ఇందుకోసం ముగ్గురు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయండి
మంగళవారం మధ్యాహ్నంకల్లా నివేదించండి
నీట్ ప్రశ్నపై ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్యవిద్యలో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్–యూజీ, 2024 పరీక్షలో పేపర్ లీకేజీ ఉదంతంపై పిటిషన్లను విచారిస్తున్న సుప్రీంకోర్టులో సోమవారం ఒక ప్రశ్నపై తీవ్రమైన చర్చ జరిగింది. ఒక ప్రశ్నకు ఇచి్చన ఆప్షన్లలో రెండు సరైన సమాధానాలు ఉన్నాయని, వీటిల్లో ఒకటి ఎంచుకున్న అభ్యర్థులకు మార్కులేసి రెండోది ఎంచుకున్న అభ్యర్థులకు మార్కులు వేయలేదని దీనిపై తేల్చాలని కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ కేసులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జసిŠట్‌స్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పారి్ధవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం సోమవారం విచారించింది. రెండింటిలో సరైన సమాధానం ఏది? అనే దానిపై స్పష్టత వస్తే అభ్యర్థుల తుది జాబితా మెరిట్ లిస్ట్‌లో మార్పులు చేసుకునే అవకాశం ఉంది. ఈ అంశంపై తొలుత పిటిషన్ల తరఫు న్యాయవాది వాదించారు. ‘‘ఈ ప్రశ్నకు సమాధానం రాసేందుకు ప్రయతి్నంచిన అభ్యర్థుల్ని మూడురకాలుగా విడగొట్టాలి.
ఎందుకంటే రెండు ‘సరైన’ సమాధానాల్లో ఒకదానికి ఎంచుకున్న వాళ్లకు నెగిటివ్ మార్కింగ్ కారణంగా ఐదు మార్కులు పోయాయి. రెండో సమాధానం ఎంచుకున్న వాళ్లకు నాలుగు మార్కులు పడ్డాయి. రెండింటిలో ఏది కరెక్టో తేల్చుకోలేక, నెగిటివ్ మార్కింగ్ వల్ల మార్కులు పోతాయన్న భయంతో సమాధానం రాయకుండా వదిలేసిన వాళ్లూ ఉన్నారు’’ అని న్యాయవాది వివరించారు. దీంతో ధర్మాసనం స్పందించింది.
‘‘ ఫిజిక్స్ విభాగంలో అణువుకు సంబంధించిన ప్రశ్నలో నాలుగు ఆప్షన్లలో రెండు సరైన సమాధానాలు ఉన్నాయన్న వాదనల నడుమ అసలైన సమాధానాన్ని తేల్చాల్సిన సమయమొచి్చంది. అందుకోసం ముగ్గురు విషయ నిపుణులతో కూడిన బృందాన్ని ఏర్పాటుచేయండి. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలలోపు మాకు సరైన సమాధానమేంటో నివేదించండి’’ అని ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్‌ను కోర్టు ఆదేశించింది.
తమ ఆదేశాలు ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్‌కు చేరేలా చూడాలని సుప్రీంకోర్టులో సెక్రటరీ జనరల్‌కు ధర్మాసనం సూచించింది. ‘పరీక్ష నిర్వహణలో లోపాలు చూస్తుంటే ఇది వ్యవస్థాగత వైఫల్యమని తెలుస్తోంది. గుజరాత్‌లో ఒక విద్యార్థి 12వ తరగతిలో ఫెయిల్ అయ్యాడుగానీ నీట్ పరీక్షలో చాలా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. కొన్ని కేంద్రాల్లో అడ్రస్ వెరిఫికేషన్ చేయలేదు. మరి కొన్నింటిలో సీసీటీవీ కెమెరాలే లేవు’ అని లాయర్ నరేందర్ హూడా వాదించారు.
కొలిక్కి వస్తున్న నీట్–యూజీ వివాదం!
నీట్ యూజీ పరీక్షను రద్దుచేసి మళ్లీ నిర్వహించాలని దాదాపు 40 పిటిషన్లు దాఖలైన విషయం తెల్సిందే. పరీక్ష రద్దు చేయాలంటూ, రద్దు చేయొద్దంటూ దాఖలు చేసిన వారి వాదనలు సుప్రీంకోర్టులో పూర్తయ్యాయి. ఇక కేంద్రం తరఫు వాదనలు మిగిలి ఉన్నాయి. మంగళవారం కేంద్రం వాదనలు పూర్తయితే త్వరగా తీర్పు వెలువరించే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment