Kalogi University
-
‘స్థానికత’పై వర్సిటీ తీరు సరికాదు
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యా అడ్మిషన్లకు సంబంధించి కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ ‘స్థానికత’పై వ్యవహరిస్తున్న తీరును హైకోర్టు తప్పుబట్టింది. నేరుగా ప్రభుత్వం సిఫార్సు చేసిన సైనిక పాఠశాల విద్యార్థిని స్థానిక అభ్యర్థిగా పరిగణించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వెంటనే జోక్యం చేసుకుని విద్యార్థిని స్థానికుడిగా పరిగణించే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వ సిఫార్సు మేరకు రంగారెడ్డి జిల్లా వనస్థలిపురానికి చెందిన చేపూరి అవినాశ్ డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ స్కూల్లో 8 నుంచి 10వ తరగతి వరకు విద్యను అభ్యసించారు. రాష్ట్ర కోటా నుంచి అతను ఎంపికయ్యారు. ఆ తర్వాత ఇంటరీ్మడియట్ తెలంగాణలో పూర్తి చేశారు. ఎంబీబీఎస్ అడ్మిషన్ల సమయంలో అతను తెలంగాణలో 9, 10 చదవలేదని పేర్కొంటూ స్థానిక అభ్యర్థిగా పరిగణించడానికి విశ్వవిద్యాలయం నిరాకరించింది. దీన్ని సవాల్ చేస్తూ హైకో ర్టులో అవినాశ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున ఎ.వెంకటేశ్, ప్రభుత్వం తరఫున ఏజీపీ స్వప్న, కాళోజీ వర్సి టీ తరఫున ఎ.ప్రభాకర్‌రావు హాజరయ్యారు. రెండు రోజుల క్రితం విచారణ సందర్భంగా పిటిషనర్ స్థానిక అభ్యర్థే కదా అని ధర్మాసనం అభిప్రాయపడింది. సమస్యను పరిష్కరించాలని వర్సిటీకి సూ చించింది. అయితే గురువారం విచారణ సందర్భంగా స్థానికుడిగా పరిగణించలేమని వర్సిటీ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. వర్సిటీ తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన అభ్యర్థి నాన్ లోకల్ ఎలా అవుతారో సర్కార్‌ను అడిగి చెప్పాలని ఏఏజీని ఆదేశించింది. తదుపరి విచారణ నేటికి వాయిదా వేసింది. -
రెండో విడత కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో ఎంబీబీఎస్, బీడీఎస్‌ల్లో మిగిలిన సీట్లకు, అఖిల భారత కోటాలో మిగిలిన సీట్లకు ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు ఈ కౌన్సెలింగ్ జరగనుంది. అందుకోసం విద్యార్థులు శనివారం ఉదయం 8 నుంచి ఈ నెల 20 మధ్యాహ్నం ఒంటి గంట వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. అన్ని కేటగిరీ సీట్లకూ కౌన్సెలింగ్ జరుపుతారు. ఇక మొదటి విడతలో సీటు పొంది చేరనివారు ఈసారి అదే కోర్సుకు వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి అనుమతించరు. వాస్తవంగా రెండోవిడత కౌన్సెలింగ్ ఈ నెల 12వ తేదీ నాటికే పూర్తికావాలి. జీవో నంబర్ 550కు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో రెండో విడత కౌన్సెలింగ్‌పై ఇప్పటివరకు అనిశ్చితి నెలకొంది. చివరకు రెండో విడత కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. 444 ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు కౌన్సెలింగ్ అఖిల భారత కోటా సీట్లలో చేరాక తిరిగి రాష్ట్రానికి కేటాయించిన 63 మిగులు సీట్లతో కలుపుకొని మొత్తం 444 ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లున్నాయి. అందులో ఎంబీబీఎస్ 194, బీడీఎస్ 250 సీట్లున్నాయి. వాటిల్లో చేరేందుకు విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. వాటికి రెండోవిడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ప్రైవేటు కాలేజీల్లోని ఎన్ఆర్ఐ సీట్లు ఇంకా మిగిలే ఉన్నాయి. చాలామంది విద్యార్థులు సమీప రాష్ట్రాల్లోని డీమ్డ్ వర్సిటీల్లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అక్కడ ఫీజు తక్కువుండటంతో విద్యార్థులు అటువైపు మొగ్గుచూపుతున్నారు. పైగా మరో రెండు కౌన్సెలింగ్‌లు డీమ్డ్ వర్సిటీల్లో ఉండటంతో అటువైపు వెళ్తున్నట్లు అంచనా. -
‘నీట్’గా మోసం
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య సీట్ల అడ్మిషన్లలో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీ అక్రమాలకు పాల్పడింది. బీయూఎంఎస్ (యునానీ) సీట్ల భర్తీలో నిబంధనలను యథేచ్ఛగా అతిక్రమించింది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)లో కచ్చితంగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉన్నా 50 మంది విద్యార్థులతో ఆటలాడుకుంది. ఒక్కో సీటుకు భారీ మొత్తంలో ఫీజు వసూలు చేసి నిబంధనలకు విరుద్ధంగా అడ్మి షన్లు ఇచ్చింది. ఈ అడ్మిషన్లు ఇప్పుడు రద్దయ్యే పరిస్థితి వచ్చింది. కాళోజీ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నిర్ణయంపై విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంది. హైదరాబాద్‌లోని బండ్లగూడలో ఆల్–అరీఫ్ యునానీ కళాశాలలో ఈ వ్యవహారం జరిగింది. కాళోజీ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 2017–18 విద్యా సంవత్సరం వైద్య సీట్ల భర్తీ ప్రక్రియ జరిగింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల సీట్ల భర్తీ అనంతరం 2017 సెప్టెంబర్‌లో ఆయుర్వేదిక్, హోమియోపతి, యునానీ, నేచురోపతి, యోగా కోర్సుల భర్తీని వర్సిటీ చేపట్టింది. అన్ని కోర్సుల్లో చేరేందుకు కచ్చితంగా నీట్ అర్హత సాధించి ఉండాలని పేర్కొంది. మొదట ప్రతి కాలేజీలోని 50 శాతం సీట్ల (ఏ–కేటగిరీ)ను, అనంతరం బీ, సీ కేటగిరీ సీట్లను కన్వీనర్ ఆధ్వర్యంలోనే భర్తీ చేయాలి. అయితే అన్ని సీట్లకు కచ్చితంగా నీట్ అర్హత ఉండాలనే నిబంధనను అల్–అరీఫ్ కాలేజీ పట్టించుకోలేదు. కాలేజీలో మొత్తం 100 యునానీ కోర్సు సీట్లు ఉండగా వాటిలో 50 సీట్లను కన్వీనర్ ఆధ్వర్యంలో భర్తీ చేసిన యాజమాన్యం... బీ కేటగిరీలోని 35, సీ కేటగిరీలోని 15 సీట్ల భర్తీలో మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. యునానీ కోర్సుల బీ, సీ కేటగిరీ సీట్ల ఫీజు రూ. 3 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఉంది. ఇంతకంటే ఎక్కువ మొత్తం ఇచ్చిన విద్యార్థులకు సీట్లు ఇచ్చారు. అడ్మిషన్లు పొందిన విద్యార్థుల వివరాలను గడువులోగా సరైన ఫార్మాట్లో కాళోజీ విజ్ఞాన విశ్వవిద్యాలయానికి సమర్పించాల్సి ఉండగా కాలేజీ యాజమాన్యం పట్టించుకోలేదు. ఇప్పుడు యునానీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో అసలు విషయం బయటపడింది. కాలేజీ యాజమాన్యంలో అంతర్గత విభేదాలతో మొదటి సంవత్సరం అడ్మిషన్లపై ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఫిర్యాదులు అందాయి. నీట్లో అర్హత సాధించకున్నా 50 మంది విద్యార్థులకు అల్–అరీఫ్ కాలేజీలో మొదటి సంవత్సరం బీయూఎంఎస్ కోర్సులో అడ్మిషన్లు ఇచ్చారని విశ్వవిద్యాలయం గుర్తించింది. దీంతో విద్యార్థుల అడ్మిషన్లను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని కాలేజీకి నోటీసు ఇచ్చింది. దీనిపై కాలేజీ యాజమాన్యం సైతం తన వివరణ ఇచ్చింది. నీట్ రాయకపోయినా అడ్మిషన్లు ఇవ్వండని, దీనిపై తర్వాత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుందని అధికారులు హామీ ఇవ్వడం వల్లే అడ్మిషన్లు ఇచ్చామని పేర్కొంది. ఇప్పుడు ఈ అంశం కాళోజీ ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం పరిధిలో ఉంది. ఈసీ కమిటీలో నిర్ణయం అల్–అరీఫ్ కాలేజీ సీట్ల విషయంపై ఫిర్యాదులు వచ్చాయి. నీట్ అర్హత లేకుండా అడ్మిషన్లు ఇచ్చినట్లు గుర్తించాం. ఈ మేరకు కాలేజీకి నోటీసులు ఇచ్చాం. ప్రస్తుతం ఈ అంశం విశ్వవిద్యాలయం కార్యనిర్వాహక కమిటీ (ఈసీ) పరిధిలో ఉంది. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటాం. – బి.కరుణాకర్‌రెడ్డి, కాళోజీ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ -
రేపు బీడీఎస్ 4వ దశ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ప్రైవేటు మైనారిటీ వైద్య కాలే జీల్లోని ‘ఎ’ కేటగిరీ బీడీఎస్ సీట్ల భర్తీకి ఆదివారం నాల్గో దశ వెబ్ కౌన్సెలింగ్ జరగనుంది. మూడో దశ కౌన్సెలింగ్ తర్వాత ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి సెప్టెంబర్ 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు వెబ్ ఆప్షన్స్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు కాళోజీ ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం శుక్రవారం నోటిఫి కేషన్ జారీ చేసింది. ఇప్పటికే బీడీఎస్ సీట్లు పొందిన వారు, కొత్తగా కాలేజీ మారాలనుకుంటున్న వారు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చని సూచించింది. కాలేజీల వారీగా ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను వర్సిటీ వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు తెలిపింది. తాజా కౌన్సె లింగ్లో సీటు పొందిన వారు జాయిన్ కాక పోతే రూ.3 లక్షలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని, మూడేళ్లదాకా కౌన్సెలిం గ్‌కు అనర్హులుగా ప్రకటిస్తామని పేర్కొంది. రిజిస్ట్రార్ కొనసాగింపు.. కాళోజీ వర్సిటీ రిజిస్ట్రార్ పదవీ కాలాన్ని కొనసాగించాలని వైద్య శాఖ నిర్ణయించినట్లు తెలి సింది. ప్రస్తుత రిజిస్ట్రార్ టి.వెంకటేశ్వర్రావు ఎంజీఎంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తూ ఆగస్టు 31న పదవీ విరమణ పొందారు. మూడేళ్లుగా వర్సిటీ నిర్వహణలో అనుభవం ఉన్న ఆయనను ఇదే పోస్టులో కొనసాగించాలని నిర్ధారించినట్లు సమాచారం. -
సీటు వదులుకున్నా ఫీజు కట్టక్కర్లేదు
- ఎంబీబీఎస్, బీడీఎస్ అభ్యర్థులకు ఊరటనిచ్చిన కాళోజీ వర్సిటీ - మూడో కౌన్సెలింగ్‌కు ముందే లేఖ ఇవ్వాలని సూచన - నేటి నుంచి బీ, సీ కేటగిరీ సీట్లకు కౌన్సెలింగ్ సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించి కాళోజీ వర్సిటీ అభ్యర్థులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులలో మొదటి దశ కౌన్సెలింగ్‌లో సీటు వచ్చిన వారు ఒకవేళ సీటు వదులుకుంటే రూ.3 లక్షలు చెల్లించాలనే నిబంధనలో మార్పులు చేసింది. రెండో దశ కౌన్సెలింగ్ వరకు ఈ అవకాశం కల్పించింది. అభ్యర్థులు రెండో దశ కౌన్సెలింగ్ తర్వాత సీటు వదులుకున్నా.. ఎలాంటి ఫీజులు చెల్లించా ల్సిన అవసరం లేదని పేర్కొంది. మూడో దశ కౌన్సెలింగ్(మాప్ ఆప్) ప్రక్రియకు ముందే సీటు వదులుకున్నట్లు లేఖలు ఇవ్వాలని సూచించింది. మరోవైపు ప్రైవేటు, ప్రైవేటు మైనారిటీ కాలేజీల్లోని బీ కేటగిరీ, సీ(ఎన్నారై) కేటగిరీ ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ కోసం ఈ నెల 3 నుంచి 5 వరకు ఆన్లైన్ కౌన్సెలింగ్ జరగనుంది. ఉస్మానియా వర్సిటీలోని పీజీఆర్‌ఆర్‌సీడీఈలో ఆన్లైన్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. బీ కేటగిరీ సీట్లకు సంబంధించి ఆగస్టు 3న 1 నుంచి 700 ర్యాంకు వరకు కౌన్సెలింగ్ ఉంటుంది. ఆగస్టు 4న 700 ర్యాంకు నుంచి సీట్ల భర్తీ ఆధారంగా చివరి ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఆగస్టు 5న సీ కేటగిరీ సీట్ల భర్తీ కోసం అన్ని ర్యాంకుల వరకు కౌన్సెలింగ్ జరుగుతుంది. బీ, సీ కేటగిరీ సీట్ల కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావాలి. సీటు పొందిన వెంటనే వర్సిటీ ఫీజు చెల్లించి ధ్రువీకరణ పత్రం పొందాలి. అనంతరం ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం కాలేజీ ఫీజులను, బాండ్‌ను, డీడీలను ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లకు అక్కడే చెల్లించాలి. సీటు పొందిన అభ్యర్థులు అదే రోజు వర్సిటీ ఫీజు చెల్లించకున్నా, సీటు పొందిన ధ్రువపత్రాన్ని అదే రోజు సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్‌కు ఇవ్వకున్నా సీటు రద్దవుతుంది. ప్రైవేటు ముస్లిం మైనారిటీ కాలేజీల్లోని బీ, సీ కేటగిరీ సీట్ల భర్తీ కోసం నిర్వహించే మొదటి దశ కౌన్సెలింగ్‌కు కేవలం ముస్లిం అభ్యర్థులు మాత్రమే హాజరుకావాలి. 10 తర్వాత రెండో దశ కౌన్సెలింగ్ ఎంబీబీఎస్, బీడీఎస్ ఏ కేటగిరీ రెండో దశ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 10 తర్వాత జరగనుంది. మూడు కేటగిరీ సీట్ల మొదటి దశ కౌన్సెలింగ్ పూర్తిగా ముగిసిన తర్వాత రెండో దశ కౌన్సెలింగ్ మొదలు పెట్టనున్నట్లు కాళోజీ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. -
ఖాళీగా కాళోజీ వర్సిటీ
మొదలుకాని పూర్తిస్థాయి పాలన - ఖాళీలను భర్తీ చేయని యంత్రాంగం - 82 పోస్టులు మంజూరు.. - ఖాళీగా 61 పోస్టులు - పట్టించుకోని వైద్య ఆరోగ్య మంత్రి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య విద్య నిర్వహణ, పర్యవేక్షణ కోసం ఏర్పాటైన కాళోజీ వైద్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పరిస్థితి దయనీయంగా మారింది. ఏళ్లు గడుస్తున్నా వర్సిటీలో పూర్తిస్థాయి పరిపాలన సాగట్లేదు. గతంలో రాష్ట్రంలోని సగం సీట్లనే వర్సిటీ భర్తీ చేసేది. గతంతో పోల్చితే వర్సిటీపై పనిభారం పెరుగుతోంది. నీట్ పరీక్ష నేపథ్యంలో రాష్ట్రంలోని వైద్య కాలేజీల్లోని సీట్లన్నింటినీ కాళోజీ వర్సిటీ ఆధ్వర్యంలోనే భర్తీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వర్సిటీలో ఖాళీగా ఉన్న పోస్టులతో ఈ ప్రక్రియ సజావుగా సాగుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వర్సిటీ నిర్వహణకు అవసరమైన పోస్టులను ప్రభు త్వం మంజూరు చేసినా.. భర్తీ చేయడంపై దృష్టి పెట్టట్లేదు. వర్సిటీ ఉన్నతాధికారులు సైతం పోస్టుల భర్తీ విషయాన్ని పట్టించుకోవట్లేదు. రాష్ట్రంలో వైద్య విద్య నిర్వహణలో కీలకమైన వర్సిటీపై ఆ శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి సమీక్షించ కపోవడం వల్లే పోస్టుల భర్తీ ప్రక్రియను ఎవరూ పట్టించు కోవట్లేదనే అభిప్రాయముం ది. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ వైద్య విద్య నిర్వహణ చూసేది. రాష్ట్ర విభజనతో తెలంగాణలో 2014 సెప్టెంబర్ 26న కాళోజీ ఆరోగ్య వర్సిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాత్కాలిక వైస్ చాన్సలర్‌ను, రిజిస్ట్రార్ నియమించింది. వర్సిటీ నిర్వహణకు అవసరమై 82 పోస్టులను శాశ్వత ప్రాతిపదికన, 22 పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అనుమతిస్తూ గతేడాది జనవరి 19న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం అనుమ తిచ్చి ఏడాదిన్నర గడిచినా వర్సిటీ ఉన్నతాధికారులు ఈ విషయంలో చర్యలు తీసుకోవట్లేదు. వైద్య శాఖలో, ఇతర వర్సిటీల్లో పని చేస్తున్న 21 మందిని డిప్యూటేషన్ పద్ధతిలో నియమిం చారు. దీంతో 61 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. మిగతా ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి ఇటీవలే రెండు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను ఎంపిక చేశారు. ఒకే ఏజెన్సీకి ఈ కాంట్రాక్టు అప్పగించాల్సి ఉండగా.. మంత్రి పేషీలోని ఓ ఉన్నతాధికారి ఒత్తిడి మేరకు 2 సంస్థలకు అప్పగించినట్లు తెలి సింది. ప్రస్తుత ఏడాది వైద్య విద్య కోర్సుల కౌన్సెలింగ్ పూర్తయ్యేలోపు ఈ ఉద్యోగాలను సైతం భర్తీ చేసే అవకాశాలు తక్కువేనని తెలుస్తోంది.