ఆరు రోజుల ర్యాలీకి బ్రేక్
ముంబై: స్టాక్ మార్కెట్ లో ఆరు రోజుల ర్యాలీకి బ్రేక్ పడింది. మదుపుదారులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో మార్కెట్ నష్టాల్లోకి జారుకుంది. బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 45 పాయింట్లు పతనమయి 27842 వద్ద ముగిసింది. ట్రేడింగ్ ఆరంభంలో కీలక 28 వేల పాయింట్లు దాటిన సెన్సెక్స్ మదుపుదారులు అమ్మకాలకు దిగడంతో తర్వాత పతనమైంది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ 17 పాయింట్లు పతనమయి 8,378 వద్ద స్థిరపడింది. బ్యాకింగ్ రంగంలో సంస్కరణలు చేపడతామన్న ప్రభుత్వ ప్రకటన మార్కెట్ పై ప్రతికూల ప్రభావం చూపింది. డాక్టర్ రెడ్డీస్, భారతీ ఎయిర్ టెల్, హిందాల్కో, హెచ్ డీఎఫ్ సీ, టీసీఎస్, ఎస్ బీఐ షేర్లు నష్టపోయాయి.