చెన్నై: ఫుడ్ డెలివరీ ఆలస్యం కావడం..ఓ విద్యార్థి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. చెన్నైకి చెందిన పవిత్రన్(19) బీకాం చదువుకుంటూ తీరిక వేళల్లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 11వ తేదీన కొరట్టూర్ ప్రాంతం నుంచి వచ్చిన ఆర్డర్‌ను అందజేయడానికి పవిత్రన్ బయలుదేరాడు.
లొకేషన్ గుర్తించి, చేరుకోవడంలో ఆలస్యమైంది. ఈ విషయంలో మహిళా కస్టమర్‌తో పవిత్రన్‌కు వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఆమె అతనిపై చేయి చేసుకుంది. ఆ తర్వాత ఆమె సంబంధిత కంపెనీకి ఫిర్యాదు చేశారు. రెండు రోజుల తర్వాత పవిత్రన్ రాయి విసరడంతోనే తన ఇంటికి కిటికీ అద్దం పగిలిందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం పవిత్రన్ తన ఇంట్లో ఉరి వేసుకుని, తనువు చాలించాడు.
ఫుడ్ డెలివరీ ఆలస్యమైనందుకు మహిళా కస్టమర్ తనను కొట్టడంతో తీవ్ర మనస్తాపంతో ఈ విపరీత నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొన్నాడు. పోలీసులు ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment