రాంచీ: నీట్ యూజీ-2024 పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ, అవకతవకలే దేశంవ్యాప్తంగా దుమారం రేపుతోంది. నీట్ పరీక్షను రద్దు చేయాలని విక్షాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
మరోవైపు.. ప్రశ్న లీకేజీ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. సీబీఐ తాజాగా శనివారం ప్రశ్నపత్రం లీకేజీతో సంబంధాలు ఉన్నాయని జార్ఖండ్‌లోని హజారీబాగ్‌కు చెందిన ఓ జర్నలిస్ట్‌ను అరెస్ట్ చేసింది.
ఓ హింది న్యూస్ పేపర్‌లో పనిచేసే.. జమాలుద్దీన్ అనే జర్నలిస్ట్ పేపర్ లీకేజీలో ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్‌కు సాయం చేసినట్లు అభియోగాలతో సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఇప్పటికే ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపల్ ఎహసానుల్ హక్, వైస్ ప్రిన్సిపల్ ఇంతియాజ్ ఆలంకు శుక్రవారం సీబీఐ అరెస్ట్ చేసింది.
అదేవిధంగా గుజరాత్‌లోని 7 వేర్వేరు ప్రాంతాల్లో సీబీఐ బృందాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. గోద్రా, ఖేడా, అహ్మాదాబాద్, అనంద్ సోదాలు నిర్వహించింది. ఈకేసులో ఎఫ్‌ఐఆర్ ఆధారంగా గోద్రా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ తొలిసారిగా ఇద్దరు నిందితులను పట్నాలో అరెస్టు చేసింది. నిందితులను మనీశ్ కుమార్, ఆశుతోష్‌గా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment