నీట్‌పై సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్ర మంత్రి ప్రధాన్
న్యూఢిల్లీ: నీట్–యూజీ అంశంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు కాంగ్రెస్ బాధ్యతారాహిత్యానికి, చిల్లర రాజకీయాలకు చెంపపెట్టని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. సుప్రీం నిర్ణయం విద్యార్థుల ఓటమి కానేకాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి కేంద్రం ప్రభుత్వంపైనే కాదు, సుప్రీంకోర్టుపైనా విశ్వాసం లేదని విమర్శించారు.
రాజస్తాన్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనూ పేపర్ లీకేజీలు జరగడం తెలియదా అని ఆ పార్టీ చీఫ్ ఖర్గేను ఆయన ప్రశ్నించారు. అప్పటి ఘటనలపై ఎందుకు మౌనంగా ఉన్నారన్నారు. పేపర్ లీకేజీలకు, అవినీతికి తండ్రివంటిది కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. రాజకీయ మనుగడ కోసం ఆ పార్టీ అబద్ధాలు, అరాచకాలనే నమ్ముకుందని మంత్రి మండిపడ్డారు. స్వార్థ ప్రయోజనాలపైనే తప్ప, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఖర్గేకు, రాహుల్ గాం«దీకిగానీ, కాంగ్రెస్ పార్టీకిగానీ ఏమాత్రం పట్టింపు లేదని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment