
పట్నా: బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం విద్యార్థులకు ఎంతో ఆనందాన్నిస్తుంది. అయితే అవే పరీక్షల్లో టాపర్‌గా నిలిస్తే ఇక వారి ఆనందానికి అవధులు ఉండవు. మరి.. తరతరాలుగా టాపర్లుగా నిలుస్తున్న ఆ కుటుంబంలోని వారు ఎంత ఆనందించాలి?
తాజాగా బీహార్ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల ఫలితాలు(Bihar Intermediate Board Exam Results) విడుదలయ్యాయి. ఈ నేపధ్యంలో పరీక్షల్లో టాపర్లుగా నిలిచినవారిని పట్నాలోని బోర్డు కార్యాలయానికి వెరిఫికేషన్ కోసం పిలిచారు. సరిగ్గా ఇక్కడే ఒక ఆసక్తికర టాపర్ల ఫ్యామిలీ ఉదంతం మీడియాకు దొరికింది. ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాలవారు టాపర్లుగా నిలుస్తూ వస్తున్నారు. బెట్టియాకు చెందిన ఒక కుటుంబానికి చెందిన తాత, తండ్రి, ఇప్పుడు తనయుడు తమ ప్రతిభతో పరీక్షల్లో టాపర్లుగా నిలిచారు. ఈ కుటుంబానికి చెందిన మూడవ తరం వాడైన యువరాజ్ బీహార్ బోర్డు టాపర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
యువరాజ్ కుమార్ పాండే మాట్లాడుతూ నాటి రోజుల్లో మా తాత కూడా టాపర్‌గా నిలిచారని, మెట్రిక్యులేషన్‌లో టాపర్‌గా నిలిచారని, తరువాత బీఎస్సీలోనూ టాపర్ అయ్యారన్నారు. మా నాన్న కూడా టాపర్ల లిస్ట్‌లో పేరు దక్కించుకున్నారన్నారు. ఇప్పుడు తాను కూడా ఈ జాబితాలో చేరానన్నారు. ఈ సందర్భంగా యువరాజ్ తండ్రి రజనీష్ కుమార్ పాండే మాట్లాడుతూ తన తండ్రి 1954లో గ్రాడ్యుయేషన్(Graduation)లో టాపర్‌గా నిలిచారన్నారు. తన సోదరుడు కూడా 1998లో టాపర్ అని, 1996 ఇంటర్మీడియట్ బ్యాచ్‌లో తాను టాపర్‌గా నిలిచానన్నారు. గతంలో రాష్ట్రంలో కాపీయింగ్ జరిగేదని రజనీష్ కుమార్ పాండే అన్నారు. 1996లో మొదటిసారిగా కేంద్రీకృత పరీక్ష నిర్వహించినప్పుడు తాను టాపర్‌గా నిలిచానన్నారు. తన ఇద్దరు మేనల్లుళ్ళు కూడా వారి వారి పాఠశాలల్లో టాపర్లుగా నిలిచారన్నారు.
ఇది కూడా చదవండి: పట్టాలపై ఎస్‌యూవీని ఈడ్చుకెళ్లిన రైలు
Comments
Please login to add a commentAdd a comment