వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నేషనల్ కమ్-ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్)-యుజీ పేపర్ లీక్ కేసు వ్యవహారం ఇంకా చల్లారడం లేదు. నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలు, అవకవకలపై అటు సుప్రీంకోర్టు విచారణ, ఇటు సీబీఐ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది.
తాజాగా నీట్ వ్యవహారంలో కేంద్ర దర్యప్తు సంస్థ సీబీఐ మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసింది. పేపర్ లీక్ కేసులో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు ఎంబీబీఎస్ విద్యార్థులను సీబీఐ శనివారం అదుపులోకి తీసుకుంది. అరెస్టయిన ఇద్దరు నిందితులను భరత్‌పూర్ మెడికల్ కాలేజీ విద్యార్థులు కుమార్ మంగళం బిష్ణోయ్,దీపేందర్ కుమార్‌లుగా గుర్తించారు.
నీట్ యూజీ పరీక్ష రోజు హజారీబాగ్‌లో రెండవ సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థి బిష్ణోయ్, మొదటి సంవత్సరం వైద్య విద్యార్థి శర్మ ఉన్నట్లు సాంకేతిక నిఘా నిర్ధారించినట్లు అధికారులు తెలిపారు. వీరిద్దరూ తంలో అరెస్టయిన ఇంజనీర్ పంకజ్ కుమార్ దొంగిలించిన పేపర్‌కు ‘పరిష్కారకర్తలుగా’ వ్యవహరిస్తున్నారని తేలిందని పేర్కొన్నారు.
కాగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జంషెడ్‌పూర్‌కు (జార్ఖండ్)చెందిన 2017-బ్యాచ్ సివిల్ ఇంజనీర్ పంకజ్ కుమార్ అలియాస్ ఆదిత్య.. హజారీబాగ్‌లోని ఎన్టీయే ట్రంక్ నుండి నీట్ పేపర్‌ను దొంగిలించాడన్న ఆరోపణలతో సీబీఐ అధికారులు ఇటీవల అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment