రేపు బీడీఎస్ 4వ దశ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ప్రైవేటు మైనారిటీ వైద్య కాలే జీల్లోని ‘ఎ’ కేటగిరీ బీడీఎస్ సీట్ల భర్తీకి ఆదివారం నాల్గో దశ వెబ్ కౌన్సెలింగ్ జరగనుంది. మూడో దశ కౌన్సెలింగ్ తర్వాత ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి సెప్టెంబర్ 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు వెబ్ ఆప్షన్స్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు కాళోజీ ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం శుక్రవారం నోటిఫి కేషన్ జారీ చేసింది. ఇప్పటికే బీడీఎస్ సీట్లు పొందిన వారు, కొత్తగా కాలేజీ మారాలనుకుంటున్న వారు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చని సూచించింది. కాలేజీల వారీగా ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను వర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు తెలిపింది. తాజా కౌన్సె లింగ్‌లో సీటు పొందిన వారు జాయిన్ కాక పోతే రూ.3 లక్షలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని, మూడేళ్లదాకా కౌన్సెలిం గ్‌కు అనర్హులుగా ప్రకటిస్తామని పేర్కొంది.
రిజిస్ట్రార్ కొనసాగింపు..
కాళోజీ వర్సిటీ రిజిస్ట్రార్ పదవీ కాలాన్ని కొనసాగించాలని వైద్య శాఖ నిర్ణయించినట్లు తెలి సింది. ప్రస్తుత రిజిస్ట్రార్ టి.వెంకటేశ్వర్‌రావు ఎంజీఎంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తూ ఆగస్టు 31న పదవీ విరమణ పొందారు. మూడేళ్లుగా వర్సిటీ నిర్వహణలో అనుభవం ఉన్న ఆయనను ఇదే పోస్టులో కొనసాగించాలని నిర్ధారించినట్లు సమాచారం.