
సాక్షి,న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా నీట్ యూజీ-2024 పేపర్ లీకేజీలో మరో కీలక మలుపు తిరిగింది. నీట్ పరీక్షల్లో అవకతవకలు జరగడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది విద్యార్థులకు తిరిగి ఆదివారం నీట్ పరీక్ష నిర్వహించింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నీట్ యూజీ -2024 రీటెస్ట్ నిర్వహించింది. వారిలో 48 శాతం మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారని ఎన్టీఏ తెలిపింది. 1563 మంది విద్యార్థుల్లో 813 మంది (52 శాతం) పరీక్షకు హాజరైతే, 750 మంది (48 శాతం) గైర్హాజరయ్యారని ఎన్టీఏ ఓ ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment