
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh Babu) కార్పొరేట్ కళాశాలలపై తన ప్రేమను ప్రదర్శించారు. ఈ క్రమంలో విడ్డూరమైన వ్యాఖ్యలు చేశారాయన. విద్యార్థుల ఆత్మహత్యల అంశంపై శాసన మండలిలో గురువారం చర్చ జరగ్గా.. ఇందుకు తల్లిదండ్రుల ధోరణినే కారణమనే రీతిలో మాట్లాడారాయన.
మండలిలో విద్యార్ధుల ఆత్మహత్యలపై చర్చ సందర్భంగా.. టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి మాట్లాడారు. ‘‘ఏపీలో రైతుల ఆత్మహత్యల కంటే విద్యార్ధుల ఆత్మహత్యలే(Students Suicides) ఎక్కువ ఉన్నాయి. కార్పొరేట్ కళాశాలల్లోనే ఎక్కువగా చనిపోతున్నారు. ఇటీవల ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి.
.. తీవ్రమైన ఒత్తిడితోనే విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రైవేట్ కాలేజీలపై ప్రభుత్వానికి నియంత్రణ లేకుండా పోయింది. చక్రపాణి కమిటీని బయటపెట్టాలి. విద్యార్ధుల ఆత్మహత్యలను నియంత్రించాలి’’ అని అన్నారాయన.
దీనికి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్(AP Education Minister Nara lokesh) బదులిచ్చారు. ‘‘విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి.. కాదనడం లేదు. కానీ, కార్పొరేట్ కళాశాలల్లో మాత్రమే కాదు యూనివర్శిటీల్లోనూ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కొంత మంది తల్లిదండ్రులు ఫీజులు కట్టేస్తున్నాం.. ఇంక మీదే బాధ్యత అనేలా వ్యవహరిస్తున్నారు. ఇది చాలా తీవ్రమైన అంశం. కాబట్టి ప్రైవేట్ యాజమాన్యాలతో పాటు తల్లిదండ్రులకూ బాధ్యత ఉంటుందని అన్నారాయన.
రాష్ట్రంలో కార్పొరేట్ కళాశాల్లో యాజమాన్యాల వేధింపులతో విద్యార్థులు బలవన్మరణాలు పాల్పడుతుంది చూస్తున్నాం. అయితే ఈ అంశాన్ని సొంత పార్టీ వాళ్లే లేవనెత్తితే.. యూనివర్సిటీల్లోనూ జరుగుతున్నాయంటూ చెప్పడం విడ్డూరం.
Comments
Please login to add a commentAdd a comment