NEET(UG) రీ-టెస్ట్‌ ఫలితాలు విడుదల | NTA Releases NEET UG Re Test 2024 June Results, Check Results Download Link Inside | Sakshi
Sakshi News home page

నీట్‌-యూజీ రీ టెస్ట్‌ ఫలితాలు విడుదల

Published Mon, Jul 1 2024 9:03 AM | Last Updated on Mon, Jul 1 2024 9:41 AM

NTA Releases NEET UG Re test 2024 June Result

ఢిల్లీ: నీట్‌ యూజీ రీ-టెస్ట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలతో పాటు రివైజ్డ్‌ స్కోర్‌ కార్డులను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రకటించింది.

నీట్‌ ఆందోళన నడుమ.. ఆపై సుప్రీంకోర్టు జోక్యంతో 1,563 మందికి గ్రేస్‌ మార్కుల్ని రద్దు చేసిన ఎన్టీఏ వాళ్లకు మళ్లీ పరీక్ష నిర్వహించింది. అయితే.. జూన్‌ 23వ తేదీన పరీక్ష నిర్వహించగా.. 813 మంది అభ్యర్థులు మాత్రం తిరిగి పరీక్ష రాశారు. 

వివాదాల నేపథ్యంలో ఈసారి ఫలితాల్ని పక్కాగా విడుదల చేసింది ఎన్టీఏ. పరీక్ష అనంతరం ఆన్సర్‌ కీ, ఓఎంఆర్‌ ఆన్షర్‌ షీట్లను పబ్లిక్‌ నోటీస్‌ ద్వారా అందుబాటులో ఉంచిన ఎన్టీఏ.. అభ్యర్థుల నుంచి అభ్యంతరాల్ని స్వీకరించింది. ఆ అభ్యంతరాలను నిపుణులు పరిశీలించిన అనంతరం.. తుది కీని విడుదల చేసింది. ఇప్పుడు ఆ అభ్యర్థుల ఫలితాల్ని వెబ్‌సైట్‌లో ఉంచింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement