నోవేలిస్ ఫలితాలతో హిందాల్కో జూమ్ | Hindalco hits 23-month high on robust Q2 results from Novelis | Sakshi
Sakshi News home page

నోవేలిస్ ఫలితాలతో హిందాల్కో జూమ్

Published Tue, Nov 8 2016 12:24 PM | Last Updated on Mon, Sep 4 2017 7:33 PM

Hindalco hits 23-month high on robust Q2 results from Novelis

ముంబై:  హిందాల్కో  ఇండస్ట్రీస్ పై   దాని అనుబంధ సంస్థ  నోవెలిస్   ఫలితాల ప్రభావం బాగా  పడింది.  ఏడాది క్యూ2లో హిందాల్కో  విదేశీ అనుబంధ సంస్థ నోవెలిస్‌ ఆకర్షణీయ ఫలితాలు  ప్రకటించడంతో  మదుపర్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీంతో ఈ కౌంటర్ దాదాపు 3 శాతానికిపైగా లాభపడి 23 నెలల గరిష్టాన్ని నమోదు చేసింది. అనుకూలమైన విదేశీ మారక లాభాలు, ప్రధానంగా ఉత్పాదకత లాభాల కారణంగా ఈ ఫలితాలు సాధించామని అల్యూమినియం ఉత్పత్తిలో వరల్డ్ లీడర్   నోవేలిస్  ఇంక్ ఒక ప్రకటనలో తెలిపింది.వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా ఈబీఐటీడీఏ మార్జిన్లు, మెటల్ ఇన్పుట్ ఆప్టిమైజేషన్  తో సానుకూల ఫలితాలు సాధించామని  నోవెలిస్  అధ్యక్షుడు ముఖ్య కార్యనిర్వహణాధికారి స్టీవ్ ఫిషర్ తెలిపారు.
 కాగా, ఈ ఏడాది(2016)లో ఇప్పటివరకూ మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్‌ 5 శాతం బలపడితే ఈ షేరు 102 శాతం దూసుకెళ్లింది. జూలై-సెప్టెంబర్‌లో నోవెలిస్‌ నిర్వహణ లాభం 18.2 కోట్ల డాలర్ల నుంచి 25.6 కోట్ల డాలర్లకు ఎగిసింది.   ఎబిటా మార్జిన్లు 14శాతం  పెరిగి 270మిలియన్లుగా నమోదు చేసింది.కాగా  హిందాల్కో బోర్డ్  ఈ శనివారం (నవంబరు12) న  సమావేశం కానుంది.  అనంతరం హిందాల్కో క్యూ2 ఫలితాలు ప్రకటించనుంది. దీని నికర లాభాలు 4శాతం ఎగిసి రూ.3,100 కోట్లకు చేరనుందని మార్కెట్ వర్గాల  అంచనా.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement