Topper
-
Bihar: పరీక్షల్లో టాపర్‌ను మేళతాళాలతో ఊరేగిస్తూ..
పట్నా: బీహార్ బోర్డు(Bihar Board) తాజాగా 12వ తరగతి ఫలితాలను విడుదలు చేసింది. పెళ్లిళ్లలో మేళతాళాలు వాయించే వ్యక్తి కుమార్తె సంజనా కుమారి ఈ పరీక్షలో టాపర్‌గా నిలిచింది. ఆమె ఆర్ట్స్ గ్రూపులో రాష్ట్రంలో ఐదవ స్థానంలో నిలిచింది. సంజన 93.6శాతం మార్కులతో ఉత్తీర్ణురాలయ్యింది. ఆమె భవిష్యత్‌లో ఐఏఎస్ కావాలనుకుంటోంది.సంజనా కుమారి మోతీపూర్ పరిధిలోని అంజనాకోట్లో ఉంటోంది. కుటుంబంలోని ముగ్గురు సంతానంలో ఆమె మూడవది. సంజనా మీడియాతో మాట్లాడుతూ తన సోదరుడు దీపక్ ఇటీవలే ప్రభుత్వ టీచర్(Government teacher) ఉద్యోగం సంపాదించాడని తెలిపింది. మరో సోదరుడు కూడా చదవులో ప్రతిభ చూపిస్తున్నాడని పేర్కొంది. ఇష్టంగా కష్టపడి చదవితేనే మంచి స్కోరు సాధించగలమని సంజన స్పష్టం చేసింది.పరీక్షల్లో తాను రాష్ట్రంలో ఐదవ స్థానంలో నిలిచానని తెలియగానే ఎంతో ఆనందించానని, ఇంట్లోని వారికి ఈ విషయం తెలిసి, ఎంతో సంబరపడ్డారని సంజన పేర్కొంది. ఇండియా టీవీ కథనంలోని వివరాల ప్రకారం సంజన తన విజయానికి తన పాఠశాల ఉపాధ్యాయులే కారణమని, వారి మార్గదర్శకత్వంలో చదివి, తాను ఉత్తీర్ణత సాధించానని వివరించింది. తాను పరీక్షలకు ముందు రోజుకు 10 నుంచి 12 గంటలపాటు చదివేదానినని, సెల్ఫ్ స్టడీ తనకు ఎంతో ఉపకరించిందని తెలిపింది. భవిష్యత్‌లో ఐఏఎస్ కావాలన్నదే తన కల అని సంజన పేర్కొంది. కుమార్తె 12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిందని తెలియగానే తండ్రి ఆమెను మేళతాళాలతో ఊరేగించారు. ఇది కూడా చదవండి: ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. ఎన్నికల్లో పౌరసత్వ రుజువుకు పెద్దపీట -
తరతరాలకు చెరగని ‘టాపర్ల’ చిరునామా..
పట్నా: బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం విద్యార్థులకు ఎంతో ఆనందాన్నిస్తుంది. అయితే అవే పరీక్షల్లో టాపర్‌గా నిలిస్తే ఇక వారి ఆనందానికి అవధులు ఉండవు. మరి.. తరతరాలుగా టాపర్లుగా నిలుస్తున్న ఆ కుటుంబంలోని వారు ఎంత ఆనందించాలి?తాజాగా బీహార్ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల ఫలితాలు(Bihar Intermediate Board Exam Results) విడుదలయ్యాయి. ఈ నేపధ్యంలో పరీక్షల్లో టాపర్లుగా నిలిచినవారిని పట్నాలోని బోర్డు కార్యాలయానికి వెరిఫికేషన్ కోసం పిలిచారు. సరిగ్గా ఇక్కడే ఒక ఆసక్తికర టాపర్ల ఫ్యామిలీ ఉదంతం మీడియాకు దొరికింది. ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాలవారు టాపర్లుగా నిలుస్తూ వస్తున్నారు. బెట్టియాకు చెందిన ఒక కుటుంబానికి చెందిన తాత, తండ్రి, ఇప్పుడు తనయుడు తమ ప్రతిభతో పరీక్షల్లో టాపర్లుగా నిలిచారు. ఈ కుటుంబానికి చెందిన మూడవ తరం వాడైన యువరాజ్ బీహార్ బోర్డు టాపర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.యువరాజ్ కుమార్ పాండే మాట్లాడుతూ నాటి రోజుల్లో మా తాత కూడా టాపర్‌గా నిలిచారని, మెట్రిక్యులేషన్లో టాపర్‌గా నిలిచారని, తరువాత బీఎస్సీలోనూ టాపర్ అయ్యారన్నారు. మా నాన్న కూడా టాపర్ల లిస్ట్‌లో పేరు దక్కించుకున్నారన్నారు. ఇప్పుడు తాను కూడా ఈ జాబితాలో చేరానన్నారు. ఈ సందర్భంగా యువరాజ్ తండ్రి రజనీష్ కుమార్ పాండే మాట్లాడుతూ తన తండ్రి 1954లో గ్రాడ్యుయేషన్(Graduation)లో టాపర్‌గా నిలిచారన్నారు. తన సోదరుడు కూడా 1998లో టాపర్ అని, 1996 ఇంటర్మీడియట్ బ్యాచ్‌లో తాను టాపర్‌గా నిలిచానన్నారు. గతంలో రాష్ట్రంలో కాపీయింగ్ జరిగేదని రజనీష్ కుమార్ పాండే అన్నారు. 1996లో మొదటిసారిగా కేంద్రీకృత పరీక్ష నిర్వహించినప్పుడు తాను టాపర్‌గా నిలిచానన్నారు. తన ఇద్దరు మేనల్లుళ్ళు కూడా వారి వారి పాఠశాలల్లో టాపర్లుగా నిలిచారన్నారు.ఇది కూడా చదవండి: పట్టాలపై ఎస్‌యూవీని ఈడ్చుకెళ్లిన రైలు -
నీట్, జేఈఈ క్రాక్ చేసి.. మెడికల్, ఐఐటీ వద్దంటూ..
ఏదైనా సాధించాలనే తపన మనసులో గాఢంగా ఉంటే ఏదీ అసాధ్యం కాదు. ఇందుకు నీట్, జేఈఈ పోటీపరీక్షలు మినహాయింపు కాదని నిరూపించాడు అసోంకు చెందిన ఓ కుర్రాడు. సీబీఎస్సీ 12వ తరగతి బోర్డు పరీక్షలో టాపర్‌గా నిలవడమే కాకుండా నీట్, జేఈఈలలో మంచి స్కోర్ సాధించాడు. అయినప్పటికీ తన అభిరుచికే పట్టంకడుతూ.. మెడికల్ సీటు, ఐఐటి మద్రాస్ అవకాశాన్ని వదిలి ఐఐఎస్సీలో సైన్స్ గ్రాడ్యుయేషన్ చేయాలని నిర్ణయించుకున్నాడు.ఆ కుర్రాడి పేరు అధిరాజ్ కర్. అసోంతోని గౌహతి నివాసి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించి, సీబీఎస్సీ బోర్డు 12వ తరగతి పరీక్షలో కెమిస్ట్రీలో వందశాతం మార్కులు సాధించడంతోపాటు టాపర్‌గా నిలిచాడు. అలాగే నీట్ యూజీలో అసోంలో టాపర్‌గా నిలిచాడు. అదేవిధంగా మద్రాస్ ఐఐటీలోనూ సీటు దక్కించుకున్నాడు. అయితే అధిరాజ్ అటు ఐఐటీగానీ, ఇటు ఎంబీబీఎస్‌లను ఎంచుకోకుండా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)లో సైన్స్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో అడ్మిషన్ తీసుకున్నాడు.అధిరాజ్ కెమిస్ట్రీ, బయాలజీలో నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ తరహాలోని వివిధ జాతీయ స్థాయి పరీక్షలలో మంచి ప్రతిభ కనబరిచాడు. పరిశోధనారంగంలో అతనికున్న అభిరుచి అతనిని ఐఐఎస్సీ వైపు నడిపించింది. అకడమిక్ విద్యకు అతీతంగా అధిరాజ్కు వన్యప్రాణుల సంరక్షణ, సంగీతంపై అమితమైన ఆసక్తి ఉంది. ఈ నేపధ్యంలోనే డబ్ల్యుడబ్ల్యుఎఫ్ నేచర్ వైల్డ్ విజ్డమ్ క్విజ్‌లో మూడుసార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలిచాడు. అధిరాజ్ గౌహతి యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ బిమల్ కర్, డాక్టర్ మధుశ్రీ దాస్‌ల కుమారుడు. -
అనారోగ్యంలోనూ.. టాపర్‌గా దివ్యాంశ్!
అన్ని రకాలుగా బాగా ఉండి కూడా కొందరూ విద్యార్థులు ఎంట్రెన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులు తెచ్చుకోలేక చతికిలపడుతుంటారు. పైగా ఏవేవో సాకులు చెబుతుంటారు. తల్లిదండ్రులు సమస్త సౌకర్యాలు కల్పించి.. పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉండి కూడా ఉత్తీర్ణులు కాలేకపోతుంటారు. అలాంటి వారికి ఈ విద్యార్థే స్ఫూర్తి. తీవ్రైమన అనారోగ్యంతో బాధపడుతూ కూడా ప్రతిష్టాత్మకమైన నీట్ ఎంట్రెన్స్ పరీక్షలో సత్తా చాటి ప్రథమ ర్యాంక్‌లో నిలిచాడు. అతడే దివ్యాంశ్. హర్యానాలోని చర్కీ దాద్రీకి చెందిన దివ్యాంశ్ అతను న్యూమోథొరాక్స్(తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్య)తో బాధపడుతున్నాడు. ఆ సమస్య నుంచి నెమ్మదిగా కోలుకున్న కొద్ది రోజులకు డెంగ్యూ బారిన పడ్డాడు. అతడికి సపర్యలు చేసి..చేసి అమ్మ అనారోగ్యం పాలయ్యింది. అయినా ఆ అడ్డంకులనన్నింటిని పక్కన పెట్టి మరీ ఈ ఎంట్రెన్స్ టెస్ట్‌పై దృష్టిసారించేవాడు. అయితే అనారోగ్యం కారణంగా సిలబస్‌లో తన తోటి విద్యార్థుల కంటే కాస్త వెనుకబడ్డాడు. అతనికి వారితో వేగం అందుకోవడానికే దాదాపు పది రోజులు పట్టింది. అలాగే సహా విద్యార్థులు, ఉపాద్యాయుల మార్గదర్శకంలో మరింతగా కష్టపడి చదివాడు దివ్యాంశ్. అతని కృషి ఫలించి అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ అండ్ పారామెడికల కోర్సుల ప్రవేశానికి పెట్టే ప్రతిష్టాత్మ నీట్ పరీక్షలో ఏకంగా 720 మార్కులు స్కోర్ చేయడమే గాక ప్రథమ ర్యాంకులో నిలిచాడు. అతడు వైద్యపరమైన సవాళ్లను దాటుకుంటూ కఠినతరమైన నీట్ పరీక్షలో ప్రథమ ర్యాంక్‌లో నిలిచి అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. పైగా గెలవాలన్న తపన ఉంటే ఎంత పెద్ద కష్టాన్ని అయినా జయించొచ్చని చాటి చెప్పాడు. ఇక్కడ దివ్యాంశ్ ఫేస్ చేసిన న్యూమోథొరాక్స్ అంటే ఏంటంటే..శరీరంలో సరిగ్గా ఊపిరితిత్తులకు బయట ఉన్న ఖాళీ ప్రదేశంలో గాలి పేరుకుపోతే దాన్ని న్యూమోథోరాక్స్ అని అంటారు. ఈ ప్రాంతంలో గాలి చేరితే ఊపిరితిత్తులపై ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఫలితంగా ఊపిరి తిత్తులు పనిచేయకుండా పోతాయి. దీని కారణంగా పదునైన ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు రోగులు. ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటే మాత్ర చర్మ రంగు కూడా మారిపోతుంది. ఎవరికి వచ్చే ప్రమాదం ఉందంటే..ఆకస్మిక ఛాతీ గాయం, దీర్ఘకాలిక ఊరితిత్తుల సంబంధ వ్యాధులు, ఆస్తమా, దగ్గు, క్షయ వంటి వాటితో బాధపుడుతున్న వారిలో ఈ న్యూమోథోరాక్స్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.చికిత్స:సమస్య తీవ్రతను అనుసరించి వైద్యులు చికిత్స అందించడం జరుగుతుంది. ఒక్కోసారి మాత్రం కొద్దిపాటి సర్జరీ కూడా చేయాల్సి రావొచ్చని చెబుతున్నారు.(చదవండి: రాత్రి భోజనం తర్వాత నడిస్తే ఇన్ని లాభాలా..!) -
అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
నా లాగా కష్టపడకుండా నా బిడ్డలు పెరగాలి.. చదువుకోవాలి. ఉన్నత స్థితిలోకి రావాలని అని తల్లిదండ్రులు పిల్లల అభివృద్ధికోసం కష్టపడతారు.వారి బంగారు భవిష్యత్తుకోసం కలగంటారు. అలాగే పిలలు అమ్మా నాన్నల్ని కాలు కిందపెట్టకుండా చూసుకోవాలి. మంచి కారు కొనాలి.. ఇల్లు కొనాలి.. ఇలా రకరకాలుగా ఊహించుకుంటారు. తమ ఆశయ సాధన కోసం పట్టుదలగా చదువుతారు. అచ్చం ఇలాగే చెన్నైలోని ఒక అమ్మాయి ఆలోచించింది. తన తల్లిదండ్రులు ఏ వస్తువునైనా ధర ట్యాగ్ చూడకుండా నచ్చింది కొనుక్కోవాలి అని కలగంది ఓ ఆటో డ్రైవర్ కూతురు. దాన్ని సాధించి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ స్టోరీ పూర్తిగా అర్థం కావాలంటే వివరాలను తెలుసుకుందాం రండి!I want to be at a place where my parents don’t see the price tag when they go to a shop,says Poongodhai, daughter of an auto-driver, who came first among GCC schools scoring 578 in the class XII board exams. Speaking in fluent English, Poongodhai of Perambur GCC school said she… pic.twitter.com/2T1Mbnz8vB— Omjasvin M D (@omjasvinTOI) May 6, 2024తాజాగా తమిళనాడు ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించి ఆదర్శంగా నిలిచింది ఆటోడ్రైవర్ కుమార్తె పూంగోధయ్. పెరంబూర్ జీసీసీ స్కూల్‌కు చెందిన పూంగోధయ్ 578 స్కోరుతో పాఠశాల టాపర్‌గా నిలిచింది. తన కుటుంబం, సోదరి కాలేజీ, సిబ్బంది, తన ఇలా ప్రతీ ఒక్కరూ బాగా సహక రించారంటూ ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడుతూ బికామ్, సీఏ చదవాలని కోరుకుంటోంది.Her sister Shobana breaks down responding to her sister’s success coming first among GCC schools in the 12th board examinations. Both of them are daughters of auto driver pic.twitter.com/qSS6EffAbP— Omjasvin M D (@omjasvinTOI) May 6, 2024ఒక చిన్న అద్దే ఇంట్లో నివసించే ఆమె తండ్రి ఒక ఆటో డ్రైవర్. తల్లి డొమెస్టిక్ హెల్పర్‌గా పని చేస్తుంది. తండ్రి ఆరోగ్యం అంతంత మాత్రమే. సోదరి బి.ఫార్మ్ చేస్తోంది. తండ్రి అనారోగ్యం రీత్యా కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. తండ్రి పడుతున్న కష్టాన్ని గమనించిన అక్కా చెల్లెళ్లిద్దరూ చదువుల్లో రాణించారు. సోదరి స్కూలు ఫస్ట్ రావడంపై శోభన భావోద్వేగానికి లోనయింది. తమ బిడ్డలు రాణించడం సంతోషంగా ఉందంటూ ఆనందం ప్రకటించారు తల్లి దండ్రులు.అటు ఇది తమ టీచర్ల ఘనత అని పెరంబూర్‌లోని పాఠశాల హెచ్ఎం కూడా ఆనందాన్ని ప్రకటించారు. 6వ తరగతి నుంచి ఇంగ్లీషు నేర్పుతామని, దీంతో విద్యార్థులు అనర్గళంగా మాట్లాడుతారని చెప్పారు. స్పోకెన్ ఇంగ్లీష్‌లో తామిచ్చిన శిక్షణే ఇందుకు నిదర్శనమని చెప్పారు. -
కర్నూలు: బాల్య వివాహాన్ని ఎదిరించి.. ఇపుడు టాపర్‌గా
బాల్య వివాహం నుంచి తప్పించుకుని మరీ తానేంటో నిరూపించుకుంది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అగ్ర స్థానంలో నిలిచింది. అవకాశం కల్పిస్తే ఆడబిడ్డల సత్తా ఏంటో సమాజానికి చాటి చెప్పింది. అంతేకాదు ఐపీఎస్ ఆఫీసర్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలని భావిస్తుండటం విశేషం. కర్నూలు జిల్లా ఆలూరు కేజీబీవీలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని ఎస్.నిర్మల. బైపీసీలో 440కి 421 మార్కులు సాధించింది. ప్రభుత్వం అండగా నిలవడంతో నిర్మల చక్కగా చదువుకుని అత్యధిక మార్కులు సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్.. నిర్మలను ప్రత్యేకంగా అభినందించారు. ఐపీఎస్ అధికారి కావాలనే ఆమె కల సామాజిక న్యాయం, బాల్య వివాహాల నిరోధంపై ఆమెకున్న తిరుగులేని నిబద్ధతను ప్రతిబింబిస్తోందని ప్రశంసించారు.ఈ బాలికకు గతేడాది బాల్య వివాహం జరిపిస్తుండగా జిల్లా యంత్రాంగం రక్షించి కేజీబీవీలో చేర్పించింది. ఎస్ఎస్సీలో 537 మార్కులు సాధించడం గమనార్హం. నిరుపేదలైన ఆమె తల్లిదండ్రులకు నలుగురు కుమార్తెలు, వీరిలో ముగ్గురికి ఇప్పటికే వివాహాలైనాయి. ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి నిర్మలకి కూడా చిన్నతనంలోనే వివాహంచేయాలని భావించారు. కానీ చదువుకోవాలన్నపట్టుదలతో పోరాడి బాల్య వివాహంనుంచి తప్పించుకుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పరీక్షలో టాపర్‌గా నిలిచి తానేమిటో నిరూపించుకుంది. Congratulations to Ms. G. Nirmala from Kasturba Gandhi Balika Vidyalaya (KGBV), Kurnool, a residential girls’ school run by the Ministry of Education for the disadvantaged sections in India, for securing the top spot in the 1st Year Intermediate exam of Andhra Pradesh… pic.twitter.com/OVqEX0frQL — Ministry of Education (@EduMinOfIndia) April 13, 2024 -
‘నేను సైన్స్ టాపర్‌ని.. కోవిడ్ వైరస్‌కే వణుకు పుట్టించాను’
ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ నేతగా మారిన బిహార్‌కు చెందిన పప్పు యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన కోవిడ్‌కి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘న్యూస్ 24’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పప్పు యాదవ్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో మహమ్మారికి అందరూ భయపడుతుంటే తాను మాత్రం ఆ వైరస్‌నే భయపెట్టానని పేర్కొన్నారు. ‘కోవిడ్ సమయంలో మాస్క్, చేతికి గ్లోవ్స్ ధరించని ఏకైక వ్యక్తని నేనే. నేను సైన్స్ టాపర్‌ని’ అన్నారాయన. బిహార్ నుంచి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న పప్పు యాదవ్ ప్రపంచ రాజకీయాలు, తత్వాలు, ఆర్థిక వ్యవస్థతో సహా తనకు అన్ని విషయాలు తెలుసునని పేర్కొన్నారు. పప్పు యాదవ్ 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ కూటమికి వ్యతిరేకంగా 2015లో జన్ అధికార్ పార్టీని స్థాపించారు. పప్పు యాదవ్‌ను బిహార్ బాహుబలిగా వ్యవహరిస్తారు. ఆయన ఇటీవలే తన జన్ అధికార్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి అధికారికంగా ఆ పార్టీలో చేరారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆయన బిహార్‌లోని పూర్నియా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. -
ఆంధ్రాయూనివర్సిటీ టాపర్‌గా గవిడి మానస
చీపురుపల్లి: సాధారణ కుటుంబంలో జన్మించి చదువుల తల్లిగా ఎదిగింది. టాపర్‌గా నిలవడానికి కావాల్సింది బ్యాక్‌గ్రౌండ్ కాదని, కేవలం కష్టపడి చదవడమేనని రుజువు చేసింది. టాపర్‌గా నిలవడానికి అహర్నిశలు కృషి చేసి ఆంధ్రాయూనివర్సిటీ స్థాయిలో టాపర్‌గా నిలిచి నేటి యువతీ, యువకులకు ఆదర్శంగా నిలిచింది చీపురుపల్లి పట్టణానికి చెందిన గవిడి మానస. 2020–21 విద్యాసంవత్సరంలో మానస ఆంధ్రాయూనివర్సిటీలో ఎంఎస్సీ ఫిజిక్స్ పూర్తి చేసి టాపర్‌గా నిలిచింది. అయితే ఆ విద్యా సంవత్సరానికి మానస యూనివర్సిటీ స్థాయిలో టాపర్‌గా నిలవడంతో ఆమెను 18 అవార్డులు వరించాయి. వాటిలో 4 బంగారు పతకాలు ఉన్నాయి. యూనివర్సిటీల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు వివిధ సంస్థలు పతకాలు, ప్రశంసలు ఇస్తుంటాయి. అందులో భాగంగానే మానసకు 18 అవార్డులు లభించాయి. అయితే గత మూడేళ్లుగా ఆంధ్రాయూనివర్సిటీలో స్నాతకోత్సవాలు జరగకపోవడంతో వరుసగా మూడు స్నాతకోత్సవాలును శనివారం నిర్వహించారు. ఈ స్నాతకోత్సవానికి గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, జీఎంఆర్ సంస్థల అధినేత గ్రంధి మల్లికార్జునరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా మానస మెరిట్ ధ్రువీకరణతో బాటు పతకాలు అందుకుంది. ప్రస్తుతం ఆంధ్రాయూనివర్సిటీలోనే భౌతికశాస్త్రంపై మానస పీహెచ్డీ చేస్తోంది. ఇదిలా ఉండగా మానస తండ్రి శాంతారావు ఇందిరక్రాంతి పథం(వెలుగు)లో సీసీ గా విధులు నిర్వహిస్తుండగా తల్లి పైడిరాజు వీఓ ఏగా పని చేస్తోంది. మానస ఒకేసారి 18 అవార్డులు తెచ్చుకోవడం, యూనివర్సిటీ టాపర్‌గా నిలవడంతో స్థానికంగా హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. -
గిరిజన విద్యార్థి.. కష్టాలను అధిగమించి,ఐఐటీలో సీటు సాధించింది
జె.ఇ.ఇ. ఎంట్రన్స్‌లో ర్యాంకు కొట్టడం సామాన్యం కాదు.అందుకై కొందరు రాజస్తాన్ వెళ్తారు. కొందరు హైదరాబాద్, విజయవాడ చేరుకుంటారు.తల్లిదండ్రులు గైడ్ చేస్తారు. కాని నిరక్షరాస్యులైన తల్లిదండ్రులకు పుట్టిన కోయ విద్యార్థిని కొర్సా లక్ష్మి గురుకుల పాఠశాలలో చదువుకునే మంచి ర్యాంకు సాధించింది.పాట్నా ఐఐటీలో సీటు సాధించింది. కోయలలో ఒక అమ్మాయి సాధించిన స్ఫూర్తినిచ్చే విజయం ఇది. కొర్సా లక్ష్మి పరిచయం. కొంతమంది ఇళ్లల్లో, నిజానికి చాలామంది ఇళ్లల్లో పిల్లలు జె.ఇ.ఇ. ఎంట్రన్స్ రాయడానికి తల్లిదండ్రులు చాలా శ్రద్ధ పెడతారు. బాగా చదివించే కోచింగ్ సెంటర్ కోసం అవసరమైతే రాజస్థాన్‌లోని కోటాకు వెళతారు లేదా హైదరాబాద్, విజయవాడలలో ప్రఖ్యాత కోచింగ్ సెంటర్లలో వేస్తారు. ఇక పిల్లలు ఇంట్లో ఉండి చదువుకుంటుంటే టీవీలు బంద్ చేస్తారు. మాటా పలుకూ లేకుండా పిల్లలు ఇరవై నాలుగ్గంటలూ చదువుకునేలా చేస్తారు. మెటీరియల్ తెచ్చిస్తారు. చాలా హైరానా పడతారు. అదేం తప్పు కాదు. కాని ఇలాంటివన్నీ లేకుండా కూడా కొంతమంది విజయం సాధిస్తుంటారు. కొత్తగూడెంలోని గిరిజన గురుకుల పాఠశాలలో చదువుకున్న కోయ విద్యార్థిని కుర్సా లక్ష్మి అలాంటి విజేతే. పట్టుదలతో చదువుకుని ర్యాంకు సాధించిన విజేత. ఐసులమ్మే తండ్రి కూతురు కొత్తగూడెం నుంచి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న గిరిజన తండా కాటాయగూడెం. 300 గడపలున్న గ్రామం ఇది. అందరూ కోయలే. వ్యవసాయ కూలీలే. ఏ కొద్దిమందికో కాసింత భూమి ఉంటుంది. కొర్సా లక్ష్మి తండ్రి కన్నయ్యకు ఎకరం భూమి ఉంది. కాని వాన పడితేనే పండుతుంది. కన్నయ్య వ్యవసాయ కూలీగా వెళతాడు. తల్లి శాంతమ్మ కూడా. వ్యవసాయ పనులు లేనప్పుడు తన టీవీఎస్ ఎక్సెల్ మీద ఐస్ బాక్స్ పెట్టుకుని ఐసులమ్ముతాడు. ముగ్గురు పిల్లలు. కాని పెద్ద కొడుకు చదువు ఇష్టం లేక 7వ తరగతిలో ఇంట్లో నుంచి పారిపోయాడు. రెండో కొడుకు మామూలు చదువే. చివరి అమ్మాయి లక్ష్మి బాగా చదువుకోవాలని నిశ్చయించుకుంది. పిన్ని స్ఫూర్తి కన్న తల్లిదండ్రులు చదువు లేని వారు కావడంతో లక్ష్మికి చదువులో ఏ సాయమూ చేయలేకపోయేవారు. ఆరవ తరగతి నుంచి కొత్తగూడెం గిరిజన గురుకుల పాఠశాలలో చదువుతున్న లక్ష్మికి పిన్ని సుమలత స్ఫూర్తిగా నిలిచింది. డిగ్రీ చదువుకున్న సుమలత హాస్టల్లో ఉన్న లక్ష్మిని తరచూ కలుస్తూ చదువు విలువ చెబుతూ వచ్చింది. డబ్బుకు విలువ ఇవ్వని వారు కూడా చదువుకు విలువ ఇస్తారని తెలిపింది. సెలవుల్లో ఇంటికి తీసుకువచ్చి లక్ష్మి మంచి చెడ్డలు చూసేది. ఆమె మాటలు లక్ష్మి మనసులో నాటుకుపోయాయి. ‘ఏ రోజూ కూడా రాత్రి ఒంటి గంట లోపు లక్ష్మి పుస్తకం మూయగా చూడలేదు’ అని లక్ష్మి బాబాయ్ రవి తెలిపాడు. గురుకుల పాఠశాలలో కొత్తగూడెంలోని గిరిజన గురుకుల పాఠశాలలో దాదాపు వేయి మంది అమ్మాయిలు 6 నుంచి ఇంటర్ వరకూ చదువుతున్నారు. ప్రిన్సిపాల్ దేవదాసు, ఉపాధ్యాయులు వీరి చదువు మీద బాగా శ్రద్ధ పెడుతున్నారు. చురుకైన విద్యార్థినులను ఎంపిక చేసి జె.ఇ.ఇలో శిక్షణ ఇస్తున్నారు. ఇంటర్లో ఎం.పి.సి తీసుకున్న లక్ష్మి 992 మార్కులు సాధించింది. దాంతో ఇంకా ఉత్సాహంతో జె.ఇ.ఇకి ప్రిపేర్ అయ్యింది. జె.ఇ.ఇ అడ్వాన్స్‌డ్‌లో 1371వ ర్యాంకు సాధించింది. పాట్నా ఐ.ఐ.టిలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో మొన్నటి ఆగస్టు మొదటివారంలో సీటు పొందింది. గురుకుల పాఠశాల నుంచి ఈ ఘనత సాధించిన అమ్మాయి లక్ష్మీ. ఐ.ఏ.ఎస్ చేయాలని... బాగా చదువుకుని ఐ.ఏ.ఎస్ చేయాలనేది తన లక్ష్యమని కొర్సా లక్ష్మి చెప్పింది. జె.ఇ.ఇలో మంచి ర్యాంకు సాధించి ఐ.ఐ.టిలో సీటు పొందడంతో ఐ.టి.డి.ఏ అధికారులు లక్ష్మిని ప్రశంసించారు. ట్యాబ్ ఇచ్చి ఆర్థిక సహాయం చేశారు. లక్ష్మి ఇంత బాగా చదవడంతో ఇంకా కొంతమంది ఆమె చదువును ప్రోత్సహించడానికి ముందుకొచ్చారు. ఆ ప్రోత్సాహం వల్ల లక్ష్మి ఐ.ఏ.ఎస్ చదివి పేద వర్గాల కోసం పని చేయాలని నిశ్చయించుకుంది. -
ఉత్తమ ఫలితాలు తెచ్చుకున్న విద్యార్థులు , ఉఫాధ్యాలులకి సత్కారం
-
NEET UG Topper: ‘సార్’ కలను సాకారం చేసిన చదువుల తల్లి
స్కూలు రోజుల నుంచే మిస్బాహ్ చదువులో ఎంతో చురుకు. 10 వ తరగతిలో 92 శాతం మార్కులు తెచ్చుకుంది. 12 వ తరగతి బోర్డు పరీక్షలో 86 శాతం మార్కులు దక్కించుకుంది. ఆమె తండ్రి కుటుంబ పోషణకు టైర్ల పంక్చర్ దుకాణాన్ని నడుపుతున్నాడు. NEET UG Topper: మహారాష్ట్రలోని జాల్నా పట్టణంలో పంక్చర్ దుకాణం నడుపుతున్న అన్వర్ ఖాన్ కుమార్తె మిస్బాహ్ NEET UG పరీక్ష క్రాక్ చేసి కుటుంబంలో అవధులు లేని ఆనందాన్ని నింపింది. మిస్బాహ్ నీట్ పరీక్షలో 720 మార్కులకు 633 స్కోర్‌తో విజయం సాధించింది. ఈ విషయం తెలియగానే జాల్నా పట్టణంలోని వారంతా ఆమెను అభినందనల్లో ముంచెత్తుతున్నారు. మిస్బాహ్ ఇంటి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. తండ్రి అన్వర్ ఖాన్ మోటార్‌సైకిళ్లకు పంక్చర్లు వేస్తూ, కుటుంబ భారాన్ని మోస్తున్నాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంటి పరిస్థితులు బాగోలేకపోయినా తనకుమార్తె ఎంతో శ్రమించి, రెండవ ప్రయత్నంలోనే నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిందని అన్నారు. ఇప్పుడు తన కుమార్తె ఎంబీబీఎస్ చేయాలనే కలను సాకారం చేసుకుంటున్నదన్నారు. నీట్ పరీక్షలో తమ కుమార్తె విజయం సాధించడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఈ సందర్భంగా తండ్రి అన్వర్ ఖాన్ మాట్లాడుతూ ‘ఒకవేళ అంకుశ్ సార్ మార్గదర్శకత్వం లేకుంటే మిస్బాహ్ ఈ విజయాన్ని సాధించలేకపోయేది. గడచిన రెండు మూడేళ్లుగా తన కుమార్తె పట్టణంలోని అంకుశ్ సార్ దగ్గర ఉచితంగా నీట్ క్లాసులకు హాజరవుతోంది. దీనికితోడు ఎంతో కష్టపడి చదవడంతో తన కుమార్తె పట్టణం నుంచి నీట్ పరీక్షలో టాపర్‌గా నిలిచిందని’ అన్నారు. జాల్నాలో నీట్ పరీక్షకు శిక్షణ అందిస్తున్న అంకుశ్ సార్ మీడియాతో మాట్లాడుతూ ‘ మేము విద్యార్థులు కోసం ఒక ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనిలో భాగంగా పేద విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ అందిస్తున్నాం. దీనిలో మిస్బాహ్ ఉచిత కోచింగ్ తీసుకుంది. ఇప్పుడు మా కృషికి తగిన ఫలితం దక్కినట్లు అనిపించింది’ అని అన్నారు. మిస్బాహ్ మీడియాతో మాట్లాడుతూ ‘ఇంటిలోని ఆర్థిక పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. అయినా పగలనక, రాత్రనక కష్టపడి చదివాను. ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోలేదు. ఎంబీబీఎస్ డాక్టర్‌గా పేదలకు వైద్య సేవలు అందిస్తాను’ అని తెలిపింది. ఇది కూడా చదవండి: అటు అండమాన్.. ఇటు దుబాయ్.. ఎక్కడికి వెళ్లడం సులభం? -
నాన్న కళ్లలో ఆనందం కోసం.. ‘కలాసీ కూతురు ఇంజినీర్’ అని చెప్పుకోవాలి
‘‘మా నాన్న వ్యవసాయ కూలీగా ఉంటూ కుటుంబాన్ని పోషించేవారు. ఆ సం పాదన మా చదువులకు సరిపోదని విశాఖ వచ్చి పూర్ణామార్కెట్‌లో కలాసీగా పనిచేస్తున్నారు. నాకు మంచి మార్కులు వస్తున్నాయని, బాగా చదివించమని మా ఉ పాధ్యాయులు చెప్పడంతో నాన్న ఎప్పుడూ నా గురించే ఆలోచించేవారు. చాలీచాలని సం పాదనతో ఎలా చదివించాలన్నదే ఆయన ఆందోళన. అలాంటి సమయంలో నేను 8వ తరగతిలో ఉండగా మొదటిసారి అమ్మ ఒడి అందింది. వరుసగా మూడేళ్లు ఆ పథకం వల్ల లబ్ధి ΄పొందడం వల్ల నా చదువు ఎలాంటి భారం లేకుండా సునాయాసంగా సాగిపోయింది. మా పాఠశాల ఉ పాధ్యాయులందరూ ప్రత్యేక శ్రద్ధతో నన్ను తీర్చిదిద్దారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి టాపర్‌గా నిలవడం ఆనందంగా ఉంది’’ ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో 594 మార్కులు సాధించి ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల్లో టాపర్‌గా నిలిచిన అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఏపీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల విద్యార్థిని కామిరెడ్డి హేమశ్రీ మనోగతమిది. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి చదువుల సరస్వతిగా నిలిచింది. తల్లిదండ్రులకు, ఉ పాధ్యాయులకు మంచి పేరు తెచ్చింది. ఒకప్పుడు కార్పొరేట్ స్కూళ్లకే పరిమితమైన టెన్త్ టాపర్లు.. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల నుంచి పుట్టుకొచ్చారు. అలాంటి టాపర్లలో ఈమె ఒకరు. ఆమెతో ‘సాక్షి’ సంభాషించింది. హేమశ్రీ ఎలా ఈ స్థాయికి చేరుకుందో ఆమె మాటల్లోనే.. నాన్న మాటలే స్ఫూర్తి ‘‘అమ్మ గోవిందమ్మ, మా నాన్న శ్రీనివాసరావు. నాన్న పదో తరగతిలో రెండు సబ్జెక్టులు ఫెయిల్. ప్రస్తుతం విశాఖలోని పూర్ణా మార్కెట్లో కలాసీ. ఓ రకంగా నాన్నే నా విజయానికి స్ఫూర్తి. తను బాగా చదవలేకపోవడం వల్లే టెన్త్ ఫెయిలయ్యారు. కలాసీగా రాత్రీపగలూ కష్టపడుతున్నారు. అదే మాకు పదేపదే చెప్పేవారు. తానెన్ని కష్టాలుపడ్డా.. అదంతా నా కోసం, నా తమ్ముడి కోసమేనని గుర్తు చేసేవారు. మా చదువులకు డబ్బులు అవసరమవుతాయనే ఆరేళ్ల క్రితం దేవరాపల్లి నుంచి విశాఖ వచ్చేశారు. నాన్న కష్టం తెలుసు. అందుకే చదువు తప్ప వేరే ధ్యాసలేకపోయింది. అదే నన్ను పదో తరగతి ఫలితాల్లో 594 మార్కులతో టాపర్‌గా నిలిపింది. చదువంతా సర్కారీ స్కూల్లోనే.. ఒకటో తరగతి నుంచి 4వ తరగతి వరకూ మా స్వగ్రామం దేవరాపల్లి మండలం కొత్తపెంటలోని మండల పరిషత్ ్ర పాథమిక పాఠశాలలో చదువుకున్నా. ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్ల ప్రవేశ పరీక్షలో 92 మార్కులు సాధించా. దీంతో అచ్యుతాపురం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ (గరల్స్)లో సీటు వచ్చింది. నా జీవితంలో నేను సాధించిన తొలి విజయమది. ఐదోతరగతి నుంచి పదో తరగతి వరకూ ఇక్కడే. అమ్మానాన్నల కష్టం తెలియడంతో వారికి ఏ రోజూ నా చదువు భారం కాకూడదనుకున్నాను. ఎంత బాగా చదివితే.. నా చదువుకు అంత తక్కువ ఖర్చవుతుందని తెలుసుకున్నాను. దీనికి నా తల్లిదండ్రుల ఆర్థిక స్థోమత తెలియడం ఒక కారణమైతే, మా స్కూల్ టీచర్లు మరో కారణం. ఇక్కడ చదువుతున్న వారిలో దాదాపు అంతా దిగువ మధ్యతరగతికి చెందిన వారే. అందుకే మా టీచర్లు చదువు విలువ తెలిసేలా, పరీక్షల భయం పోయేలా నిత్యం మమ్మల్ని ్రపోత్సహించారు. వసతులు పెరిగాయి సాధారణంగా రెసిడెన్షియల్ స్కూళ్లు మిగిలిన ప్రభుత్వ స్కూళ్లతో పోల్చుకుంటే కాస్త మెరుగ్గానే ఉంటాయి. అయితే నా వ్యక్తిగత అవసరాలకు మొదటి మూడేళ్లు ఇంటి నుంచి కొంత డబ్బులు తీసుకొచ్చేదాన్ని గత మూడేళ్లుగా పరిస్థితి చాలా మారింది. వసతులు మరింత మెరుగయ్యాయి. పర్యవేక్షణ పెరిగింది. పుస్తకాలు, యూనిఫాం, షూస్.. ఇలాంటి వాటి కోసం అమ్మానాన్నల్ని డబ్బులడిగే అవసరం లేకుండా పోయింది. మూడుసార్లు అమ్మ ఒడి అందుకున్నా. సీఎం జగన్ మామయ్య ప్రభుత్వంలో కార్పొరేట్ స్కూళ్లను మించి ప్రభుత్వ స్కూళ్లు బాగుపడ్డాయి. ఇంజినీర్ కావడమే లక్ష్యం ఇంజినీర్ కావాలన్నది నా కల. అందుకు రూ.లక్షల్లో ఖర్చుపెట్టే స్థోమత నా కుటుంబానికి లేదు. బాగా చదవడమే ఖర్చులేని దారని నాకు తెలుసు. అందుకే టీచర్లు చెప్పిన పాఠాలను ఎప్పటికప్పుడు పునఃశ్చరణ చేసుకునేదాన్ని. అర్థంకాని విషయాల్ని ఎప్పుడు అడిగినా, టీచర్లు ఓపిగ్గా విడమరిచి చెప్పేవారు. నా తమ్ముడు సందీప్ ప్రస్తుతం 7వ తరగతి పూర్తి చేసుకున్నాడు. మా అమ్మానాన్నలకు మేం భరోసాగా నిలవాలన్నదే నా కోరిక. దాన్ని నెరవేర్చేందుకు చదువు తప్ప, నాకు వేరే మార్గం తెలియదు. ఇంజినీర్‌గా స్థిరపడి నాలాంటి వారికి ఆసరాగా నిలవగలిగితే చాలు. ‘కలాసీ కూతురు ఇంజినీర్’ అని నలుగురూ చెప్పుకుంటే.. మా నాన్న కళ్లలో కనిపించే ఆనందాన్ని చూడాలి.. అంతే..!’’ మిట్టు.. సూపర్ హిట్టు టెన్త్‌లో 594 మార్కులు శ్రీకాకుళం జిల్లా (ఆంధ్రప్రదేశ్) పాతపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టెన్త్ చదివిన మిట్టు మహా పాత్రో 600కు 594 మార్కులు సాధించాడు. పాతపట్నంలోని సెయింట్ ఆన్స్ స్కూల్ ఎదురుగా ప్రధాన రహదారిలో వీరి ఇల్లు. మహా పాత్రో తండ్రి దుర్గాప్రసాద్ మహా పాత్రో ద్విచక్రవాహనాల టైర్లకు పంక్చర్లు వేస్తుంటారు. తల్లి మమత మహా పాత్రో గృహిణి. మిట్టు పాఠశాల సెలవుల్లోను, ఇంటి వద్ద ఉన్నప్పుడు సైకిల్‌కు, బైక్‌లకు పంక్చర్లు వేయడంలో తండ్రికి సహాయం చేస్తుండేవాడు. ఒడియా బ్రహ్మణ కుటుంబానికి చెందిన పేద కుటుంబం వీరిది. మిట్టుకు పదో తరగతిలోఅత్యధిక మార్కులు రావడంతో ఆ కుటుంబంపై ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి. పాతపట్నంలో 20 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నా అత్యధిక మార్కులు మాత్రం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిన మిట్టు సాధించాడు. తన కుమారుడికి పదో తరగతిలో జిల్లా మొదటి స్థానం రావడంతో ఆనందంగా ఉందని తండ్రి దుర్గా ప్రసాద్ తెలి పారు. మిట్టు ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు పాతపట్నం ప్రభుత్వ ్ర పాథమిక ఒడియా పాఠశాలలో చదివాడు. – రవి కుమార్, సాక్షి పాతపట్నం ఇంజినీర్ అవుతా... అమ్మ, నాన్న, ఉ పాధ్యాయుల ్రపోత్సాహంతో పదో తరగతిలో మంచి మార్కులు సాధించాను. ట్రిపుల్ ఐటీ చదివి, ఇంజినీర్ అవుతా. – మిట్టు మహా పాత్రో – లోవరాజు, సాక్షి, అనకాపల్లి. -
గ్రూప్–1 టాపర్ ఎవరో చెబితే ప్రభుత్వం కూలుతుంది: ఆర్ఎస్ ప్రవీణ్
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ గ్రూప్–1 మొదటి ర్యాంకు ఎవరిదో చెబితే బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్‌లకు ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా గ్రూప్–1 టాపర్లు ఎవరో ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంగళవారం బీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగ భోరోసా దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ సిబ్బంది, ఈ కేసులో నిందితులైన రాజశేఖర్‌రెడ్డి, దాసరి కిషోర్‌లకు గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో 150 మార్కులకుగాను 120 మార్కులు సాధించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితకు తెలిసిన వారే టీఎస్పీఎస్సీ సభ్యులుగా ఉన్నారని, అందువల్ల ఆ కమిషన్‌ను వెంటనే రద్దు చేయాలన్నారు. ఏ నిరుద్యోగ బిడ్డల త్యాగం వల్ల తెలంగాణ వచి్చందో, ఆ తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలను కేసీఆర్ ప్రభుత్వం రూ. 10 లక్షల నుంచి రూ. కోటి వరకు అమ్ముకుంటోందని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ‘టెన్త్’లో అలా.. టీఎస్పీఎస్సీలో ఇలా.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో ‘సిట్’విచారణ నత్తనడకన సాగుతోందని... నిందితులను బాధితులుగా చూపే ప్రయత్నం జరుగుతోందని దుయ్యబట్టారు. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో పోలీసులు 48 గంటల్లోనే పాత్రదారులు, సూత్రదారులను అరెస్ట్ చేశారని... కానీ టీఎస్పీఎస్సీ కేసులో సూత్రదారులు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నందునే ఇప్పటివరకు అరెస్టు చేయలేదని ఆరోపించారు. ఈ కేసుపై స్పందించకుండా ముఖ్యమంత్రి మౌనం వహిస్తున్నారంటే తప్పు చేసినట్లు అంగీకరిస్తున్నట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే ముఖ్యమంత్రి గద్దె దిగాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే అమరవీరుల స్థూపం వద్దకు రావాలని, తాము పేపర్ లీక్‌కు సంబందించి ఆధారాలతో వస్తామని ఆయన సవాల్ చేశారు. 18న నిరసన దీక్ష... టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిరుద్యోగులకు న్యాయం చేసేలా ప్రతిపక్ష పారీ్టలంతా ఏకతాటిపైకి రావాలని ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. అలాగే కొత్త కమిషన్ వేశాకే పరీక్షలు నిర్వహించాలనే డిమాండ్‌తో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. అన్ని పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాలతో ఈ నెల 18న ఇందిరాపార్కు వద్ద నిరసన దీక్ష చేయనున్నట్లు ప్రవీణ్‌కుమార్ తెలిపారు. సీఎంకు 25 ప్రశ్నలు రాజకీయ ప్రయోజనాల కోసమే సీఎం కేసీఆర్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు వాడుకుంటున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ విమర్శించారు. మంగళవారం బీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలను ఓటుబ్యాంకుగా చూడటమే తప్ప చిత్తశుద్ధి లేదని విమర్శించారు. 2016లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికైనా 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని... కానీ గతంలో దళిత, బహుజనులకు ఇచ్చిన హామీల సంగతేంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా 25 ప్రశ్నలతో సీఎంకు రాసిన బహిరంగ లేఖను విడుదల చేశారు. చదవండి: టీఎస్పీఎస్సీ లీకేజీ.. రంగంలోకి ఈడీ -
T20 World Cup 2022: దర్జాగా సెమీస్‌కు...
గత ఏడాది టి20 వరల్డ్‌కప్‌లో లీగ్ దశలోనే ఇంటికొచ్చిన భారత్ ఈసారి టోర్నీలో లీగ్ టాపర్‌గా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. టీమిండియా చిన్న జట్లను తేలిగ్గా తీసుకోలేదు. పెద్ద జట్లతో గాభరా పడలేదు. ప్రతీ పోరు విలువైందన్నట్లుగానే ఆడింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ మినహా ప్రతి మ్యాచ్‌లోనూ బ్యాటర్లు, బౌలర్లు చక్కగా రాణించారు. సమష్టి బాధ్యత కనబరిచారు. దీంతో టీమిండియా ఈ టోర్నీలో టైటిల్ ఫేవరెట్‌గా మారింది. గురువారం అడిలైడ్‌లో జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో రోహిత్ శర్మ బృందం సమరానికి సై అంటోంది. మెల్బోర్న్: సూర్యకుమార్ యాదవ్‌ను సహచరులంతా అతని పేరులోని మూడక్షరాలతో స్కై (ఎస్కేవై) అంటారు. ఈ ప్రపంచకప్‌లో అతను కూడా ఆ పేరుకు (ఆకాశం) తగ్గట్లే హద్దేలేని ఇన్నింగ్స్‌లతో జట్టును గెలిపిస్తున్నాడు. అభిమానుల్ని అలరిస్తున్నాడు. జింబాబ్వేతో పోరులో అయితే ‘సూపర్ సండే’ స్పెషల్ ఇన్నింగ్స్ ఆడాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్య (25 బంతుల్లో 61; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపుల సునామీతో... ‘సూపర్ 12’ గ్రూప్–2 చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 71 పరుగుల తేడాతో జింబాబ్వేపై జయభేరి మోగించి 8 పాయింట్లతో ‘టాపర్’గా నిలిచింది. మొదట భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (35 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా మెరిపించాడు. సీన్ విలియమ్స్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత జింబాబ్వే 17.2 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. బర్ల్ (22 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్), రజా (24 బంతుల్లో 34; 3 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. అశ్విన్ (3/22), షమీ (2/14), హార్దిక్ పాండ్యా (2/16) ప్రత్యర్థిని మూకుమ్మడిగా దెబ్బకొట్టారు. సూర్య ప్రతాపం... ఓవరాల్‌గా ఈ మెగా ఈవెంట్లో ‘భారత 360’ సూర్య బ్యాటింగ్ ఓ లెవెల్లో వుంది. ఈ మ్యాచ్‌లో అది మరో స్థాయికి చేరింది. సూర్య 12 ఓవర్ ఆఖరిబంతికి క్రీజులోకి వచ్చాడు. అప్పుడు టీమిండియా స్కోరు (87/2) వందయినా కాలేదు. అతను రాగానే రాహుల్ అవుటయ్యాడు. అవకాశమిచ్చిన రిషభ్ పంత్ (3) చేజార్చుకున్నాడు. స్కోరు 101/4గా ఉన్న దశలో జింబాబ్వే సంచలనంపై ఆశలు పెట్టుకోకుండా సూర్యకుమార్ రెచ్చిపోయాడు. కొన్నిషాట్లయితే ఊహకే అందవు. ఆఫ్‌సైడ్‌కు దూరంగా వెళుతున్న బంతుల్ని ఆన్‌సైడ్‌లో సిక్సర్లుగా మలచడం అద్భుతం. 15 ఓవర్లలో 107/4గా ఉన్న స్కోరు అతని సునామీ ఇన్నింగ్స్‌తో 186/5గా మ్యాచ్ ఛేంజింగ్ ఫిగర్ అయ్యింది. ఆఖరి 5 ఓవర్లలో 79 పరుగులు వచ్చాయి. 16వ ఓవర్లో సూర్య వరుసగా 2 బౌండరీలు కొడితే పాండ్యా మరో ఫోర్ కొట్టాడు. 17వ ఓవర్ వేసిన ఎన్గరవా ఆఫ్‌సైడ్‌లో వేసిన వైడ్ యార్కర్లను 4, 6గా కొట్టడం మ్యాచ్‌కే హైలైట్. చటారా ఓవర్లో ఎక్స్ట్రా కవర్స్ మీదుగా బాదిన సిక్సర్, ఎన్‌గరవ ఆఖరి ఓవర్లో వరుసగా సూర్య 6, 2, 4, 6లతో మొత్తం 21 పరుగులు వచ్చాయి. 23 బంతుల్లో సూర్య (5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఫిఫ్టీ పూర్తయ్యింది. అంతకుముందు ఓపెనర్లలో రోహిత్ (15) విఫలమైనా... రాహుల్, కోహ్లి (25 బంతుల్లో 26; 2 ఫోర్లు)తో కలిసి స్కోరును నడిపించాడు. 34 బంతుల్లో (3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాహుల్ అర్ధశతకం సాధించాడు. మన పేస్‌కు విలవిల జింబాబ్వే బ్యాటర్లు లక్ష్యఛేదనను అటుంచి... అసలు క్రీజులో నిలిచేందుకే కష్టపడ్డారు. టాప్, మిడిలార్డర్ భారత పేస్ బౌలింగ్‌కు విలవిల్లాడింది. ఓపెనర్లు మదెవెర్ (0)ను భువీ, ఇర్విన్ (13)ను హార్దిక్, చకబ్వా (0)ను అర్‡్షదీప్, సీన్ విలియమ్స్ (11)ను షమీ... ఇలా వరుసలోని నలుగురు బ్యాటర్స్‌ను నలుగురు బౌలర్లు దెబ్బకొట్టడంతో జింబాబ్వే ఓటమివైపు నడిచింది. సికిందర్ రజా, రియాన్ బర్ల్ చేసిన పరుగులు జట్టు వంద దాటేందుకు ఉపయోగపడ్డాయి. ఆఖరి వరుస బ్యాటర్స్ అశ్విన్ ఉచ్చులో పడటంతో ఆలౌట్ అయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) మసకద్జా (బి) సికందర్ 51; రోహిత్ (సి) మసకద్జా (బి) ముజరబాని 15; కోహ్లి (సి) బర్ల్ (బి) విలియమ్స్ 26; సూర్యకుమార్ (నాటౌట్) 61; పంత్ (సి) బర్ల్ (బి) విలియమ్స్ 3; పాండ్యా (సి) ముజరబాని (బి) ఎన్‌గరవ 18; అక్షర్ పటేల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1–27, 2–87, 3–95, 4–101, 5–166. బౌలింగ్: ఎన్‌గరవ 4–1–44–1, చటార 4–0–34–0, ముజరబాని 4–0–50–1, మసకద్జా 2–0–12–0, బర్ల్ 1–0–14–0, సికందర్ రజా 3–0–18–1, సీన్ విలియమ్స్ 2–0–9–2. జింబాబ్వే ఇన్నింగ్స్: మదెవెర్ (సి) కోహ్లి (బి) భువనేశ్వర్ 0; ఇర్విన్ (సి అండ్ బి) పాండ్యా 13; చకబ్వా (బి) అర్‡్షదీప్ 0; విలియమ్స్ (సి) భువనేశ్వర్ (బి) 11; సికందర్ (సి) సూర్య (బి) పాండ్యా 34; టోని (ఎల్బీడబ్ల్యూ) (బి) షమీ 5; బర్ల్ (బి) అశ్విన్ 35; మసకద్జా (సి) రోహిత్ (బి) అశ్విన్ 1; ఎన్‌గరవ (బి) అశ్విన్ 1; చటార (సి అండ్ బి) అక్షర్ 4; ముజరబాని (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (17.2 ఓవర్లలో ఆలౌట్) 115. వికెట్ల పతనం: 1–0, 2–2, 3–28, 4–31, 5–36, 6–96, 7–104, 8–106, 9–111, 10– 115. బౌలింగ్: భువనేశ్వర్ 3–1–11–1, అర్‡్షదీప్ 2–0–9–1, షమీ 2–0–14–2, పాండ్యా 3–0– 16–2, అశ్విన్ 4–0–22–3, అక్షర్ 3.2–0–40–1. 1: క్యాలెండర్ ఇయర్లో అంతర్జాతీయ టి20ల్లో 1,000 పరుగులు సాధించిన తొలి భారతీయ క్రికెటర్‌గా సూర్యకుమార్ యాదవ్ గుర్తింపు పొందాడు. ఈ ఏడాది సూర్య 28 టి20 మ్యాచ్‌లు ఆడి 1,026 పరుగులు చేశాడు. 21:ఈ ఏడాది రోహిత్ శర్మ కెప్టెన్సీలో టి20ల్లో భారత్ సాధించిన విజయాలు. క్యాలెండర్ ఇయర్లో అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా బాబర్ ఆజమ్ (2021లో 20) పేరిట ఉన్న రికార్డును రోహిత్ అధిగమించాడు. -
ఇంట్లో పెను విషాదం..కన్నీళ్లను దిగమింగుతూ టాపర్‌గా నిలిచింది
సాక్షి, వెబ్‌డెస్క్: పరీక్షలు దగ్గర పడుతున్నాయంటే చాలు.. పిల్లల గురించి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగనీయరు. ప్రతీది వారి ముందుకే తెచ్చిపెడతారు. ఏమంటే.. పిల్లలు ఏ మాత్రం డిస్టర్బ్ అయినా ఆ ప్రభావం వారి పరీక్షల మీద పడుతుందని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు తల్లిదండ్రులు. అలాంటిది పరీక్షల ముందు ఏకంగా అమ్మానాన్న మరణిస్తే.. ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఓ సారి ఊహించుకోండి. పరీక్షల్లో పాసవ్వడం సంగతి అటుంచి.. అసలు చాలా మంది ఎగ్జామ్స్‌కు హాజరవ్వరు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే విద్యార్థిని అందుకు భిన్నం. తల్లిదండ్రులను కోల్పోయాననే బాధ వెంటాడుతున్నప్పటికి.. వారు తనమీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చడమే తన బాధ్యత అనుకుంది. మరింత దీక్షగా చదివి.. టాపర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆ విద్యార్థిని స్టోరి ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఆ వివరాలు.. బుధవారం ప్రకటించిన సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలోల మధ్యప్రదేశ్‌కు చెందిన వనీషా పఠాక్ టాపర్‌గా నిలిచింది. స్కూల్ యాజమాన్యం, ఇరుగుపొరుగు వారు ప్రశంసిస్తున్నప్పటికి.. పెద్దగా సంతోషించలేకపోతుంది. ఎందుకంటే ఆ సమయంలో తన పక్కనే ఉండి.. తన విజయంలో పాలు పంచుకుని.. తన కన్నా ఎక్కువగా మురిసిపోవాల్సిన తన తల్లిదండ్రులు రెండు నెలల క్రితం కోవిడ్ బారిన పడి మృతి చెందారు. ఫస్ట్ వచ్చిన సంతోషం కంటే.. అమ్మనాన్న లేరనే విషయమే వనీషాను ఎక్కువ బాధిస్తుంది. తల్లిదండ్రులతో వనీషా పఠాక్ (ఫైల్ ఫోటో) ఈ సదర్భంగా వనీషా మాట్లాడుతూ.. ‘‘నా తల్లిదండ్రులు నన్ను ప్రతి విషయంలో ప్రోతాహిస్తూ ఉండేవాళ్లు. జీవితాంతం నన్ను పోత్సాహిస్తూనే ఉంటారు. నా పరీక్షల ముందే వారిద్దరికి కోవిడ్ సోకి ఆస్పత్రిలో చేరారు. నేను చివరి సారిగా ఈ ఏడాది మే 2న మా అమ్మతో మాట్లాడాను. మే 4న ఆమె చనిపోయారు. అప్పటికే మా నాన్న కూడా ఆస్పత్రిలోనే ఉన్నారు. కానీ మా బంధువులు నాకు ఆ విషయం చెప్పలేదు. మే 10న నాన్నతో చివరి సారి మాట్లాడాను. ఐదు రోజుల తర్వాత నాన్న కూడా చనిపోయారు. ఆ తర్వాతే నాకు అమ్మనాన్న చనిపోయారనే విషయం చెప్పారు. అమ్మ మృతదేహాన్ని కూడా చూడలేకపోయాను. ‘‘నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో.. ధైర్యంగా ఉండి.. మేం త్వరలోనే వస్తాం’’ ఇదే అమ్మ నాతో మాట్లాడిన ఆఖరి మాటలు’’ అంటూ భావోద్వేగానికి గురయ్యింది వనీషా. ఆ తర్వాత తేరుకుని ‘‘ఇప్పుడు నా జీవితంలో నాకున్న అతిపెద్ద అండ నా సోదరుడు. తను ఇచ్చిన మద్దతు వల్లే నేను అమ్మనాన్న చనిపోయారనే బాధ నుంచి కోలుకుని.. చదువు మీద దృష్టి పెట్టగలిగాను. ఈ రోజు టాపర్‌గా నిలిచాను. నాన్న కలల్ని నేరవేరుస్తాను. అమ్మ కోరుకున్నట్లు నేను ధైర్యంగా ఉంటాను’’ అని తెలిపింది వనీషా. ఇక ఎన్డీటీవీ తెలిపిన వివరాల ప్రకారం వనీషా తండ్రి జితేంద్ర కుమార్ ఆర్థిక సలహాదారుగా పని చేసేవాడు.. ఆమె తల్లి డాక్టర్ సీమా పఠాక్ స్కూల్ టీచర్‌గా పని చేసేవారు. -
ఈసారి పరేడ్‌లో ఒక ఫైటర్ ఒక టాపర్
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి రాజ్‌పథ్ మీదుగా ఇండియా గేట్ వరకు ఎనిమిది కి.మీ. దూరం సాగవలసిన రిపబ్లిక్ డే పరేడ్ ఈ ఏడాది మునుపటంత సందడితో ఉండబోవడం లేదు. ఎప్పుడూ లక్షమంది వరకు వీక్షకులను అనుమతించేవారు. ఈ ఏడాది ఆ సంఖ్యను ఇరవై ఐదు వేలకు కుదించారు. ఆ ఇరవై ఐదు వేల మందిలో నాలుగు వేల మంది మాత్రమే సాధారణ ప్రజలు. మిగతావారంతా వి.ఐ.పి.లు, వి.వి.ఐ.పీలు. ఎప్పుడూ చిన్నాపెద్దా అందరూ పరేడ్‌ను చూడ్డానికి వచ్చేవారు. ఈ ఏడాది పదిహేనేళ్ల వయసు లోపువారికి, అరవై ఐదేళ్లు దాటిన వారికి రాజ్‌పథ్ ప్రవేశాన్ని నిషేధించారు. బయటి అతిథులు కూడా ఎవరూ రావడం లేదు. కారణం తెలిసిందే. సోషల్ డిస్టెన్స్. అయితే.. ఇన్ని నిరుత్సాహాల నడుమ రెండంటే రెండే ఉల్లాసకరమైన విషయాలుగా కనిపిస్తున్నాయి. ఫ్లయింట్ లెఫ్ట్‌నెంట్ భావనా కాంత్ మన వాయుసేనలోని ఫైటర్ జెట్‌తో గగనతలంలో విన్యాసాలు చేయబోతున్నారు! రిపబ్లిక్ డే పరేడ్‌లో ఒక మహిళా ఫైటర్ పైలట్.. యుద్ధ విమానాన్ని చక్కర్లు కొట్టించబోవడం ఇదే మొదటిసారి. అలాగే దివ్యాంగి త్రిపాఠీ అనే విద్యార్థినికి పరేడ్ గ్రౌండ్స్‌లోని ప్రధాన మంత్రి బాక్స్‌లో కూర్చొని వేడుకలను తిలకించే అవకాశం లభించడం దేశంలోని బాలికలు, మహిళలందరికీ స్ఫూర్తినిచ్చే పరిణామం. భావనా కాంత్ (28) భారతదేశపు తొలి మహిళా ఫైటర్ పైలట్. జనవరి 26 న ఆమె రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్న తొలి మహిళా ఫైటర్ పైలట్ అవుతారు. భారత వాయుసేన ఆమెకు ఈ అరుదైన, ఘనమైన, చరిత్రాత్మక అవకాశాన్ని కల్పించింది. 2016 లో తొలి ఫైటర్ పైలట్‌గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐ.ఎ.ఎఫ్) లోకి వచ్చారు భావన. ఇంచుమించుగా ఆమెతో పాటే అవని చతుర్వేది, మోహనా సింగ్ ఫైటర్ పైలట్ శిక్షణలో చేరారు. అప్పటి వరకు మన సైన్యంలో మహిళా ఫైటర్ పైలట్లే లేరు. మూడేళ్ల అంచెలంచెల శిక్షణానంతరం 2019 మే లో యుద్ధ విమానాలు నడిపేందుకు భావన పూర్తి అర్హతలు సంపాదించారు. ప్రస్తుతం ఆమె రాజస్థాన్‌లోని వైమానిక స్థావరంలో విధి నిర్వహణలో ఉన్నారు. మిగ్–21 యుద్ధ విమానాన్ని అన్ని కోణాల్లో మలుపులు తిప్పి శత్రువు వెన్ను విరచడంలో నైపుణ్యం ఉన్న యోధురాలు భావనా కామత్ ఇప్పుడు. భావన 1992 డిసెంబర్ 1న బిహార్‌లోని దర్భంగా లో జన్మించారు. అయితే ఆమె పెరిగింది అక్కడికి సమీపంలోని బెగుసరాయ్‌లోని రిఫైనరీ టౌన్షిప్లో. ఆమె తండ్రి తేజ్ నారాయణ్.. ఇంజనీర్. ఆ టౌన్‌షిప్‌లోని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్లో ఆయన ఉద్యోగం. భావన తల్లి రాధాకాంత్ గృహిణి. భావన తమ్ముడు నీలాంబర్, భావన చెల్లి తనూజ. వారిద్దరికీ భావనే అన్నిటా స్ఫూర్తి. భావనకు డ్రైవింగ్ అంటే ఇష్టం. అందుకే కావచ్చు డ్రైవింగ్‌కి అత్యున్నతస్థాయి అనుకోదగిన ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ పైలటింగ్‌ను కెరీర్‌గా ఎన్నుకున్నారు. ఇంకా ఆమెకు ఖోఖో, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, డిబేట్స్, సినిమాలు ఇష్టం. టౌన్‌షిప్‌లోని స్కూల్లో చదువు పూర్తయ్యాక భావన బెంగళూరులోని బి.ఎం.ఎస్. కాలేజ్‌లో మెడికల్ ఎలక్ట్రానిక్స్‌లో ఇంజనీరింగ్ చేశారు. తర్వాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో కొన్నాళ్లు పని చేశారు. ఎయిర్ ఫోర్స్‌లో జాయిన్ అయ్యేందుకు కామన్ అడ్మిషన్ టెస్ట్ రాసి ఉత్తీర్ణులయ్యారు. హైదరాబాద్ హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ట్రైనింగ్ అయ్యాక మేడ్చెల్ జిల్లాలోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్అకాడమీ నుంచి ఫ్లయింగ్ ఆఫీసర్‌గా బయటికి వచ్చారు. భారత రాష్ట్రపతి గత ఏడాది ఆమెకు నారీ శక్తి పురస్కారం ప్రదానం చేశారు. ∙ ∙ ఇక రిపబ్లిక్ డే పరేడ్‌ను పీఎం పక్కన కూర్చొని వీక్షించేందుకు ప్రత్యేక ఆహ్వానాన్ని పొందిన దివ్యాంగీ త్రిపాఠీ (18) ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ అమ్మాయి. 2020 సీబీఎస్ఇ 12వ తరగతి పరీక్షల్లో 99.6 శాతం మార్కులతో జిల్లాలోనే టాపర్‌గా నిలవడంతో దివ్యాంగికి ఈ అరుదైన అవకాశం లభించింది. ఆమెతో పాటు ఈ అవకాశం దేశంలోని మిగతా రాష్ట్రాల టాపర్స్కీ దక్కింది. ఇప్పుడు ఆమెకు స్నేహితుల నుంచి, బంధువుల నుంచి ఎదురౌతున్న ప్రశ్న ఒక్కటే. ‘ప్రధాని నరేంద్ర మోదీ పక్కన కూర్చొని ఉన్నప్పుడు నువ్వు ఆయనతో ఏం మాట్లాడతావు?’ అని! దివ్యాంగి తండ్రి ఉమేశ్‌నాథ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్. తల్లి ఉష గృహిణి. ఈ నెల 13న కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ‘పరేడ్’ను చూసేందుకు ఆహ్వానం వచ్చిందని ఆమె ఎంతో సంతోషంతో తెలిపారు. గత ఏడాది ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్ -
అస్సాంలో జేఈఈ టాపర్ అరెస్టు
గువాహటి: తన బదులు మరొకరితో పరీక్ష రాయించి, అస్సాంలో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ)–మెయిన్‌లో టాపర్‌గా నిలిచిన నీల్ నక్షత్ర దాస్‌ను అరెస్టు చేసినట్లు గువాహటి పోలీసులు బుధవారం తెలిపారు. ఈ పరీక్షలో నక్షత్ర దాస్ 99.8 శాతం పర్సంటైల్ సాధించి, అస్సాం రాష్ట్రంలో టాపర్‌గా నిలిచాడు. అతడు మరొకరితో పరీక్ష రాయించినట్లు విచారణలో తేలింది. అంటే కష్టపడి చదవకుండానే, పరీక్షకు హాజరు కాకుండానే టాప్ ర్యాంకు కొట్టేశాడన్నమాట. ఈ విషయంలో నక్షత్ర దాస్‌కు అతడి తండ్రి డాక్టర్ జ్మోతిర్మయి దాస్, పరీక్ష కేంద్రం నిర్వాహకులు హేమేంద్రనాథ్ శర్మ, ప్రాంజల్ కలితా, హీరూలాల్ పాఠక్ సహకరించినట్లు విచారణలో బయటపడింది. తన కుమారుడు నక్షత్రదాస్కు టాప్ ర్యాంకు రావడానికి తండ్రి జ్యోతిర్మయి దాస్ దాదాపు రూ.20 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. -
నీట్ గందరగోళం.. టాపర్‌ని ఫెయిల్ చేశారు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) ఫలితాలపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతుంది. ఇప్పటికే ఫస్ట్ ర్యాంక్ ప్రకటన విషయంలో విమర్శలు వస్తుండగా.. తాజాగా టాపర్‌గా నిలిచిన విద్యార్థిని ఫెయిల్ అయినట్లు ప్రకటించినట్లు తెలిసింది. వివరాలు.. 17 ఏళ్ల రావత్ రాజస్తాన్ లోని సవాయి మాధోపూర్ జిల్లాలోని గంగాపూర్ పట్టణంలో నివసిస్తున్నాడు. అక్టోబర్ 16 న, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఏటీఏ) జారీ చేసిన మొదటి మార్క్‌షీట్ ప్రకారం అతడు ఫెయిల్ అయినట్లు వచ్చింది. 720 మార్కులకు గాను మృదుల్‌కు 329 పాయింట్లు ఇచ్చింది. దాంతో అతడు రిజల్ట్‌ని సవాలు చేశాడు. ఈ క్రమంలో అతడి ఓఎంఆర్ షీట్, ఆన్సర్ కీని తిరిగి తనిఖీ చేయడంతో 650 మార్కులతో అతను ఎస్టీ కేటగిరీలో ఆల్ ఇండియా టాపర్ అని తేలింది. జనరల్ కేటగిరీలో ఆల్ ఇండియా 3577వ ర్యాంకు సాధించాడు. (చదవండి: ఎన్నదగిన తీర్పు) అయితే, ఎన్టీఏ జారీ చేసిన రెండవ మార్క్‌షీట్‌లో కూడా మరో పొరపాటును గుర్తించారు. దానిలో, అతని మార్కుల మొత్తం 650 అని చూపించినప్పటికి.. అక్షరాల్లో మాత్రం మూడు వందల ఇరవై తొమ్మిది అని రాశారు. అలానే ఫస్ట్ ర్యాంకు విషయంలో కూడా విమర్శలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఒడిశాకు చెందిన సోయబ్ అఫ్తాబ్, ఢిల్లీకి చెందిన ఆకాంక్ష సింగ్ ఇద్దరు ఆవుట్ ఆఫ్ మార్కులు సాధించారు. కానీ ఎన్టీఏ టై బ్రేకింగ్ పాలసీ ప్రకారం అఫ్తాబ్‌కి మొదటి ర్యాంకు, ఆకాంక్షకు రెండవ ర్యాంకుగా ప్రకటించింది. -
సమాన మార్క్‌లు కానీ ఆమె టాపర్ కాలేదు, ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ: ఒడిశాకు చెందిన సోయబ్ అఫ్తాబ్ నీట్-2020 పరీక్షలలో టాపర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అతనికి నీట్లో 720 కి 720 మార్క్‌లు వచ్చాయి. అయితే అతనితో సమానంగా ఢిల్లీకి చెందిన ఆకాంక్ష సింగ్ కూడా ఫుల్ మార్క్ తెచ్చుకుంది. ఇద్దరికి సరిసమానమైన మార్క్‌లు వచ్చినప్పటికి సోయబ్ టాపర్‌గా నిలవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవి ఏంటంటే నీట్ పరీక్షలో ఇద్దరు అభ్యర్థులకు సమానమైన మార్క్‌లు వచ్చినప్పుడు వారికి ర్యాంక్ కేటాయించేటప్పుడు అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుంటారు. మొదటగా పరిశీలించేది వారి బయాలజీ మార్క్‌లు, అక్కడ కూడా ఇద్దరికి సమానమైన మార్క్‌లు వస్తే రసాయన శాస్త్రంలో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూస్తారు. ఆ తరువాత ఎవరికి ఎక్కువ నెగిటివ్ మార్క్‌లు వచ్చాయో పోలుస్తారు. అప్పటకి ఇద్దరు సమానంగా ఉంటే వయసును లెక్కిస్తారు. ఈ ఏడాది నీట్ టాపర్స్ ఇద్దరు అన్నింటిలో సమానంగా మార్క్‌లు తెచ్చకున్నప్పటికి ఆకాంక్ష సింగ్ సోయబ్ కంటే చిన్నది. అందుకే పెద్ద వాడు అయిన సోయబ్‌నే ఆల్ ఇండియా నీట్ ర్యాంకర్ 1 గా ప్రకటించారు. ఇలా ఇద్దరికి సమానమైన మార్క్‌లు వచ్చినప్పుడు వారి వయసులను పరిశీలించి ఎవరు పెద్దవారైతే వారికే మొదటి ర్యాంక్‌ను కేటాయిస్తారు. ఈ కారణంగానే సోయబ్ టాపర్‌గా నిలిచాడు. చదవండి: నీట్ ఫలితాల వెల్లడి -
మెకానిక్ కొడుకు.. అమెరికన్ స్కూల్ టాపర్
లక్నో: కృషి, పట్టుదల, సాధించాలనే తపన ఉండాలేగాని పేదరికం మనల్ని ఏం చేయలేదు అనేది పెద్దల మాట. ఈ మాటల్ని రుజువు చేసే ఘటనలు మన ముందు కొకొల్లలు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ అలీగఢ్‌లో చోటు చేసుకుంది. అమెరికన్ స్కాలర్షిప్ పొంది హై స్కూల్ విద్య కోసం ఆ దేశం వెల్లడమే కాక తన ప్రతిభతో అక్కడ కూడా టాపర్‌గా నిలిచాడు ఓ మెకానిక్ కొడుకు. ఆ వివరాలు.. అలీఘర్కు చెందిన ఓ మోటార్ మెకానిక్ కొడుకు మహ్మద్ షాదాబ్ చిన్నప్పటి నుంచి చదువులో బాగా చురుకుగా ఉండేవాడు. ఈ క్రమంలో గత ఏడాది అమెరికా ప్రభుత్వం ఇచ్చే ‘కెన్నడి లూగర్ యూత్ ఎక్స్చేంజ్ స్కాలర్షిప్’కు ఎంపికయ్యాడు. దీని ద్వారా షాదాబ్‌కు రూ. 20లక్షలు వచ్చాయి. దాంతో హై స్కూల్ చదువుల నిమిత్తం షాదాబ్ అమెరికా వెళ్లాడు. ఈ క్రమంలో ఈ ఏడాది అక్కడి హై స్కూల్లో టాపర్‌గా నిలిచాడు. అంతేకాక దాదాపు 800 వందల మంది చదువుతున్న ఈ అమెరికన్ హై స్కూల్లో గత నెల షాదాబ్ ‘స్టూడెంట్ ఆఫ్ ది మంత్’గా నిలిచాడు. ఈ క్రమంలో షాదాబ్ మాట్లాడుతూ.. ‘ఇది నాకు చాలా గొప్ప విజయం. అమెరికన్ స్కాలర్‌షిప్‌తో ఇక్కడ చదువుకోడానికి వచ్చిన నేను టాపర్‌గా నిలిచాను. అయితే దీని కోసం ఎంతో శ్రమించాను. ఇంటి దగ్గర పరిస్థితి ఏం బాగుండేది కాదు. నేను నా కుటుంబానికి మద్దతుగా నిలవాలనుకుంటున్నాను. వారిని గర్వపడేలా చేస్తాను’ అని తెలిపాడు. అంతేకాక విదేశాల్లో భారత జెండా ఎగరవేసే అవకాశం తనకు ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాడు.(చాలా సార్లు విన్నా: మేరీ ట్రంప్) షాదాబ్ తండ్రి గత 25 సంవత్సరాలుగా మోటార్ మెకానిక్‌గా పని చేస్తున్నారు. కొడుకు గురించి అతడు ఎంతో గర్వపడుతున్నాడు. తన కొడుకు కలెక్టర్ అయ్యి దేశానికి సేవ చేయాలని ఆశిస్తున్నాడు. కానీ షాదాబ్ మాత్రం ఐక్యరాజ్యసమితిలో మానవహక్కుల అధికారిగా పని చేయాలని ఉందని తెలిపాడు. -
హన్సిక ఈజ్ ద బెస్ట్!
న్యూఢిల్లీ: చరిత్ర అంటే తనకెంతో ఇష్టమని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) పన్నెండో తరగతి పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన హన్సిక శుక్లా తెలిపింది. సీబీఎస్ఈ ఫలితాల్లో అగ్రస్థానంలో నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. ఘజియాబాద్‌లోని ఢిల్లీ ప్లబిక్ స్కూల్లో చదివిన హన్సిక.. చరిత్ర, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, హిందూస్తానీ వోకల్లో వందకు వంద మార్కులు సాధించింది. ఇంగ్లీషులో మాత్రమే 99 మార్కులు తెచ్చుకుంది. ‘ఫలితాలు వెలువడిన వెంటనే ఆఫీస్ నుంచి మా నాన్న ఫోన్ చేశారు. నేను చూసుకోలేదు. తర్వాత మా అమ్మ కాల్ చేసి అభినందనలు తెలిపింది. టాప్‌లో నిలిచానని చెప్పడంతో నమ్మలేకపోయాన’ని హన్సిక ‘ఏబీపీ’ వార్తా సంస్థతో చెప్పింది. తన విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణమని వెల్లడించింది. హన్సిక తల్లి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, తండ్రి రాజ్యసభ సెక్రటరీగా పనిచేస్తున్నారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండి, ప్రతి సబ్జెక్ట్‌పై ఫోకస్ చేయడం వల్లే పరీక్షల్లో టాపర్ నిలిచానని హన్సిక తెలిపింది. డిగ్రీలో సైకాలజీ చదివి ఇండియన్ ఫారిన్ సర్వీసులో చేరాలన్నదే తన లక్ష్యమని పేర్కొంది. శాస్త్రీయ సంగీతం, బాలీవుడ్, ఇంగ్లీషు పాటలు వింటూ రిలాక్స్ అవుతుంటానని వెల్లడించింది. జంక్ ఫుడ్ చాలా తక్కువగా తీసుకుంటానని, పనీర్ అంటే తనకు చాలా ఇష్టమని హన్సిక తెలిపింది. (500కు 499 మార్కులు.. మళ్లీ వాళ్లే టాప్!) -
సివిల్స్ టాపర్ ప్రేమకథ
న్యూఢిల్లీ: తన విజయంలో గర్ల్‌ఫ్రెండ్ పాత్ర కూడా ఉందని సివిల్స్ టాపర్ కనిషక్ కటారియా చేసిన ప్రకటనతో ట్విట్టర్ హోరెత్తిపోతోంది. సంప్రదాయానికి భిన్నంగా ఆయన అభ్యుదయభావంతో స్పందించారని నెటిజెన్లు పొడిగారు. కెరీర్లో విజయం సాధించేందుకు ప్రేయసి అడ్డుకాదని కొందరు వ్యాఖ్యానించారు. ‘ఈ క్షణం ఎంతో ఆశ్చర్యకరం. సివిల్స్‌లో తొలి ర్యాంకు సాధిస్తానని అనుకోలేదు. ఈ విషయంలో మద్దతుగా నిలిచి నైతిక స్థైర్యాన్నిచ్చిన నా తల్లిదండ్రులు, సోదరి, గర్ల్‌ఫ్రెండ్‌కు కృతజ్ఞతలు’ అని కటారియా శనివారం విలేకర్లతో అన్నారు. తన విజయం పట్ల గర్ల్‌ఫ్రెండ్‌కు బహిరంగంగా ధన్యవాదాలు చెప్పిన తొలి సివిల్స్ టాపర్ కటారియానే అని భావిస్తున్నారు. ‘మన దేశంలో చదువుకునే పిల్లలు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ చదువుపైనే దృష్టిపెట్టాలి. కానీ ఆలిండియా సివిల్స్ టాపర్ కటారియా తన ప్రేయసికి ధన్యవాదాలు చెప్పారు’ అని ఒకరు అనగా..యూపీఎస్సీ పరీక్ష పాసవ్వడానికి ప్రేయసి అడ్డుకాదని మరోసారి నిరూపితమైందని మరొకరు ట్వీట్ చేశారు. ఇలా గర్ల్‌ఫ్రెండ్‌కు ధన్యవాదాలు చెప్పే ధైర్యం ఎందరికి ఉంటుందని మరొకరు ప్రశ్నించారు. ‘ప్రేయసి, సంబంధాలు కెరీర్ లక్ష్యాల నుంచి దృష్టి మరలుస్తాయని అన్నవారెక్కడ?’ అని మరొకరు ప్రశ్నించారు. జైపూర్‌కు చెందిన కటారియా తండ్రి సాన్వర్ వర్మ, అంకుల్ కేసీ వర్మ ఐఏఎస్ అధికారులే కావడం గమనార్హం. -
వయసు 96.. మార్కులు 98
తిరువనంతపురం : చదువుకు వయసుతో నిమిత్తం లేదని నిరూపించిందో బామ్మ. సెంచరీ కొట్టేందుకు చేరువలో ఉన్న ఈ బామ్మ.. ఎగ్జామ్‌లో మాత్రం సెంట్ పర్సెంట్ స్కోర్ చేసి టాపర్‌గా నిలిచింది. దాంతో ఈ బామ్మ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేతుల మీదగా రేపు (గురువారం) మెరిట్ సర్టిఫికెట్ అందుకోనుంది. వివరాలు.. కేరళ అలప్పుజ జిల్లా ముత్తం గ్రామానికి చెందిన కార్థియాని అమ్మ(96)... ఆలయాల్లో శుభ్రం చేస్తూ జీవనం గడిపేది. బాల్యంలో బడి ముఖం చూడని ఈ బామ్మ చదువుపై మక్కువతో కేరళ ప్రభుత్వ ప్రారంభించిన ‘అక్షర లక్ష్యం’ కార్యక్రమంలో చేరింది. రాష్ట్రంలో 100శాతం అక్షరాస్యత సాధించేందుకుగాను కేరళ ప్రభుత్వం ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాక్షరతా మిషన్‌లో భాగంగా ఈ ‘అక్షర లక్ష్యం’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు నాలుగు, ఏడు, పది, ఇంటర్ తరగతులకు సంబంధించి దాదాపు 42, 933మంది పరీక్షలు నిర్వహించారు. కార్థియాని అమ్మ నాలుగో తరగతి పరీక్షలకు హాజరయ్యింది. అంతేకాక ఈ పరీక్షలో ఆమె 98 మార్కులు సాధించి టాపర్‌గా నిలించింది. ఈ విషయం గురించి బామ్మ మాట్లాడుతూ.. ‘నేను ఇప్పుడు చదవగలను, రాయగలను లెక్కలు కూడా చేయగలను. చదువులో నాకు నా ముని మనవరాళ్లు సాయం చేసేవార’ని ముసిరిపోయింది బామ్మ. కాగా కార్థిమణి అమ్మ పట్టుదలను పలువురు ప్రముఖులు మెచ్చుకుంటున్నారు. వీరిలో మహీంద్ర గ్రూప్ చైర్మెన్ ఆనంద్ మహీంద్ర, కేరళ పర్యాటక శాఖ మంత్రి అల్ఫోన్స్ ఉన్నారు. కార్థిమణి అమ్మ పట్టుదలకు ముగ్దులైన వీరు... ఆమె ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
హరియాణ గ్యాంగ్ రేప్ కేసులో కొత్త కోణం
-
హరియాణ గ్యాంగ్ రేప్ : వైద్యుడి ప్రమేయం
చండీగఢ్ : హరియాణలో సీబీఎస్ఈ టాపర్, 19 ఏళ్ల విద్యార్థినిపై జరిగిన సామూహిక లైంగిక దాడి కేసులో ప్రధాన నిందితుడు బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుడిని పిలిచాడని పోలీసులు తెలిపారు. నిందితుడు నిషు పొగట్ బాధితురాలి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని గ్రహించి డాక్టర్ సంజీవ్ అనే వైద్యుడిని రప్పించాడని పోలీసులు వెల్లడించారు. డాక్టర్ సంజీవ్‌తో పాటు లైంగిక దాడి జరిగిన రూమ్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. టీనేజర్‌పై లైంగిక దాడి కేసులో వైద్యుడి ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితురాలిపై నిందితులు దారుణానికి ఒడిగట్టినా డాక్టర్ సంజీవ్ పోలీసులకు సమాచారం అందించలేదని చెబుతున్నారు. లైంగిక దాడి జరిగే సమయంలో ఆయన అక్కడే ఉన్నా పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వకపోవడంతో పాటు ఈ ఘోరంలో పాలుపంచుకున్నాడని ఆధారాలున్నాయని, ఫోరెన్సిక్ ఫలితాల్లో ఇది వెలుగుచూస్తుందని పోలీస్ అధికారి నంజీన్ భాసిన్ చెప్పారు. ఈ ఘటనలో ఆర్మీ జవాన్‌తో సహా మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని తెలిపారు. కనియా జిల్లాలో కోచింగ్ క్లాస్‌కు వెళ్లి తిరిగివస్తున్న ఓ యువతిని బుధవారం ముగ్గురు యువకులు కిడ్నాప్‌చేసి గ్యాంగ్‌రేప్ చేసిన సంగతి తెలిసిందే. వీరితో పాటు మరో 9 మంది బాధితురాలిపై లైంగికదాడికి దిగారు. ఆమె స్పృహ కోల్పోవడంతో బస్టాండ్‌లో పడేసి వెళ్లిపోయారు.మరోవైపు ఈ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్(ఎన్డబ్ల్యూసీ).. వీలైనంత త్వరగా దీనిపై నివేదికను సమర్పించాలని హరియాణా డీజీపీ సంధూను ఆదేశించింది. -
హరియాణా గ్యాంగ్ రేప్ : నిందితుడి అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : హరియాణాలో సీబీఎస్ఈ టాపర్‌పై జరిగిన సామూహిక లైంగిక దాడి కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నేరం జరిగిన స్ధలంలోని ట్యూబ్‌వెల్ యజమానిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. ఈ స్థలాన్ని నిందితులకు అతను రెంట్‌కు ఇచ్చాడని వెల్లడించారు. ఘటనలో సైనిక జవాను సహా పరారీలో ఉన్న ముగ్గురు ప్రధాన నిందితుల కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. వీరి అరెస్ట్‌కు సహకరించే సమాచారం అందించిన వారికి పోలీసులు రూ లక్ష నగదు రివార్డును ప్రకటించారు. కనియా జిల్లాలో కోచింగ్ క్లాస్‌కు వెళ్లి తిరిగివస్తున్న ఓ యువతిని బుధవారం ముగ్గురు యువకులు కిడ్నాప్‌చేసి గ్యాంగ్‌రేప్ చేసిన సంగతి తెలిసిందే. వీరితో పాటు మరో 9 మంది బాధితురాలిపై లైంగికదాడికి దిగారు. ఆమె స్పృహ కోల్పోవడంతో బస్టాండ్‌లో పడేసి వెళ్లిపోయారు.మరోవైపు ఈ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్(ఎన్డబ్ల్యూసీ).. వీలైనంత త్వరగా దీనిపై నివేదికను సమర్పించాలని హరియాణా డీజీపీ సంధూను ఆదేశించింది. -
సీబీఎస్ టాపర్‌పై అత్యాచారం.. మహిళా ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ఛండీఘర్ : ‘యువతకు సరైన ఉపాధి లేకపోవడం వల్ల తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఆ కోపం, చిరాకులో వారు అత్యాచారాలకు పాల్పడుతున్నారం’టూ హర్యానా ఉచానా కాలన్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ప్రేమ్‌లతా సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో సీబీఎస్ టాపర్‌పై సామూహిక అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. వివరాల ప్రకారం.. బాధితురాలు బుధవారం ఊరికి సమీపంలోని కోచింగ్ సెంటర్ నుంచి ఇంటికి తిరిగివచ్చేటప్పుడు కారులో వచ్చిన ముగ్గురు యువకులు ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత నిందితులు బాధితురాలిని బస్టాండ్ సమీపంలో వదిలి వెళ్లిపోయారు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వం ఈ కేసును దర్యాప్తు చేయడానికి మేవట్ ఎస్పీ నాజ్నేన్ భాసిన్ అధ్వర్యంలో ‘సిట్’ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్‌లతా మాట్లాడుతూ..ఉపాధి లేని యువత ఆ ఒత్తిడిలో ఇలాంటి అత్యాచార నేరాలకు పాల్పడుతున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాక నేరస్తులు ఎవరైనా వారిని వదిలిపెట్టం అని తెలిపారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవడానికి సాయం చేసినవారికి లక్ష రూపాయల బహుమతి కూడా ఇస్తామని ప్రకటించారు. నిందితులంతా తమ ఊరికి చెందిన వారేనని బాధితురాలు పేర్కొన్న నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించిన ప్రధాన నిందుతుడు రాజస్తాన్‌లో డిఫెన్స్ అధికారిగా పనిచేస్తున్నట్లు సమాచారం. మరో ఇద్దరు నేరస్తుల వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. -
సీబీఎస్ఈ టాపర్‌పై సామూహిక అత్యాచారం!
చంఢీఘర్: హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. గతంలో సీబీఎస్ఈ ఎగ్జామ్స్‌లో టాపర్‌గా నిలిచి.. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఓ యువతిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని రేవారి గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి ప్రస్తుతం డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నారు. బుధవారం ఊరికి సమీపంలోని కోచింగ్ సెంటర్ నుంచి ఇంటికి తిరిగివచ్చేటప్పుడు కారులో వచ్చిన ముగ్గురు యువకులు ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారని పాల్పడ్డారు. ఆ తర్వాత నిందితులు స్పృహ కొల్పోయిన బాధితురాలిని బస్టాండ్ సమీపంలో పారేసి వెళ్లిపోయారు. నిందితులంతా తమ ఊరికి చెందిన వారేనని బాధితురాలు పేర్కొన్నారు. తనకు జరిగిన అన్యాయంపై తల్లిదండ్రులు సాయంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. పోలీసులు తొలుత తమ ఫిర్యాదును స్వీకరించడానికి ముందుకు రాలేదని తెలిపారు. నిందితులు పోలీసులను బెదిరించారని.. తాము కేసు నమోదు చేయడానికి పలు పోలీసు స్టేషన్లు తిరగాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్‌లో టాప్ ర్యాంక్ సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ తమ కూతురిని ప్రశంసించారని తెలిపారు. మోదీ బేటీ బచావో భేటీ పచావో అంటారని.. కానీ అది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. తమ కూతురికి న్యాయం జరగాలని డిమాండు చేశారు. ఇప్పటివరకు పోలీసులు ఎటువంటి దర్యాప్తు చేపట్టలేదని పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదుపై స్పందించిన ఓ పోలీసు అధికారి.. ఘటన జరిగిన ప్రదేశం ఆయన స్టేషన్ పరిధిలో రాకపోవడంతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా దీనిని శుక్రవారం ఉదయం రెగ్యూలర్ ఎఫ్ఐఆర్గా సంబంధిత పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. -
పది ఫలితాల్లో సత్తా చాటిన రైతు బిడ్డ
లక్నో: సాధారణ రైతు బిడ్డ ఉత్తరప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో దుమ్మురేపారు. మొత్తం 600 మార్కులకుగాను 578 మార్కులు (96.3%) సాధించి టాపర్‌గా నిలిచింది. ఆదివారం యూపీఎంఎస్‌పీ విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో అలహాబాద్‌కు చెందిన రైతు బిడ్డ అంజలి వర్మ స్టేట్ టాపర్‌గా నిలిచారు. ఫలితాలు వెలువడిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టాపర్‌గా నిలిచినందుకు సంతోషంగా ఉందన్నారు. ‘మా నాన్న రైతు. చాలా కష్టాలు ఉన్నప్పటికీ నన్ను చదివించాడు. టీచర్లు ప్రతి విషయంలో సహాయం చేశారు. ఈ ఫలితాన్ని ముందే ఊహించాను. ప్రతి విషయంలో సపోర్టుగా నిలిచిన నా తల్లిదండ్రులకి, టీచర్లకి థ్యాక్స్. నేను గొప్ప ఇంజనీర్ అయి దేశానికి సేవ చేయాలనుకుంటున్నాను’ అని అంజలి తెలిపారు. యూపీలో పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 6 నుంచి 22 వరకు నిర్వహించారు. దాదాపు 37 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు రాశారు. -
టాపర్ కాలేదని... గన్‌తో కాల్చుకుంది
సాక్షి, న్యూఢిల్లీ : తాను ఆశించినట్టుగా టాప్ ర్యాంక్ రాలేదని మనస్తాపానికి గురై ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన హరియాణాలో చోటుచేసుకుంది. జింద్ జిల్లాలోని ఓ స్కూల్ బాలిక...పరీక్షల్లో స్కూల్ టాపర్‌గా నిలుస్తుందని ఆశించింది. కానీ తీరా టాపర్ కాలేదని తెలిసి సోమవారం తన తండ్రి వద్ద ఉన్న గన్‌తో కాల్చుకుని తనువు చాలించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సివాహ గ్రామ సర్పంచ్ వేద్‌పాల్ సింగ్ కుమార్తె అంజలి కుమారి ఇండస్ పబ్లిక్ స్కూల్లో 11వ తరగతి చదువుతోంది. తాజాగా వెలువడిని ఫలితాల్లో తాను ఆశించినట్టుగా టాప్ ర్యాంక్ రానందుకు తీవ్ర మనస్తాపానికి లోనయింది. భావోద్వేగం నియంత్రించుకోలేక తన తండ్రి వద్ద ఉండే గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం నాడు ఆ కుటుంబం అంతా దగ్గర్లోని వేరే గ్రామానికి వెళ్లింది. ఆ సమయంలో అంజలి ఇంటి వద్దే ఉంది. తొందరగా ఇంటికి రమ్మని తన తండ్రికి ఫోన్ చేసింది. కానీ వచ్చేసరికి బాత్రూమ్లో కాల్చుకుని పడి ఉంది. ఆస్పత్రికి తరలించ క్రమంలో మరణించిందని వైద్యులు తెలిపారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు పోలీసులు తెలిపారు. కాగా హరియాణా ఆర్థిక మంత్రి కెప్టెన్ అభిమన్యు ఆ స్కూల్ యజమాని కావడం గమనార్హం. -
మహిళా టాపర్‌గా హేమలత
మారుమూల పల్లెటూరు... సాధారణ వ్యవసాయ కుటుంబం... ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం... ఇవేవీ ఆమె లక్ష్యానికి అడ్డంకి కాలేదు! స్వయంకృషితో ఆమె ఒక్కో మెట్టూ ఎక్కుతుంటే కుటుంబం అండగా నిలిచింది! సివిల్ సర్వీసెస్ తర్వాత అంత అత్యున్నతమైన ఉద్యోగాన్ని సాధించడంతో ఆ కుటుంబంలో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి! తొలిసారిగా ఒక గ్రూప్–1 టాపర్‌ను సమాజసేవకు అందించిన కనుగులవానిపేటలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి! ఇంతటి భావోద్వేగాలకు కారణమైన ఆమె పేరు కనుగుల హేమలత! గ్రూప్–1 (2011)లో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించింది. మహిళల్లోనే టాపర్‌గా నిలిచింది. సిక్కోలు సిగలో మరో మణిపూసగా మెరిసింది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:శ్రీకాకుళం రూరల్ మండలంలో ఇప్పిలి శివారు గ్రామమైన కనుగులవానిపేట ముద్దుబిడ్డే హేమలత! ఆమె తండ్రి ప్రసాదరావు, తల్లి సుజాత. వారిది వ్యవసాయ కుటుంబం. ఆరోగ్యపరమైన కారణాల వల్ల ప్రసాదరావు పాఠశాల స్థాయిలో అర్ధంతరంగా చదువు ముగించాల్సి వచ్చింది. ఆయన సోదరులంతా విద్యాభ్యాసం ద్వారానే మంచి స్థానంలోకి వెళ్లారు. ఉన్నత విద్యాభ్యాసం చేయాలి, సమాజసేవ చేయాలి అనే కలలను తన పిల్లల ద్వారా సాకారం చేయాలని తపించారు. అందుకు తగ్గట్లే హేమలత సహా ముగ్గురు పిల్లలూ గౌరవనీయమైన ఉద్యోగాలు సాధించారు. ప్రసాదరావు పెద్ద కుమార్తె హైమావతి ఆమదాలవలస మున్సిపల్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. కుమారుడు జగదీశ్వరరావు జలవనరుల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని దేవరకొండలోనే ఆయన ఉన్నారు. ఇప్పుడు రెండో కుమార్తె హేమలత గ్రూప్–1లో టాపర్‌గా నిలిచారు. ఈ ర్యాంకు డిప్యూటీ కలెక్టరు ఉద్యోగం పొందే అవకాశం ఉంది. సమాజసేవ చేయడానికి, తద్వారా ఉన్నతస్థాయిలో తగిన గుర్తింపు పొందడానికి అవకాశం రావడంతో హేమలత కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. స్వయంకృషితోనే ఒక్కో మెట్టూ... కనుగులవానిపేటలో ప్రసాదరావు కుటుంబానికి మూడెకరాల మెట్టు భూమి ఉంది. గతంలో చిన్న రైస్‌మిల్లు కూడా ఉండేది. ఆయన ఆరోగ్యం అంతగా సహకరించకపోవడంతో వాటిపై వచ్చే ఆదాయంతోనే కుటుంబపోషణ చూసేవారు. కానీ ఏదేమైనా బాగా చదువుకోవాలని పిల్లలకు నూరిపోసేవారు. తండ్రి మనస్సును అర్థం చేసుకున్న పిల్లలు ముగ్గురూ కష్టపడి చదివారు. హేమలత ప్రాథమిక విద్యాభ్యాసం కనుగులవానిపేట పాఠశాలలోనే చదివారు. అయితే గురుకుల పాఠశాలలో చేర్పిస్తే చదువు బాగుంటుందనే విశ్వాసం అప్పట్లో ఉండేది. దీంతో తండ్రి ప్రోత్సాహంతో హేమలత ఎచ్చెర్లలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో సీటు సాధించింది. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకూ అక్కడే విద్యాభ్యాసం సాగింది. పదో తరగతిలో మంచి మార్కులు రావడంతో 2001 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో ఉన్న సాంఘిక సంక్షేమశాఖ గురుకుల కళాశాలలో ఎంపీసీ సీటు వచ్చింది. అప్పుడే తోటి స్నేహితుల మధ్య సివిల్స్, గ్రూప్–1 గురించి చర్చ వచ్చేదని, సమాజసేవ నేరుగా చేసే అవకాశం ఆ ఉద్యోగాల్లో ఉంటుందనే విషయం తెలిసిందని హేమలత చెప్పారు. కానీ ఇంటర్ తర్వాత ఎంసెట్ ప్రిపరేషన్ ఏడాది చేసినా ఆశించిన ర్యాంకు రాలేదు. అక్క హైమావతి ప్రోత్సాహంతో టీచర్ ట్రైనింగ్ వైపు దృష్టి పెట్టారు. 2002లో శ్రీకాకుళం డైట్లో సీటు సాధించారు. 2004లో కోర్సు పూర్తి చేస్తుండగానే డీఎస్సీ–2003 నోటిఫికేషన్ వెలువడింది. ఆ పరీక్షల్లోనూ రాష్ట్రస్థాయిలో మహిళా టాపర్‌గా హేమలత నిలిచారు. 2005లో సెకండ్‌గ్రేడ్ టీచర్ ఉద్యోగం పొందారు. ఎల్ఎన్ పేట మండలం బొత్తాడసింగి పాఠశాలలో, తర్వాత 2012 వరకూ ఎచ్చెర్ల మండలంలో పనిచేశారు. ఒకవైపు టీచర్ ఉద్యోగం చేస్తూనే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) కూడా పూర్తి చేశారు. 2012లో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం పార్వతీపురంలో పనిచేస్తున్నారు. పదేళ్ల పరిశ్రమ ఫలించింది సివిల్స్, గ్రూప్స్ పరీక్షలకు 2007 సంవత్సరంలోనే హేమలత ప్రిపరేషన్ ప్రారంభించారు. గ్రూప్–1 2007 నోటిఫికేషన్లో తొలి ప్రయత్నంలోనే ఇంటర్వ్యూ దశ వరకూ వెళ్లారు. త్రుటిలో అవకాశం చేజారింది. తర్వాత మరో రెండు నోటిఫికేషన్లలోనూ ఇంటర్వ్యూ వరకూ వెళ్లారు. ఇక ఆఖరి ప్రయత్నంగా 2011 గ్రూప్–1 నోటిఫికేషన్లో దరఖాస్తు చేశారు. 2012లో మెయిన్స్, ఇంటర్వ్యూ ఆమె బాగానే చేశారు. కానీ న్యాయపరమైన వివాదాల వల్ల ఫలితాలు రద్దు చేసినా ఆమె నిరాశపడలేదు. 2016 సెప్టెంబర్‌లో మరోసారి మెయిన్స్ పరీక్షలు, ఇటీవలే నిర్వహించిన ఇంటర్వ్యూలో బాగానే అటెమ్ట్ చేశానని, తప్పక మంచి పోస్టు వస్తుందని ఆశించానని హేమలత చెప్పారు. ఆశించినట్లే రెండో ర్యాంకు, మహిళలలో ప్రథమ ర్యాంకు రావడం తనకు ఆనందంగా ఉందన్నారు. భర్త నుంచి ప్రోత్సాహం హేమలత భర్త కె.తవిటినాయుడు ప్రస్తుతం విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్ రేంజ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఈ దంపతులకు రెండేళ్ల కుమారుడు ప్రణవ్ ఉన్నాడు. తన విజయంలో తల్లిదండ్రులు, సోదరి, సోదరుడుతో భర్త ప్రోత్సాహం కూడా ఎంతో ఉందని హేమలత చెప్పారు. గ్రామీణ ప్రాంతవారమని నిరాశ వద్దు ‘ఉన్నత ఉద్యోగాల సాధనకు గ్రామీణ నేపథ్యం ఏమాత్రం అడ్డంకి కాదు. గ్రామీణ ప్రాంతవారమని అమ్మాయిలకు నిరాశ వద్దు. కష్టపడి, ఇష్టపడి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుంది. అభిరుచిని బట్టి ఏ రంగాన్ని ఎంచుకున్నా లక్ష్యం సాధించేవరకూ విశ్రమించకూడదు.’ – కనుగుల హేమలత, గ్రూప్–1 విజేత -
‘నీట్’ తెలంగాణ టాపర్ త్రినాథ్
రెండు, మూడు ర్యాంకుల్లో దీపిక, వెంకట హేమంత్ - రాష్ట్ర ర్యాంకులు ప్రకటించిన కాళోజీ నారాయణరావు వర్సిటీ - రాష్ట్రం నుంచి 26 వేల మంది అర్హత! - వారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం.. సాక్షి, హైదరాబాద్: జాతీయ వైద్య ప్రవేశ పరీక్ష ‘నీట్–2017’లో లక్కిమ్‌శెట్టి అర్నవ్ త్రినాథ్ తెలంగాణ రాష్ట్ర టాప్ ర్యాంకర్‌గా నిలిచాడు. రెండో ర్యాంకు ఎం.దీపిక, మూడో ర్యాంకు ఎ.వెంకట హేమంత్ సాధించారు. గత నెలలో ‘నీట్’ ఫలితాల ను సీబీఎస్ఈ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో త్రినాథ్ జాతీయ స్థాయిలో 12వ ర్యాంకు, దీపిక 24వ ర్యాంకు, వెంకట హేమంత్ 32వ ర్యాంకు సాధించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి నీట్ రాసిన వారు, అందులో అర్హత సాధించిన విద్యార్థులు, వారి మార్కుల వివరాలను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి సీబీఎస్ఈ పంపింది. ఆదివారం రాత్రి ఈ మేరకు ఆ వివరాలను వర్సిటీ అధికారులు వెల్లడించారు. జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ 131 మార్కులు తెలంగాణ నుంచి మొత్తం 39,055 మంది ‘నీట్’ రాశారు. జనరల్ కేటగిరీలో 131 మార్కులను కట్ ఆఫ్‌గా ప్రకటించారు. 131 కంటే అధికంగా మార్కులు సాధించిన వారు 24,180 మంది ఉన్నారని వర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. ఇక ఎస్సీ, ఎస్టీల కట్ ఆఫ్ మార్కులు 107గా సీబీఎస్ఈ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు 107 నుంచి 131 కట్ ఆఫ్ మార్కులు సాధించిన వారు 3,586 మంది ఉన్నారు. అయితే 107–131 మార్కుల మధ్య జనరల్ కేటగిరీ వారూ కూడా ఉండొచ్చని, కాబట్టి వారిలో సగం మంది వరకు ఎస్సీ, ఎస్టీలు అర్హత సాధించి ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆ ప్రకారం జనరల్, ఎస్సీ, ఎస్టీలు అందరూ కలిపి దాదాపు 26 వేల మంది వరకు రాష్ట్రం నుంచి నీట్లో అర్హత సాధించి ఉంటారని వివరించారు. అయితే ఏ కేటగిరీలో ఎవరెవరు ఎంతెంత ర్యాంకులు సాధించారన్నది తెలియడానికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. త్రినాథ్‌కు 685 మార్కులు రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించిన త్రినాథ్‌కు ‘నీట్’లో 685 మార్కులు వచ్చాయి. రెండో ర్యాంకర్ దీపికకు 681 మార్కులు, మూడో ర్యాంకర్ వెంకట హేమంత్‌కు 680 మార్కులు వచ్చాయి. నాలుగో ర్యాంకు సాధించిన ఎ.అఖిలకు కూడా 680 మార్కులు రాగా, జాతీయస్థాయిలో 32వ ర్యాంకు వచ్చింది. వారంలో నోటిఫికేషన్! నీట్లో మొత్తం 720 మార్కులకు జనరల్ కేటగిరీలో అత్యధిక మార్కులు 697. 50 శాతం పర్సంటైల్ ప్రకారం కటాఫ్ మార్కు 131. గతేడాది కటాఫ్ మార్కు 140గా ఉంది. ఈసారి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీల్లో 40 శాతం పర్సంటైల్ ప్రకారం కటాఫ్ మార్కు 107గా నిర్ధారించారు. ఈసారి ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలన్నింటికీ ప్రభుత్వమే ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహించనుంది. మొత్తం 3,750 ఎంబీబీఎస్ సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఆగస్టు నెలాఖరుకు అడ్మిషన్ల ప్రక్రియ ముగియాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ విడుదలకు ముందు ప్రభుత్వం ఉమ్మడి కౌన్సెలింగ్‌పై ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయాలని, ఆ తర్వాతే నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుందని డాక్టర్ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. -
ఆ స్కూల్లో చదివి టాపర్ అయింది!
త్రాల్: కల్లోల ప్రాంతంలో విద్యా సుమం విరిసింది. అడ్డంకులను అధిగమించి అగ్రస్థానంలో నిలిచింది. జమ్మూకశ్మీర్ త్రాల్ జిల్లా దాద్‌సారా గ్రామానికి చెందిన 18 ఏళ్ల షహీరా అహ్మద్ ఇంటర్ పరీక్షల్లో టాపర్ గా నిలిచింది. భద్రతా దళాల కాల్పుల్లో హతమైన హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీ చదివిన పాఠశాలలో ఆమె చదవడం విశేషం. ఇంటర్ పరీక్షల్లో 500 మార్కులకు 498 మార్కులు సాధించి టాపర్ గా నిలిచింది. గతేడాది జూలైలో వనీ హతమైన తర్వాత అల్లర్లు చెలరేగడంతో దాదాపు 5 నెలలు విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో షహీరా సాధించిన ఘనత స్ఫూర్తిదాయకంగా నిలిచింది. సంక్షోభాలు ఎదురైనా సడలని సంక్పలంతో ఈ ‘చదువుల తల్లి’ విద్యార్థులకు ప్రేరణ అయింది. ‘చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా మనసును చదువు మీదే లగ్నం చేశాను. ఇతర విషయాలవైపు మళ్లకుండా స్వీయనియంత్రణ పాటించాను. కల్లోల పరిస్థితుల మధ్యే నేను పెరిగాను. చదువు కొనసాగించాలన్న దృఢ చిత్తంతో ముందుకు సాగుతున్నాన’ని షహీరా వివరించింది. టెన్త్ పరీక్షల్లోనూ ఆమె ప్రతిభ చూపింది. రాష్ట్రవ్యాప్తంగా రెండో స్థానంలో నిలిచింది. అయితే ఈసారి కశ్మీర్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఆమె చదువుకు ఆటంకం కలిగిస్తాయని తల్లిదండ్రులు భయపడ్డారు. ‘కల్లోల పరిస్థితుల్లో నడుమ షహీరా చదువు కొనసాగించాలని మాకు తెలుసు. ఇది చాలా కష్టంతో కూడుకున్నది అయినప్పటికీ ఆమె తన దృష్టిని చదువు మీద నుంచి మళ్లించలేద’ని షహీరా తల్లి తస్లిమా వెల్లడించింది. వేర్పాటువాదుల సానుభూతిపరులకు నిలయంగా పేరుగాంచిన దాద్‌సారా గ్రామంలో ఉద్రిక్తతలు నిత్యకృత్యం. ఎంతో మంది తీవ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. బుర్హాన్ వనీ హతమైన తర్వాత కశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో ‘కమ్యూనిటీ స్కూలింగ్’ షహీరాకు ఎంతో మేలు చేసిందని ఆమె తండ్రి షమీన్ అహ్మద్ తెలిపారు. ‘షహీరా స్వయంగా కమ్యూనిటీ టీచర్ల వద్దకు వెళ్లేది. ఒకరు ఫిజిక్స్ క్లాసులు చెబితే మరొకరు మ్యాథ్స్ క్లాస్ తీసుకునే వారు. ఇంకొరు కెమిస్ట్రీ.. ఈ విధంగా కమ్యూనిటీ టీచర్ల సహాయంలో షహీరా సిలబస్ పూర్తి చేసింద’ని అహ్మద్ వివరించారు. -
ఈ స్ట్రిక్ట్ ఐఏఎస్ ఇక ఎల్ఎల్బీ స్టూడెంట్‌గా..
చండీగఢ్: ప్రముఖ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా న్యాయవాది కావాలన్న తన కలను నెరవేర్చుకుంటున్నారు. ఇందుకోసం ఆయన ఆయన పంజాబ్ యూనివర్సిటీ నిర్వహించిన ప్రవేశ పరీక్ష రాసి టాప్ మార్కులు తెచ్చుకున్నారు. 166.37 మార్కులు న్యాయ విద్య ప్రవేశ పరీక్షలో సంపాదించారు. దీంతో ఆయన ప్రవేశం ఇక అధికారికంగా ఖరారు కానుంది. మూడేళ్ల న్యాయవిద్య కోసం ఆయన ఈ పరీక్ష రాశారు. 2016-17 విద్యా సంవత్సరం కోసం జూన్ 19న బుధవారం మొత్తం 3,987మంది ఈ పరీక్ష రాయగా వాటి పలితాలను పంజాబ్ యూనివర్సిటీ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో ఖేమ్కా అత్యధిక మార్కులు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఖేమ్కా మాట్లాడుతూ ‘ నాకు న్యాయ విద్య అంటే చాలా ఆసక్తి. నేను సాయంకాలం కోర్సును చేస్తాను. పదవీ విరమణ పొందిన తర్వాత న్యాయవృత్తిని కొనసాగిస్తాను. అందుకే ఈ కోర్సు చేయాలని నేను నిర్ణయించుకున్నాను’ అని చెప్పారు. రాబర్ట్ వాద్రా కేసు విషయంలో అశోక్ ఖేమ్కా కీలక అధికారిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఈయనకు చాలా స్ట్రిక్ట్ గా పనిచేసే అధికారిగా పేరుంది. మొత్తం 22 ఏళ్ల సర్వీసులు ఖేమ్కా 46సార్లు బదిలీ అయ్యారు. -
సాకారమైన కల
♦ బాసటగా నిలిచిన సాక్షి ♦ అమరేందర్లో అవధుల్లేని ఆనందం ♦ విద్యుత్ ఏఈగా నియామకం ♦ పేద దళిత విద్యార్థి విజయగాధ పేదింటి విద్యాకుసుమం.. అమరేందర్. ఆర్థిక ఇబ్బందులు పట్టిపీడిస్తున్నా.. చదువుల్లో టాపర్‌గా నిలుస్తూ అందరి చేత మన్ననలు పొందుతున్నాడు. బీటెక్ చదువుకు పేదరికం అడ్డంకిగా మారడంతో ‘సాక్షి’ బాసటగా నిలిచింది. ‘ప్రతిభను వెక్కిరిస్తున్న పేదరికం’ అంటూ వెన్నుదన్నుగా నిలిచింది. సాక్షి కథనానికి దాతల నుంచి విశేష స్పందన.. ఫలితంగా చదువు కొనసాగడమేకాక విద్యుత్ ఏఈ ఉద్యోగం వరించింది. గురువారం అతను బాధ్యతలు స్వీకరించిన వేళ ఆ పేద కుటుంబంలో అవధుల్లేని ఆనందం వెల్లువెత్తింది. అమరేందర్ విజయపథం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది. వర్గల్: ములుగు మండలం అచ్చాయపల్లికి చెందిన తుడుం కృష్ణ, కళమ్మ దంపతుల రెండో సంతానం అమరేందర్. మరో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. అర ఎకరం భూమి మి నహా ఆస్తిపాస్తులు లేవు. కూలీ పనే ఆధారం. పేదరికం నేపథ్యంలో అమరేందర్‌ను వర్గల్ మండలం మైలారానికి చెందిన మేనమామ బి.యాదగిరి చేరదీశాడు. మామ సంరక్షణలో ఉంటూ మైలారంలో ఒకటినుంచి పదోతరగతి వరకు చదివాడు. తొమ్మిదోతరగతి చదువుతుండగానే తండ్రి మరణించాడు. ఆ విషాదం నుంచి కోలుకొని 2007-08లో పదోతరగతిలో 514 మార్కులు సాధించి మండల స్థాయిలో రెండో టాపర్‌గా నిలిచాడు. ఉపాధ్యాయులు యాదగిరి, నిరంతరం సూచనలిచ్చే ఎల్లం సహకారంతో డీఆర్డీఏ ద్వారా విజయవాడ శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్లో ఉచిత సీటు దక్కించుకున్నాడు. డ్రెస్సుల కొనుగోలుకు రాజిరెడ్డి, యాదగిరి తదితర ఉపాధ్యాయులు ఆర్థిక సహకారా న్ని అందించారు. ఆ తరువాత అంచనాలకు తగ్గట్టుగానే ఇంటర్లో 96.3 శాతం మార్కులు సాధించి కాలేజీ టాపర్‌గా నిలిచాడు. ఎంసెట్ లోనూ మెరుగైన ర్యాంకు రావడంతో జేఎన్టీయూలో సీటు దక్కించుకున్నాడు. ప్రవేశ ఫీజు తదితరాలు కలిపి రూ.30 వేలు ఖర్చవుతుంద ని తెలిసి అమరేందర్ డీలాపడిపోయాడు. ఆ తరుణంలో ‘సాక్షి’ అతని దీనగాథను గుర్తిం చింది. 2010 అక్టోబర్‌లో ‘ప్రతిభను వెక్కిరిస్తున్న పేదరికం’ అంటూ కథనాన్ని ప్రచురిం చి అమరేందర్ పరిస్థితిని వెలుగులోకి తెచ్చింది. ఈ కథనంతో దాతల అండ పుష్కలంగా లభించింది. అమరేందర్ బీటెక్ ఇంజినీరింగ్ చదువులకు అడ్డుతొలగిపోయింది. ట్యూషన్ చెప్పుకుంటూ కాస్తోకూస్తో సంపాదించుకుంటూ లక్ష్యం వైపు సాగిన అమరేందర్ ఇంజినీరింగ్ పూర్తి కాగానే చెన్నైలో ప్రైవేటు ఉద్యోగం వచ్చింది. తల్లి ఆరోగ్యం క్షీణించడంతో నెలరోజుల్లోనే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి వెనుదిరిగివచ్చాడు. ఆ తరువాత టీఎస్ జెన్కో, టీఎస్‌ట్రాన్స్‌కో, టీఎస్ ఎస్పీడీసీఎల్, టీఎస్ ఎన్పీడీసీఎల్లో అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగం కోసం ఎంపిక పరీక్ష రాసి అన్నింటిలోనూ మంచి ర్యాంకులు సాధించాడు. తన ప్రాంతంలో ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా టీఎస్ ఎస్పీడీసీఎల్ను ఎంపిక చేసుకున్నాడు. సీఎం నియోజకవర్గ పరిధిలోని జగదేవ్‌పూర్ మండల ఏఈగా గురువారం విధుల్లో చేరాడు. అమరేందర్ ఉద్యోగంలో చేరడంతో అటు తల్లి కళమ్మ, ఇటు మేనమామ యాదగిరి కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. ‘సాక్షి’కి ప్రత్యేక కృతజ్ఞతలు.. తొలి అడుగు తడబడుతున్న సమయంలో బీటెక్ చదువులకు అవరోధాన్ని ‘సాక్షి’ కథనం తొలగించింది. ఆ కథనం ఫలితంగా ఎందరో దాతలు నా చదువుకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి నా ప్రత్యేక కృతజ్ఞతలు. దాతల సహకారమూ మరవలేనిది. ఇంజినీరింగ్ పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించాలన్న నా కలసాకారమైంది. ప్రధానంగా రైతులకు సేవ చేసే అవకాశం విద్యుత్ ఏఈగా నాకు దక్కడం ఆనందంగా ఉన్నది. నాకు ఉద్యోగం రావడంతో మా కుటుంబం అవధుల్లేని ఆనందంలో మునిగితేలుతున్నది. చెప్పలేని సంతోషం పంచుతున్నది. నా ఈ విజయంలో భాగస్వాములైన ఉపాధ్యాయులు, మిత్రులు, కష్టాల్లో అండగా నిలిచిన వారందరికి ధన్యవాదాలు. - అమరేందర్, ఏఈ -
ప్రధాని మోదీ ఇప్పటికీ టాపరే!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్య తరగతి ప్రజల దృష్టిలో నేటికీ టాపర్ అంటున్నాయి తాజా సర్వేలు. భారత్ లోని ప్రధాన ఏడు నగరాల్లో జరిపిన సర్వేలలో మోదీనే ప్రథమ స్థానంలో ఉన్నట్లు ఈటీ-టీఎన్ఎస్ సర్వేలో వెల్లడి అయ్యాయి. నరేంద్రమోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఓ బలమైన మెజారిటీ తో అధికారాన్ని కైవసం చేసుకొని దాదాపు రెండు సంవత్సరాలు గడిచింది. అయిప్పటికీ మోదీనే అధిక మద్దతు కలిగి ఉన్నట్లు ఈటీ-టీఎన్ఎస్ సర్వే లెక్కలు నిరూపిస్తున్నాయి. ఆయన అజెండాలో కీలక అంశాల సంస్కరణలో వైఫల్యం చెందడంతోపాటు, అనేక వివాదాలు చోటు చేసుకున్న నేపథ్యం ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం రేటింగ్స్ లో ఫస్ట్ మార్కును మాత్రం కోల్పోలేదని తాజా సర్వేలు తేల్చి చెప్పాయి. ఆర్థిక పనితీరులో 86 శాతం, ఉద్యోగ సృష్టిలో 62 శాతం, భవిష్యత్ ప్రణాళికల విషయంలో 58 శాతం మోదీ ప్రభుత్వం మార్కులు కొట్టేసిందని సర్వే లెక్కలు చెప్తున్నాయి. అచ్చేదిన్ ఆనేవాలా హై అంటూ నమ్మకంగా చెప్పే మోదీ ప్రజల్లో నేటికీ మొదటి స్థానంలోనే ఉన్నారని ఈటీ-టీఎన్ఎస్ సర్వే చెప్తోంది. -
ఆత్మహత్య చేసుకున్నాక టాపర్ అయ్యాడు
శ్రీనగర్: పరీక్షలో ఫెయిల్ అయ్యానని ఆత్మహత్య చేసుకున్న ఓ ఇంజనీరింగ్ విద్యార్థి, క్లాస్ టాపర్ అని తేలడం విషాదాన్ని నింపింది. జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో టెక్నికల్ బోర్డు విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం ఓ తెలివైన విద్యార్థి ఉసురు తీసిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వివరాల్లోకి వెళితే శ్రీనగర్ లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న మొహమ్మద్ అద్నాన్ (17) చాలా తెలివైన విద్యార్థి. ఫిజిక్స్ అంటే అతనికి ప్రాణం. కానీ తనకెంతో ఇష్టమైన ఫిజిక్స్ పరీక్షలో ఫెయిల్ అయినట్టు, కేవలం 28 మార్కులు మాత్రమే వచ్చినట్టుగా ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్నాడు. దీంతో అద్నాన్ అవమాన భారంతో కుంగిపోయాడు. జీలం నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజుల తరువాత అతని శవం నదిలో తేలడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. తన కొడుకు ఫిజిక్స్ పరీక్ష చాలా బాగా రాశానని, మంచి మార్కులు వస్తాయని కాన్ఫిడెంట్‌గా చెప్పటంతో... తండ్రి హిలాల్ అహ్మద్ గిల్కర్ ఈ వ్యవహారాన్ని అంతటితో వదిలేయలేదు. పోరాటానికి సిద్ధపడ్డాడు. ఎంతో ప్రతిభావంతుడైన తన కొడుకు ఫెయిల్ అయ్యే అవకాశమే లేదని, ఎక్కడో తప్పు దొర్లిందని భావించారు. రీవాల్యుయేషన్ కోసం టెక్నికల్ బోర్డుకు లేఖ రాశారు. అయితే ఆ వాల్యుయేషన్‌లో అద్నాన్ పాస్ అవ్వడమే కాదు...48 అత్యధిక మార్కులు సాధించాడు. ఫస్ట్ సెమిస్టర్ లో 70 శాతం మార్కులతో క్లాస్‌లో టాపర్‌గా నిలిచాడు. అయితే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న నాలుగు నెలల తరువాత రాష్ట్ర టెక్నికల్ బోర్డు ఈ విషయాన్ని ప్రకటించింది. తప్పయిందంటూ నాలిక్కరచుకుంది. అయితే పొరపాటు జరిగిందంటూనే మరోవైపు యూనివర్శిటీలలో ఇలాంటి తప్పులు జరగడం మామూలే అని బోర్డు వ్యాఖ్యానించడంపై హిలాల్ అహ్మద్ గిల్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులే తన కొడుకును హత్య చేశారని అద్నాన్ తండ్రి ఆరోపిస్తూ, బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. -
ఒక టాపర్ కథ
'నిన్ను చదివించే స్తోమత మాకు లేదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. వెంటనే ఇంటికి బయలుదేరు. పెళ్లి సంబంధం చూశా. కుర్రాడు మనలాగే ఇటుకల బట్టీలో కూలీ. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పదపద....' సరిగ్గా మూడు నెలల క్రితం మహేన్ రాయ్.. తన కూతురు స్వప్న రాయ్‌తో అన్న మాటలివి. అనుకున్నట్టే పెళ్లి చేసేందుకు కూతుర్ని వెంటబెట్టుకుని అతను తన గుడిసెకు చేరుకున్నాడు . పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ దినాజ్‌పూర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని చిన్న గ్రామం వాళ్లది. అప్పటికి స్వప్న వయసు 16 ఏళ్లు. ఇంకో మూడు నెలల్లో పదో తరగతి పరీక్షలు. అయితే స్వప్న మనసంతా చదువుపైనే. ఉన్నత చదువులతో ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నా, చెల్లిని బాగా చూసుకోవాలనుకునేది. అదే విషయం తల్లిదండ్రులకు చెప్పింది. 'బేటీ పడావో' అవసరం తెలియని నిరక్షరాస్యులు వాళ్లు. సహజంగానే తల్లిదండ్రులు 'చదువొద్దు.. పెళ్లే ముద్దు' అన్నారు. చదువు తప్ప స్వప్నకు మరోదారి కనిపించలేదు. దాంతో పోరాటానికి సిద్ధమైంది. దినాజ్ పూర్ జిల్లా కేంద్రంలో తాను చదువుతోన్న స్కూల్ టీచర్లకు గోడు చెప్పుకుంది. రంగంలోకి దిగిన టీచర్లు.. ప్రభుత్వాధికారుల సహాయంతో ఆ బాల్య వివాహ ఒప్పందాన్ని రద్దు చేయించారు. అంతేకాకుండా బెంగాల్ ప్రభుత్వ పథకమైన గీతాంజలి ఆవాస్ యోజన కింద ఓ ఇట్టు కట్టించి, స్వప్న కుటుంబానికి ప్రభుత్వాధికారులు ఆర్థిక సాయం కూడా అందించారు. దాంతో స్వప్న మళ్లీ స్కూలుకు వెళ్లింది. ఇటీవలే ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో 92 శాతం మార్కులు సాధించిన స్వప్న స్కూల్ టాపర్‌గా నిలిచింది. లెక్కల్లో 99, ఫిజిక్స్‌లో వందకు వంద, లైఫ్ సైన్స్‌లో 97, హిస్టరీలో 91, జాగ్రఫీలో 93, ఇంగ్లీష్‌లో 76, బెంగాలీలో 92 మార్కులు సాధించి ఔరా అనిపించింది. స్వప్న తండ్రి మహేన్ రాయ్ ఇప్పుడేమంటున్నాడో చూడండి.. 'నిజంగా నేనెంత పొరపాటు చేశాను. చదువుకుంటానని నా కూతురు ఎంత అరిచినా వినిపించుకోలేదు. అధికాలు వచ్చి పెళ్లి వద్దన్నప్పుడు కోపమొచ్చింది కూడా. నా బిడ్డ ఇంత బాగా చదవగలదని, ఫస్ట్ వస్తుందని నేను ఊహించలేదు. రెండో కూతురు ప్రస్తుతం వేరొక హాస్టల్లో చదువుతోంది. కష్టమైనా సరే నా కూతుళ్ల చదువుల కోసం రక్తం ధారపోస్తా' అని సంతోషంగా తెలిపాడు. 'నాకు హ్యుమానిటీస్ సబ్జెక్టులో చేరాలని ఉంది. ఆ తర్వాత మంచి యూనివర్సిటీలో డిగ్రీ సాధించి టీచర్ కావాలన్నది నా ఆశయం. సైన్స్ గ్రూప్ చదవడానికి నాకు అన్ని అర్హతలున్నాయి. కానీ మా ఆర్థిక స్తోమత అంతంతే. అందుకే ఆర్ట్స్ గ్రూపులో చేరదామనుకుంటున్నా. అదైతే తక్కువ ఖర్చుతో చదివెయ్యొచ్చు' అంటూ తన కలల్ని పంచుకుంది టాపర్ స్వప్న రాయ్. -
ఐఐటీలో మెరిసిన తెలుగు తేజం
హైదరాబాద్: దేశంలో ప్రతిష్టాత్మక ఐఐటీ(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో తెలుగు తేజం మెరిసింది. గుడివాడలో పాఠశాల విద్య పూర్తిచేసుకున్న పి.రోహిత్ ఏకంగా ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్(ఈ అండ్ ఈసీఈ) టాపర్‌గా నిలిచాడు. బీటెక్‌లో 9.28/10 క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్(సీజీపీఏ) సాధించి ప్రతిభ చాటిన రోహిత్ ఇన్స్టిట్యూట్ సిల్వర్ మెడల్‌తోపాటు ఎండోమెంట్ ప్రైజ్‌ను జూలై 26న అందుకున్నాడు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్‌ఏంజెలిస్‌లో ఉచితంగా పీహెచ్డీ చేసేందుకు ఫెలోషిప్ అవార్డును, జార్జియాటెక్, మిచిగన్ , యాన్ అర్బోర్, పుర్డ్యూ యూనివర్సిటీలలో ప్రవేశ అవకాశాలూ దక్కించుకున్నాడు. క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా ఈ-బే/పేపాల్ సంస్థలో రూ.21.5 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సంపాదించాడు. -
ఇష్టపడి చదివా.. 'ఎయిమ్స్' టాపరయ్యా!
-
‘తిరువళ్లూరు’లో 88.23 శాతం ఉత్తీర్ణత
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం విడుదల చేసిన ప్లస్‌టూ పరీక్షా ఫలితాల్లో తిరువళ్లూరు జిల్లాలో 88.23 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించిన ట్టు కలెక్టర్ వీరరాఘవరావు వెల్లడించా రు. జిల్లా వ్యాప్తంగా ప్లస్‌టూ పరీక్షలకు 40,032 మంది విద్యార్థులు హాజరుకాగా, 35,320 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది 85 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, ఈ ఏడాది మరో మూడు శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ప్లస్‌టూ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 289 పాఠశాలకు చెందిన విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, వీటిలో 69 పాఠ శాల విద్యార్థులు వంద శాతం ఫలితాలను సాధించి రికార్డు సృష్టించారు. టాపర్లు వీరే: తిరువళ్లూరు జిల్లా స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థుల జాబి తాను కలెక్టర్ వీరరాఘవరావు శుక్రవారం ఉదయం విడుదల చేశారు. తమిళాన్ని ప్రథమ భాషగా ఎంచుకుని విధ్యనభ్యసించిన మెగప్పేరు వేలమ్మాల్ పాఠశాలకు చెందిన కే. రంజిత్(1188) జిల్లా స్థాయిలో మొదటి స్థానం సంపాదించగా, అంబత్తూరు సేతు భాస్కర పాఠశాలకు చెందిన పూజా(1187), పంజె ట్టి వేలమ్మాల్ పాఠశాల విద్యార్థిణి శరణ్య(1187) మార్కులతో రెండవ స్థానం సాధించారు. మూడవ స్థానంలో పంచెట్టి వేలామ్మాల్ పాఠశాలకు చెందిన రమ్యప్రభ(1186), మెగప్పేరు వేలమ్మాల్ పాఠశాలకు చెందిన అనణ్య(1186) మార్కులతో మూడవ స్థానంలో నిలిచారు. ప్రభుత్వ పాఠశాల టాపర్లు: ప్రభుత్వ పాఠశాల పరిధిలోని పళవేర్కాడు ప్రభుత్వ పాఠశాలకు చెందిన సంగీత(1160), టీఎంకేవీ అమ్మయ్యార్కుప్పం పాఠశాలకు చెందిన ప్రభాకరన్(1160) మార్కులతో జిల్లా స్థాయిలో మొదటి స్థానం సాధించారు. రెండవ స్థానంలో పొన్నేరి ప్రభుత్వ బాలుర పాఠశాలకు చెందిన కుమరవేల్(1157) నిలిచారు. మూడవ స్థానంలో కవరపేట ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఆనంది(1153), అంబత్తూరు పీకే పాఠశాల విద్యార్థిని యువరాణి(1153) మార్కులతో మూడవ స్థానంలో నిలిచినట్టు కలెక్టర్ వివరించారు. సత్తాచాటిన తెలుగు విద్యార్థి: ప్లస్‌టూ పరీక్షలలో తెలుగు, సంస్కృతం, ప్రెంచ్ భాషను మొదటి భాషగా ఎంచుకుని చదివిన విద్యార్థులు తమ సత్తాను చాటారు. సంస్కృతాన్ని మొదటి భాషగా ఎంచుకున్న వేలమ్మాల్ విద్యార్థులు అజిత్(1192), శ్రీనిధి(1192) మార్కులతో మొదటి స్థానం సాధిం చారు. సంస్కృతాన్ని ప్రథమ భాషగా ఎంచుకున్న దీపక్ అరవింద్(1189) మార్కులతో రెండవ స్థానంలోనూ, ప్రెంచ్ను మొదటి భాషగా తీసుకున్న వేలమ్మాల్ విద్యార్థులు మణిగండ న్(1188), తెలుగును మొదటి భాషగా ఎంచుకున్న రంజిత్(1188) మూడవ స్థానంలో నిలిచారు. తమిళ విద్యార్థులకు దీటుగా సంస్కృతం, తెలుగు విద్యార్థులు రాణించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.