National Eligibility Entrance Test (NEET)
-
‘నీట్’ నుంచి మినహాయించేదాకా ఉద్యమిస్తాం
చెన్నై: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్) నుంచి తమిళనాడును మినహాయించేదాకా తమ ఉద్యమం ఆగదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తేల్చిచెప్పారు. ‘నీట్’ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అధికార డీఎంకే నేతృత్వంలో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలను, ఆందోళనలు నిర్వహించారు. నిరాహార దీక్షలు సైత చేపట్టారు. నీట్ రద్దు అనేది రాజకీయపరమైన డిమాండ్ కాదని, అందిరికీ సమాన అవకాశాలు లభించాలన్నదే తమ ఉద్దేశమని స్టాలిన్ చెప్పారు. ఈ పరీక్ష నుంచి తమిళనాడు మినహాయించేలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని వెల్లడించారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటి ఎదుట ధర్నా చేస్తామని పేర్కొన్నారు. ఈ ధర్నాలో పాల్గొనాలని విపక్ష ఏఐఏడీఎంకేకు స్టాలిన్ సూచించారు. అయితే, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే నీట్‌ను తీసుకొచ్చానని ఏఐఏడీఎంకే నేత, మాజీ సీఎం పళనిస్వామి గుర్తుచేశారు. -
NEET UG 2023: నేడే నీట్ ఎగ్జామ్.. ఈ రూల్స్ తప్పక పాటించాల్సిందే!
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ (NEET UG 2023) పరీక్ష ఈరోజు(ఆదివారం) నిర్వహించనున్నారు. పెన్ను, పేపర్ విధానంలో దేశవ్యాప్తంగా 499 నగరాలు/పట్టణాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. తెలుగుతో పాటు 13 భాషల్లో జరిగే ఈ పరీక్షకు దాదాపు 18 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్ష రాసే విద్యార్థులు పరీక్ష సమయం కంటే గంట ముందుగా చేరుకుంటే మంచింది. పరీక్ష కేంద్రాన్ని చెక్ చేసుకోవాలి. కొన్ని నగరాల్లో ఒకటే పేరు మీద పీజీ, యూజీ కాలేజీలు ఉంటాయి. కాబట్టి పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకుంటే మంచింది. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు ఉంటుంది. మధ్యాహ్నం 1.15 గంటల వరకు విద్యార్థులు తమ హాల్ టికెట్స్ ఆధారంగా.. ఏ గదిలో మీ సీట్ ఎలాట్ చేశారో చూసుకోవాలి. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత హాల్లోకి ఎవరినీ అనుమతించరు. 1.45 గంటలకు ప్రశ్నపత్రం బుక్లెట్ ఇస్తారు. మధ్యాహ్నం 1.50 నుంచి 2 గంటల వరకు అభ్యర్థులు తమకు అవసరమైన వివరాలను బుక్‌లెట్‌లో నింపాల్సి ఉంటుంది. 2 గంటలకు పేపర్ ఇస్తారు. చదవండి: భార్యకు విడాకులు ఇచ్చిన ఆనందంలో బంగీ జంప్.. చివరికి! ► పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డు, పాస్‌పోర్టు సైజు ఫొటోను తీసుకెళ్లాలి. ఫొటోను అటెండెన్స్ షీట్‌పై అతికించాలి. ► అభ్యర్థులు డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలి. పొడవు చేతులున్న డ్రెస్సులు, షూలు, నగలు, మెటల్ వస్తువులను లోనికి అనుమతించరు. ► స్లిప్పర్లు, తక్కువ ఎత్తున్న శాండిల్స్ మాత్రమే వేసుకోవాలి. ► పేపర్లు, జామెట్రీ/పెన్సిల్ బాక్సులు, ప్లాస్టిక్ పౌచ్‌లు, కాలిక్యులేటర్లు, స్కేళ్లు, రైటింగ్ ప్యాడ్స్, పెన్‌డ్రైవ్స్, ఎలక్ట్రానిక్ పెన్నులు వంటి వాటిని పరీక్ష కేంద్రానికి అనుతించరు. ► చేతికి వాచ్‌లు, వాలెట్లు, హ్యాండ్‌బ్యాగ్‌లు, బెల్ట్‌లు, టోపీలు వంటివి ధరించకూడదు. ► మొబైల్ ఫోన్లు, బ్లూటూత్, ఇయర్ఫోన్లు, పేజర్స్, హెల్త్ బ్యాండ్స్, స్మార్ట్ వాచ్‌లు వంటి కమ్యూనికేషన్ డివైజ్‌లను లోనికి అనుమతించరు. ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకెళ్లకూడదు. ► అభ్యర్థులు పరీక్ష రాసేందుకు అవసరమైన బాల్ పాయింట్ పెన్నును పరీక్ష గదిలోనే ఇస్తారు. -
Kerala NEET Controversy: బలవంతంగా లోదుస్తులు విప్పించారు
తిరువనంతపురం: నీట్ పరీక్ష కోసం వెళ్లిన ఓ అభ్యర్థి చేదు అనుభవం.. ఆమె తండ్రి ఫిర్యాదుతో ఆ ఘటన దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఒకవైపు నీట్ నిర్వాహణ సంస్థ ‘నేషనల్ టెస్ట్ ఏజెన్సీ’ ఈ ఘటనను తోసిపుచ్చింది. విద్యార్థిని తండ్రి Gopakumar Sooranad ఆరోపణలను అసత్యప్రచారంగా కొట్టిపడేసింది. అయితే మంగళవారం మరో రెండు ఫిర్యాదులు అందడంతో.. నిజనిర్ధారణ కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించడంతో వ్యవహారం మరింత ముదిరినట్లయ్యింది. ఇదిలా ఉండగా.. బాధితురాలు ఆరోజు ఏం జరిగిందో చెబుతూ కన్నీటి పర్యంతమైంది. అదొక చేదు అనుభవంగా చెప్పిన పదిహేడేళ్ల యువతి.. నీట్ సెంటర్ దగ్గర బలవంతంగా తమతో లోదుస్తులు విప్పించారని తెలిపింది. ‘స్కానింగ్ జరిగే దగ్గర కొందరు సిబ్బంది ఉన్నారు. అక్కడికి రమ్మని నాకు సైగ చేశారు. అక్కడ రెండు లైన్లలో అభ్యర్థులు నిల్చుని ఉన్నారు. నన్ను స్కాన్ చేశాక.. లోపలికి పంపిస్తారు అనుకున్నా. కానీ, ‘మెటల్ ఉన్న ఇన్నర్‌వేర్ వేస్కున్నావా?’ అని అడిగారు. ‘అవును’ అని సమాధానం ఇచ్చా. వెంటనే పక్కనే ఉన్న ఓ లైన్లో నిల్చొమన్నారు. అప్పుడు అర్థమైంది ఆ లైన్లో ఉన్నవాళ్లంతా మెటల్ హుక్ బ్రాలు ధరించిన వాళ్లేనని... ఆ తర్వాత ఆ క్యూలో ఉన్న అందరినీ పక్కకు పిలిచి బ్రాలు తొలగించి.. టేబుల్ మీద పెట్టమన్నారు సిబ్బంది. పరీక్ష రాయడానికి బ్రాలు ఉండాల్సిన అవసరం లేదని, లేకుంటే లోపలికి పంపించమని అనడంతో మా అందరికీ సిగ్గుగా అనిపించింది. ఒక చీకటి గదిలోకి వెళ్లి అమ్మాయిలమంతా చెప్పినట్లు చేశాం. అదొక భయానక అనుభవం. గదిలో వెలుతురు లేదు.. లైట్ లేదు. అమ్మాయిలు.. అబ్బాయిలు అంతా ఒకే హాలులో పరీక్ష రాయాల్సి ఉంది. సిగ్గుగా, ఇబ్బందిగా అనిపించి.. చాలామంది శాలువాలు, స్కార్ఫ్‌లు వేసుకుంటామని అడిగాం. కుదరదన్నారు. చేసేది లేక.. జుట్టును ముందుకు వేసుకుని పరీక్ష రాశాం. చాలామంది అవమానంగా, భయంభయంగా పరీక్ష రాశారు. నాతో సహా చాలామంది కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓ ఇన్విజిలేటర్ సెక్యూరిటీతో వచ్చి.. ఎందుకు ఏడ్వడం అంటూ గట్టిగా గద్దించారు. పరీక్ష అయ్యాక బ్రాలను కుప్పలుగా పడేశారు. వెతుక్కోవడానికి చాలామంది అవస్థలు పడ్డారు. ఇలాంటి అనుభవం ఏ అమ్మాయికి రాకూడదు అంటూ ఏడుస్తూ.. చెప్పుకొచ్చింది యువతి. ముక్తకంఠంతో ఖండన కేరళ కొల్లాంలో నీట్ పరీక్షకు హాజరైన అమ్మాయిల లోదుస్తులు తొలగించిన ఘటనపై జాతీయ మహిళా సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన సిగ్గు చేటని, అమ్మాయిల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే అంశమని ప్రకటించింది. మూడు ఫిర్యాదులు నమోదు కావడంతో.. మళ్లీ తాజా దర్యాప్తును చేపట్టాలని కేరళ పోలీసులను విద్యాశాఖ మంత్రి డాక్టర్ బిందు ఆదేశించారు. మరోవైపు మానవ హక్కుల సంఘం సైతం ఘటనపై విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని కేరళ పోలీసులను ఆదేశించింది. నేషనల్ టెస్ట్ ఏజెన్సీ నిజనిర్ధారణ కమిటీ రెండు మూడు రోజుల్లో ఘటనపై దర్యాప్తు ప్రారంభించనుంది. రేఖా శర్మ లేఖ కేరళలో ఆదివారం ఓ నీట్ పరీక్ష కేంద్రంలో 17 ఏళ్ల అమ్మాయిని నిర్వాహకులు లో దుస్తులు విప్పించారన్న వార్తలపై జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖా శర్మ తీవ్రంగా ఆగ్రహించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)కు లేఖ రాశారు. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్) కూడా దీన్ని తీవ్రంగా తప్పుబట్టింది. బాధితుల వాంగ్మూలాలు నమోదు చేసి విచారణ జరపాలని కలెక్టర్‌ను ఆదేశించింది. దీంతో ముగ్గురు ఏజెన్సీ వ్యక్తులను, ఇద్దరు విద్యాసంస్థ సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు, నీట్ పరీక్షలో అభ్యర్థికి బదులు వేరొకరు పరీక్ష రాసేందుకు రూ.20 లక్షల చొప్పున ఒప్పందాలు జరిగాయని సీబీఐ విచారణలో తేలింది. చదవండి: నీట్ పరీక్షకు ‘బ్రా’ వేసుకోకూడదా?.. గైడ్‌లైన్స్‌లో ఏముందంటే.. -
NEET Dress Code Controversy: ఇదంత ‘నీట్’ కాదేమో!?
మొదలైన ముహూర్తబలమో ఏమో కానీ, కొన్ని నిత్యం వివాదాస్పదమే. దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం కేంద్రం కొన్నేళ్ళ క్రితం ఆరంభించిన ‘జాతీయ ఉమ్మడి అర్హత – ప్రవేశ పరీక్ష’ (నీట్) అందుకు ఓ ఉదాహరణ. తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కొంతకాలంగా ఉన్న ‘నీట్’ వ్యతిరేకత చాలదన్నట్టు, ఆదివారం నాటి పరీక్ష వివాదాల్లో మరో మెట్టు పైకెక్కింది. ఆడవారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడానికి వేదికైంది. కేరళలోని ఓ పరీక్షా కేంద్రంలో విద్యార్థినులతో ‘బ్రాసరీలు’ విప్పించి, ఆ తర్వాతే పరీక్ష రాయడానికి అనుమతించిన ఘటన అత్యంత హేయమైనది. ‘నీట్’ సహా అనేక పరీక్షల్లో ఆడపిల్లల్ని వేధించడానికి అనువుగా మారిన అర్థరహిత ‘దుస్తుల నిబంధ నల’పై చర్చ జరగాల్సిన అవసరాన్ని ఇది గుర్తు చేస్తోంది. ఒక్క మార్కుతో జాతకాలే మారే చోట మాస్ రిగ్గింగ్‌తో ‘నీట్’ ప్రయోజనమే ప్రశ్నార్థకమవుతోంది. ‘నీట్–2022’కు దేశవ్యాప్తంగా 18 లక్షల మందికి పైగా విద్యార్థులు నమోదు చేసుకున్నారు. జూలై 17న 497 పట్నాల్లో 3,570 కేంద్రాల్లో ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ (ఎన్టీఏ) పరీక్ష నిర్వహిం చింది. త్వరలోనే ఫలితాలు విడుదల చేయాలి. తీరా పరీక్షలో అక్రమాల నేపథ్యంలో మళ్ళీ పరీక్ష పెట్టాలనే వాదన వినిపిస్తోంది. ఇన్నేళ్ళయినా నిక్కచ్చిగా ఒక పరీక్ష పెట్టలేకపోవడం సర్కారీ చేతకానితనమే. కరోనా వల్ల తరగతులే సరిగా జరగలేదంటూ, పరీక్ష వాయిదా కోరుతూ విద్యా ర్థులు వీధికెక్కినా, వారి గోడు విన్నవారు లేరు. ఇప్పుడేమో హిందీ మాధ్యమ అభ్యర్థులకు ఆంగ్ల ప్రశ్నపత్రాల పంపిణీ, ఆడవారి ఆత్మ గౌరవాన్ని హరించే ‘డ్రెస్ కోడ్’ లాంటివి మరింత తల వంపులు తెచ్చాయి. కనీసం అభ్యర్థి రాసే మీడియమ్‌లోని పేపరైనా ఇవ్వలేకపోతే, మార్కుల నష్టానికి పూచీ ఎవరు? రాష్ట్రాల స్థానిక ప్రవేశపరీక్షలతో పోలిస్తే, ‘నీట్’ లోపరహితమనీ, వైద్యవిద్యలో ప్రవేశాలు పారదర్శకంగా సాగుతాయనీ కేంద్ర వర్గాల మాట. పరీక్షలో ప్రమాణాలు పెంచడం ఓకే కానీ, నిర్వహణలో లోపాలే విద్యార్థులకు శాపాలు. తాజా ‘నీట్’లో మాస్‌రిగ్గింగ్‌కు తెర తీసిన 8 మంది నిందితులను సీబీఐ అరెస్టు చేయడం అందుకు మచ్చుతునక. పరీక్ష రాయాల్సిన అసలు అభ్యర్థుల స్థానంలో వేరొకరెళ్ళి రాస్తున్నారంటే ‘నీట్’లో అక్రమాలకు ఆస్కారమే లేదని ఎలా అంటాం? పైగా, ఢిల్లీ, హరియాణా ల్లోని పలు కేంద్రాల్లో ఇదే తంతు! పరీక్ష మర్నాడు పుంజీడు మంది పట్టుబడ్డా, దొరకని దొంగలు ఎందరున్నారో ఎవరు చెప్పగలరు? రాజస్థాన్‌లో ఓ చోట నిర్ణీత గడువు ముగిసిన తర్వాతా పరీక్ష కొనసాగుతూనే ఉంది. సాక్షాత్తూ ఓ ఎంపీ ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. కొన్నిచోట్లయితే... బయో మెట్రిక్ హాజరు తీసుకోకుండానే అందరినీ పరీక్షకు అనుమతించారనీ, అయినవాళ్ళయిన అభ్యర్థులకు అనుకూలంగా ఉండేలా ‘నీట్’ పేపర్లనే మార్చేశారనీ వార్త. ప్రతిష్ఠాత్మక ‘ఎన్టీఏ’ పరీక్షలు నిర్వహిస్తున్నా, క్షేత్రస్థాయిలో ఇంత సంబడంగా సాగుతోందంటే ‘నీట్’ ఏ మాత్రం నీటుగా నడుస్తోందో వేరే చెప్పనక్కర్లేదు. వాములు తింటున్న స్వాముల్ని వదిలేసి, కనబడని సూదుల కోసం వెతికినట్టు... అక్రమార్కుల కన్నా ఆడవారి లోదుస్తులకుండే లోహపు కొక్కీ ‘నీట్’ పరీక్షకులకు అభ్యంతరకరంగా, ప్రమాద కరంగా కనిపించడం పరాకాష్ఠ. పరీక్ష రాయాల్సిన పిల్లలు ఏడుస్తున్నా కరగక, ‘లోదుస్తులు ముఖ్యమా, భవిష్యత్తు ముఖ్యమా’ అని ప్రశ్నించి, లోదుస్తులు విడిస్తే తప్ప పరీక్ష రాయనివ్వని పరిస్థితి కల్పించారంటే మనం ఏ నాగరక సమాజంలో ఉన్నట్టు? ఆ షాక్‌లోనే పరీక్ష రాసిన పిల్లల్ని తిరిగి చాటుగా ఆ దుస్తులను ధరించనివ్వక, అదేదో పరీక్షా కేంద్రం బయటకెళ్ళి చేసుకొమ్మనడం ఎంత రాక్షసత్వం? ఈ కర్కశత్వంతో హృదయం గాయపడిన ఆ చిన్నారులకు ఏ మందు రాస్తే గాయం మానుతుంది? జీవితాంతం వేధించే దారుణ అనుభవానికి తోడు అసలేమీ జరగలేదనీ, విద్యార్థిని అబద్ధమాడుతోందనీ ‘ఎన్టీఏ’ బుకాయించడం విడ్డూరం. చివరకు మరో నలుగురు పిల్లలు ముందుకొచ్చి, తమకూ ఎదురైన అదే అనుభవాన్ని వెల్లడించాల్సి వచ్చిందంటే మన ప్రవేశ పరీక్షల్లోని పాశవిక నిబంధనల్ని ఏమనాలి? గతంలోనూ ‘నీట్’లో ఇలాంటివే జరిగాయి. 2017లో కేరళలోనే కన్నూరులోని ఓ పరీక్షా కేంద్రంలో లోదుస్తుల్ని విప్పమని నలుగురు స్కూలు టీచర్లు ‘అతిగా ప్రవర్తించి’, ఆనక సస్పెండ య్యారు. అప్పట్లో సీబీఎస్ఈ నిర్వహించిన ‘నీట్’ ఇప్పుడు ‘ఎన్టీఏ’ చేతికొచ్చింది. పాత ‘అతి’ మాత్రం మారలేదు. చీటీలు పెట్టకుండా, ఆధునిక పరికరాలను వాడకుండా కట్టుదిట్టంగా పరీక్ష నిర్వహించాలనుకోవడం తప్పు కాదు. పొడుగు చేతుల దుస్తులు, బూట్లు వేసుకోకూడదన్నదీ అర్థం చేసుకోవచ్చు. కానీ, ‘ఆభరణాలు, లోహపు వస్తువులు ధరించ రాద’న్న నిబంధనను సాకుగా చేసు కొని, లోహపు కొక్కీతో ధరించే లోదుస్తులు విప్పేయాలనడం విపరీతం, వితండవాదం. వచ్చే జేఈఈ లాంటి అనేక ప్రవేశపరీక్షలకూ దాదాపు ఇవే నిబంధనలు గనక ఆడపిల్లల ఆత్మగౌరవ హననం అక్కడా పునరావృతం కాదన్న గ్యారంటీ లేదు. కేరళ విద్యా శాఖ మహిళా మంత్రి ఖండిం చినా, ఇప్పటికీ పెదవి విప్పని కేంద్ర పెద్దలు, బాధ్యులు ఇలాంటి ఘటనలకు తెరపడేలా చర్యలు చేపట్టాలి. ఇప్పటికే వివాదాలు, రిగ్గింగ్‌లతో ‘నీట్’ నవ్వులపాలైంది. రీ–ఎగ్జామ్ అంటూ పెట్టాల్సి వస్తే, అధికారుల వైఫల్యానికి మూల్యం చెల్లించేది – అమాయక విద్యార్థులు, వారి కుటుంబాలే! -
నీట్ పరీక్షలో విద్యార్థినికి ఘోర అవమానం! ఫిర్యాదు చేసిన తండ్రి
తిరువనంతపురం: నీట్ పరీక్ష రాసేందుకు ఎంతో కాలం కష్టపడి చదువుతుంటారు విద్యార్థులు. వైద్యులు కావాలని కలలు కనేవారు ఈ పరీక్ష కోసమే ఏళ్ల తరబడి కూడా ఎదురు చూస్తుంటారు. అయితే కేరళ కొల్లం జిల్లాలో నీట్ పరీక్ష రాసేందుకు వెళ్లిన విద్యార్థినులకు చేదు అనుభవం ఎదురైంది. లోదుస్తులు తీసేస్తేనే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని సిబ్బంది తేల్చి చెప్పారట. లేకపోతే పరీక్ష రాయొద్దని అన్నారట. ఈ నిబంధన వల్ల తన కూతురు తీవ్ర మానసిక క్షోభ అనుభవించిందని ఓ విద్యార్థిని తండ్రి గోపకుమార్ సూరానంద్ తెలిపారు. ఈ విషయంపై కొల్లం రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మార్ థోమా ఇనిస్ట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాలేజీలో ఆదివారం నీట్ పరీక్ష రాసేందుకు తన కూతురు వెళ్లిందని, బ్రా తీసేస్తేనే లోపలికి అనుమతిస్తామని సిబ్బంది చెప్పారని గోపకుమార్ ఫిర్యాదు చేశారు. మెటల్ హుక్స్ ఉన్నాయనే కారణంతో లోదుస్తులు తీసేయాలని, లేకపోతే పరీక్ష రాయనివ్వమని వారు చెప్పినట్లు పేర్కొన్నారు. దీని వల్ల పరీక్ష రాశాక తన కూతురు ఏడుస్తూ ఇంటికి వచ్చిందని వివరించారు. రూల్ ఏం లేదు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మార్గదర్శకాల్లో మెటల్ హుక్స్ ఉన్న లోదుస్తులు తీసెయ్యాలనే నిబంధనేమీ లేదని, అయినా వారు దీన్ని అమలు చేయడమేంటని గోపకుమార్ ప్రశ్నించారు. ఈ నిబంధన వల్ల ఎంతో మంది విద్యార్థినులు క్షోభ అనుభవిస్తున్నారని, పరీక్ష సరిగ్గా రాయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ మెటల్ హుక్స్ బ్రాలు ధరించిన విద్యార్థులు పరీక్షకు హాజరైతే వారిని చెక్ చేసిన తర్వాతైనా హాల్లోకి అనుమతించాలని, కానీ లోదుస్తులు తీసిసే పరీక్ష రాయమనడం ఎంతవరకు సబబు అని గోపకుమార్ ప్రశ్నించారు. ఆదివారం నీట్ పరీక్ష రాసేందుకు వెళ్లిన విద్యార్థినులందరితో లోదుస్తులను బలవంతంగా తొలగించి, కోవిడ్ నిబంధనలు కూడా పాటించకుండా లోదుస్తులన్నింటినీ ఒకే గదిలో వేయాలని విద్యార్థులకు సిబ్బంది చెప్పినట్లు గోపకుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. మాకు సంబంధం లేదు మార్ థోమా కాలేజీ యాజమాన్యం మాత్రం ఈ వ్యవహారంతో తమకేమీ సంబంధం లేదని చెప్పింది. తాము కేవలం అటెండెన్స్ వివరాలు మాత్రమే చూసుకున్నామని, విద్యార్థులకు లోనికి అనుమతించే బాధ్యతలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి వచ్చిన సిబ్బందే చూసుకున్నట్లు తెలిపింది. హిజాబ్ ధరించిన విద్యార్థులు తమను హాల్లోకి అనుమతించట్లేదని ఏడిస్తే తాము జోక్యం చేసుకుని లోపలికి పంపించినట్లు కాలేజీ సిబ్బంది వివరించారు. చదవండి: ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ సరదా.. రిజర్వాయర్ ఎత్తైన అంచుకు వెళ్లి ఫొటో దిగుతూ.. -
‘ఎంబీబీఎస్ కల చెదిరింది.. ఇక జీవించలేకున్నా.. సెలవు’
సాక్షి, చెన్నై: ‘ఎంబీబీఎస్ కల నీట్ రూపంలో చెదిరింది.. ఇక జీవించలేకున్నా.. సెలవు’ అని లేఖ రాసిపెట్టి ఓ బాలిక బలవన్మరణానికి పాల్పడింది. శనివారం నీలగిరి జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. ఓవేలి యూనియన్ పరిధిలోని భారతీ నగర్‌కు చెందిన అరులానందం, పుష్ప దంపతులు తేయాకు తోట కార్మికులు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తె జయ ఇటీవల ప్లస్‌టూ ముగించింది. చిన్న తనం నుంచి ఎంబీబీఎస్ చదవాలన్న ఆశతో నీట్ పరీక్షకు హాజరైంది. అయితే ఆశించిన ఫలితం రాలేదు. తీశ్ర మనస్తాపంతో గురువారం రాత్రి ఇంట్లో పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. శుక్రవారం ఉదయం విగతజీవిగా పడివున్న కుమార్తెను చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఇంట్లో బాలిక రాసిన లేఖ బయటపడింది. చదవండి: (నాలుగో వేవ్ నడుస్తోంది.. జాగ్రత్త!) ఎంబీబీఎస్ చదివి పేదలకు వైద్య సేవలు అందించాలని కలలు కన్నట్టు వివరించింది. అయితే నీట్ రూపంలో తన కల చెదిరిందని, ఇక జీవించ లేకున్నాను...సెలవు అని లేఖలో పేర్కొంది. ఈ ఘటనతో నీట్ వ్యతిరేక నినాదం మళ్లీ తెరపైకి వచ్చింది. రాష్టŠట్రంలో ఇప్పటికే 10కి పైగా విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ పరీక్షకు వ్యతిరేకంగా డీఎంకే ప్రభుత్వం చేసిన తీర్మానం రాజ్ భవన్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. -
నీట్ రద్దు: మంత్రి కేటీఆర్‌తో డీఎంకే ఎంపీల భేటీ
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌తో డీఎంకే ఎంపీలు బుధవారం భేటీ అయ్యారు. నీట్ రద్దు చేయాలనే డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని పలువురు ముఖ్యమంత్రులకు తమిళనాడు సీఎం స్టాలిన్ రాసిన లేఖను డీఎంకే ఎంపీలు టీకేఎస్ ఎలాన్గోవన్, రామస్వామితో కలిసి కేటీఆర్‌కు అందజేశారు. అనంతరం డీఎంకే ఎంపీ ఎలెన్గోవన్ మాట్లాడుతూ.. నీట్ పరీక్ష రద్దు అంశంపై కేటీఆర్‌ను కలిశాము. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నీట్ పరీక్ష అంశంపై మేము నిర్ణయం తీసుకున్నాం. కేంద్ర విధానంపై మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. మాకు సపోర్ట్ చెయ్యాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని అడిగాము. అందుకు కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. కీలకమైన అంశాలలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభిప్రాయం తీసుకోవడం లేదు అని ఎంపీ ఎలాన్గోవన్ అన్నారు. ఇదే అంశంపై టీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. నీట్ రద్దు అంశంపై ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్ కేసీఆర్‌కు లేఖ రాశారు. అందుకు మద్దతు కోసం డీఎంకే ఎంపీలు కేటీఆర్‌ను కలిశారు. లెటర్ తీసుకొచ్చి కేటీఆర్‌కి స్వయంగా అందించి మద్దతు అడిగారు అని ఎంపీ రంజిత్ రెడ్డి తెలిపారు. చదవండి: (పెట్టుబడులకు నిలయం.. తెలంగాణ) -
మన పరీక్షలు ఎంత ‘నీట్’?
దేశంలో బోలెడు పోటీ ఉన్న ప్రవేశపరీక్షలవి. ఒకటి వైద్యవిద్యకూ, మరొకటి ఇంజనీరింగ్ విద్యకూ సంబంధించినది. ప్రతిష్ఠాత్మకమైన ఆ చదువుల్లో చేరడానికి అర్హత నిర్ణయించే ‘నీట్’, ‘జేఈఈ’ - ఈ జాతీయ స్థాయి పరీక్షలు రెండూ తాజాగా వివాదాస్పదం కావడం విచిత్రం. దేశ మంతటా ఒకే ప్రవేశ పరీక్ష ఉండాలంటూ ప్రతిష్ఠాత్మకంగా పెట్టుకున్న ఎగ్జామ్‌లు ఇవి. కానీ, వీటిలో సైతం దొడ్డి దారిన పాస్ చేసి, మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశం సంపాదించి పెట్టేలా అక్రమార్కులు విజృంభించడం నివ్వెరపరుస్తోంది. మన పరీక్షావిధానాల్లోని డొల్లతనానికి ఇది నిలువెత్తు నిదర్శనం. అటు జేఈఈ, ఇటు నీట్ రెండింటిలో అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణకు దిగాల్సి రావడం ఈ ప్రవేశపరీక్షల విశ్వసనీయతను వెక్కిరిస్తోంది. ప్రాసంగికతను ప్రశ్నిస్తోంది. వైద్యవిద్యలో ప్రవేశాల కోసం 2012లో మొదలుపెట్టినప్పటి నుంచి ‘నీట్’ వివాదాలు రేపుతూనే ఉంది. ఈ జాతీయ ప్రవేశపరీక్ష విద్యార్థుల ప్రాంతీయ, సామాజిక, ఆర్థిక అంతరాలను బట్టి కొందరికి వరం, మరికొందరికి శాపమనే వాదన చాలా కాలంగా నడుస్తోంది. కొన్నేళ్ళుగా తమిళనాడు, మహారాష్ట్ర సహా అనేక రాష్ట్రాల్లో వివాదమూ నెలకొంది. అప్పట్లోనే పలువురు విద్యార్థుల ఆత్మహత్యలతో తమిళనాట ‘నీట్’ రద్దు ఎన్నికల వాగ్దానమూ అయింది. ఇటీవల వారం రోజుల్లో ముగ్గురి ఆత్మహత్యతో ఈ నెల 13న అక్కడి కొత్త డీఎంకె ప్రభుత్వం తమిళనాట నీట్‌ను మినహాయిస్తూ, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది. పన్నెండో తరగతి మార్కులే వైద్యవిద్యలో ప్రవేశానికి అర్హతగా తీర్మానించింది. రాష్ట్రపతి ఆమోదం పొందితే తప్ప, ఈ బిల్లు కాస్తా చట్టం కాదు. ఇంతలోనే పులి మీద పుట్రలా ఈ దొడ్డిదారి పాస్ వివాదం. ఎవరైనా సరే రూ. 50 లక్షలిస్తే చాలు... అసలు విద్యార్థి బదులు వేరెవరినో కూర్చోబెట్టి, ‘నీట్’ రాయించి, మెడికల్ కాలేజీ సీటు ఇప్పించే నాగపూర్‌లోని కోచింగ్ బండారం ఈ నెల 22న సీబీఐ బయటపెట్టింది. కథ కొత్త మలుపు తిరిగింది. ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం జేఈఈ (మెయిన్స్), వాటిలో పాసైన 2.5 లక్షల మంది ప్రతిష్ఠాత్మక ఐఐటీలలో చేరేందుకు రాసే జేఈఈ (అడ్వాన్స్డ్)కు సైతం ఇప్పుడు బురదంటుకుంది. ఈ ఏడాది నుంచి 4 దశలైన ఈ పరీక్షలో నాలుగోది కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ). పేరొందిన జాతీయ పరీక్షా సంస్థ (ఎన్టీఏ) నిర్వహిస్తున్న ఇందులోనూ అక్రమాలు జరిగాయని సీబీఐ తేల్చింది. 15 లక్షలిస్తే, విద్యార్థి పరీక్ష రాసే కంప్యూటర్లోకి సుదూరంగా ఎక్కడి నుంచో సాంకేతికంగా జొరబడి, జవాబులు రాసి పాస్ చేయించే మోసాలు బహిర్గతమయ్యాయి. ఇలా అక్రమాలకు పాల్పడ్డ విద్యార్థుల్లో కొందరిపై ఎన్టీఏ తాజాగా మూడేళ్ళు నిషేధం పెట్టింది. పట్టుబడని దొంగల సంఖ్య పరమాత్ముడికి ఎరుక. వెరసి, జేఈఈ, నీట్ – రెండూ లోపరహితం కాదని తేలిపోయింది. ఏటా లక్షలాది విద్యార్థులు అనేక నెలలు శ్రమించి ఈ పరీక్షలకు హాజరవుతుంటారు. ఈ ఏడాది 15.3 లక్షల మంది నీట్, 9.4 లక్షల మంది జేఈఈ మెయిన్స్ రాశారు. ఎంతటి ప్రతిభావంతులైనా ఈ ఎంట్రన్స్ టెస్టుల్లో పాసైతేనే, కోరుకున్న వైద్య, ఇంజనీరింగ్ వృత్తివిద్యాభ్యాసం చేయగలుగుతారు. అందుకోసం అనేక మంది లక్షలు పోసి మరీ కోచింగ్‌లు తీసుకుంటూ ఉంటారు. కుటుంబ వార్షికాదాయం రూ. 2.5 లక్షల కన్నా తక్కువుండి, గ్రామీణ ప్రాంతాల్లో తమిళ మాధ్యమంలో చదువుకున్న విద్యార్థులు, వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పిల్లలకు నీట్ ఓ ప్రాణాంతక పోటీగా మారింది. సమాజంలోని ఉన్నత సామాజిక, ఆర్థిక వర్గాలకే ఎంబీబీఎస్ సీటొచ్చే పరిస్థితి. విభిన్న వర్గాలకు చోటు లేకుండా పోతోంది. తమిళనాడు సర్కార్ నియమించిన కమిటీ ఆ సంగతే తేల్చింది. 2013లో ఒకసారి నీట్ జరిగినా, సుప్రీమ్ కోర్టు నిషేధంతో కొన్నేళ్ళు ఆగింది. 2016లో కోర్టు ఉత్తర్వుల సవరణతో 2017– 18 విద్యా సంవత్సరం నుంచి నీట్ మళ్ళీ దేశవ్యాప్తంగా తప్పనిసరి తంతుగా మారింది. అప్పటి నుంచి నీట్ నుంచి మినహాయింపు కోసం తమిళనాడు లాంటి రాష్ట్రాలు ప్రయత్నిస్తూనే వస్తున్నాయి. బాగా చదివి, పన్నెండో తరగతిలో మార్కులు తెచ్చుకున్నవారు సైతం దేశవ్యాప్త సిలబస్, కోచింగ్ అంతరాలతో నీట్ సరిగ్గా రాయలేక, ఒత్తిడి, ఆందోళనతో కొన్నేళ్ళుగా ఎందరో పసివాళ్ళు ప్రాణాలు తీసుకోవడం కన్నీరు తెప్పిస్తోంది. ప్రతిభకు పట్టం కట్టడం, అందరికీ సమాన అవకాశాల కల్పన, విద్యార్థుల ప్రాణాలు – ఇలా ఎన్నో ముడిపడ్డ సున్నిత అంశమిది. నీట్‌ను యథాతథంగా కొనసాగించ రాదు. అలాగని, రాష్ట్రానికో రకం సిలబస్, ఒక్కోచోట ఒక్కోరకం మార్కుల కేటాయింపున్న బహుభాషా దేశంలో, పన్నెండో తరగతి మార్కులతోనే దేశవ్యాప్త ప్రవేశాలు నిర్ణయించాలని పట్టుబట్టడమూ సరైనది కాదు. వైద్యం రాష్ట్ర జాబితాలోది కాగా, విద్యను రాష్ట్ర పరిధి నుంచి ఎమర్జెన్సీ కాలంలో కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలోకి తెచ్చారు. మళ్ళీ ఇప్పుడిలా నీట్‌తో కేంద్రం పెత్తనమన్నది విమర్శ. ఇరుపక్షాలూ సమగ్రంగా ఆలోచించి, తగు చర్యలు చేపట్టాలి. బలహీన వర్గాలకు ప్రత్యేక కోచింగ్ ఇవ్వడం, లేదంటే ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు రిజర్వు చేయడం లాంటివి చేయవచ్చు. ఈ పరీక్షలు, మార్కులే ప్రపంచం కాదనీ, బతకడానికి నీట్ ఒక్కటే మార్గం కాదనీ పెద్దలు, టీచర్లు పిల్లలకు ధైర్యమివ్వాలి. ప్రభుత్వమేమో జేఈఈలో అక్రమాలకు ఎథికల్ హ్యాకర్లతో అడ్డుకట్ట వేయాలి. పారదర్శకమనే ఆన్లైన్ పరీక్షలే ‘డిజిటల్ ఇండియా’ వేళ అక్రమాలకు నెలవైనప్పుడు వ్యవస్థ నిద్ర మేల్కోవాల్సిందే. ఎందుకంటే, ఇది లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు. కోట్లాది కుటుంబాల ఆకాంక్షలకు విపత్తు. -
NEET 2021: నేడు ‘నీట్’.. ఇవి వద్దు, ఇవి తప్పనిసరి
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, దంత వైద్య సీట్ల భర్తీ కోసం ఆదివారం ‘నీట్’(జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష) నిర్వహించనున్నారు. దీని కోసం రాష్ట్రంలో 10 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. గుంటూరు, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, విశాఖ, తెనాలి, నరసరావుపేట, మచిలీపట్నం, మంగళగిరిలోని కేంద్రాల్లో పరీక్ష జరుగుతుంది. ఏపీ నుంచి ఈ ఏడాది 59 వేల మందికి పైగా అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కలిపి సుమారు 5 వేల సీట్లున్నాయి. 85 శాతం సీట్లను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసుకోనుండగా, 15 శాతం సీట్లు మాత్రం నేషనల్ పూల్(కేంద్ర కోటా)లో భర్తీ అవుతాయి. ఈ 15 శాతం సీట్లు ఏపీ ఇవ్వడం వల్ల.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలిచ్చే 15 శాతం కోటాకు రాష్ట్ర విద్యార్థులు కూడా పోటీ పడే అవకాశముంటుంది. ప్రభుత్వ పరిధిలో 11 వైద్యకాలేజీలుండగా, ప్రైవేటు పరిధిలో 18 వరకు ఉన్నాయి. గంట ముందే రావాలి.. పరీక్షా కేంద్రానికి గంట ముందే వచ్చేలా విద్యార్థులు సన్నద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పరీక్ష జరుగుతుంది. విద్యార్థులు మధ్యాహ్నం 1.30కల్లా పరీక్షా కేంద్రానికి వచ్చి ఇన్విజిలేటర్‌కు అడ్మిట్ కార్డు చూపించాలి. 1.45 గంటలకు బుక్లెట్ ఇస్తారు. 1.50కి బుక్‌లెట్‌లో వివరాలు నింపాల్సి ఉంటుంది. సరిగ్గా 2 గంటలకు ప్రశ్నపత్రం ఇస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకే పరీక్షా కేంద్రానికి రావడం వల్ల ప్రశాంతంగా ఇవన్నీ పూర్తి చేసుకోవచ్చు. ఆలస్యంగా వస్తే నిబంధనల మేరకు పరీక్షకు అనుమతించరు. తప్పకుండా తీసుకురావాల్సినవి ఇవే.. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అడ్మిట్ కార్డుతో పాటు విధిగా ఒక పాస్‌పోర్ట్ సైజు ఫొటో తీసుకురావాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన కార్డులు.. అంటే పాన్‌కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ వీటిలో ఏదో ఒకటి తప్పనిసరిగా తెచ్చుకోవాలి. కోవిడ్ నిబంధనల మేరకు మాస్కు, గ్లౌజులు ధరించాలి. శానిటైజర్(50 ఎం.ఎల్) బాటిల్ తెచ్చుకోవచ్చు. నిషేధిత జాబితా.. ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ఫోన్లు, ఆభరణాలు తదితరాలు తీసుకురాకూడదని నిబంధనల్లో స్పష్టం చేశారు. చెవులకు ధరించే ఆభరణాలు, బ్రాస్లెట్, వేలి ఉంగరాలు, ముక్కు పిన్లు, చైన్లు, నక్లెస్‌లు, పెండెంట్స్ తదితర ఆభరణలేవీ పెట్టుకోకూడదు. అలాగే కాగితాలు, బిట్స్ పేపర్లు, జామెట్రీ బాక్స్‌లు, పెన్సిల్ బాక్స్‌లు, క్యాలిక్యులేటర్లు, ప్లాస్టిక్ పౌచ్‌లు, స్కేల్, రైటింగ్ ప్యాడ్, ఎరైజర్, లాగ్ టేబుల్, ఎలక్ట్రానిక్ పెన్స్ తీసుకురాకూడదు. మొబైల్ ఫోన్, బ్లూటూత్, ఇయర్ ఫోన్స్, పేజర్స్, హెల్త్ బ్యాండ్లు, పర్సులు, హ్యాండ్ బ్యాగ్స్, బెల్ట్, క్యాప్, స్కార్ఫ్, కెమెరా తదితర వస్తువులన్నీ నిషేధిత జాబితాలో ఉన్నాయి. -
సున్నా మార్కులు.. కోర్టులో పిటిషన్
ముంబై: నీట్ ఫలితాల్లో ఏర్పడిన గందరగోళం గురించి చూస్తూనే ఉన్నాం. తాజాగా ఎస్టీ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన స్టూడెంట్‌ని ఫెయిల్ అంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో విద్యార్థిని తనకు సున్నా మార్కులు వచ్చాయి.. మాన్యువల్‌గా పేపర్ కరెక్షన్ చేయాలంటూ కోర్టును ఆశ్రయించింది. వివరాలు..మహారాష్ట్రకు చెందిన విద్యార్థిని వసుంధర భోజనే నీట్లో 720 మార్కులకు గాను సున్నా(0) మార్కులు సాధించినట్లు రిజల్ట్‌లో చూపించింది. కనీసం 650 మార్కులు వస్తాయని భావించిన ఆమె సున్నా మార్కులు రావడంతో షాక్‌కు గురయ్యింది. దాంతో తన పేపర్ని రీ వాల్యూయేషన్ చేయాలని కోరుతూ బొంబాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. (చదవండి: సమాన మార్క్‌లు కానీ ఆమె టాపర్ కాలేదు, ఎందుకు?) బొంబాయి హైకోర్టు సోమవారం ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ని విచారించి నోటీసులు జారీ చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ), కేంద్ర ఆరోగ్య, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలకు నోటీసులు జారీ చేసింది. ఇక విద్యార్థి తరఫున న్యాయవాది మాట్లాడుతూ.. ‘వసుంధర మెరిట్ స్టూడెంట్. బోర్డు పరీక్షల్లో మంచి మార్కులు సాధించింది. ఈ పరీక్షలో కనీసం 650 మార్కులు వస్తాయని భావించింది. కానీ సున్నా మార్కులు వచ్చాయి. ఆన్లైన్ టెస్టింగ్ విధానంలోని లోపాల వల్ల ఇలా జరిగి ఉండవచ్చు. అందుకే మాన్యువల్‌గా రీవాల్యూయేషన్ చేయాలని కోరుతున్నాం’ అన్నారు. అయితే నీట్ పరీక్షలో రీవాల్యూయేషన్ చేసే విధానం లేదు. అందుకే పరీక్షకు హాజరయిన విద్యార్థులు సమర్పించిన ఓఎంఆర్ షీట్‌ను ఎన్టీఏ అప్లోడ్ చేస్తుంది, ఆన్సర్ కీ కూడా ఇస్తుంది. తమిళనాడులోని ఇద్దరు విద్యార్థులు కూదా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. -
నీట్ గందరగోళం.. టాపర్‌ని ఫెయిల్ చేశారు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) ఫలితాలపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతుంది. ఇప్పటికే ఫస్ట్ ర్యాంక్ ప్రకటన విషయంలో విమర్శలు వస్తుండగా.. తాజాగా టాపర్‌గా నిలిచిన విద్యార్థిని ఫెయిల్ అయినట్లు ప్రకటించినట్లు తెలిసింది. వివరాలు.. 17 ఏళ్ల రావత్ రాజస్తాన్ లోని సవాయి మాధోపూర్ జిల్లాలోని గంగాపూర్ పట్టణంలో నివసిస్తున్నాడు. అక్టోబర్ 16 న, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఏటీఏ) జారీ చేసిన మొదటి మార్క్‌షీట్ ప్రకారం అతడు ఫెయిల్ అయినట్లు వచ్చింది. 720 మార్కులకు గాను మృదుల్‌కు 329 పాయింట్లు ఇచ్చింది. దాంతో అతడు రిజల్ట్‌ని సవాలు చేశాడు. ఈ క్రమంలో అతడి ఓఎంఆర్ షీట్, ఆన్సర్ కీని తిరిగి తనిఖీ చేయడంతో 650 మార్కులతో అతను ఎస్టీ కేటగిరీలో ఆల్ ఇండియా టాపర్ అని తేలింది. జనరల్ కేటగిరీలో ఆల్ ఇండియా 3577వ ర్యాంకు సాధించాడు. (చదవండి: ఎన్నదగిన తీర్పు) అయితే, ఎన్టీఏ జారీ చేసిన రెండవ మార్క్‌షీట్‌లో కూడా మరో పొరపాటును గుర్తించారు. దానిలో, అతని మార్కుల మొత్తం 650 అని చూపించినప్పటికి.. అక్షరాల్లో మాత్రం మూడు వందల ఇరవై తొమ్మిది అని రాశారు. అలానే ఫస్ట్ ర్యాంకు విషయంలో కూడా విమర్శలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఒడిశాకు చెందిన సోయబ్ అఫ్తాబ్, ఢిల్లీకి చెందిన ఆకాంక్ష సింగ్ ఇద్దరు ఆవుట్ ఆఫ్ మార్కులు సాధించారు. కానీ ఎన్టీఏ టై బ్రేకింగ్ పాలసీ ప్రకారం అఫ్తాబ్‌కి మొదటి ర్యాంకు, ఆకాంక్షకు రెండవ ర్యాంకుగా ప్రకటించింది. -
ఇదే ప్రభుత్వానికి నేనిచ్చే సలహా: సోనియా
న్యూఢిల్లీ: సెప్టెంబర్‌లో జరగాల్సిన జేఈఈ, నీట్ పరీక్షలు వాయిదా వేయాలని దేశవ్యాప్తంగా విద్యార్థులు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించి తీరుతామని మొండిగా తేల్చి చెప్పింది. అయితే చాలామంది ప్రముఖులు విద్యార్థుల పక్షాన నిలబడుతూ పరీక్షలు వాయిదా వేయాలని కేంద్రాన్ని కోరుతున్నారు. తాజాగా కాంగ్రెస్ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థుల బాధను అర్థం చేసుకుని పరీక్షలు వాయిదా వేయాలని కేంద్రానికి విన్నవించారు. ఈ మేరకు శుక్రవారం ఓ వీడియోను షేర్ చేశారు. (చదవండి: నీట్, జేఈఈల వాయిదా ఉండదు!) "ప్రియమైన విద్యార్థులారా.. మీ బాధను నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు మీరు అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పరీక్షలు ఎప్పుడు, ఎక్కడ జరపాలి అనే విషయాలు మీకు మాత్రమే కాదు, మీ కుటుంబానికి కూడా ప్రధానమైన సమస్యగా పరిణమించాయి. మీరే రేపటి భవిష్యత్తు. భావి భారత నిర్మాణం మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి మీ భవిష్యత్తును శాసించే ఏ నిర్ణయమైనా మీ అనుమతితోనే తీసుకోవాలి. అదే ముఖ్యం కూడా. ప్రభుత్వం మీ మొర ఆలకిస్తుందని ఆశిస్తున్నా. మీ ఇష్టానికి అనుగుణంగా నడుచుకుంటుందని భావిస్తున్నా. ఇదే ప్రభుత్వానికి నేనిచ్చే సలహా. ధన్యవాదాలు" అని వీడియోలో పేర్కొన్నారు. కాగా జేఈఈ, నీట్ పరీక్షలు ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డాయి. పరీక్షల నిర్వహణ ఆలస్యం చేసే కొద్దీ విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని కేంద్ర విద్యాశాఖ అభిప్రాయపడుతోంది. (చదవండి: నీట్ పరీక్ష వాయిదాకు విపక్ష సీఎంల డిమాండ్) Students are our future, we depend on them to build a better India, therefore, if any decision has to be taken regarding their future it is important that it is taken with their concurrence.: Congress President Smt. Sonia Gandhi #SpeakUpForStudentSafety pic.twitter.com/Jf18cmykbd — Congress (@INCIndia) August 28, 2020 -
నీట్ పరీక్ష వాయిదాకు విపక్ష సీఎంల డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో నీట్ పరీక్షను వాయిదా వేయాలని కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులతో పాటు, విపక్ష సీఎంలు, నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రులు అమరీందర్ సింగ్, అశోక్ గహ్లోత్, భూపేష్ బాగేల్, హేమంత్ సోరేన్, మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రేలు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంపై అవసరమైతే కోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్ పాలిత సీఎంలు పేర్కొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించకపోవడంపై ఆందోళన వ్యక్తమైంది. రాష్ట్రాలకు సరైన సమయంలో జీఎస్టీ పరిహారం ఇవ్వడం లేదని, బకాయిలు పెరిగిపోయాయని సోనియా గాంధీ అన్నారు. రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలు చెల్లించే పరిస్థితుల్లో కేంద్రం లేదని ఆమె దుయ్యబట్టారు. రైల్వేల ప్రైవేటీకరణ, ఎయిర్‌పోర్టుల వేలం నిర్ణయాలను తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించిన జాతీయ విద్యా విధానం సరిగా లేదని విమర్శించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వీటిపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. మరోవైపు నీట్ పరీక్షపై విద్యార్ధులు, తల్లితండ్రుల్లో భయాందోళనలు ఉన్నాయని రాహుల్ గాంధీ అన్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ భయపెడుతుంటే కొన్ని రాష్ట్రాల్లో వరదలు సంభవించాయని ఈ పరిస్థితుల్లో నీట్ పరీక్ష నిర్వహించడం సరికాదని రాహుల్ పేర్కొన్నారు. అందరి అభిప్రాయాలూ కేంద్రం తెలుసుకున్న తర్వాతే ఓ నిర్ణయం తీసుకోవాలని కోరారు. చదవండి : అప్పుడే కాంగ్రెస్ కొత్త సారథి ఎన్నిక!? -
జేఈఈ, నీట్‌లపై గళమెత్తిన గ్రెటా థన్‌బెర్గ్
కరోనా కరాళ నృత్యం చేస్తుంటే విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతూ జేఈఈ, నీట్ పరీక్షలు ఎలా నిర్వహిస్తారని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు భిన్నంగా కేంద్రం మాత్రం పరీక్షలకు పచ్చజెండా ఊపింది. సెప్టెంబర్ 1-6వ తేదీ వరకు జేఈఈ మెయిన్స్ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) జరగనున్నట్లు వెల్లడించింది. మరోవైపు వచ్చే నెల 13న నీట్(నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్–2020) పరీక్ష జరుగుతుండగా, కరోనా అనుమానితులకు ఐసోలేషన్ గదిలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) తెలిపింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. (చదవండి: పరీక్ష కేంద్రాల్లో ఐసోలేషన్ గదులు ) తాజాగా స్వీడిష్ యువ కెరటం, పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్ విద్యార్థుల తరపున గళమెత్తారు. కరోనా కాలంలో భారత విద్యార్థులను జాతీయ పరీక్షలకు హాజరు కావాల్సిందేనని చెప్పడం అన్యాయమన్నారు. ఇప్పటికే అక్కడ లక్షలాది మంది వరదల వల్ల ప్రభావితమయ్యారని పేర్కొన్నారు. కాబట్టి జేఈఈ, నీట్ పరీక్షలు వాయిదా వేయాలని కోరారు. కాగా ఇప్పటికే విద్యార్థులను కరోనా భయం వెంటాడుతుంటే, మరోవైపు అస్సాం, బిహార్, గుజరాత్, చత్తీస్ఘడ్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. ఈ సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లోని విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడం కూడా కష్టమేనన్నది ప్రతిపక్షాల వాదన. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ మొదటి వారంలోనే పరీక్షలు నిర్వహించి తీరుతామని కేంద్రం తేల్చి చెప్పడం గమనార్హం. (చదవండి: జేఈఈ మెయిన్స్‌కు కరోనా ఆంక్షలు) -
‘నీట్’ దరఖాస్తు గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) దరఖాస్తు గడువును ఈ నెల 6 వరకు పొడిగిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం నిర్ణయించింది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని ఆరోజు రాత్రి 11.50 గంటల వరకు తెరిచి ఉంచుతామని పేర్కొంది. వాస్తవంగా 2020–21కు సంబంధించి నీట్ పరీక్ష కోసం గత నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు. తాజా నిర్ణయంతో ఇప్పటివరకూ దరఖా స్తులు చేయనివారు ఇప్పుడు సమర్పించవచ్చని ఎన్టీఏ తెలిపింది. అయితే పరీక్షా షెడ్యూల్లో ఏ మార్పులూ ఉండవని తెలిపింది. విద్యార్థులు తమ దరఖాస్తు ఫారాలను ఈ నెల 15 నుంచి 31 వరకు సవరించుకోవచ్చు. నీట్ పరీక్ష మే నెల 3న నిర్వహిస్తారు. అనంతరం జూన్ 4న ఫలితాలు విడుదల చేస్తారు. ఇంగ్లీష్, హిందీతో సహా 11 భాషల్లో ఈ పరీక్ష జరుగుతుంది. ఈసారి ఎయిమ్స్, జిప్మర్ ఎంబీబీఎస్ కోర్సులలో ప్రవేశానికి కూడా నీట్ పరీక్ష రాయాల్సి ఉంది. దేశవ్యాప్తంగా 2,546 పరీక్షా కేంద్రాలు దేశవ్యాప్తంగా 154 నగరాల్లోని 2,546 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూలోనూ పరీక్ష ఉంటుంది. గతేడాది తెలంగాణ నుంచి 48,996 విద్యార్థులు నీట్ పరీక్ష రాయగా, అందులో 33,044 మంది అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా అదేస్థాయిలో విద్యార్థులు నీట్ పరీక్ష రాసే అవకాశముందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు చెబుతున్నారు. -
‘నీట్’ దరఖాస్తు ప్రక్రియ మొదలు
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నోటిఫికేషన్ జారీచేసింది. 2020–21 వైద్య విద్యాసంవత్సరానికి గానూ వచ్చే ఏడాది మే 3న పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తులను nta.ac.in లేదా ntaneet.nic.in వెబ్సైట్లలో పొందవచ్చు. దేశవ్యాప్తంగా 154 నగరాల్లోని 2,546 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో పరీక్ష ఉంటుంది. ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఒక దరఖాస్తు మాత్రమే సమర్పించాలి. రుసుము చెల్లించిన తర్వాత దరఖాస్తు ఫారం ఒక్కోసారి రద్దయిపోతే, చెల్లించిన రుసుం తిరిగి వెనక్కు వస్తుంది. -
నీట్ వాయిదా కోసం ఆర్డినెన్సు?
కేంద్రం యోచన న్యూఢిల్లీ: వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)ను వచ్చేఏడాది నుంచి నిర్వహించేందుకు.. సుప్రీంకోర్టు తీర్పుపై ఆర్డినెన్సు తీసుకు వచ్చే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం రాష్ట్రాల వైద్య, ఆరోగ్య మంత్రులతో కేంద్రం ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా సమావేశంలో దీనిపై చర్చ జరిగినట్లు తెలిసింది. అయితే ఆర్డినెన్సుపై అంతిమ నిర్ణయం తీసుకోనప్పటికీ దీన్ని కూడా ఓ ప్రత్యామ్నాయంగా కేంద్రం భావిస్తోందని సమాచారం. బుధవారం ఉదయం జరగాల్సిన కేంద్ర కేబినెట్ భేటీ నోట్లోనూ ఈ అంశం లేదని స్పష్టమైంది. కాగా, ఈ ఏడాదినుంచే నీట్ అమలవుతుందన్న సుప్రీంకోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన పలు రాష్ట్రాలు.. ఈ తీర్పును ఏడాదిపాటు వాయిదా వేయాలని కోరాయి. వివిధ రాజకీయ పార్టీలు కూడా సుప్రీంకోర్టు నిర్ణయంతో విభేదించాయి. దీనిపై రంగంలోకి దిగిన కేంద్రం.. రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో సమావేశమైంది. అయితే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, డీమ్డ్ వర్సిటీలు ఎట్టిపరిస్థితుల్లోనూ నీట్ ద్వారానే ప్రవేశాలు నిర్వహించాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు.