వైద్య విద్యా సీట్ల భర్తీలో కాళోజీ వర్సిటీపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యా అడ్మిషన్లకు సంబంధించి కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ ‘స్థానికత’పై వ్యవహరిస్తున్న తీరును హైకోర్టు తప్పుబట్టింది. నేరుగా ప్రభుత్వం సిఫార్సు చేసిన సైనిక పాఠశాల విద్యార్థిని స్థానిక అభ్యర్థిగా పరిగణించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వెంటనే జోక్యం చేసుకుని విద్యార్థిని స్థానికుడిగా పరిగణించే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వ సిఫార్సు మేరకు రంగారెడ్డి జిల్లా వనస్థలిపురానికి చెందిన చేపూరి అవినాశ్ డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ స్కూల్‌లో 8 నుంచి 10వ తరగతి వరకు విద్యను అభ్యసించారు.
రాష్ట్ర కోటా నుంచి అతను ఎంపికయ్యారు. ఆ తర్వాత ఇంటరీ్మడియట్ తెలంగాణలో పూర్తి చేశారు. ఎంబీబీఎస్ అడ్మిషన్ల సమయంలో అతను తెలంగాణలో 9, 10 చదవలేదని పేర్కొంటూ స్థానిక అభ్యర్థిగా పరిగణించడానికి విశ్వవిద్యాలయం నిరాకరించింది. దీన్ని సవాల్ చేస్తూ హైకో ర్టులో అవినాశ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున ఎ.వెంకటేశ్, ప్రభుత్వం తరఫున ఏజీపీ స్వప్న, కాళోజీ వర్సి టీ తరఫున ఎ.ప్రభాకర్‌రావు హాజరయ్యారు.
రెండు రోజుల క్రితం విచారణ సందర్భంగా పిటిషనర్ స్థానిక అభ్యర్థే కదా అని ధర్మాసనం అభిప్రాయపడింది. సమస్యను పరిష్కరించాలని వర్సిటీకి సూ చించింది. అయితే గురువారం విచారణ సందర్భంగా స్థానికుడిగా పరిగణించలేమని వర్సిటీ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. వర్సిటీ తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన అభ్యర్థి నాన్ లోకల్ ఎలా అవుతారో సర్కార్‌ను అడిగి చెప్పాలని ఏఏజీని ఆదేశించింది. తదుపరి విచారణ నేటికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment