ప్రధానమంత్రి కార్యాలయానికి సీబీఐ లేఖ రాసింది. హిందాల్కో సంస్థకు బొగ్గు గనుల కేటాయింపునకు సంబంధించిన ఫైళ్లన్నింటినీ తమకు అప్పగించాలని అందులో కోరింది.
బొగ్గు కుంభకోణం రాజుకుంటోంది. ప్రధానమంత్రి కార్యాలయానికి సీబీఐ లేఖ రాసింది. హిందాల్కో సంస్థకు బొగ్గు గనుల కేటాయింపునకు సంబంధించిన ఫైళ్లన్నింటినీ తమకు అప్పగించాలని అందులో కోరింది. ఈ కుంభకోణంపై విచారణ ప్రారంభించడానికి ముందుగానే ఒకసారి ఆ ఫైళ్లన్నింటినీ సమీక్షించాల్సి ఉందని, అందువల్ల మొత్తం ఫైళ్లు తమకు అందజేయాలని సీబీఐ కోరినట్లు సమాచారం.
హిందాల్కో సంస్థకు బొగ్గు గనుల కేటాయింపును ఇంతకుముందే ప్రధానమంత్రి కార్యాలయం సమర్థించుకున్న విషయం తెలిసిందే. కాగా.. బొగ్గు స్కాంపై సుప్రీంకోర్టుకు సీబీఐ ఓ స్థాయీ నివేదికను మంగళవారం సమర్పించింది. ఇటీవల కుమార మంగళం బిర్లాపైన, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పి.సి. పరేఖ్లపై దాఖలుచేసిన 14వ ఎఫ్ఐఆర్ వివరాలను కూడా సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది.