NEET UG
-
తెల్ల ‘కోట్లు’!.. నీట్ ర్యాంకర్ల నిర్వేదం
‘ఏడాదిపాటు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని నీట్ యూజీ–2024లో 595 స్కోర్ చేశా. గతేడాదితో పోలిస్తే మెరుగైన స్కోర్ చేసినా కన్వీనర్ కోటాలో సీటు వస్తుందన్న నమ్మకం లేదు. ప్రభుత్వం ఈ ఏడాది మరో 5 కొత్త వైద్య కళాశాలలను ప్రారంభిస్తే మనకు అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లు సమకూరేవి. దీనికి తోడు టీడీపీ తన హామీ మేరకు సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తే మరో 319 సీట్లు కన్వీనర్ కోటాలో పెరిగేవి. కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు ఇచ్చేందుకు ఎన్ఎంసీ అండర్ టేకింగ్ కోరినా ప్రైవేట్‌కు కట్టబెట్టే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. పులివెందుల మెడికల్ కాలేజీకి ఎంఎన్సీ సీట్లు మంజూరు చేస్తే మేం నిర్వహించలేమంటూ ప్రభుత్వమే లేఖ రాసి నాలాంటి విద్యార్థులకు తీవ్ర నష్టం తలపెట్టింది. ఇప్పటికే లాంగ్‌టర్మ్ కోచింగ్ రూపంలో రెండేళ్లు కాలగర్భంలో కలిసిపోయాయి. ఈసారి కూడా సీటు రాకుంటే నా భవిష్యత్ అంధకారమే. తెలంగాణలో 500 లోపు స్కోర్ చేసిన ఓసీ విద్యార్థులకు ఈసారి సీట్లు వస్తున్నాయి. అక్కడ 8 వైద్య కళాశాలల్లో 400 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా పెరగడమే దీనికి కారణం. ఏపీలో మాత్రం వచ్చిన సీట్లు సైతం వద్దంటూ ప్రభుత్వమే లేఖ రాసింది. ఈడబ్ల్యూఎస్ కోటా అమలుపై చిత్తశుద్ధి లేని జీవో ఇచ్చి చేతులు దులుపుకొంది...!’ విశాఖకు చెందిన నీట్ ర్యాంకర్ సాయి ఆక్రోశం ఇదీ!సాక్షి, అమరావతి: వైద్య విద్యపై ఎంతో ఆశ పెట్టుకుని లాంగ్ టర్మ్ శిక్షణతో ఏడాదంతా సన్నద్ధమై మంచి స్కోర్ సాధించిన పలువురు ఇప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త వైద్య కాలేజీలు అందుబాటులోకి రాకపోవడంతో ఉసూరుమంటున్నారు. ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలతో ఈ ఏడాది 700, వచ్చే ఏడాది 1,050 చొప్పున మొత్తం 1,750 సీట్లు కోల్పోవడంతో తమ ఆశలు గల్లంతవుతున్నాయని నీట్ ర్యాంకర్లు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే వైద్య విద్యా వ్యాపారం చేస్తానంటే ఎలా? అని ఆక్రోశిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతే ఇక ‘కోట్లు’న్న వారికే తెల్లకోటు భాగ్యం దక్కుతుందని పేర్కొంటున్నారు.మంచి స్కోరైనా..సీట్ కష్టంనీట్ యూజీలో అర్హత సాధించిన 13,849 మంది ఈసారి రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం నీట్లో 500–550 స్కోర్ చేసినా రిజర్వేషన్ వర్గాల విద్యార్థులకు కన్వీనర్ కోటాలో సీటు కష్టమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఓసీ విద్యార్థులైతే దాదాపు 600 స్కోర్ చేసినప్పటికీ అసలు సీటు వస్తుందో? లేదో? అనే ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు తెలంగాణలో 500 లోపు స్కోర్ చేసిన ఓసీ విద్యార్థులకు కూడా కన్వీనర్ కోటాలో సీట్లు దక్కుతున్నాయని, ఏపీలో మాత్రం ప్రతిభ ఉన్నప్పటికీ వైద్య విద్య చదివే అదృష్టం లేదని వాపోతున్నారు. గత పదేళ్లలో తెలంగాణలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు గణనీయంగా పెరగడం, ఈ విద్యా సంవత్సరంలో 8 కళాశాలలకు ఏకంగా 400 సీట్లు అదనంగా మంజూరవడం అక్కడి విద్యార్థులకు కలిసి వస్తోంది.సీట్లు పెరిగింది గత ఐదేళ్లలోనే⇒ ఉమ్మడి రాష్ట్రంలో దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ఒంగోలు, శ్రీకాకుళం, కడప రిమ్స్‌లను నెలకొల్పడంతో పాటు నెల్లూరు ఎసీఎస్ఆర్ కళాశాల ఏర్పాటుకు బీజం వేశారు. ⇒ 2004కు ముందు, 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు కాలేదు. దీంతో వైద్య విద్యపై తీవ్ర ప్రభావం పడింది. ⇒ గత ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏకంగా 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ⇒ వీటిలో ఐదు కొత్త కళాశాలలు గత విద్యా సంవత్సరంలో ప్రారంభమై 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా సమకూరడంతో వైద్య విద్యపై ఆశలు చిగురించాయి. ⇒ ఈ క్రమంలో ఈ ఏడాది మరో ఐదు కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించాల్సి ఉండగా వాటిని ప్రైవేట్‌పరం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.⇒ దీంతో ఈ ఏడాది 750 సీట్లు సమకూరాల్సి ఉండగా కేవలం పాడేరు వైద్య కళాశాలలో కేవలం 50 సీట్లు అది కూడా గత ప్రభుత్వం తీసుకున్న చర్యల ద్వారా అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు వాటికి అనుమతులు రాకుండా ప్రభుత్వమే అడ్డుపడింది. ⇒ ఇదే విషయం ఎంఎన్సీ (జాతీయ వైద్య కమిషన్) రాసిన లేఖ ద్వారా ఇప్పటికే బహిర్గతమైన సంగతి తెలిసిందే. ⇒ ఈ ఏడాది మెడికల్ కాలేజీలు పెరిగితే తమ పిల్లలకు కచ్చితంగా సీటు వస్తుందనే అంచనాతో సగటున రూ.3 లక్షలకుపైగా ఖర్చు చేసి నీట్ శిక్షణ ఇప్పించామని, అయితే స్కోర్ 500 దాటినా దక్కని పరిస్థితి నెలకొందని తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారు. ⇒ పులివెందుల మెడికల్ కాలేజీకి ఎంఎన్సీ సీట్లు మంజూరు చేయడం విస్మయం కలిగించిందంటూ ప్రైవేట్ విద్యా వ్యాపారాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వమే వ్యాఖ్యానించడంపై నివ్వెరపోతున్నారు.మా ఆశలను కాలరాశారుగతేడాది నీట్లో 515 స్కోర్ చేశా. ఓసీ కేటగిరీలో 543 స్కోర్‌కు కన్వీనర్ కోటాలో చివరి సీట్ వచ్చింది. దీంతో లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకున్నా. ఈసారి 555 స్కోర్ సాధించినా పోటీ తీవ్రంగా ఉంది. ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభమైతే నాకు సీటు దక్కేది. కనీసం సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేసినా మాకు న్యాయం జరిగేది. ప్రభుత్వమే మా ఆశలను కాలరాసింది. మేనేజ్మెంట్ కోటాలో చేరాలంటే మా తల్లిదండ్రులకు తలకు మించిన భారం. ఇప్పటికే నాతోపాటు మా సోదరుడి లాంగ్‌టర్మ్ కోచింగ్ కోసం రూ. లక్షల్లో ఖర్చు పెట్టారు. – ఎన్. సుచేతన, రాజంపేట, అన్నమయ్య జిల్లాఅప్పుడు అదృష్టం.. ఇప్పుడు!నాకు ఇద్దరు కుమార్తెలు. 2023లో పెద్దమ్మాయి నీట్లో 530 మార్కులు సాధించి ఏలూరు కాలేజీలో సీట్ దక్కించుకుంది. ఆ విద్యా సంవత్సరంలో 5 కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించడం, అదనంగా 750 సీట్లు పెరగడం మాకు కలిసి వచ్చింది. ఇప్పుడు రెండో అమ్మాయి 543 మార్కులు సాధించినా ప్రభుత్వ సీట్ రావటం లేదు. ఈ విద్యా సంవత్సరంలో కూడా ఐదు కొత్త కళాశాలలు ప్రారంభం అయితే అదృష్టం కలసి వస్తుందని ఆశపడ్డాం. ప్రభుత్వమే వసతులు కల్పించలేమని చేతులెత్తేస్తే మాలాంటి వాళ్ల పరిస్థితి ఏమిటి? అదే మా అమ్మాయి పక్క రాష్ట్రంలో ఉంటే మొదటి రౌండ్లోనే ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు వచ్చేది. – సీహెచ్.ఉమామహేశ్వరరావు, పోలాకి మండలం, శ్రీకాకుళంప్రభుత్వమే వ్యాపారం చేస్తానంటే ఎలా?సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో రద్దు చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ దాన్ని నెరవేర్చకపోగా పీపీపీ విధానంలో వైద్య కళాశాలలను నిర్వహిస్తామని చెప్పడం ఎంత వరకు సమంజసం? ప్రభుత్వం ఉచితంగా వైద్య విద్య అందించడానికి కృషి చేయాలి. అంతేగానీ వైద్య విద్యా వ్యాపారం చేస్తానంటే ఎలా? గతేడాది కొత్త వైద్య కళాశాలలు ప్రారంభమై అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లు రావడంతో ఎంతో సంతోషించాం. ఈ ఏడాది మరో ఐదు కొత్త కాలేజీల ద్వారా అదనంగా 750 సీట్లు వస్తాయని భావిస్తే పీపీపీ విధానం పేరుతో విద్యార్థులు, తల్లిదండ్రులను తీవ్ర నిరాశకు గురి చేశారు. – జి.ఈశ్వరయ్య, ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ రాష్ట్ర కార్యదర్శి -
ఒక్కో ఎంబీబీఎస్ సీటుకు నలుగురు పోటీ!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2024–25 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లకు తీవ్ర పోటీ నెలకొంది. కన్వీనర్ కోటాలో మొత్తం 3,856 సీట్లు ఉండగా.. వీటికి 13,850 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. ఒక్కో సీటుకు దాదాపు నలుగురు విద్యార్థులు పోటీ పడుతున్నారు. యాజమాన్య కోటా (ఎంక్యూ) సీట్లకు కూడా గతంతో పోలిస్తే దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య పెరిగింది. గత విద్యా సంవత్సరంలో ఎంక్యూ సీట్లకు 3,500 మందికి పైగా దరఖాస్తు చేసుకోగా ఈసారి ఇప్పటివరకు 4,136 మంది నమోదు చేసుకున్నారు. సీట్ వస్తుందో.. లేదోనీట్ యూజీలో మంచి స్కోర్ సాధించిన వారికి అఖిల భారత స్థాయిలో ర్యాంక్‌లు పెరిగిపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మంచి స్కోర్ సాధించినప్పటికీ ఎంబీబీఎస్ సీటు వస్తుందో, లేదో అనే సందేహం చాలా మందిని వెంటాడుతోంది. మరోవైపు తెలంగాణ విద్యార్థులకు 15 శాతం కోటా రద్దు, స్థానికతపై తీసుకున్న నిర్ణయం, స్కోర్, ర్యాంక్‌ల తీరు మారడంతో కొంత అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కళాశాలల వారీగా అందుబాటులో ఉన్న సీట్లను రిజర్వేషన్ల వారీగా ప్రకటిస్తే కొంత స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. కొనసాగుతున్న రెండో విడత పరిశీలన విద్యార్థుల దరఖాస్తులను రెండు విడతల్లో ఆరోగ్య విశ్వవిద్యాలయంలో పరిశీలిస్తారు. అనంతరం మెరిట్ జాబితాలు ప్రకటిస్తారు. ఈ క్రమంలో కన్వీనర్ కోటా దరఖాస్తులకు సంబంధించి ఇప్పటికే తొలి విడత పరిశీలన పూర్తయింది. రెండో విడత కొనసాగుతోంది. ఇది కూడా పూర్తయ్యాక రెండు, మూడు రోజుల్లో ప్రాథమిక మెరిట్ జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్టు ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ నెల 9 నుంచి కన్వీనర్ కోటా ప్రవేశాల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించగా 16తో గడువు ముగిసింది. భారీగా పెరిగిన కటాఫ్.. ఇప్పటికే అఖిల భారత కోటా (ఏఐక్యూ) తొలి విడత కౌన్సెలింగ్ పూర్తయింది. విద్యార్థులకు సీట్లు కూడా కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి తొలి విడత కౌన్సెలింగ్‌లో భారీగా కటాఫ్ స్కోర్లు పెరిగాయి. దీంతో రాష్ట్ర కోటాలో పోటీ పడుతున్న విద్యార్థులు తాము సాధించిన మార్కులకు సీటు వస్తుందో, రాదోననే ఆందోళనలో ఉన్నారు. గతేడాది ఏఐక్యూ తొలి విడత కౌన్సెలింగ్‌లో అన్ రిజర్వుడ్ విభాగంలో 618 స్కోర్ వరకు సీటు లభించింది. ఈ ఏడాది కటాఫ్ స్కోర్ 42 పెరిగి 660 స్కోర్‌కు చివరి సీటు వచ్చింది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కోటాలో గతేడాది 613 మార్కులకు సీటు వస్తే ఈసారి 654 మార్కులు వచ్చినవారికి చివరి సీటు దక్కింది. వాస్తవానికి రాష్ట్రంలో 600 స్కోర్‌కు పైన చేసిన విద్యార్థుల్లో చాలా మంది అఖిల భారత కోటాలో సీట్లు పొందుతుంటారు. దీంతో రాష్ట్ర వాటా సీట్లలో కొత్త వారికి అవకాశం లభించేది. అయితే ఏఐక్యూ కటాఫ్ గణనీయంగా పెరగడం చూసి.. రాష్ట్రంలో కూడా ఇవే పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
నీట్ యూజీ-2024 తొలి రౌండ్ కౌన్సెలింగ్ ఫలితాలు విడుదల
నీట్ యూజీ-2024 తొలి రౌండ్ కౌన్సెలింగ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్ని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) విడుదల చేసింది. కాగా, నీట్ యూజీ కౌన్సెలింగ్ తొలి రౌండ్ ఆగస్ట్ 14 నుంచి రాష్ట్రాల వారీగా ప్రారంభమైంది. ఎంసీసీ సమాచారం మేరకు.. నీట్ యూజీ-2024 కౌన్సెలింగ్ నాలుగుసార్లు జరగనుంది. తాజాగా తొలిరౌండ్ కౌన్సెలింగ్ పూర్తయింది. అందులో ర్యాంక్, ప్రాధాన్యతలు, అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా అభ్యర్ధులకు ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను కేటాయించినట్లు ఎంసీసీ వెల్లడించింది. ఈ కౌన్సెలింగ్‌లో మొత్తం 26,109 మంది విద్యార్ధులకు సీట్లను కేటాయించింది.మొత్తం టాప్ 17 ర్యాంకులు సాధించిన విద్యార్ధులు ఎయిమ్స్ ఢిల్లీలో ఎంబీబీఎస్ సీట్లను సంపాదించారు. ఈ సందర్భంగా అర్హులైన విద్యార్ధులు ప్రొవిజినల్ అలాట్మెంట్ లెటర్స్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని ఎంసీసీ వెల్లడించింది.ఎంసీసీ ప్రకారం, రెండవ రౌండ్ కౌన్సెలింగ్ కోసం అవసరమయ్యే వైకల్య ధ్రువీకరణ పత్రాలు(పీడబ్ల్యూడీ) అవసరమయ్యే అభ్యర్థులు సెప్టెంబర్ 9, 2024 సాయంత్రం 5 గంటల లోపు సంబందిత కేంద్రాల నుంచి పొందాలని తెలిపింది. ఇతర వివరాల కోసం ఎంసీసీ కాల్ సెంటర్‌కు కాల్ చేసి తెలుసుకోవాలని, జన్మాష్టమి కారణంగా, ఎంసీసీ కాల్ సెంటర్ (సోమవారం)ఆగస్టు 26, 2024న ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు పని చేస్తుందని ఎంసీసీ ప్రతినిధులు వెల్లడించారు.అభ్యర్థులు తమకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్ చేయడానికి గడువు ఆగస్ట్ 29 వరకు ఇచ్చింది. ఆ తర్వాత మెడికల్ కాలేజీలు ఈ అభ్యర్థుల అడ్మిషన్ డేటాను వెరిఫై చేస్తాయి. ఇవి ఆగస్టు 30,31 మధ్య ఎంసీసీకి సమర్పిస్తాయి. -
కూటమి సర్కార్.. ‘మెడికల్’ ద్రోహం!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడమే ఏకైక లక్ష్యంగా వ్యవహరిస్తున్న కూటమి సర్కారు కొత్త కళాశాలలకు అనుమతులు రాబట్టకుండా పేద విద్యార్థులకు తీరని ద్రోహం తలపెట్టింది. గత ప్రభుత్వం శ్రీకారం చుట్టిన 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభం కావాల్సిన ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులపై తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, ఆదోని, పాడేరు వైద్య కళాశాలల్లో ఒక్కో చోట 100 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించాల్సి ఉంది.ఈమేరకు గత ప్రభుత్వం ఈ ఐదు చోట్ల సెకండరీ కేర్ ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేయడంతో పాటు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా పోస్టులను గతంలోనే మంజూరు చేశారు. పోస్టుల భర్తీ దాదాపుగా పూర్తయిన సమయంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. మొదటి ఏడాది ఎంబీబీఎస్ విద్యార్థుల అకడమిక్ కార్యకలాపాల కోసం లెక్చర్ హాల్, ల్యాబ్, హాస్టల్స్, క్యాంటీన్ల నిర్మాణం లాంటి పనులన్నీ దాదాపుగా పూర్తయ్యాయి.ఈ నేపథ్యంలో గత జూన్ 24న ఎన్ఎంసీ బృందాలు ఈ ఐదు కళాశాలల్లో తనిఖీలు నిర్వహించాయి. మదనపల్లెలో 12 శాతం, పాడేరు, మార్కాపురం, పులివెందుల, ఆదోనిల్లో కొంత మేర ఫ్యాకల్టీ, ఇతర వనరులను కల్పించాల్సి ఉన్నందున అనుమతులను నిరాకరిస్తున్నట్లు జూలై 6న కళాశాలలకు సమాచారం ఇచ్చింది. అయితే వనరుల కల్పనకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా నాన్చిన కూటమి సర్కారు చివరి నిమిషంలో మొక్కుబడిగా అప్పీల్‌కు వెళ్లింది.అండర్ టేకింగ్ ఇవ్వకపోవడంతో..కొత్త వైద్య కళాశాలలకు అనుమతులపై అప్పీల్ చేసిన నేపథ్యంలో పులివెందుల కళాశాలలో ఎన్ఎంసీ వర్చువల్ ఇన్స్పెక్షన్ నిర్వహించింది. అయితే తాము జూన్ 24న ఇన్స్పెక్షన్ చేసినప్పటి పరిస్థితులే ఇంకా ఉన్నాయని, అంతకు మించి పెద్దగా పురోగతి లేదని ఎన్ఎంసీ ప్రతినిధులు గుర్తించినట్లు తెలిసింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇస్తే 50 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేస్తామని గత వారం కళాశాలలకు ఎన్ఎంసీ సమాచారం ఇచ్చింది. అండర్ టేకింగ్ అంటే కళాశాలలో తరగతుల నిర్వహణ, అకడమిక్ కార్యకలాపాలకు అవసరమైన వసతులన్నింటినీ ప్రభుత్వం సమకూరుస్తుందని గ్యారంటీ ఇవ్వడం. అయితే అండర్ టేకింగ్ గడువు కూడా ఈనెల 12వతేదీతో ముగిసింది. దీనిపై వైద్యశాఖ సమాచారం ఇచ్చినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని తెలిసింది.పట్టుబట్టి సాధించిన వైఎస్ జగన్గతేడాది ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల కళాశాలలకు తొలి దశ తనిఖీల్లో అనుమతులు రాకపోవడంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లి అండర్ టేకింగ్ ఇచ్చింది. తద్వారా ఆ నాలుగు కళాశాలలకు వైఎస్ జగన్ అప్పట్లో పట్టుబట్టి అనుమతులు రాబట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం అండర్ టేకింగ్ ఇవ్వలేదు. ఇక మిగిలిన నాలుగు కొత్త కళాశాలల్లో వర్చువల్ ఇన్స్పెక్షన్ కూడా జరగలేదు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. బీజేపీకి చెందిన సత్యకుమార్ రాష్ట్రంలో వైద్య శాఖ మంత్రిగా ఉన్నా కొత్త వైద్య కళాశాలలకు అనుమతుల విషయాన్ని పట్టించుకోకపోవడంపై వైద్య వర్గాల్లో చర్చ జరుగుతోంది.వైద్య కళాశాలలకు అనుమతులపై సందిగ్ధత కొనసాగుతున్న క్రమంలో ఆల్ ఇండియా కోటా, రాష్ట్ర కోటా కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైంది. గతేడాది వైఎస్సార్ సీపీ హయాంలో ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఒక్కోచోట 150 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున మొత్తం 750 సీట్లు అదనంగా రాష్ట్రానికి సమకూరాయి. ఇక ఈ ఏడాది ఐదు కొత్త కళాశాలల్లో ఒక్కోచోట 100 చొప్పున 500 సీట్లు సమకూరుతాయని విద్యార్థులు, తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొత్త కళాశాలలకు అనుమతులు లభిస్తే 75 సీట్లు ఆల్ ఇండియా కోటా కింద పోగా మిగిలిన 425 సీట్లు పూర్తిగా మన రాష్ట్ర విద్యార్థులకే దక్కే పరిస్థితి ఉండేది. తద్వారా పేద, మధ్య తరగతి విద్యార్థుల వైద్య విద్య కల నెరవేరి అందుబాటులోకి వచ్చే వైద్యుల సంఖ్య పెరిగేది.ఆశలు ఆవిరి..నీట్ యూజీ–2024లో 598 మార్కులు సాధించా. కడప రిమ్స్ లేదా పులివెందుల కాలేజీలో సీటు సాధిస్తే అమ్మనాన్నలకు దగ్గరగా ఉండి ఎంబీబీఎస్ చదవచ్చని భావించా. పులివెందుల మెడికల్ కళాశాలలో ప్రవేశాలపై స్పష్టత లేదు. రాష్ట్రంలో ఈ ఏడాది ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కొత్తగా ఏర్పాటైతే అదనంగా 500 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయని ఎంతోమంది విద్యార్థులు ఆశ పెట్టుకున్నారు. గతంలో హామీ ఇచ్చిన ప్రకారం సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేయాలి. – పెద్దిరెడ్డి వెంకట కేదార్‌నాథ్‌రెడ్డి, పోరుమామిళ్ల, వైఎస్సార్ జిల్లా -
మళ్లీ ‘నీట్’కు ఆదేశించలేం: సుప్రీం
న్యూఢిల్లీ: నీట్–యూజీ 2024 పరీక్ష సమగ్రతకే తూట్లు పొడిచేంతటి భారీ స్థాయిలో వ్యవస్థీకృత లీకేజీ జరిగినట్టు ఇప్పటికైతే ఎలాంటి రుజువులూ లేవని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో పరీక్షను తిరిగి నిర్వహించాలని ఆదేశించలేమని స్పష్టం చేసింది. సీజేఐ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్డీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. ధర్మాసనం తరఫున సీజేఐ 63 పేజీల తీర్పు రాశారు. ‘‘సోషల్ మీడియా, ఇంటర్నెట్ వంటివాది ద్వారా ప్రశ్నపత్రాన్ని విస్తృతంగా లీక్ చేశారనేందుకు ఎలాంటి ఆధారాలూ లేవు. లీకేజీ ప్రధానంగా పటా్న, హజారీబాగ్ ప్రాంతాలకే పరిమితమైనట్టు తేలింది. తద్వారా లబ్ధి పొందిన విద్యార్థులను గుర్తించడం కష్టమేమీ కాదు. వారెంత మందో సీబీఐ దర్యాప్తు ఇప్పటికే తేలి్చంది. కనుక మళ్లీ పరీక్ష నిర్వహించడం అనవసరం. పైగా దానివల్ల ఈ దశలో విద్యా సంవత్సరం దెబ్బ తింటుంది’’ అని పేర్కొన్నారు. ఎన్టీఏకి తలంటిన సీజేఐనీట్–యూజీ వంటి కీలక పరీక్ష నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వ్యవహరించిన తీరు దారుణమని సీజేఐ దుయ్యబట్టారు. ముందు తప్పుడు నిర్ణయాలు తీసుకుని తర్వాత దిద్దుబాటుకు దిగడం దారుణమన్నారు. ‘‘లక్షలాది మంది విద్యార్థులు హాజరయ్యే జాతీయ స్థాయి పోటీ పరీక్షల నిర్వహణ బృహత్తర కార్యక్రమమే. అందుకు భారీ వనరులు, సమన్వయం, ప్రణాళిక అవసరం. మేమేమీ కాదనడం లేదు. కానీ ఎన్టీఏ వంటి సంస్థలను ఏర్పాటు చేసింది అందుకే కదా! ఈసారి జరిగిన తప్పిదాలను నివారించేందుకు కావాల్సినన్ని నిధులు, సమయం ఎన్టీఏకు అందుబాటులో ఉన్నాయి. కనుక ఒకే కేంద్రంలో భారీ సంఖ్యలో అభ్యర్థులను అనుమతించడం వంటివి లీకేజీకి కారణాలని చెప్పడం కుదరదు. పైగా హజారీబాగ్ పరీక్ష కేంద్రంలో భద్రతా వైఫల్యమూ చోటుచేసుకుంది. స్ట్రాంగ్ రూం వెనక తలుపు తెరిచి అనధికార వ్యక్తులు ప్రశ్నపత్రాలను చేజిక్కించుకున్నారు. వాటిని ఇ–రిక్షాల్లో తరలించుకుపోయి అభ్యర్థల చేతిలో పెట్టారు. ఫలితంగానే 67 మందికి నూరు వాతం మార్కులొచ్చాయి. అనుమానితులైన 1,563 మందికి తిరిగి పరీక్ష పెడితే ఆ సంఖ్య అంతిమంగా 17కు తగ్గింది. అది కూడా అభ్యర్థుల ఆక్రందనలు, మీడియా రిపోర్టులు, కోర్టు జోక్యం అనంతరం! ఇలాంటి వాటితో నిమిత్తం లేకుండానే ప్రజలు విశ్వసించేలా పనితీరు ఉండాలి. ఇకనైనా మరింత జాగరూకంగా ఉండండి’’ అంటూ ఎన్టీఏను మందలించారు. తీర్పులో పేర్కొన్న అన్ని అంశాలపైనా దృష్టి పెట్టి ఇకపై పరీక్షల నిర్వహణ పూర్తిగా దోషరహితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో సంస్కరణలు సిఫార్సు చేసే విషయంలో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకోవాలని రాధాకృష్ణన్ ప్యానెల్‌ను సీజేఐ నిర్దేశించారు. అభ్యర్థుల గుర్తింపు నిర్ధారణ పద్ధతిని లోపరహితం చేయడం, పరీక్షల నిర్వహణ, ప్రక్రియ తాలూకు భద్రత, డేటా సెక్యూరిటీ తదితరాలపైనా సిఫార్సులు చేయాలని నిర్దేశించారు. -
లోపాల్ని సరిదిద్దుకోవాల్సిందే.. ఎన్టీఏకు సుప్రీం అక్షింతలు
న్యూఢిల్లీ: నీట్ యూజీ పరీక్ష విధానానికి సంబంధించిన లోపాలను (సరిదిద్దాలని) నివారించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ను సుప్రీంకోర్టు శుక్రవారం హెచ్చరించింది. మున్ముందు ఇలాంటి లీకేజీలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అటు కేంద్రంతోపాటు ఎన్టీఏను మందలించింది. ఈ మేరకు నీట్ యూజీ పేపర్‌లీక్‌పై దాఖలైన వివిధ పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు.. శుక్రవారం తుది తీర్పు వెలువరించింది.పేపర్‌లీకేజీలో వ్యవస్థీకృత ఉల్లంఘన జరగలేదని, కేవలం పాట్నా, హజారీబాగ్‌కే పరిమితమని సుప్రీం వ్యాఖ్యానించింది. అందుకే నీట్ పరీక్షను రద్దు చేసి, మళ్లీ నిర్వహించేందుకు నిరాకరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ ధర్మాసంన సమగ్ర తీర్పు వెల్లడించింది.నీట్ వంటి జాతీయ పరీక్షలో ఇలాంటి 'ఫ్లిప్ ఫ్లాప్స్'ను నివారించాలని, ఇవి విద్యార్థుల ప్రయోజనాలను దెబ్బతిస్తాయని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. నీట్ యూజీ పేపర్ లీక్‌పై ఆరోపణలు, ఇతర అవకతవకలపై వివాదం చెలరేగినప్పటికీ పరీక్షను రద్దు చేయకపోవడానికి గల కారణాలను వెలువరిస్తూ, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిందిపరీక్షా విధానంలో లోపాలను నిపుణుల కమిటీ సరిచేయాలని పేర్కొంది. ఎన్టీఏ స్ట్రక్చరల్ ప్రాసెస్‌లోని లోపాలన్నింటినీ తమ తీర్పులో ఎత్తిచూపినట్లు అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. విద్యార్థుల శ్రేయస్సు కోసం లోపాలను భరించలేమని స్పష్టం పేర్కొంది. తాజాగా తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా ఈ ఏడాదే కేంద్రం పరిష్కరించాలని సుప్రీంకోర్టు సూచించింది.ఈసందర్భంగా ఎన్టీఏ పనితీరు, పరీక్షల్లో సంస్కరణల కోసం కేంద్రం నియమించిన ఇస్రో మాజీ చీఫ్ కె.రాధాకృష్ణన్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కమిటీకి సుప్రీంకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది.కేంద్రం నియమించిన కమిటీ తన నివేదికను సెప్టెంబర్ 30 లోపు కోర్టుకు సమర్పించాలి. ఈ కమిటీ మొత్తం పరీక్ష ప్రక్రియను విశ్లేషించి, పరీక్ష విధానంలో లోపాలను సరిచేసి, ఎన్టీఏ మరింత సమర్థవంతంగా చేయడానికి అవసరమయ్యే మార్పులను సూచించాలి. పరీక్షా వ్యవస్థను బలోపేతం చేసేందుకు అంతర్జాతీయ సాంకేతిక సంస్థల సాయం తీసుకోవాలని సూచించింది. ఈ నివేదిక అందిన తర్వాత అందులోని అంశాలను అమలుచేసే విషయంపై కేంద్రం, విద్యాశాఖ రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలి.అర్హత పరీక్షల నిర్వహణకు ప్రామాణిక ఆపరేటింగ్ విధానం లేదా ప్రోటోకాల్‌ను రూపొందించడం,పరీక్షా కేంద్రాల కేటాయింపు, మార్పు ప్రక్రియను సమీక్షించాలి.అభ్యర్థుల గుర్తింపును ధృవీకరించడానికి కఠినమైన విధానాలను సిఫార్సు చేయాలి.అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను అంచనా వేయాలి.ట్యాంపరింగ్ ప్రూఫ్ ప్రశ్నపత్రాల కోసం యంత్రాంగాలను సమీక్షించాలి. సూచనలు ఇవ్వాలి.పరీక్షా కేంద్రాల్లో క్రమం తప్పకుండా ఆడిట్లు, తనిఖీలు నిర్వహించాలి. -
నీట్ యూజీ-2024పై సుప్రీం సమగ్ర తీర్పు
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు శుక్రవారం తుది తీర్పు వెలువరించింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. నీట్ పేపర్ లీకేజీలో వ్యవస్థీకృత ఉల్లంఘనలు జరగలేదని స్పష్టం చేసింది. పేపర్ లీకేజీ హజారీబాగ్, పాట్నాలకు మాత్రమే పరిమితమైందని స్పష్టం చేసింది.అయితే పరీక్ష వ్యవస్థలో ఉన్న లోపాలను నివారించాలని నేషనల్ టెస్టింగ్ ఏజ్సెన్సీతోపాటు కేంద్రానికి సుప్రీం సూచించింది. పేపర్ లీకేజ్ ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.. కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని, కమిటీ నివేదిక అమలుపై రెండు వారాల్లో సుప్రీంకోర్టుకు కేంద్ర విద్యాశాఖ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.పేపర్ లీకేజీ ఆరోపణలు, పరీక్షలో ఇతర అవకతవకలపై తీవ్ర వివాదం ఉన్నప్పటికీ, నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్)-యుజి మెడికల్ ప్రవేశ పరీక్షను రద్దు చేయకపోవడానికి గల కారణాలను సుప్రీంకోర్టు శుక్రవారం తన తీర్పులో వివరించింది. సుప్రీం చేసిన సూచనలు..1. ఎవల్యూషన్ కమిటీ ఏర్పాటు చేయాలి2. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ రూపొందించాలి 3. పరీక్షా కేంద్రాల కేటాయింపు ప్రక్రియను సమీక్షించాలి 4. గుర్తింపు, తనిఖీ ప్రక్రియలను మరింత మెరుగుపరచాలి 5. అన్ని పరీక్ష కేంద్రాలలో సీసీటీవీ లను ఏర్పాటు చేయాలి 6. పేపర్ టాంపరింగ్ జరగకుండా భద్రతను పెంచాలి 7. ఫిర్యాదుల పరిష్కారానికి మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి 8. సైబర్ సెక్యూరిటీ రంగంలో సాంకేతికతను అభివృద్ధి చేసుకునేందుకు అంతర్జాతీయ సహకారం తీసుకోవాలి నీట్ లీక్ అంశం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. మే 5న జరిగిన ఈ పరీక్షను రద్దుచేసి.. మళ్లీ నిర్వహించాలని సుప్రీంకోర్టును పలువురు ఆశ్రయించగా.. అందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రశ్నాపత్రం లీక్ అయిన మాట వాస్తవమే కానీ.. దీని ప్రభావం స్వల్పమేనని అభిప్రాయపడింది. నీట్ రీ ఎగ్జామ్ అవసరం లేదని పేర్కొంది. ఈ పిటిషన్లపై నేడు సర్వోన్నతన్యాయస్థానం సమగ్ర తీర్పు వెలువరించింది.మరోవైపు నీట్ పేపర్ లీకేజ్‌పై విచారణ చేస్తో న్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తొలి ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇందులో నలుగురు అభ్యర్ధులు, ఓ జూనియర్ ఇంజనీర్, ఇద్దరు కుట్రదారులు సహా 13 మందిని నిందితులుగా చేర్చింది. -
14 నుంచి నీట్ యూజీ కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర యూజీ కోర్సుల్లో 2024–25 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ఆల్ ఇండియా కౌన్సెలింగ్ ఆగస్ట్ 14 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) తాత్కాలిక షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేసింది. అక్టోబర్ 30వ తేదీ నాటికి స్ట్రే వేకెన్సీ రౌండ్‌కౌన్సెలింగ్‌ను ముగించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. అక్టోబర్1 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. నీట్ యూజీ–2024 తీవ్ర వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. కాగా, ఇటీవల సవరించిన మార్కులు, ర్యాంకుల జాబితాను ఎన్టీఏ విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలో 64,299 మంది విద్యార్థులు నీట్ రాయగా 43,788 మంది అర్హత సాధించారు. జూన్ 4 తేదీ నాటి ఫలితాలతో పోలిస్తే ఏపీలో 70 మంది విద్యార్థులు అనర్హులుగా మారారు. రాష్ట్రం నుంచి నీట్లో అర్హత సాధించిన విద్యార్థులు ఎన్టీఏ నుంచి వైఎస్సార్ విశ్వవిద్యాలయానికి రావాల్సి ఉంది. వర్సిటీ ప్రతినిధి ఢిల్లీకి వెళ్లి ఈ సమాచారం తీసుకుని రావాల్సి ఉండగా, ఇప్పటి వరకూ ఢిల్లీ నుంచి ఎటువంటి పిలుపు రాలేదు. ఇక ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ ప్రారంభమైన అనంతరం రాష్ట్రస్థాయిలో వైఎస్సార్ ఆరోగ్య వర్సిటీ కౌన్సెలింగ్ ప్రారంభించనుంది. -
NEET-UG 2024 revised result: 61 నుంచి 17కు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నీట్–యూజీ ప్రవేశపరీక్ష ఫలితాల రీ–రివైజ్డ్ తుది జాబితాను ఎన్టీఏ శుక్రవారం విడుదలచేసింది. ఐదు మార్కులు తీసేయడంతో టాప్ ర్యాంకర్ల సంఖ్య 61 నుంచి 17కు పడిపోయింది. ఫిజిక్స్‌లో ప్రశ్నకు నాలుగో ఆప్షన్ సరైనదని ఐఐటీ ఢిల్లీ నిపుణుల బృందం తేలి్చంది. దాంతో అందరి ర్యాంకులు మారిపోయాయి. గతంలో 67 మంది 720కి 720 మార్కులు సాధించారని ప్రకటించారు. ఆరుగురికి గ్రేస్ మార్కులను తీసేయడంతో టాపర్లు 61కి తగ్గారు. తాజాగా వారి సంఖ్య 17కు తగ్గింది.టాప్ 100 జాబితా.. రీ–రివైజ్డ్ జాబితా ప్రకారం టాప్–100 జాబితాలో 17 మంది 720కి 720 మార్కులు సాధించారు. ఆరుగురు 716 మార్కులు సాధించారు. 77 మంది 715 మార్కులు సాధించారు. కేరళ, చండీగఢ్, తమిళనాడు, పంజాబ్, బిహార్, పశి్చమబెంగాల్ నుంచి తలొకరు, రాజస్థాన్ నుంచి నలుగురు, మహారాష్ట్ర నుంచి ముగ్గురు, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ నుంచి చెరొకరు.. 17 మంది టాపర్లుగా నిలిచారు. వీరిలో నలుగురు అమ్మాయిలు! టాప్–100లో అమ్మాయిలు 22 మంది ఉన్నారు. స్కోర్‌కార్డులు, కౌన్సిలింగ్‌కు తాజా సమాచారం కోసం ్ఛ్ఠ్చఝట.n్ట్చ.్చఛి.జీnను చూడాలని ఎన్టీఏ పేర్కొంది. -
కాంగ్రెస్ చిల్లర రాజకీయాలకు చెంపపెట్టు
న్యూఢిల్లీ: నీట్–యూజీ అంశంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు కాంగ్రెస్ బాధ్యతారాహిత్యానికి, చిల్లర రాజకీయాలకు చెంపపెట్టని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. సుప్రీం నిర్ణయం విద్యార్థుల ఓటమి కానేకాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి కేంద్రం ప్రభుత్వంపైనే కాదు, సుప్రీంకోర్టుపైనా విశ్వాసం లేదని విమర్శించారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనూ పేపర్ లీకేజీలు జరగడం తెలియదా అని ఆ పార్టీ చీఫ్ ఖర్గేను ఆయన ప్రశ్నించారు. అప్పటి ఘటనలపై ఎందుకు మౌనంగా ఉన్నారన్నారు. పేపర్ లీకేజీలకు, అవినీతికి తండ్రివంటిది కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. రాజకీయ మనుగడ కోసం ఆ పార్టీ అబద్ధాలు, అరాచకాలనే నమ్ముకుందని మంత్రి మండిపడ్డారు. స్వార్థ ప్రయోజనాలపైనే తప్ప, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఖర్గేకు, రాహుల్ గాం«దీకిగానీ, కాంగ్రెస్ పార్టీకిగానీ ఏమాత్రం పట్టింపు లేదని ఆరోపించారు. -
నీట్ యూజీ తుది ఫలితాల్లో గందరగోళం
న్యూఢిల్లీ: నీట్ యూజీ 2024 తుది ఫలితాల విడుదలో గందరగోళం నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తుది ఫలితాలను ప్రకటించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వెల్లడించగా.. కేంద్ర విద్యామంత్రిత్వశాఖ మాత్రం సవరించిన మర్కులకు సంబంధించిన ఫలితాలను తాము ఇంకా విడుదల చేయలేదని పేర్కొంది.విద్యార్ధులు ఫలితాలను ఇప్పుడే చూసుకోలేరని, తాము త్వరలో విడుదల చేస్తామని తెలిపింది. ఇప్పుడు వైరల్ అవుతున్న లింక్ పాతదని స్పష్టం చేసింది. కాగా నీట్ యూజీ-2024 తుది ఫలితాలు విడుదలయ్యాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సవరించిన ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసినట్లు వార్తలు వస్తున్నాయి.ఫిజిక్స్ విభాగంలో ఓ ప్రశ్నకు తప్పుడు సమాధానం ఎంచుకున్న కొంత మంది విద్యార్ధులకు కలిసిన గ్రేస్ మార్కులను తొలగించి.. తాజా ఫలితాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు తుది ఫలితాలను విడుదల చేసింది. దీని ఆధారంగా 4 లక్షల మంది అభ్యర్థులు 5 మార్కులను కోల్పోయారు. కాగా ఫిజిక్స్‌లోని ఓ ప్రశ్నకు 12వ తరగతి ఎన్సీఈఆర్టీ పాత సిలబస్ ప్రకారం తప్పుగా సమాధానం ఇచ్చిన కొంతమంది విద్యార్ధులకు ఎన్టీఏ అదనంగా మార్కులను కలిపింది. అయితే, కచ్చితమైన ఒక సమాధానాన్ని మాత్రమే అంగీకరించాలని, ఇతర సమాధానాలకు మార్కులు ఇవ్వరాదని సుప్రీంకోర్టు మంగళవారం తేల్చి చెప్పింది. ఇప్పటికే ఇచ్చిన మార్కులను ఉపసంహరించుకోవాలని తెలిపింది.అయితే సుప్రీంకోర్టులో నీట్ వ్యవహారంపై విచారణ సందర్బంగా ఫిజిక్స్ విభాగంలో 29వ ప్రశ్నకు ఒకటి మాత్రమే సరైన సమాధానం అయినప్పుడు.. రెండు ఆప్షన్లు ఎంచుకున్న విద్యార్ధులకు ఎన్టీయే అదనపు మార్కులు కలిపిందని ఓ పిటిషనర్ లేవనెత్తాురు.దీనిపై స్పందించిన సుప్రీం దర్మాసనం.. ముగ్గురు నిపుణులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసి మరుసటి రోజు మధ్యాహ్నానికి ఫిజిక్స్ ప్రశ్నకు సరైన సమాధానానికి సంబంధించిన నివేదికను సమర్పించాలని ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్‌ను ఆదేశించింది. అనంతరం ఐటీ ఢిల్లీ యొక్క నివేదిక ఆధారంగా ఆప్షన్ 4 మాత్రమే సరైన సమాధానం అని తెలిపింది. దీంతో ఆప్షన్ 4 ఎంపిక ేసిన విద్యార్ధులకు మాత్రమే మార్కులు ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది.ఇక ఈ ఏడాది మే నెలలో దేశవ్యాప్తంగా జరిగిన నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. మరోవైపు ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని పేర్కొంది. -
Rahul Gandhi: ధనికులైతే చాలు పరీక్ష విధానాన్నే కొనేయొచ్చు
న్యూఢిల్లీ: ధనికులైతే చాలు పరీక్షా విధానాన్నే కొనేయొచ్చంటూ నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై పార్లమెంట్ వేదికగా విపక్షనేత రాహుల్‌గాంధీ ప్రభుత్వం తీవ్ర విమర్శలుచేశారు. గత ఏడేళ్లలో ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్లు ఆధారాలు లేవంటూ లోక్‌సభలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పడంతో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాహుల్ మాట్లాడారు. ‘‘ నీట్ పేపర్ లీకేజీ ఉదంతంలో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వీయతప్పిదాన్ని ఒప్పుకోవట్లేదు. ప్రతి ఒక్కరిపై నిందలేస్తూ తప్పుబడుతున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందనే కనీస అవగాహన కూడా ఆయనకు లేనట్లుంది. వరస లీకేజీలతో తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడిందని కోట్లాది మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. భారత్‌లో పరీక్షల నిర్వహణ అనేది ఒక మోసపూరిత వ్యవహారమని అభ్యర్థులు ఒక నిర్ణయానికొచ్చారు. ధనికులైతే చాలు పరీక్షావిధానాన్నే కొనేయొచ్చు అనే పరిస్థితి నెలకొంది. ఈ తప్పు వ్యవస్థీకృతంగా జరుగుతోంది. ఈ పరిస్థితిని రూపుమాపేందుకు మీ వంతుగా ఎలాంటి కృషిచేస్తున్నారు?’ అని మంత్రిని రాహుల్ నిలదీశారు. దీంతో మంత్రి ప్రధాన్ మాట్లాడారు. ‘‘ మొత్తం పరీక్ష విధానమే నిష్పలం అన్నట్లుగా మాట్లాడటం దురదృష్టకరం. ఏడేళ్లలో 70 పేపర్లు లీక్ అయ్యాయని కాంగ్రెస్ సభ్యుడు మాణిక్కం ఠాకూర్ చెబుతున్నదంతా అబద్ధం. నిజానికి ఎన్టీఏను స్థాపించాక 240కిపైగా పరీక్షలను విజయవంతంగా నిర్వహించాం. ఐదు కోట్ల మంది విద్యార్థులు దరఖాస్తుచేసుకున్నారు. 4.5 కోట్ల మంది వివిధ పరీక్షలు రాశారు’’ అని మంత్రి చెప్పారు. దీంతో ఠాకూర్ కలగజేసుకుని ‘‘ పేపర్ లీకేజీల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా ఎలాంటి నిర్ణయాలు ఆచరణలో పెడుతున్నారో మంత్రి చెప్పాలి. లేదంటే రాజీనామా చేయాలి’ అని అన్నారు. దీంతో మంత్రి స్పందించారు. ‘‘ ఇక్కడ మాలో ఏ ఒక్కరో జవాబుదారీ కాదు. ఏం జరిగినా ప్రభుత్వం మొత్తం జవాబుదారీగా ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. ‘‘పేపర్ లీకేజీల విషయంలో మోదీ సర్కార్ రికార్డ్ సృష్టించనుంది. ఒకే చోట రాసిన వారిలో ఎక్కువ మందికి అత్యధిక మార్కులు వచ్చిన పరీక్షకేంద్రాల జాబితాను విడుదలచేయాలి’ అని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ డిమాండ్‌చేశారు. అనంతరం టీఎంసీ, డీఎంకే సహా విపక్ష సభ్యులంతా వాకౌట్ చేశారు. -
Supreme Court: రెండిట్లో ‘సరైన’ సమాధానం ఏమిటి?
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్యవిద్యలో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్–యూజీ, 2024 పరీక్షలో పేపర్ లీకేజీ ఉదంతంపై పిటిషన్లను విచారిస్తున్న సుప్రీంకోర్టులో సోమవారం ఒక ప్రశ్నపై తీవ్రమైన చర్చ జరిగింది. ఒక ప్రశ్నకు ఇచి్చన ఆప్షన్లలో రెండు సరైన సమాధానాలు ఉన్నాయని, వీటిల్లో ఒకటి ఎంచుకున్న అభ్యర్థులకు మార్కులేసి రెండోది ఎంచుకున్న అభ్యర్థులకు మార్కులు వేయలేదని దీనిపై తేల్చాలని కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జసిŠట్స్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పారి్ధవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం సోమవారం విచారించింది. రెండింటిలో సరైన సమాధానం ఏది? అనే దానిపై స్పష్టత వస్తే అభ్యర్థుల తుది జాబితా మెరిట్ లిస్ట్‌లో మార్పులు చేసుకునే అవకాశం ఉంది. ఈ అంశంపై తొలుత పిటిషన్ల తరఫు న్యాయవాది వాదించారు. ‘‘ఈ ప్రశ్నకు సమాధానం రాసేందుకు ప్రయతి్నంచిన అభ్యర్థుల్ని మూడురకాలుగా విడగొట్టాలి. ఎందుకంటే రెండు ‘సరైన’ సమాధానాల్లో ఒకదానికి ఎంచుకున్న వాళ్లకు నెగిటివ్ మార్కింగ్ కారణంగా ఐదు మార్కులు పోయాయి. రెండో సమాధానం ఎంచుకున్న వాళ్లకు నాలుగు మార్కులు పడ్డాయి. రెండింటిలో ఏది కరెక్టో తేల్చుకోలేక, నెగిటివ్ మార్కింగ్ వల్ల మార్కులు పోతాయన్న భయంతో సమాధానం రాయకుండా వదిలేసిన వాళ్లూ ఉన్నారు’’ అని న్యాయవాది వివరించారు. దీంతో ధర్మాసనం స్పందించింది. ‘‘ ఫిజిక్స్ విభాగంలో అణువుకు సంబంధించిన ప్రశ్నలో నాలుగు ఆప్షన్లలో రెండు సరైన సమాధానాలు ఉన్నాయన్న వాదనల నడుమ అసలైన సమాధానాన్ని తేల్చాల్సిన సమయమొచి్చంది. అందుకోసం ముగ్గురు విషయ నిపుణులతో కూడిన బృందాన్ని ఏర్పాటుచేయండి. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలలోపు మాకు సరైన సమాధానమేంటో నివేదించండి’’ అని ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్‌ను కోర్టు ఆదేశించింది. తమ ఆదేశాలు ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్‌కు చేరేలా చూడాలని సుప్రీంకోర్టులో సెక్రటరీ జనరల్‌కు ధర్మాసనం సూచించింది. ‘పరీక్ష నిర్వహణలో లోపాలు చూస్తుంటే ఇది వ్యవస్థాగత వైఫల్యమని తెలుస్తోంది. గుజరాత్లో ఒక విద్యార్థి 12వ తరగతిలో ఫెయిల్ అయ్యాడుగానీ నీట్ పరీక్షలో చాలా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. కొన్ని కేంద్రాల్లో అడ్రస్ వెరిఫికేషన్ చేయలేదు. మరి కొన్నింటిలో సీసీటీవీ కెమెరాలే లేవు’ అని లాయర్ నరేందర్ హూడా వాదించారు.కొలిక్కి వస్తున్న నీట్–యూజీ వివాదం! నీట్ యూజీ పరీక్షను రద్దుచేసి మళ్లీ నిర్వహించాలని దాదాపు 40 పిటిషన్లు దాఖలైన విషయం తెల్సిందే. పరీక్ష రద్దు చేయాలంటూ, రద్దు చేయొద్దంటూ దాఖలు చేసిన వారి వాదనలు సుప్రీంకోర్టులో పూర్తయ్యాయి. ఇక కేంద్రం తరఫు వాదనలు మిగిలి ఉన్నాయి. మంగళవారం కేంద్రం వాదనలు పూర్తయితే త్వరగా తీర్పు వెలువరించే అవకాశాలున్నాయి. -
నీట్ రద్దు పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ రేపటికి వాయిదా
ఢిల్లీ: నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని, రద్దు చేసి తిరిగి నిర్వహించాలని దాఖలైన పదుల సంఖ్యలో పిటిష్లున్లపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్‌లు జేబీ పార్ధివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా పరీక్ష సెంటర్ల వారీగా విడుదల చేసిన ఫలితాల్లో కూడా గందరగోళం ఉందన్న పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థి గుజరాత్ నుంచి బెల్గావి వెళ్లి పరీక్ష రాస్తే.. 700పైగా మార్కులు వచ్చాయని చెప్పారు. ఎన్టీఏ నుంచి బ్యాంక్ లాకర్లకు పేపర్లు చేరడానికి మధ్యలో ఏదో జరిగిందని తెలిపారు.విచారణ సందర్భంగా.. ఫిజిక్స్ పేపర్లోని 19వ ప్రశ్నకు రెండు ఆప్షన్లు సరైనవిగా ఎన్సీఈఆర్టీ పేర్కొందని, కొత్త ఎన్సీఈఆర్టీ ఎడిషన్ ప్రకారం, ఆప్షన్ 4 సరైన సమాధానం అని ఉంటే, మునుపటి ఎడిషన్ల ప్రకారం ఆప్షన్ 2 సరైనదిగా పేర్కొన్న విద్యార్థులకు కూడా షనల్ టెస్టింగ్ ఏజెన్సీ గ్రేస్ మార్కులు కలిపిందని పిటిషనర్ తన న్యాయవాది ద్వారాకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.దీనికిసీజేఐ బదులిస్తూ.. తాజా ఎన్సీఈఆర్టీ ఎడిషన్‌లోని సూచనలే పరిగణలోకి తీసుకోవాలని, అయితే ఆప్షన్‌కు సమాధానం ఇచ్చిన వారికి పూర్తి మార్కులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఎందుకు ఎన్టీయే అలా చేసిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించారు. అయితే రెండూ సాధ్యమయ్యే సమాధానాలేనని ఎస్జీ బదులిచ్చారు.అయితే ఇది సరైనది కాదని, ఏదైనా ఒక ఆప్షన్‌ను మాత్రమే ఎంపిక చేయాలని, రెండూ సరైన సమాధానాలు కాలేవని సీజేఐ పేర్కొన్నారుఈ సమస్యను పరిష్కరించేందుకు ఢిల్లీ ఐఐటీ నుంచి నిపుణుల అభిప్రాయం తీసుకోవాలని డీవై చంద్రచూడ్ తెలిపారు. "సంబంధిత సబ్జెక్టుకు సంబంధించి ముగ్గురు నిపుణులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేయవలసిందిగా ఐఐటీT ఢిల్లీ డైరెక్టర్‌ను కోరారు. ఈ నిపుణుల బృందం సరైన ఆప్షన్‌పై అభిప్రాయాన్ని రూపొందించి, రేపు మధ్యాహ్నం 12 గంటలలోపు రిజిస్ట్రార్‌కు తెలియజేయవలసిందిగా ఆదేశించారు. మరోవైపు.. నీట్ పరీక్ష తిరిగి నిర్వహించాల్సిన అవసరం లేదన్న కేంద్రం పేర్కొంది. ఇరు వర్గాల సుధీర్ఘ వాదనల అనంతరం తదుపరి విచారణను సర్వోన్నత న్యాయ స్థానం రేపటికి(మంగళావారం) వాయిదా వేసింది.ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పరీక్ష కేంద్రాల వారీగా నీట్ పరీక్ష ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ( ఎన్టీఏ) విడుదల చేసిన విషయం తెలిసిందే. పరీక్ష రద్దు కోరుతూ 38 పిటిషన్లు దాఖలు కాగా.. అదేవిధంగా పలు రాష్ట్రాలోని హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లు సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కోరిన ఎన్టీఏ రెండు పిటిషన్లపైనా సుప్రీం విచారణ జరపుతోంది. -
నేటి నుంచే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 12వ తేదీ వరకు 19 రోజులపాటు కొనసాగుతాయి. సోమవారం ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కానుండగా, తొలి రోజు పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ నియోజకవర్గం నుంచి గెలిచిన శత్రుఘ్న సిన్హా లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం ప్రశ్నోత్తరాలు నిర్వహిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024–25 సామాజిక, ఆర్థిక సర్వే నివేదికను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుత సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 6 బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. జమ్మూకశీ్మర్ బడ్జెట్‌కు పార్లమెంట్ ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈసారి వాడీవేడిగానే చర్చలు 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఓ వైపు సన్నాహాలు చేస్తుండగా, మరోవైపు వివిధ కీలక అంశాలపై కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. నీట్–యూజీ పేపర్ లీకేజీ, యూపీఎస్సీ పరీక్షల్లో అవకతవకలు, రైల్వే భద్రత, డిప్యూటీ స్పీకర్ పదవి, నిరుద్యోగం, అగి్నవీర్ పథకం, ఆర్థిక వ్యవస్థ, కేంద్ర దర్యాప్తు సంస్థల దురి్వనియోగం, మణిపూర్‌లో శాంతి భద్రతలు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని నిర్ణయానికొచ్చాయి. ప్రత్యేక హోదాపై గళం విప్పిన వైఎస్సార్సీపీ కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. కేంద్ర మంత్రులు రాజ్నా«థ్ సింగ్, కిరణ్ రిజిజు, జేపీ నడ్డా నేతృత్వంలో నిర్వహించిన ఈ భేటీకి ఆర్జేడీ, జేడీయూ, బీజేడీ, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, శివసేన తదితర 44 పార్టీల సభాపక్ష నేతలు హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభల కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పారీ్టలు సహకరించాలని కేంద్ర మంత్రులు కోరారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని వైఎస్సార్సీపీ రాజ్యసభాపక్ష నేత విజయసాయిరెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ పాలనలో ప్రతిపక్ష నేతలపై దమనకాండ సాగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ జేడీ(యూ), ఒడిశాకు ప్రత్యేక హోదా కలి్పంచాలని బిజూ జనతాదళ్(బీజేడీ) సైతం తమ డిమాండ్లను ప్రభుత్వం ముందుంచాయి. నీట్–యూజీ పేపర్ లీకేజీ అంశంపై పార్లమెంట్లో మాట్లాడేందుకు విపక్షాలకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ తరఫున హాజరైన గౌరవ్ గొగోయ్ కోరారు. లోక్‌సభలో కాంగ్రెస్‌కు డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టాలని డిమాండ్ చేశారు. ఆరు బిల్లులివే.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఆరు కొత్త బిల్లులు ప్రవేశపెట్టనుంది. 90 ఏళ్ల క్రితం నాటి ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం స్థానంలో భారతీయ వాయుయాన్ విధేయక్–2024ను తీసుకొస్తోంది. విమానయాన రంగంలో సులభతర వాణిజ్యానికి పెద్దపీట వేయనున్నారు. అలాగే ఫైనాన్స్ బిల్లు, విపత్తు నిర్వహణ(సవరణ) బిల్లు, బాయిలర్స్ బిల్లు, కాఫీ(ప్రోత్సాహం, అభివృద్ధి) బిల్లు, రబ్బర్(ప్రోత్సాహం, అభివృద్ధి) బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. హోదాపై టీడీపీ మౌనమెందుకో?: జైరాం అఖిలపక్ష సమావేశంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ‘ఎక్స్’లో స్పందించారు. ‘‘రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష భేటీలో ఆంధ్రప్రదేశ్, బిహార్‌కు ప్రత్యేక హోదా కలి్పంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జేడీ(యూ) డిమాండ్ చేశాయి. విచిత్రంగా తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ అంశంపై మౌనం దాల్చింది’’ అని పేర్కొన్నారు. -
ఒకే సెంటర్లో 85 శాతం మందికి అర్హత
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నీట్–యూజీ ఫలితాలను పరీక్షా కేంద్రాలు, నగరాల వారీగా శనివారం విడుదల చేసింది. ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులో తీసుకొచి్చంది. ఈ ఫలితాలను పరిశీలిస్తే విస్మయకరమైన అంశాలు బయటపడుతున్నాయి. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఒకే పరీక్షా కేంద్రంలో నీట్ రాసిన అభ్యర్థుల్లో ఏకంగా 85 శాతం మంది అర్హత సాధించినట్లు తెలుస్తోంది. రాజ్‌కోట్‌లోని యూనిట్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ సెంటర్లో 22,701 మంది నీట్ రాశారు. వీరిలో 85 శాతం అర్హత సాధించారు. ఈ సెంటర్లో 12 మంది 700కు పైగా, 115 మంది 650కిపైగా, 259 మంది 600కు పైగా, 403 మంది 550కిపైగా స్కోర్ సాధించారు. అలాగే రాజస్తాన్‌లోని విద్యాభారతి శిఖర్ సెంటర్లో పరీక్ష రాసినవారిలో కూడా చాలామందికి మెరుగైన స్కోర్ లభించింది. అక్కడ 8 మంది 700కు పైగా, 69 మంది 650కిపైగా, 155 మంది 600కుపైగా, 241 మంది 500కు పైగా స్కోర్ సాధించారు.హరియాణాలోని రోహ్తక్లో మోడల్ స్కూల్ సెంటర్లో పరీక్ష రాసిన వారిలో 45 మంది అభ్యర్థులకు 600కుపైగా స్కోర్ లభించింది. హరియాణాలోని ఝాజ్జర్‌లో హర్ద యాల్ పబ్లిక్ స్కూల్ సెంటర్లో ఇంతకముందు ఆరుగురు అభ్యర్థులకు 720కి 720 స్కోర్ దక్కింది. గ్రేసు మార్కులను తొలగించి, ఫలితాలను సవరించిన తర్వాత ఈ సెంటర్లో 13 మంది అభ్యర్థులు 600కుపైగా స్కోర్ సాధించారు. 682 స్కోర్ ఎవరికీ దాటలేదు. నీట్ కేసులో మరో ముగ్గురి అరెస్టు నీట్ పేపర్ లీక్ కేసులో సూత్రధారుల్లో ఒకరిగా భావిస్తున్న వ్యక్తిని సీబీఐ అధికారులు శనివారం అరెస్టు చేశారు. అతడిని ఎన్ఐటీ–జంòÙడ్పూర్ బీటెక్ గ్రాడ్యుయేట్ శశికాంత్ పాశ్వాన్ అలియాస్ శశిగా గుర్తించారు. అలాగే ఇదే కేసులో ఇద్దరు ఎంబీబీఎస్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పటిదాకా అరెస్టయిన వారి సంఖ్య 21కి చేరుకుంది. -
నీట్ పేపర్ లీక్ కేసు.. ఇద్దరు ఎంబీబీఎస్ విద్యార్థుల అరెస్ట్
వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నేషనల్ కమ్-ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్)-యుజీ పేపర్ లీక్ కేసు వ్యవహారం ఇంకా చల్లారడం లేదు. నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలు, అవకవకలపై అటు సుప్రీంకోర్టు విచారణ, ఇటు సీబీఐ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది.తాజాగా నీట్ వ్యవహారంలో కేంద్ర దర్యప్తు సంస్థ సీబీఐ మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసింది. పేపర్ లీక్ కేసులో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు ఎంబీబీఎస్ విద్యార్థులను సీబీఐ శనివారం అదుపులోకి తీసుకుంది. అరెస్టయిన ఇద్దరు నిందితులను భరత్పూర్ మెడికల్ కాలేజీ విద్యార్థులు కుమార్ మంగళం బిష్ణోయ్,దీపేందర్ కుమార్‌లుగా గుర్తించారు.నీట్ యూజీ పరీక్ష రోజు హజారీబాగ్‌లో రెండవ సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థి బిష్ణోయ్, మొదటి సంవత్సరం వైద్య విద్యార్థి శర్మ ఉన్నట్లు సాంకేతిక నిఘా నిర్ధారించినట్లు అధికారులు తెలిపారు. వీరిద్దరూ తంలో అరెస్టయిన ఇంజనీర్ పంకజ్ కుమార్ దొంగిలించిన పేపర్‌కు ‘పరిష్కారకర్తలుగా’ వ్యవహరిస్తున్నారని తేలిందని పేర్కొన్నారు.కాగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జంషెడ్‌పూర్‌కు (జార్ఖండ్)చెందిన 2017-బ్యాచ్ సివిల్ ఇంజనీర్ పంకజ్ కుమార్ అలియాస్ ఆదిత్య.. హజారీబాగ్‌లోని ఎన్టీయే ట్రంక్ నుండి నీట్ పేపర్‌ను దొంగిలించాడన్న ఆరోపణలతో సీబీఐ అధికారులు ఇటీవల అరెస్ట్ చేశారు. -
అప్పుడేమో నీట్ టాపర్లు, రీఎగ్జామ్ ఫలితాల్లో మాత్రం..
న్యూఢిల్లీ: ఆ సెంటర్లో నీట్ యూజీ రాసిన ఆరుగురికి 720కి 720 మార్కులు వచ్చాయి. అది ఫలితాలపై, మొత్తం పరీక్ష నిర్వహణపై అనుమానాలు రేకెత్తిస్తూ .. దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది. అయితే గ్రేసు మార్కులు కలపవడం వల్లే అలా జరిగిందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వివరణ ఇచ్చుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాలతో.. గ్రేస్ మార్కులు కలిపిన 1,563 మందికి రీటెస్ట్ నిర్వహించారు. ఇవాళ మధ్యాహ్నాం సెంటర్ల వారీగా ఫలితాలు విడుదల చేశారు. అయితే.. హర్యానాలో 720కి 720 ఆరుగురికి వచ్చిన సెంటర్లో ఈసారి ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి. బహాదుర్‌ఘడ్‌లోని హర్దయాల్ పబ్లిక్ స్కూల్ సెంటర్లో మొత్తం 494 మంది పరీక్ష రాశారు. కానీ, ఆ సెంటర్లో రీఎగ్జామ్ రాసిన వాళ్లలో ఎవరికీ 700 దాటలేదు. ఆ సెంటర్లో హయ్యెస్ట్ మార్కులు 682 మాత్రమే. మరో పదమూడు మందికి 600కి పైగా మార్కులు వచ్చాయి. తొలుత వెల్లడైన ఫలితాలకు వీటికి మధ్య భారీ వ్యత్యాసం కనిపించింది.మే 5వ తేదీన దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ పరీక్షలో.. హర్యానా సెంటర్లో రాసిన ఆరుగురికి ఫుల్‌స్కోర్, మరో ఇద్దరికి 719, 718 మార్కులు వచ్చాయి. అయితే.. రీటెస్ట్ తర్వాత నీట్ యూజీ పరీక్ష రాసిన అందరి ర్యాంకులు మారినట్లు ఫలితాల తర్వాత ఎన్టీఏ వెల్లడించడం తెలిసిందే. గతంలో జరిగిన నీట్ యూజీ పరీక్షలో 571 నగరాల్లోని 4,750 సెంటర్లలో 24 లక్షల మంది పరీక్ష రాశారు. అయితే షెడ్యూల్ కంటే ముందుగా జూన్ 4న ఫలితాలు ఇవ్వడం, అందులోనూ 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం అభ్యర్థుల్లో అనుమానాల్ని రేకెత్తించింది. రోడ్డెక్కి ఆందోళన బాట పట్టారు. ఈ అంశంపై రాజకీయ దుమారం సైతం చెలరేగడం, ఆపై వివాదం సుప్రీం కోర్టుకు చేరడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. చివరకు గ్రేస్ మార్కుల్ని రద్దు చేస్తూ రీటెస్ట్‌కు సుప్రీం కోర్టు ఆదేశించింది. జూన్ 24వ తేదీన నీట్ యూజీ రీటెస్ట్ నిర్వహించగా.. గ్రేస్ మార్కులు కలిపిన 1,563 మందికి 813 మంది మాత్రమే మళ్లీ పరీక్ష రాశారు.ఇక.. నీట్ పరీక్షలో పేపర్ లీక్ జరిగిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరుగుతోంది. మరోపక్క ఈ అవకతవకలపై సుప్రీంలో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే విచారణలో భాగంగా మిగతా కేంద్రాలతో పోలిస్తే అనుమానిత పరీక్ష కేంద్రాల్లో రాసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చాయా.. లేదా అని తెలుసుకోవడానికి కేంద్రాల వారీగా ఫలితాలు అందించాలని కోర్టు ఎన్టీఏను ఆదేశించింది. ఆ ఆదేశాల ప్రకారమే ఇవాళ ఎన్టీఏ తన వెబ్సైట్లో ఫలితాలు ఉంచింది. అయితే.. ఫలితాల వెల్లడి టైంలో విద్యార్థుల గుర్తింపు బయటపడకుండా చూడాలని సుప్రీం సూచనను టెస్టింగ్ ఏజెన్సీ పాటించింది. -
Supreme Court: సెంటర్లవారీగా ఫలితాలు
సాక్షి, న్యూఢిల్లీ: పరీక్ష కేంద్రాలు, నగరాల వారీగా నీట్–యూజీ, 2024 ఫలితాలను ప్రకటించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. సమగ్ర ఫలితాలను శనివారం మధ్యాహ్నం 12 గంటలలోపు ఎన్టీఏ వెబ్సైట్లో పొందుపరచాలని తెలిపింది. నీట్–యూజీ పేపర్ లీక్, నిర్వహణలో అవకతవకలపై దాఖలైన వేర్వేరు పిటిషన్లను గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రల ధర్మాసనం విచారించింది. పరీక్షను రద్దుచేసి కొత్తగా నిర్వహించాలని, కోర్టు పర్యవేక్షణలో లీకేజీ ఉదంతంపై దర్యాప్తు జరగాలని వేర్వేరు పిటిషన్లు దాఖలైన విషయం తెల్సిందే. ‘‘ పరీక్షలో సెంటర్లవారీగా విద్యార్థులు పొందిన మార్కుల వివరాలను బహిర్గతంచేయండిగానీ అభ్యర్థుల ఐడెంటిటీ కనిపించకూడదు. గోప్యత పాటించండి. డమ్మీ రోల్ నంబర్లు వేసి అభ్యర్థుల మార్కుల వివరాలు ఇవ్వండి. ప్రశ్నాపత్రం సోషల్‌మీడియా ద్వారా ఎక్కువ మందికి షేర్ అయి, విస్తృతస్థాయిలో పరీక్ష పవిత్రత దెబ్బతింటేనే పరీక్షను మరోమారు నిర్వహించేందుకు అనుమతిస్తాం. అంతేగానీ ఒకటి రెండు కేంద్రాలకు మాత్రమే లీకేజీ పరిమితమైతే రీటెస్ట్‌కు ఒప్పుకోం. కేసు సీబీఐ చేతికి వెళ్లకముందు బిహార్ పోలీసులు సేకరించిన ఆధారాలు, సమర్పించిన ఆర్థికనేరాల విభాగ నివేదికను రేపు సాయంత్రం ఐదింటికల్లా మాకు అందజేయండి’ అని కోర్టు ఆదేశించింది. తర్వాత కొందరు పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది నరేందర్‌హూడా వాదించారు. ‘‘ పరీక్షను రద్దుచేయాల్సిందే. ఎందుకంటే లీకేజీ వ్యవస్థీకృతంగా జరిగింది. హజారీబాగ్‌లో ప్రశ్నపత్రాలు ఆరురోజులపాటు ఒక ప్రైవేట్ కొరియర్ కంపెనీ అ«దీనంలో ఉండిపోయాయి. ఎగ్జామ్ సెంటర్‌కు ఒక సాధారణ ఈ–రిక్షాలో తరలించారు. ఈ ఉదంతంలో ఆ సెంటర్ ప్రిన్సిపల్‌ను ఇప్పటికే అరెస్ట్‌చేశారు’ అని అన్నారు. అయితే ప్రశ్నపత్రం లీక్ కాలేదని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. ‘ కేవలం 1.08 లక్షల మంది అడ్మిషన్ పొందే ఈ పరీక్ష కోసం 23.33 లక్షల మంది భవిష్యత్తును పణంగా పెట్టలేం. పటా్న, హజారీబాగ్ సెంటర్లలో మాత్రమే లీకేజీ అయినట్లు ప్రాథమిక సాక్ష్యాలను బట్టి తెలుస్తోంది. గుజరాత్‌లోని గోధ్రాలోనూ ఇది జరిగి ఉండొచ్చు. అయితే దేశవ్యాప్తంగా పేపర్ లీకేజీ అయిందనే బలమైన ఆధారాలు, సాక్ష్యాలు ఉంటేనే రీ టెస్ట్‌కు ఆదేశాలిస్తాం. అయినా పేపర్ లీకేజీకి, పరీక్ష ప్రారంభానికి మధ్య ఎంత సమయం ఉంది? ఎంత మందికి పేపర్ చేరవేశారు? అనేవి కీలక అంశాలపై స్పష్టత రావాలి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ 22వ తేదీకి వాయిదా వేసింది. -
నీట్ పేపర్ లీక్ కేసు: నలుగురు విద్యార్థులపై సీబీఐ విచారణ
పట్నా: నీట్ పేపర్ లీక్, నిర్వహణలో అవకతవకలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. తాజాగా గురువారం సీబీఐ అధికారులు నలుగురు పట్నా ఎయిమ్స్ విద్యార్థులను అదుపులోకి తీసుకుంది. పేపర్ లీక్‌కు సంబంధించి వారిని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పట్నా ఎయిమ్స్ డైరెక్టర్ బీజే పాల్ మీడియాతో మాట్లాడారు.‘సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్న నలుగురు విద్యార్థులు విచారణకు సహకరిస్తున్నారు. సీబీఐ విచారణ నుంచి విద్యార్థులు ఇంకా తిరిగి రాలేదు. సీబీఐ విచారణ చేస్తున్న విద్యార్థులు చందన్ సింగ్, రాహుల్ అనంత్, కుమార్ షాను, కరణ్. ముందుగా ఇన్స్టిట్యూట్కు సీబీఐ అధికారులు సమాచారం అందించి.. నలుగురు విధ్యార్థులను వారి హాస్టల్ నుంచి అదుపులోకి తీసుకున్నారు. నీట్ పేపర్ లీవ్ విషయంలో వారిని విచారణ చేసేందుకు సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు’ అని తెలిపారు.విచారణలో భాగంగా విద్యార్థుల రూంలను అధికారులు సీజ్ చేశారు. ఇన్స్టిట్యూట్ డైరెక్టర్,డీన్ సమక్షంలో సీబీఐ టీం విద్యార్థుల ఫోటోలు , మొబైల్స్‌ను స్వాధీనం చేసుకుంది. ఇక జూలై 17 పేపర్ లీక్ ప్రధాన నిందితుడు పంకజ్ త్రిపాఠి, అతని సహాయకుడు రాజు సింగ్‌ను సీబీఐ అధికారులు జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో అరెస్ట్ చేశారు. ఇటీవల పరీక్ష నిర్వహించిన ఎన్టీఏ ట్రంక్ పెట్టె నుంచి నీట్ పేపర్ దొంగిలిచిన ఇద్దరిని కూడా సీబీఐ అరెస్ట్ చేసింది.మరోవైపు.. ప్రధాన నిందితుడు పంకజ్ త్రిపాఠికీ సీబీఐ ప్రత్యేక కోర్టు.. 14రోజుల సీబీఐ కస్టడీ, అతని సహాయకుడు రాజు సింగ్‌కు 10 రోజుల కస్టడీని విధించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో సీబీఐ అధికారులు 14 మందిని అరెస్ట్ చేశారు. -
‘సెంటర్లవారీగా ఫలితాలు వెల్లడించండి’.. సుప్రీంకోర్టులో నీట్ విచారణ వాయిదా
న్యూఢిల్లీ, సాక్షి: నీట్ పేపర్ లీక్‌పై సుప్రీం కోర్టులో విచారణ సోమవారానికి(జులై 22కి) వాయిదా పడింది. ఇవాళ్టి విచారణ ముగించే ముందు.. సెంటర్ల వారీగా ఫలితాలు విడుదల చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఆదేశించింది. శనివారం మధ్యాహ్నాం కల్లా ఫలితాల్ని వెబ్సైట్లో ఉంచాలన్న ధర్మాసనం.. విద్యార్థుల పేర్లు మాత్రం బయటపెట్టకూడదని స్పష్టం చేసింది. అలాగే తదుపరి విచారణలో ఇరుపక్షాలు రాతపూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశించింది. ఇక ఇవాళ్టి విచారణ టైంలోనూ సీజేఐ త్రిసభ్య న్యాయమూర్తుల బెంచ్.. విస్తృత స్థాయిలో పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని గుర్తిస్తేనే రీటెస్ట్‌కు ఆదేశించగలమని మరోసారి స్పష్టం చేసింది. ‘‘సామాజిక పరిణామాల దృష్ట్యా నీట్ పరీక్షకు సంబంధించిన పిటిషన్ల విచారణకు మేం ప్రాముఖ్యత ఇస్తాం. ఈ వ్యవహారంలో కోర్టు నుంచి చివరకు ఎలాంటి తీర్పు వస్తుందోనని లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అలాగే పిటిషనర్లు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి మరింత సమాచారాన్ని అడిగారు. అలాగే.. మెడికల్ సీట్లు ఎన్ని ఉన్నాయి? పిటిషన్లు వేసిన విద్యార్థులు పొందిన కనీస మార్కులు ఎన్ని? అసలు ఎంతమంది విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు?అని న్యాయవాదుల్ని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు.‘‘పరీక్ష రాసిన 23 లక్షల మందిలో లక్ష మంది మాత్రమే వైద్య కళాశాలల్లో ప్రవేశం పొందుతారు. విస్తృతస్థాయిలో పేపర్ లీక్ జరిగిందని తేలితే.. రీ టెస్ట్ నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సీబీఐ విచారణ జరుగుతోంది. మాకు దర్యాప్తు సంస్థ వెల్లడించిన వివరాలు బయటపెడితే.. దర్యాప్తుపై ప్రభావం పడుతుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఏడాది మే 5వ తేదీన దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2024 పరీక్ష నిర్వహించారు. అయితే పరీక్ష పేపర్ లీక్ అవడంతో పాటు పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఫలితాల్లో ఏకంగా 67 మందికి జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు రావడంపైనా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. నీట్ అభ్యర్థుల్లో 1563 మందికి గ్రేస్ మార్కులు కలపడం, ఓఎంఆర్ షీట్లు అందకపోవడం, న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు సహా నీట్‌ను రద్దు చేయాలన్న డిమాండ్లతో సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక.. నీట్ ప్రశ్నపత్రం లీకైనమాట వాస్తవమని తేలడంతో ఇందులో అవకతవకలు జరిగాయనడంలో ఎటువంటి సందేహం లేదని సుప్రీంకోర్టు ఇటీవల పేర్కొన్న తెలిసిందే.ల -
నీట్ పేపర్ లీక్.. మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన సీబీఐ
దేశ వ్యాప్తంగా వివాదాన్ని రాజేసిన వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష ‘నీట్’ వ్యవహారంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. నీట్ యూజీ పేపర్ లీక్ స్కామ్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మంగళవారం ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది.పరీక్షకు ముందు నీట్ యూజీ ప్రశ్నపత్రాన్ని దొంగిలించి సర్క్యులేట్ చేస్తున్నారనే ఆరోపణలపై బిహార్‌లోని పాట్నాకు చెందిన పంకజ్ కుమార్, జార్ఖండ్‌లోని హజారీ బాగ్‌కు చెందిన రాజ్సింగ్ను అదుపులోకి తీసుకుంది. పంకజ్‌ను పాట్నాలో, రాజ్‌ను జంషెడ్‌పూర్‌లో పట్టుకున్నారు.అప్పటికే పేపర్ లీక్ మాఫియాలో హస్తమున్న పంకజ్ కుమార్.. బిహార్‌లోని హజారీబాగ్‌లోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ట్రంక్ నుంచి నీట్ యూజీ పేపర్‌ను దొంగిలించగా, ఇతనికి పేపర్‌ను సర్క్యూలేట్ చేయడంలో రాజ్ సింగ్ సాయం చేసినట్లు సీబీఐ పేర్కొంది. పంకజ్ కుమార్ అలియాస్ ఆదిత్య 2017లో ఎన్ఐటీ జంషెడ్‌పూర్‌లో సివిల్ ఇంజనీరింగ్ చేసినట్లు తేలింది.కాగా నీట్ పేపర్ లీక్ కేసుపై దర్యాప్తు చేస్తోన్న సీబీఐ ఇప్పటి వరకు 60 మందిని అరెస్ట్ చేసింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి రాకీ అలియాస్ రాకేష్ రంజన్‌తో సహా మరో 13 మంది నిందితులను జూలై 12న బీహార్‌లో కస్టడీలోకి తీసుకుంది.నీట్-యూజీ పేపర్ లీక్‌కు హజారీబాగే మూల ప్రదేశమని సీబీఐ గతంలోనే తెలిపింది. హజారీ బాగ్‌లోని ఒయాసిస్ పాఠశాలలో పేపర్ లీక్ అయిందని, అక్కడకు చేరిన రెండు సెట్ల పేపర్ల సీలు ఊడిపోయిందని, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకురాకుండా పాఠశాల సిబ్బంది మౌనం వహించారని సీబీఐ విచారణలో తేలింది. ఇదిలా ఉండగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించేదే నీట్-యూజీ పరీక్ష. ఈ ఏడాది మే 5న జరిగిన ఈ పరీక్షలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో వివాదం చెలరేగింది. బిహార్‌లో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పేపర్ లీకేజీకి సంబంధించినది కాగా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలో నమోదైనవి అభ్యర్థులను మోసగించిన వాటికి సంబంధించినవి -
నీట్ రీఎగ్జామ్ అనేది లాస్ట్ ఆప్షన్ మాత్రమే: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, సాక్షి: నీట్ యూజీ పరీక్షకు సంబంధించిన పేపర్ లీక్ అయ్యిందనేది స్పష్టమైందని, అయినప్పటికీ తిరిగి పరీక్ష నిర్వహించడం అనేది చివరి ఆప్షన్‌గానే ఉండాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. నీట్ పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలన్న పిటిషన్లపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నీట్ పేపర్ లీక్ అయ్యిందనేది స్పష్టమైంది. ఇది ఒప్పుకోవాల్సిన విషయం. కానీ, ఇక్కడ ప్రశ్న ఏంటంటే.. ఆ ప్రశ్నాపత్రం ఎంత మందికి చేరింది?. ఎంత మంది ఆ లీకేజీతో లాభపడ్డారు?. ఇప్పటివరకు ఎంత మందిని గుర్తించారు?. పేపర్ లీక్‌తో ఇంకా లాభపడ్డవాళ్లు ఎవరైనా ఉన్నారా?. ఈ కేసులో ఇంకా తప్పు చేసిన వాళ్లను గుర్తించాల్సి ఉందా?.. పేపర్ లీక్‌తో లాభపడిన విద్యార్థుల్ని ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎంత మంది ఫలితాల్ని హోల్డ్‌లో పెట్టారు?. వీటన్నింటిపై సమగ్ర దర్యాప్తు జరగాలి. ఆ నివేదిక మాకు సమర్పించాలి అని కేంద్రాన్ని, ఎన్టీఏని కోర్టు ఆదేశించింది. అలాగే పేపర్ లీక్‌లకు సంబంధించిన లోపాలను పసిగట్టేందుకు దేశవ్యాప్తంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? అని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ప్రధానంగా మూడు అంశాలపై ఎన్టీఏ నుంచి మాకు స్పష్టత కావాలిలీక్ ఎలా జరిగింది.. ఎక్కడకెక్కడ జరిగింది?పేపర్ లీక్‌కు, పరీక్షకు మధ్య ఎంత సమయం ఉందిపేపర్ లీకేజీ వ్యవహారంలో నిందితులను ట్రేస్ చేసేందుకు ఎన్టీఏ తీసుకున్న చర్యలేంటి?.. ఇది తమ పిల్లలు డాక్టర్లు, ఇంజినీరింగ్‌లు కావాలన్న మధ్యతరగతి కుటుంబాల కలకు సంబంధించిన వ్యవహారాన్ని మేం విచారణ జరుపుతున్నాం. సుమారు 23లక్షల మందితో జీవితాలతో ముడిపడిన అంశం ఇది. అందుకే నీట్ పరీక్ష పవిత్రతను దెబ్బతీశారని రుజువైనా లేదంటే నేరం చేసిన వారిని గుర్తించలేకపోయినా మేం నీట్ రీ-టెస్ట్‌కు ఆదేశిస్తాం. లీకైన ప్రశ్నపత్రం సోషల్‌మీడియాలో వ్యాప్తి చేశారని తెలిసినా మళ్లీ పరీక్ష నిర్వహించాలని చెబుతాం. కానీ, రీ-టెస్ట్‌కు ఆదేశించే ముందు.. లీకైన పేపర్ ఎంతమందికి చేరిందో తేలాల్సి ఉంది’’ అని ధర్మాసనం తెలిపింది. ఈ తరుణంలో విచారణను గురువారానికి వాయిదా వేస్తూ.. ఆరోజు పిటిషనర్ల వాదనలు వింటామని సుప్రీం ధర్మాసనం చెప్పింది. వాదనల సందర్భంగా.. ముందుగా కేంద్రం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి కొన్ని వివరాలను సీజేఐ బెంచ్ ఆరా తీసింది.. నీట్ పేపర్ సెట్ చేసిన తర్వాత ప్రింటింగ్ ప్రెస్ కు ఎలా పంపించారు ?: సీజేఐప్రింటింగ్ ప్రెస్ నుంచి పరీక్షా కేంద్రానికి ఎలా పంపారు ?: సీజేఐఏ తేదీలలో ఈ ప్రక్రియ జరిగింది ?: సీజేఐదీనికి అడిషనల్ సోలిసిటర్ జనరల్ సమాధానమిస్తూ.. ఒకే సెంటర్ లో పేపర్ లీక్ అయ్యిందన్నరు. అంటే నీట్ పేపర్ లీక్ అయ్యిందనేది స్పష్టం అయ్యింది: సీజేఐఈ అంశంపై జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది: సీజేఐ23 లక్షల మంది భవిష్యత్తును పరిరక్షించాల్సిందే: సీజేఐపరీక్ష మళ్లీ ఎందుకు నిర్వహించకూడదు?: కేంద్రంతో సీజేఐఅక్రమార్కులను గుర్తించకపోతే తిరిగి పరీక్ష నిర్వహించడం మినహా మరేదైనా మార్గం ఉందా ?: సీజేఐపేపర్ లీక్ పై ఆరు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి : పిటిషనర్లుఒకే సెంటర్ లో పేపర్ లీక్ అయ్యింది : ప్రభుత్వంపరీక్షకు మూడు గంటల ముందు పేపర్ లీక్ అయ్యింది: ఎన్టీఏ NEET-UG 2024 exam: Supreme Court observes that one thing is clear that leak (of question paper) has taken place. The question is, how widespread is the reach? The paper leak is an admitted fact. pic.twitter.com/qyfZQESMsx— ANI (@ANI) July 8, 2024నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకైందని, అవకతవకలు, అక్రమాలు జరిగాయని, పరీక్షను రద్దు చేయాలని సుప్రీం కోర్టులో గత నెల రోజుల వ్యవధిలో వేర్వేరు రోజుల్లో మొత్తం 38 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిని విచారణకు స్వీకరించిన కోర్టు.. ఆయా సందర్భాల్లో కేంద్రానికి, ఎన్టీఏకు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. ఆ పిటిషన్లను మొత్తంగా కలిపి ఇవాళ(జులై 8వ) విచారణ చేపట్టింది కోర్టు. సుప్రీం విచారణతోనే.. ఈ ఏడాది మే 5వ తేదీన దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2024 పరీక్ష నిర్వహించారు. అయితే పరీక్ష పేపర్ లీక్ అవడంతో పాటు పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఫలితాల్లో ఏకంగా 67 మందికి జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు రావడంపైనా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే సుప్రీం ఆదేశాల మేరకు ఇటీవల గ్రేస్ మార్కులు కలిపిన 1,563 మందికి మళ్లీ పరీక్ష నిర్వహించి సవరించిన నీట్ ర్యాంకుల జాబితాను ఎన్టీఏ విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం.. జులై6వ తేదీన కౌన్సెలింగ్ జరగాల్సి ఉంది. అయితే కౌన్సెలింగ్‌ను కోర్టు వాయిదా వేయకపోయినప్పటికీ.. నీట్ ఆందోళనల పరిణామాల నేపథ్యంలో ఎన్టీఏనే వాయిదా వేసింది. -
NEET-UG 2024: నీట్‌పై నేడు సుప్రీంలో విచారణ
న్యూఢిల్లీ: వివాదాస్పదంగా మారిన నీట్–యూజీ 2024 నిర్వహణపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో సోమవారం నుంచి విచారణ మొదలుకానుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం నీట్‌కు సంబంధించి దాఖలైన 38 పిటిషన్లపై వాదనలు విననుంది. అయితే, పరీక్షను రద్దు చేయడం సహేతుకం కాదని, పేపర్ లీకేజీ భారీపెద్ద ఎత్తున జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లేవని ఇప్పటికే సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. మే 5వ తేదీన జరిగిన ఈ పరీక్షలో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ విద్యార్థులు, రాజకీయ పార్టీలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. పేపర్ లీకేజీ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. -
నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా