అన్ని రకాలుగా బాగా ఉండి కూడా కొందరూ విద్యార్థులు ఎంట్రెన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులు తెచ్చుకోలేక చతికిలపడుతుంటారు. పైగా ఏవేవో సాకులు చెబుతుంటారు. తల్లిదండ్రులు సమస్త సౌకర్యాలు కల్పించి.. పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉండి కూడా ఉత్తీర్ణులు కాలేకపోతుంటారు. అలాంటి వారికి ఈ విద్యార్థే స్ఫూర్తి. తీవ్రైమన అనారోగ్యంతో బాధపడుతూ కూడా ప్రతిష్టాత్మకమైన నీట్ ఎంట్రెన్స్ పరీక్షలో సత్తా చాటి ప్రథమ ర్యాంక్‌లో నిలిచాడు.
అతడే దివ్యాంశ్. హర్యానాలోని చర్కీ దాద్రీకి చెందిన దివ్యాంశ్ అతను న్యూమోథొరాక్స్(తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్య)తో బాధపడుతున్నాడు. ఆ సమస్య నుంచి నెమ్మదిగా కోలుకున్న కొద్ది రోజులకు డెంగ్యూ బారిన పడ్డాడు. అతడికి సపర్యలు చేసి..చేసి అమ్మ అనారోగ్యం పాలయ్యింది. అయినా ఆ అడ్డంకులనన్నింటిని పక్కన పెట్టి మరీ ఈ ఎంట్రెన్స్ టెస్ట్‌పై దృష్టిసారించేవాడు. అయితే అనారోగ్యం కారణంగా సిలబస్‌లో తన తోటి విద్యార్థుల కంటే కాస్త వెనుకబడ్డాడు.
అతనికి వారితో వేగం అందుకోవడానికే దాదాపు పది రోజులు పట్టింది. అలాగే సహా విద్యార్థులు, ఉపాద్యాయుల మార్గదర్శకంలో మరింతగా కష్టపడి చదివాడు దివ్యాంశ్. అతని కృషి ఫలించి అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ అండ్ పారామెడికల కోర్సుల ప్రవేశానికి పెట్టే ప్రతిష్టాత్మ నీట్ పరీక్షలో ఏకంగా 720 మార్కులు స్కోర్ చేయడమే గాక ప్రథమ ర్యాంకులో నిలిచాడు. అతడు వైద్యపరమైన సవాళ్లను దాటుకుంటూ కఠినతరమైన నీట్ పరీక్షలో ప్రథమ ర్యాంక్‌లో నిలిచి అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. పైగా గెలవాలన్న తపన ఉంటే ఎంత పెద్ద కష్టాన్ని అయినా జయించొచ్చని చాటి చెప్పాడు. ఇక్కడ దివ్యాంశ్ ఫేస్ చేసిన న్యూమోథొరాక్స్ అంటే ఏంటంటే..
శరీరంలో సరిగ్గా ఊపిరితిత్తులకు బయట ఉన్న ఖాళీ ప్రదేశంలో గాలి పేరుకుపోతే దాన్ని న్యూమోథోరాక్స్ అని అంటారు. ఈ ప్రాంతంలో గాలి చేరితే ఊపిరితిత్తులపై ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఫలితంగా ఊపిరి తిత్తులు పనిచేయకుండా పోతాయి. దీని కారణంగా పదునైన ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు రోగులు. ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటే మాత్ర చర్మ రంగు కూడా మారిపోతుంది.
ఎవరికి వచ్చే ప్రమాదం ఉందంటే..
ఆకస్మిక ఛాతీ గాయం, దీర్ఘకాలిక ఊరితిత్తుల సంబంధ వ్యాధులు, ఆస్తమా, దగ్గు, క్షయ వంటి వాటితో బాధపుడుతున్న వారిలో ఈ న్యూమోథోరాక్స్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.
చికిత్స:
సమస్య తీవ్రతను అనుసరించి వైద్యులు చికిత్స అందించడం జరుగుతుంది. ఒక్కోసారి మాత్రం కొద్దిపాటి సర్జరీ కూడా చేయాల్సి రావొచ్చని చెబుతున్నారు.
(చదవండి: రాత్రి భోజనం తర్వాత నడిస్తే ఇన్ని లాభాలా..!)
Comments
Please login to add a commentAdd a comment