్ సరఫరాలు మెరుగుపడడం వల్ల ఉత్పత్తి వ్యయాలు తగ్గుతున్నాయి. వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసిన ప్లాంట్ల వల్ల రవాణా వ్యయాలు కూడా తగ్గుతున్నాయి. ఉత్పత్తి వ్యయాలు తగ్గడం.. వల్ల అల్యూమినియం వ్యాపారానికి బాగా ప్రయోజనం కలుగుతోంది. సొంత బాక్సైట్ గనులు, అల్యుమినా రిఫైనరీ, విద్యుత్ ప్లాంట్ల కోసం గతంలో పెట్టిన 600 కోట్ల డాలర్ల పెట్టుబడులు ఫలాలు ఇప్పుడు కంపెనీకి అందుతున్నాయి. అధిక మార్జిన్లు వచ్చే వాహన విడిభాగాల కోసం అమెరికాలో డిమాండ్ పెరగడం వల్ల హిందాల్కో అనుబంధ కంపెనీ, అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నొవాలిస్ వార్షిక ఇబిటా 110 కోట్ల డాలర్లుగా ఉంటుందని అంచనా. భారత్‌లో బెంచ్‌మార్క్ వడ్డీరేట్లు తగ్గుతుండడం వల్ల, అమెరికాలో బాండ్ల రీఫైనాన్స్ వల్ల కంపెనీ రుణ, వడ్డీ భారాలు తగ్గనున్నాయి. ఇప్పటికే నొవాలిస్ కంపెనీ 250 కోట్ల డాలర్ల రుణాలను రీ ఫైనాన్స్ చేసింది. దీంతో 5.5 కోట్ల డాలర్ల వడ్డీ ఆదా అయింది. మరో 200 కోట్ల డాలర్ల రుణాలను రీ ఫైనాన్స్ చేయనున్నది. ఫలితంగా మరో 2.5 కోట్లు డాలర్లు ఆదా కానున్నాయి. వడ్డీరేట్ల తగ్గుదల వల్ల భారత్‌లో 3 కోట్ల డాలర్ల వడ్డీ భారం తగ్గుతుందని అంచనా. పదేళ్ల తర్వాత కంపెనీకి ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ప్రారంభమయ్యాయి. పెరుగుతున్న ఫ్రీ క్యాష్ ఫ్లోస్, తరుగుతున్న రుణ, వడ్డీ భారాలు ఈక్విటీ విలువను పెంచుతున్నాయి. ఉత్పత్తి వ్యయాలు తగ్గించుకోవడం, అధిక లాభాలు వచ్చే వాహన కంపెనీలకు హిందాల్కో అనుబంధ కంపెనీ నొవాలిస్ అమ్మకాలు పెరగడం, మూలధన కేటాయింపుల్లో గట్టి క్రమశిక్షణ, జోరుగా ఉన్న ఫ్రీ క్యాష్ ఫ్లోస్(ఎఫ్‌సీఎఫ్), రుణాలను రీ ఫైనాన్స్ చేయడం ద్వారా బాగా తగ్గుతున్న వడ్డీ భారం (ఏడాదికి 11 కోట్ల డాలర్ల వడ్డీ వ్యయాలు ఆదా అవుతాయని అంచనా)... ఇవన్నీ కంపెనీకి కలసివచ్చే అంశాలు. హెచ్డీఎఫ్సీ బ్రోకరేజ్ సంస్థ: జియోజిత్ బీఎన్పీ పారిబా ప్రస్తుత ధర: రూ.1,248 టార్గెట్ ధర: రూ.1,400 ఎందుకంటే: ఇతర హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలతో పోల్చితే మంచి స్థాయిలో ఉంది. దేశవ్యాప్తంగా 2,400 నగరాలు, పట్టణాలకు అందుబాటులో ఉండేలా 285 కార్యాలయాలతో సేవలందిస్తోంది. గత రెండేళ్లుగా దేశంలో ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ, తక్కువ మొండి బకాయిలతో ఆరోగ్యకరమైన పనితీరును సాధించింది. వ్యక్తిగత రుణ సెగ్మెంట్లో మంచి వ్యాపారం సాధించడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్థభాగంలో రుణ వృద్ధి 16 శాతంగా ఉంది. రుణ నాణ్యత నిలకడగా ఉంది. స్థూల మొండి బకాయిలు 1 బేసిస్ పాయింట్ మాత్రమే పెరిగి 0.8%కి చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో నిర్వహణ ఆస్తులు 17% వృద్ధి చెందాయి. అయితే రియల్టీ రంగంలో మందగమనం కారణంగా కార్పొరేట్ రుణ వృద్ధి 13%గానే ఉంది.పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా రియల్టీ ధరలు తగ్గడం వల్ల కంపెనీపై ప్రభావం స్వల్పంగానే ఉంటుందని అంచనా వేస్తున్నాం. మొత్తం లోన్‌బుక్‌లో ఆస్తుల తనఖాగా ఇచ్చిన రుణాలు 5%గా ఉండడమే దీనికి కారణం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలానికి నికర వడ్డీ ఆదాయం 11% వృద్ధి చెందింది. పోటీ పెరగడం, అధిక మార్జిన్లు వచ్చే కార్పొరేట్ రుణ వృద్ధి మందగించడం వంటి కారణాల వల్ల నికర వడ్డీ మార్జిన్ 7 బేసిస్ పాయింట్లు తగ్గి 3.1%కి తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో రుణ వృద్ధి మందగించినా, ఈ రంగంలో అగ్రస్థానంలో ఉండడంతో దీర్ఘకాలంలో హెచ్‌డీఎఫ్‌సీకి ఢోకా లేదని చెప్పవచ్చు. సమీప భవిష్యత్తులో హౌసింగ్ ఫైనాన్స్ రంగంపై కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ, దీర్ఘకాలికంగా చూస్తే హెచ్‌డీఎఫ్‌సీకి మంచి అవకాశాలే ఉన్నాయని చెప్పవచ్చు. వ్యాపారంలో మంచి వృద్ధి, మార్జిన్లు నిలకడగా వృద్ధి సాధిస్తుండడం, రుణ నాణ్యత ఆరోగ్యకరంగా ఉండడం సానుకూలాంశాలు. అనుబంధ సంస్థలు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, గృహ్ ఫైనాన్స్, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్ వ్యాపారాలు కూడా మంచి పనితీరు కనబరుస్తున్నాయి. రెండేళ్లలో నికర వడ్డీ ఆదాయం 12%, నికర లాభం 14% చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతాయని అంచనా. రెండేళ్లలో స్థూల మొండి బకాయిలు 1%గానే ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. -
8000 దిగువకు కుప్పకూలిన నిఫ్టీ
మార్కెట్లో పాజిటివ్ సంకేతాలు సన్నగిల్లడంతో ఈక్విటీ బెంచ్మార్కులు భారీగా కుప్పకూలుతున్నాయి. వరుసగా ఏడో సెషన్లోనూ నష్టాల్లో తాకిడి కొనసాగుతోంది. గురువారం ప్రారంభంలోనే అమ్మకాల ఒత్తిడితో వంద పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, మధ్యాహ్నం సెషన్లో మరింత పతనమై 250 పాయింట్ల నష్టంలో కొనసాగుతోంది. దీంతో సెన్సెక్స్ 26వేల దిగువకు చేజారి 25,990వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సైతం 81.75 పాయింట్ల నష్టంలో 8000 దిగువకు పడిపోయింది. నిఫ్టీ మెటల్ షేర్లు 2 శాతానికి పైగా పతనమవుతున్నాయి. అదేవిధంగా బ్యాంకు ఇండెక్స్ సైతం అమ్మకాల తాకిడిని ఎదుర్కొంటోంది. టాటా స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్ నిఫ్టీ 50 స్టాక్స్ టాప్ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి. ఈ రెండు కంపెనీల షేర్లు దాదాపు చెరో 3 శాతం చొప్పున పడిపోతున్నాయి. ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, ఎల్ అండ్ టీ, ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంకు, మారుతీ సుజుకీ షేర్లూ 1-2 శాతం కుప్పకూలాయి. గ్లోబల్ ట్రెండ్ రిస్కులో కొనసాగుతుండటంతో వర్ధమాన మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొన్నట్టు మార్కెట్ విశ్లేషకుడు రాకేష్ అరోరా చెప్పారు. అంతేకాక పెద్ద నోట్ల రద్దు అనంతరం డిసెంబర్ త్రైమాసిక ఫలితాల ఎఫెక్ట్ కూడా మార్కెట్లపై చూపుతుందన్నారు. డిసెంబర్ త్రైమాసిక ఫలితాలు, డిసెంబర్ అమ్మకాల డేటా, ఎకనామిక్ డేటా ఫలితాలు వచ్చే నెలలో విడుదల కానున్న నేపథ్యంలో మార్కెట్లు అతలాకుతలమవుతున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. పాత నోట్ల రద్దుతో ఆర్థికవ్యవస్థపై సమీప కాలంలో కచ్చితంగా ప్రభావం ఉంటుందని ఇప్పటికే పలు రేటింగ్ ఏజెన్సీలు హెచ్చరించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సర గ్రోత్ రేటును కూడా అవి తగ్గించాయి. అయితే ఈ ఫలితం ఏ మేరకు ఉండబోతుందో వచ్చే నెలలో వెల్లడికాబోతుంది. -
నోవేలిస్ ఫలితాలతో హిందాల్కో జూమ్
ముంబై: హిందాల్కో ఇండస్ట్రీస్ పై దాని అనుబంధ సంస్థ నోవెలిస్ ఫలితాల ప్రభావం బాగా పడింది. ఏడాది క్యూ2లో హిందాల్కో విదేశీ అనుబంధ సంస్థ నోవెలిస్ ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో మదుపర్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీంతో ఈ కౌంటర్ దాదాపు 3 శాతానికిపైగా లాభపడి 23 నెలల గరిష్టాన్ని నమోదు చేసింది. అనుకూలమైన విదేశీ మారక లాభాలు, ప్రధానంగా ఉత్పాదకత లాభాల కారణంగా ఈ ఫలితాలు సాధించామని అల్యూమినియం ఉత్పత్తిలో వరల్డ్ లీడర్ నోవేలిస్ ఇంక్ ఒక ప్రకటనలో తెలిపింది.వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా ఈబీఐటీడీఏ మార్జిన్లు, మెటల్ ఇన్పుట్ ఆప్టిమైజేషన్ తో సానుకూల ఫలితాలు సాధించామని నోవెలిస్ అధ్యక్షుడు ముఖ్య కార్యనిర్వహణాధికారి స్టీవ్ ఫిషర్ తెలిపారు. కాగా, ఈ ఏడాది(2016)లో ఇప్పటివరకూ మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 5 శాతం బలపడితే ఈ షేరు 102 శాతం దూసుకెళ్లింది. జూలై-సెప్టెంబర్‌లో నోవెలిస్ నిర్వహణ లాభం 18.2 కోట్ల డాలర్ల నుంచి 25.6 కోట్ల డాలర్లకు ఎగిసింది. ఎబిటా మార్జిన్లు 14శాతం పెరిగి 270మిలియన్లుగా నమోదు చేసింది.కాగా హిందాల్కో బోర్డ్ ఈ శనివారం (నవంబరు12) న సమావేశం కానుంది. అనంతరం హిందాల్కో క్యూ2 ఫలితాలు ప్రకటించనుంది. దీని నికర లాభాలు 4శాతం ఎగిసి రూ.3,100 కోట్లకు చేరనుందని మార్కెట్ వర్గాల అంచనా. -
నాలుగు రెట్లు పెరిగిన హిందాల్కో నికర లాభం
న్యూఢిల్లీ: అల్యూమినియం ఉత్పత్తి సంస్థ హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆకర్షణీయ ఫలితాలను వెల్లడించింది. స్వతంత్ర నికర లాభాల్లో నాలుగు రెట్లకు పైగా ఎగబాకింది. జూన్ 30 తో ముగిసిన త్రైమాసికంలో మంచి కార్యనిర్వాహక పనితీరుతో మెరుగైన ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ 294 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గత ఏడాది ఇది 61 కోట్లు. అయితే నికర లాభం నాలుగు రెట్లు పెరిగినా ఆదాయం మాత్రం క్షీణించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మొత్తం ఆదాయం 11 శాతం పడిపోయి రూ 7,716,53 కోట్లు ఆర్జించినట్టు బిఎస్ఇకి తెలిపింది. గత ఏడాది ఇదే కాలంలో రూ 8,667 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. కంపెనీ మొత్తం ఖర్చులు రూ 7,993.05 కోట్ల నుంచి రూ 6,703.82 కోట్లకు తగ్గాయి. అల్యూమినియం ఆదాయంలో తరుగుదల ఉన్నప్పటికీ, ఇయర్ ఆన్ ఇయర్ అల్యూమినియం ఆదాయం 8 శాతం వాల్యూమ్ గ్రోత్ ను సాధించింది. అయితే కాపర్ రెవెన్యూ 28 శాతం క్షీణించింది. ఈ ఫలితాలతో మార్కెట్లో షేరు బాగా పుంజుకుంది. దాదాపు 3 శాతం ఎగిసింది. కంపెనీ ప్రతికూల స్థూల ఆర్థిక పరిస్థితుల్లో ఒక బలమైన కార్యాచరణ ప్రదర్శించిందనీ, ద్రవ్యోల్బణం, ఎనర్జీ ధరలు మద్దతిచ్చాయని హిందాల్కో ఒక ప్రకనటలో తెలిపింది. స్థానిక మార్కెట్ లో అల్యూమినియం డిమాండ్ తగ్గడం ప్రభావితం చేసిందని పేర్కొంది. అలాగే భారీ దిగుమతులు కూడా ఫలితాలను దెబ్బతీసిందని తెలిపింది. అయితే రూపాయి బలపడడం, తగ్గిన ముడిసరుకు ధరలు, ప్రధానంగా ఎనర్జీ ఇన్ పుట్స్ భారీ ఊరటనిచ్చాయని చెప్పింది. -
మెటల్ ఎక్స్ ప్రతిపాదనకు హిందాల్కో ఓకే
5 శాతం పెరిగిన హిందాల్కో షేర్ న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా గనుల కంపెనీ మెటల్ ఎక్స్ టేకోవర్ ఆఫర్‌కు హిందాల్కో సమ్మతి తెలియజేయనున్నది. హిందాల్కో అనుబంధ కంపెనీ, ఆస్ట్రేలియాలో లిస్టైన ఆదిత్య బిర్లా మినరల్స్(ఏబీఎంఎల్)ను మెటల్ ఎక్స్ కంపెనీ టేకోవర్ చేయనున్నది. ఈ టేకోవర్ ఆఫర్లో భాగంగా 4.5 ఏబీఎంఎల్ షేర్లకు ఒక మెటల్స్ ఎక్స్ షేర్‌ను కేటాయిస్తారు. అంతేకాకుండా ఒక్కో ఏబీఎంఎల్ షేర్‌కు 0.08 డాలర్(ఆస్ట్రేలియా) నగదు చెల్లిస్తారు. మెటల్స్ ఎక్స్ ఆఫర్‌ను అంగీకారం తెలపనున్నామని ప్రకటించడంతో హిందాల్కో షేర్ బీఎస్ఈలో 5 శాతం ఎగసి రూ.103 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 13.3 లక్షలు, ఎన్ఎస్ఈలో కోటికి పైగా షేర్లు ట్రేడయ్యాయి. -
ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు
ముంబై: మంగళవారం సెలవు దినం అనంతరం ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీలు ఊగిసలాటలో నడుస్తున్నాయి. మొదట్లో 26 వేల మార్కుకు దగ్గర్లో ట్రేడ్ అయిన బీఎస్ఈ సెన్సెక్స్, క్రమేపీ నష్టాల్లోకి జారుకుంది. 100 పైగా లాభంతో దూసుకెళ్లిన సెన్సెక్స్, అదేవిధంగా నిఫ్టీ సైతం 8 వేల మార్కు చేరువదాకా వెళ్లినా మళ్లీ ఎనిమిది వేల దిగువకు జారుకుంది. ఇంట్రా డే లో క్రిసీల్ షేర్లు 13 శాతం కంటే ఎక్కువ లాభాలను నమోదుచేయడంతో, ప్రారంభంలో నిఫ్టీలో షేర్లు పుంజుకున్నాయి. జనవరి, మార్చి త్రైమాసికంలో ఇవే ఎక్కువ లాభాలన్నీ క్రిసిల్ ప్రకటించింది. టాటా స్టీల్, హిందాల్కో, హెచ్ డీఎఫ్ సీ, యాక్సిస్ బ్యాంక్, కోల్ ఇండియా సెన్సెక్స్ లో లాభాల బాటలో నడుస్తుండగా... టీసీఎస్, మహింద్రా అండ్ మహింద్రా, మారుతీ, సన్ ఫార్మా, భారతీ నష్టాలను చవిచూస్తున్నాయి. సెన్సెక్స్ ప్రారంభంలోనే దాదాపు 30 షేర్లు 100 పాయింట్లకు పైగా లాభాలను నమోదుచేశాయి. అదేవిధంగా విప్రో కంపెనీ సైతం నాలుగో త్రైమాసిక ఫలితాలు ఈ సాయంత్రం విడుదలచేయనున్న నేపథ్యంలో దాని షేర్లు ఒక శాతం ఎక్కువ లాభాలను నమోదుచేశాయి. అయితే ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్ నమోదుచేస్తున్న నష్టాలు మార్కెట్లో కొంత ప్రభావం చూపనుందని నిపుణులు అంచనావేస్తున్నారు. ఓ వైపు క్రూడ్ ఆయిల్ షేర్లు పడిపోతుండగా, మరోవైపు బంగారం, వెండి ధరలు పుంజుకుంటున్నాయి. -
హిందాల్కో లాభం 31 శాతం అప్
న్యూఢిల్లీ: హిందాల్కో నికర లాభం(స్టాండ్ ఎలోన్) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 31 శాతం వృద్ధి చెందింది. గత క్యూ2లో రూ.79 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.103 కోట్లకు పెరిగిందని హిందాల్కో తెలిపింది. విక్రయాలు జోరుగా ఉండడం వల్ల నికర లాభంలో ఈ స్థాయి వృద్ధి సాధించామని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.8,778 కోట్ల నుంచి 4 శాతం వృద్ధితో రూ.9,342 కోట్లకు పెరిగిందని వివరించింది. రియలైజేషన్లు బాగా తగ్గినా అమ్మకాలు పెరిగాయని తెలిపింది. కంపెనీ కొత్త ఫ్యాక్టరీల్లో ఉత్పతి కార్యకలాపాల పునర్వ్యస్థీకరణ కారణంగా ఆదాయం పెరిగిందని పేర్కొంది. లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్లో ధరలు బాగా క్షీణించడం, ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడం, దేశీయంగా అల్యూమినయం ధరలు తగ్గడం.. ఈ అంశాలన్నీ ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలపై ప్రభావం చూపాయని వివరించింది. అనుబంధ కంపెనీల నుంచి డివిడెండ్లు కలుపుకొని రూ.119 కోట్ల ఇతర ఆదాయం ఆర్జించామని తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపధ్యంలో ఈ కంపెనీ షేర్ బీఎస్ఈలో 0.4 శాతం క్షీణించి రూ.79.45 వద్ద ముగిసింది. -
ఆరు రోజుల ర్యాలీకి బ్రేక్
ముంబై: స్టాక్ మార్కెట్ లో ఆరు రోజుల ర్యాలీకి బ్రేక్ పడింది. మదుపుదారులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో మార్కెట్ నష్టాల్లోకి జారుకుంది. బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 45 పాయింట్లు పతనమయి 27842 వద్ద ముగిసింది. ట్రేడింగ్ ఆరంభంలో కీలక 28 వేల పాయింట్లు దాటిన సెన్సెక్స్ మదుపుదారులు అమ్మకాలకు దిగడంతో తర్వాత పతనమైంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 17 పాయింట్లు పతనమయి 8,378 వద్ద స్థిరపడింది. బ్యాకింగ్ రంగంలో సంస్కరణలు చేపడతామన్న ప్రభుత్వ ప్రకటన మార్కెట్ పై ప్రతికూల ప్రభావం చూపింది. డాక్టర్ రెడ్డీస్, భారతీ ఎయిర్ టెల్, హిందాల్కో, హెచ్ డీఎఫ్ సీ, టీసీఎస్, ఎస్ బీఐ షేర్లు నష్టపోయాయి. -
హిందాల్కో ఫైళ్ల కోసం ప్రధాని కార్యాలయానికి సీబీఐ లేఖ
బొగ్గు కుంభకోణం రాజుకుంటోంది. ప్రధానమంత్రి కార్యాలయానికి సీబీఐ లేఖ రాసింది. హిందాల్కో సంస్థకు బొగ్గు గనుల కేటాయింపునకు సంబంధించిన ఫైళ్లన్నింటినీ తమకు అప్పగించాలని అందులో కోరింది. ఈ కుంభకోణంపై విచారణ ప్రారంభించడానికి ముందుగానే ఒకసారి ఆ ఫైళ్లన్నింటినీ సమీక్షించాల్సి ఉందని, అందువల్ల మొత్తం ఫైళ్లు తమకు అందజేయాలని సీబీఐ కోరినట్లు సమాచారం. హిందాల్కో సంస్థకు బొగ్గు గనుల కేటాయింపును ఇంతకుముందే ప్రధానమంత్రి కార్యాలయం సమర్థించుకున్న విషయం తెలిసిందే. కాగా.. బొగ్గు స్కాంపై సుప్రీంకోర్టుకు సీబీఐ ఓ స్థాయీ నివేదికను మంగళవారం సమర్పించింది. ఇటీవల కుమార మంగళం బిర్లాపైన, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పి.సి. పరేఖ్‌లపై దాఖలుచేసిన 14వ ఎఫ్ఐఆర్ వివరాలను కూడా సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. -
'హిందాల్కో' వ్యవహారంలో మన్మోహన్ తప్పులేదు: పీఎంఓ
బొగ్గు గనుల కేటాయింపులపై ప్రధాని కేంద్ర బిందువుగా తీవ్ర విమర్శలు రావడంతో ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) మౌనం వీడింది. 'హిందాల్కో' కంపెనీకి గనుల కేటాయింపుల్లో ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని పీఎంఓ శనివారం వివరణ ఇచ్చింది. కేటాయింపులకు సంబంధించి తన ముందుంచిన ఫైళ్లను పరిశీలించి అర్హతను బట్టే ప్రధాని మన్మోహన్ సింగ్ ఆమోదించారని స్పష్టం చేసింది. 2005లో బొగ్గు మంత్రిత్వ శాఖ పంపిన ప్రతిపాదనలను ప్రధాని సాధికారిక అధికారంతో ఆమోదించినట్టు వివరించింది. బొగ్గు కుంభకోణంలో ప్రధాని పాత్రపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లా, బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పి.సి.పరేఖ్‌ల పేర్లను సీబీఐ ఆ ఎఫ్ఐఆర్లో చేర్చింది. పీసీ పరేఖ్.. మన్మోహన్‌ను లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. గనుల కేటాయింపులో కుట్ర జరిగిందని సీబీఐ భావిస్తే.. తుది నిర్ణయం తీసుకున్న ప్రధాని కూడా కుట్ర దారేనన్నారు. ఈ నేపథ్యంలో పీఎంఓ స్పందించి వివరణ ఇచ్చింది. -
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ను ప్రశ్నించనున్న సీబీఐ!
హిండాల్కో కంపెనీకి బొగ్గు బ్లాక్ కేటాయింపుల కుంభకోణంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను సీబీఐ ప్రశ్నించనుంది. 2005 లో ఆదిత్య బిర్లా కంపెనీని తిరస్కరించిన తర్వాత బొగ్గు శాఖ కు నవీన్ పట్నాయక్ లేఖ రాసిన అంశపై సీబీఐ విచారించే అవకాశం ఉంది. ఒడిశాలోని తలబిరా రెండవ బ్లాక్ కోసం దరఖాస్తు చేసుకున్న హిండాల్కో కంపెనీ తిరస్కారానికి గురైన తర్వాత పున: పరిశీలించాలని పట్నాయక్ లేఖ రాశారని సీబీఐ అధికారి తెలిపారు. పట్నాయక్ రాసిన లేఖలు, ఇతర డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నామని సీబీఐ తెలిపింది. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరిని విచారించాలనే విషయంపై ఇంకా తుది నిర్ణయం జరుగలేదని తెలిసింది.