ఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 13మంది నిందితులపై సీబీఐ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. నితీష్ కుమార్, అమిత్ ఆనంద్, సికిందర్ యాద్వెందు, అశుతోష్ కుమార్-1, రోషన్ కుమార్, మనీష్ ప్రకాష్, అశుతోష్ కుమార్-2, అఖిలేష్ కుమార్, అవదేశ్ కుమార్, అనురాగ్ యాదవ్, అభిషేక్ కుమార్, శివానందన్ కుమార్, ఆయుష్ రాజ్ వంటి నిందితుల పేర్లను చార్జిషీట్‌లో జత చేసింది.
నీట్ పేపర్ లీకేజీ కేసులో దర్యాప్తు చేసిన సీబీఐ ఇప్పటి వరకు 40 మందిని అరెస్టు చేసింది. ఇందులో 15 మందిని బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. ఇక నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి సీబీఐ అధికారులు 58 ప్రాంతాల్లో దర్యాప్తు సోదాలు నిర్వహించారు.
CBI FILES FIRST CHARGESHEET IN THE NEET PAPER LEAK CASE pic.twitter.com/JIg8YG1CSi
— Central Bureau of Investigation (India) (@CBIHeadquarters) August 1, 2024
Comments
Please login to add a commentAdd a comment