NEET UG Exam 2023: What Students Can Take To Exam Centre - Sakshi
Sakshi News home page

NEET UG 2023: నేడే నీట్ ఎగ్జామ్‌.. ఈ రూల్స్‌ తప్పక పాటించాల్సిందే!

Published Sat, May 6 2023 6:51 PM | Last Updated on Sun, May 7 2023 9:43 AM

NEET UG Exam 2023: What Students Can Take To Exam Centre - Sakshi

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ యూజీ (NEET UG 2023) పరీక్ష ఈరోజు(ఆదివారం) నిర్వ‌హించ‌నున్నారు. పెన్ను, పేపర్‌ విధానంలో దేశవ్యాప్తంగా 499 నగరాలు/పట్టణాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జ‌రుగుతుంది. తెలుగుతో పాటు 13 భాషల్లో జరిగే ఈ పరీక్షకు దాదాపు 18 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరుకానున్నారు.

ప‌రీక్ష రాసే విద్యార్థులు ప‌రీక్ష స‌మ‌యం కంటే గంట ముందుగా చేరుకుంటే మంచింది. ప‌రీక్ష కేంద్రాన్ని చెక్ చేసుకోవాలి. కొన్ని న‌గ‌రాల్లో ఒకటే పేరు మీద పీజీ, యూజీ కాలేజీలు ఉంటాయి. కాబ‌ట్టి ప‌రీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకుంటే మంచింది. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు ఉంటుంది.

మధ్యాహ్నం 1.15 గంటల వరకు విద్యార్థులు తమ హాల్ టికెట్స్ ఆధారంగా.. ఏ గదిలో మీ సీట్ ఎలాట్ చేశారో చూసుకోవాలి. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత హాల్‌లోకి ఎవరినీ అనుమతించరు. 1.45 గంటలకు ప్రశ్నపత్రం బుక్‌లెట్ ఇస్తారు. మధ్యాహ్నం 1.50 నుంచి 2 గంటల వరకు అభ్యర్థులు తమకు అవసరమైన వివరాలను బుక్‌లెట్‌లో నింపాల్సి ఉంటుంది. 2 గంటలకు పేపర్ ఇస్తారు. 
చదవండి: భార్యకు విడాకులు ఇచ్చిన ఆనందంలో బంగీ జంప్‌.. చివరికి!

► పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అడ్మిట్‌ కార్డుతో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డు, పాస్‌పోర్టు సైజు ఫొటోను తీసుకెళ్లాలి. ఫొటోను అటెండెన్స్‌ షీట్‌పై అతికించాలి. 

► అభ్యర్థులు డ్రెస్‌ కోడ్ తప్పనిసరిగా పాటించాలి. పొడవు చేతులున్న డ్రెస్సులు, షూలు, నగలు, మెటల్‌ వస్తువులను లోనికి అనుమతించరు.

► స్లిప్పర్లు, తక్కువ ఎత్తున్న శాండిల్స్‌ మాత్రమే వేసుకోవాలి.

► పేపర్లు, జామెట్రీ/పెన్సిల్‌ బాక్సులు, ప్లాస్టిక్‌ పౌచ్‌లు, కాలిక్యులేటర్లు, స్కేళ్లు, రైటింగ్‌ ప్యాడ్స్‌, పెన్‌డ్రైవ్స్‌, ఎలక్ట్రానిక్‌ పెన్నులు వంటి వాటిని పరీక్ష కేంద్రానికి అనుతించరు.

► చేతికి వాచ్‌లు, వాలెట్లు, హ్యాండ్‌బ్యాగ్‌లు, బెల్ట్‌లు, టోపీలు వంటివి ధరించకూడదు.

► మొబైల్‌ ఫోన్లు, బ్లూటూత్‌, ఇయర్‌ఫోన్లు, పేజర్స్‌, హెల్త్‌ బ్యాండ్స్‌, స్మార్ట్‌ వాచ్‌లు వంటి కమ్యూనికేషన్‌ డివైజ్‌లను లోనికి అనుమతించరు. ఎలక్ట్రానిక్‌ వస్తువులను తీసుకెళ్లకూడదు.

► అభ్యర్థులు పరీక్ష రాసేందుకు అవ‌స‌ర‌మైన‌ బాల్‌ పాయింట్‌ పెన్నును పరీక్ష గదిలోనే ఇస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement