ఎంబీబీఎస్‌లో ఏ ర్యాంక్‌కు ఎక్కడ సీటొస్తుంది? | NTA declared NEET UG 2024 results | Sakshi
Sakshi News home page

ఎంబీబీఎస్‌లో ఏ ర్యాంక్‌కు ఎక్కడ సీటొస్తుంది?

Published Thu, Jun 6 2024 4:12 AM | Last Updated on Thu, Jun 6 2024 1:11 PM

NTA declared NEET UG 2024 results

నీట్‌ యూజీ 2024 ఫలితాలు వెల్లడించిన ఎన్టీఏ

గత ఏడాదితో పోలిస్తే ఈ సారి 1.70 లక్షల మేర పెరిగిన అర్హుల సంఖ్య 

రాష్ట్రంలో 11 ప్రభుత్వ, 16 ప్రైవేటు, 2 మైనారిటీ, పద్మావతి మహిళా వైద్య కళాశాలలు 

ప్రభుత్వ కళాశాలల్లో మొత్తం సీట్లు 2,935 

ఆలిండియా కోటా 15 శాతం పోను మిగిలినవి భర్తీ

సాక్షి, అమరావతి: 2024–25 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య విద్య యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌ యూజీ–2024 ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఏడాది జాతీయ స్థాయిలో 23.33 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయగా 13.16 లక్షల మంది అర్హత సాధించారు. గత ఏడాదితో పోలిస్తే అర్హులైన విద్యార్థుల సంఖ్య 1.70 లక్షలు పెరిగింది. రాష్ట్రంలో 64,931 మంది పరీక్ష రాయగా, 43,858 మంది అర్హత సాధించారు. కాగా, జాతీయ స్థాయిలో వచ్చిన ర్యాంక్‌ ఆధారంగా రాష్ట్ర స్థాయిలో ఏ ర్యాంక్‌  వస్తుంది? గత ఏడాది ఏ ర్యాంకుకు ఏ కళాశాలలో సీటు వచ్చిందో పోల్చుకొని, ఈసారి ఏ కళాశాలలో సీటు వచ్చే అవకాశాలున్నాయో విద్యార్థులు అంచనా వేసుకుంటున్నారు. 

ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌కు కళాశాలల ప్రాధాన్యతక్రమం ఏ విధంగా ఉండాలో కసరత్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11 ప్రభుత్వ, 16 ప్రైవేటు, రెండు మైనారిటీ, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఉన్నాయి. వీటిలో 5,360 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. ఇందులో 2,935 సీట్లు 16 ప్రభుత్వ వైద్య కళాశాలలకు సంబంధించినవి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15 శాతం సీట్లు ఆల్‌ ఇండియా కోటా కింద భర్తీ చేస్తారు. మిగిలినవి రాష్ట్ర కోటాలో భర్తీ చేస్తారు. మరోవైపు బీ కేటగిరిలో 85 శాతం సీట్లలో మన విద్యార్థులకే అవకాశం కల్పిస్తోంది. 

అందరి చాయిస్‌ ఆంధ్ర కళాశాల 
రాష్ట్రంలో వైద్య విద్య అభ్యసించే విద్యార్థుల మొదటి చాయిస్‌ ఆంధ్ర వైద్య కళాశాలే. ఈ కళాశాలలో సీటు రావడమే అదృష్టంగా భావిస్తారు. ఈ కళాశాలలో గత ఏడాది ఎస్టీ విభాగంలో 490 స్కోర్‌తో 118377 ర్యాంక్‌ సాధించిన విద్యారి్థకి చివరి సీటు వచ్చింది. ఎస్సీ విభాగంలో 545తో 67614 ర్యాంక్, బీసీ–ఏలో 596తో 31456, బీసీ–బి 612తో 22315, బీసీ–సిలో 591తో 34134, బీసీ–ఈలో 548తో 24384, ఓసీ కేటగిరీలో 621తో 17976, ఈడబ్ల్యూఎస్‌లో 608తో 24384 ర్యాంకు వరకు సీట్లు పొందారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement