న్యూఢిల్లీ: హిందాల్కో ఇండస్ట్రీస్ సెప్టెంబర్ త్రైమాసికానికి మిశ్రమ ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ లాభం 35 శాతం తగ్గిపోయి రూ.2,205 కోట్లకు పరిమితం కాగా, ఆదాయం మాత్రం 18 శాతం పెరిగి రూ.56,176 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.3,417 కోట్లు, ఆదాయం రూ.47,665 కోట్ల చొప్పున ఉండడం గమనించాలి.
మెరుగైన అమ్మకాలు ఆదాయంలో వృద్ధికి తోడ్పడినట్టు కంపెనీ తెలిపింది. రూ.5,743 కోట్ల ఎబిట్డా (పన్నులు, వడ్డీకి ముందస్తు) నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 29 శాతం తక్కువ. ‘‘తయారీ వ్యయాలు పెరగడం, అననుకూల ఆర్థిక పరిస్థితులు ప్రభావం చూపించాయి. కాపర్ వ్యాపారంలో మెరుగైన నిర్వహణ పనితీరు, విక్రయాలు బలంగా ఉండడంతో ఈ ప్రభావాన్ని కొంత వరకు అధిగమించగలిగాం’’అని హిందాల్కో ఎండీ సతీష్ పాయ్ తెలిపారు.
గత కొన్నేళ్లుగా కంపెనీ వ్యాపారం మరింత బలోపేతంగా, సమగ్రంగా మార్పు చెందడం సవాళ్ల వాతావరణంలోనూ బలమైన ఫలితాలు సాధించేందుకు అనుకూలించినట్టు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment