నీట్‌ యూజీ-2024 తొలి రౌండ్‌ కౌన్సెలింగ్‌ ఫలితాలు విడుదల | NEET UG counselling 2024 round 1 seat allotment declared on August 25, 2024 | Sakshi
Sakshi News home page

నీట్‌ యూజీ-2024 తొలి రౌండ్‌ కౌన్సెలింగ్‌ ఫలితాలు విడుదల

Published Sun, Aug 25 2024 6:15 PM | Last Updated on Sun, Aug 25 2024 7:39 PM

NEET UG counselling 2024 round 1 seat allotment declared on August 25, 2024

నీట్‌ యూజీ-2024 తొలి రౌండ్‌ కౌన్సెలింగ్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్ని మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ(ఎంసీసీ) విడుదల చేసింది. కాగా, నీట్ యూజీ కౌన్సెలింగ్ తొలి రౌండ్‌ ఆగస్ట్‌ 14 నుంచి రాష్ట్రాల వారీగా ప్రారంభమైంది.  

ఎంసీసీ సమాచారం మేరకు.. నీట్‌ యూజీ-2024 కౌన్సెలింగ్‌ నాలుగుసార్లు జరగనుంది. తాజాగా తొలిరౌండ్‌ కౌన్సెలింగ్‌ పూర్తయింది. అందులో ర్యాంక్‌, ప్రాధాన్యతలు, అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా అభ్యర్ధులకు ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్లను కేటాయించినట్లు ఎంసీసీ వెల్లడించింది. ఈ కౌన్సెలింగ్‌లో మొత్తం 26,109 మంది విద్యార్ధులకు సీట్లను కేటాయించింది.

మొత్తం టాప్‌ 17 ర్యాంకులు సాధించిన విద్యార్ధులు ఎయిమ్స్‌ ఢిల్లీలో ఎంబీబీఎస్‌ సీట్లను సంపాదించారు. ఈ సందర్భంగా అర్హులైన విద్యార్ధులు ప్రొవిజినల్‌ అలాట్‌మెంట్‌ లెటర్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఎంసీసీ వెల్లడించింది.

ఎంసీసీ ప్రకారం, రెండవ రౌండ్ కౌన్సెలింగ్ కోసం అవసరమయ్యే వైకల్య ధ్రువీకరణ పత్రాలు(పీడబ్ల్యూడీ) అవసరమయ్యే అభ్యర్థులు సెప్టెంబర్ 9, 2024 సాయంత్రం 5 గంటల లోపు సంబందిత కేంద్రాల నుంచి పొందాలని తెలిపింది. ఇతర వివరాల కోసం ఎంసీసీ కాల్‌ సెంటర్‌కు కాల్‌ చేసి తెలుసుకోవాలని, జన్మాష్టమి కారణంగా, ఎంసీసీ కాల్ సెంటర్ (సోమవారం)ఆగస్టు 26, 2024న ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు పని చేస్తుందని ఎంసీసీ ప్రతినిధులు వెల్లడించారు.

అభ్యర్థులు తమకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్ చేయడానికి గడువు ఆగస్ట్‌ 29 వరకు ఇచ్చింది. ఆ తర్వాత మెడికల్ కాలేజీలు ఈ అభ్యర్థుల అడ్మిషన్ డేటాను వెరిఫై చేస్తాయి. ఇవి ఆగస్టు 30,31 మధ్య ఎంసీసీకి సమర్పిస్తాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement