
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, చెన్నై: ‘ఎంబీబీఎస్ కల నీట్ రూపంలో చెదిరింది.. ఇక జీవించలేకున్నా.. సెలవు’ అని లేఖ రాసిపెట్టి ఓ బాలిక బలవన్మరణానికి పాల్పడింది. శనివారం నీలగిరి జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. ఓవేలి యూనియన్ పరిధిలోని భారతీ నగర్‌కు చెందిన అరులానందం, పుష్ప దంపతులు తేయాకు తోట కార్మికులు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తె జయ ఇటీవల ప్లస్‌టూ ముగించింది.
చిన్న తనం నుంచి ఎంబీబీఎస్ చదవాలన్న ఆశతో నీట్ పరీక్షకు హాజరైంది. అయితే ఆశించిన ఫలితం రాలేదు. తీశ్ర మనస్తాపంతో గురువారం రాత్రి ఇంట్లో పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. శుక్రవారం ఉదయం విగతజీవిగా పడివున్న కుమార్తెను చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఇంట్లో బాలిక రాసిన లేఖ బయటపడింది.
చదవండి: (నాలుగో వేవ్ నడుస్తోంది.. జాగ్రత్త!)
ఎంబీబీఎస్ చదివి పేదలకు వైద్య సేవలు అందించాలని కలలు కన్నట్టు వివరించింది. అయితే నీట్ రూపంలో తన కల చెదిరిందని, ఇక జీవించ లేకున్నాను...సెలవు అని లేఖలో పేర్కొంది. ఈ ఘటనతో నీట్ వ్యతిరేక నినాదం మళ్లీ తెరపైకి వచ్చింది. రాష్టŠట్రంలో ఇప్పటికే 10కి పైగా విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ పరీక్షకు వ్యతిరేకంగా డీఎంకే ప్రభుత్వం చేసిన తీర్మానం రాజ్ భవన్‌కే పరిమితమైన విషయం తెలిసిందే.