పరీక్షా కేంద్రాలు, నగరాల వారీగా
నీట్–యూజీ ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నీట్–యూజీ ఫలితాలను పరీక్షా కేంద్రాలు, నగరాల వారీగా శనివారం విడుదల చేసింది. ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో తీసుకొచి్చంది. ఈ ఫలితాలను పరిశీలిస్తే విస్మయకరమైన అంశాలు బయటపడుతున్నాయి. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఒకే పరీక్షా కేంద్రంలో నీట్ రాసిన అభ్యర్థుల్లో ఏకంగా 85 శాతం మంది అర్హత సాధించినట్లు తెలుస్తోంది.
రాజ్‌కోట్‌లోని యూనిట్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ సెంటర్‌లో 22,701 మంది నీట్ రాశారు. వీరిలో 85 శాతం అర్హత సాధించారు. ఈ సెంటర్లో 12 మంది 700కు పైగా, 115 మంది 650కిపైగా, 259 మంది 600కు పైగా, 403 మంది 550కిపైగా స్కోర్ సాధించారు. అలాగే రాజస్తాన్‌లోని విద్యాభారతి శిఖర్ సెంటర్‌లో పరీక్ష రాసినవారిలో కూడా చాలామందికి మెరుగైన స్కోర్ లభించింది. అక్కడ 8 మంది 700కు పైగా, 69 మంది 650కిపైగా, 155 మంది 600కుపైగా, 241 మంది 500కు పైగా స్కోర్ సాధించారు.
హరియాణాలోని రోహ్‌తక్‌లో మోడల్ స్కూల్ సెంటర్‌లో పరీక్ష రాసిన వారిలో 45 మంది అభ్యర్థులకు 600కుపైగా స్కోర్ లభించింది. హరియాణాలోని ఝాజ్జర్‌లో హర్‌ద యాల్ పబ్లిక్ స్కూల్ సెంటర్‌లో ఇంతకముందు ఆరుగురు అభ్యర్థులకు 720కి 720 స్కోర్ దక్కింది. గ్రేసు మార్కులను తొలగించి, ఫలితాలను సవరించిన తర్వాత ఈ సెంటర్లో 13 మంది అభ్యర్థులు 600కుపైగా స్కోర్ సాధించారు. 682 స్కోర్ ఎవరికీ దాటలేదు.
నీట్ కేసులో మరో ముగ్గురి అరెస్టు
నీట్ పేపర్ లీక్ కేసులో సూత్రధారుల్లో ఒకరిగా భావిస్తున్న వ్యక్తిని సీబీఐ అధికారులు శనివారం అరెస్టు చేశారు. అతడిని ఎన్‌ఐటీ–జంòÙడ్‌పూర్ బీటెక్ గ్రాడ్యుయేట్ శశికాంత్ పాశ్వాన్ అలియాస్ శశిగా గుర్తించారు. అలాగే ఇదే కేసులో ఇద్దరు ఎంబీబీఎస్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పటిదాకా అరెస్టయిన వారి సంఖ్య 21కి చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment