BDS counseling
-
నీట్ యూజీ-2024 తొలి రౌండ్ కౌన్సెలింగ్ ఫలితాలు విడుదల
నీట్ యూజీ-2024 తొలి రౌండ్ కౌన్సెలింగ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్ని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) విడుదల చేసింది. కాగా, నీట్ యూజీ కౌన్సెలింగ్ తొలి రౌండ్ ఆగస్ట్ 14 నుంచి రాష్ట్రాల వారీగా ప్రారంభమైంది. ఎంసీసీ సమాచారం మేరకు.. నీట్ యూజీ-2024 కౌన్సెలింగ్ నాలుగుసార్లు జరగనుంది. తాజాగా తొలిరౌండ్ కౌన్సెలింగ్ పూర్తయింది. అందులో ర్యాంక్, ప్రాధాన్యతలు, అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా అభ్యర్ధులకు ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను కేటాయించినట్లు ఎంసీసీ వెల్లడించింది. ఈ కౌన్సెలింగ్‌లో మొత్తం 26,109 మంది విద్యార్ధులకు సీట్లను కేటాయించింది.మొత్తం టాప్ 17 ర్యాంకులు సాధించిన విద్యార్ధులు ఎయిమ్స్ ఢిల్లీలో ఎంబీబీఎస్ సీట్లను సంపాదించారు. ఈ సందర్భంగా అర్హులైన విద్యార్ధులు ప్రొవిజినల్ అలాట్మెంట్ లెటర్స్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని ఎంసీసీ వెల్లడించింది.ఎంసీసీ ప్రకారం, రెండవ రౌండ్ కౌన్సెలింగ్ కోసం అవసరమయ్యే వైకల్య ధ్రువీకరణ పత్రాలు(పీడబ్ల్యూడీ) అవసరమయ్యే అభ్యర్థులు సెప్టెంబర్ 9, 2024 సాయంత్రం 5 గంటల లోపు సంబందిత కేంద్రాల నుంచి పొందాలని తెలిపింది. ఇతర వివరాల కోసం ఎంసీసీ కాల్ సెంటర్‌కు కాల్ చేసి తెలుసుకోవాలని, జన్మాష్టమి కారణంగా, ఎంసీసీ కాల్ సెంటర్ (సోమవారం)ఆగస్టు 26, 2024న ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు పని చేస్తుందని ఎంసీసీ ప్రతినిధులు వెల్లడించారు.అభ్యర్థులు తమకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్ చేయడానికి గడువు ఆగస్ట్ 29 వరకు ఇచ్చింది. ఆ తర్వాత మెడికల్ కాలేజీలు ఈ అభ్యర్థుల అడ్మిషన్ డేటాను వెరిఫై చేస్తాయి. ఇవి ఆగస్టు 30,31 మధ్య ఎంసీసీకి సమర్పిస్తాయి. -
ఎంబీబీఎస్ రెండో విడత కౌన్సెలింగ్ నిలిపివేత
హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ రెండో విడత కౌన్సెలింగ్ నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ప్రాథమిక ఆధారాలను బట్టి జనరల్ కేటగిరీ సీట్లను భర్తీ చేశాక రిజర్వేషన్ కోటా సీట్లను భర్తీ చేయలేదని స్పష్టమవుతోందని, దీంతో ఇప్పటికే జరిగిన రెండో విడత కౌన్సెలింగ్‌ను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజీవ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్ పి.కేశవరావుల ధర్మాసనం ఈ మేరకు స్టే ఉత్తర్వులు ఇచ్చింది. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నష్టం కలిగేలా రెండో విడత కౌన్సెలింగ్ జరిగిందని పేర్కొంటూ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎన్.భావన మరో నలుగురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను బుధవారం హైకోర్టు విచారించింది. తొలి విడతలాగే రెండో విడత కౌన్సెలింగ్‌ను జీవో ప్రకారం నిర్వహించారో లేదో తెలపాలని, పిటిషనర్ల ఆరోపణలపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ లను ఆదేశించింది. వర్సిటీలో ఏం జరుగుతుందో ప్రభుత్వం పట్టించుకోవాలని, రెండో విడత కౌన్సెలింగ్ జీవో నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని అనిపిస్తోందని వ్యాఖ్యానించింది. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నష్టం.. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్ వాదిస్తూ.. తొలి విడత కౌన్సెలింగ్‌లో సీట్ల భర్తీ సక్రమంగానే జరిగిందని.. రెండో విడతలో మాత్రం రిజర్వేషన్ కేటగిరీ సీట్ల భర్తీ తర్వాత జనరల్ కేటగిరీ సీట్లను భర్తీ చేశారని పేర్కొన్నారు. దీంతో ప్రతిభ ఉన్న రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు నష్టపోయారని చెప్పారు. రెండో విడత కౌన్సెలింగ్‌లో ముందుగా జనరల్ కేటగిరీ సీట్లను భర్తీ చేశారా లేక రిజర్వేషన్ సీట్లను భర్తీ చేశారా.. అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు స్పందిస్తూ.. ప్రవేశాలకు జీవోలు 550, 114 ఉన్నాయని, వివరాలు ఇచ్చేందుకు గడువు కావాలని కోరారు. తదుపరి విచారణను హైకోర్టు 13వ తేదీకి వాయిదా వేసింది. -
రేపు బీడీఎస్ 4వ దశ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ప్రైవేటు మైనారిటీ వైద్య కాలే జీల్లోని ‘ఎ’ కేటగిరీ బీడీఎస్ సీట్ల భర్తీకి ఆదివారం నాల్గో దశ వెబ్ కౌన్సెలింగ్ జరగనుంది. మూడో దశ కౌన్సెలింగ్ తర్వాత ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి సెప్టెంబర్ 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు వెబ్ ఆప్షన్స్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు కాళోజీ ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం శుక్రవారం నోటిఫి కేషన్ జారీ చేసింది. ఇప్పటికే బీడీఎస్ సీట్లు పొందిన వారు, కొత్తగా కాలేజీ మారాలనుకుంటున్న వారు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చని సూచించింది. కాలేజీల వారీగా ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను వర్సిటీ వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు తెలిపింది. తాజా కౌన్సె లింగ్లో సీటు పొందిన వారు జాయిన్ కాక పోతే రూ.3 లక్షలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని, మూడేళ్లదాకా కౌన్సెలిం గ్‌కు అనర్హులుగా ప్రకటిస్తామని పేర్కొంది. రిజిస్ట్రార్ కొనసాగింపు.. కాళోజీ వర్సిటీ రిజిస్ట్రార్ పదవీ కాలాన్ని కొనసాగించాలని వైద్య శాఖ నిర్ణయించినట్లు తెలి సింది. ప్రస్తుత రిజిస్ట్రార్ టి.వెంకటేశ్వర్రావు ఎంజీఎంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తూ ఆగస్టు 31న పదవీ విరమణ పొందారు. మూడేళ్లుగా వర్సిటీ నిర్వహణలో అనుభవం ఉన్న ఆయనను ఇదే పోస్టులో కొనసాగించాలని నిర్ధారించినట్లు సమాచారం.