Education Minister
-
ఉన్నత విద్య ఎంట్రన్స్లకే ఎన్టీఏ పరిమితం
న్యూఢిల్లీ: 2025 నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని ఉద్యోగ ఎంపిక పరీక్షల నిర్వహణ బాధ్య తల నుంచి తప్పిస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. కేవలం ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షలను మాత్రమే ఎన్టీఏ ఇకపై నిర్వహిస్తుందన్నారు. వచ్చే ఏడాదిలో ఈ మేరకు ఎన్టీఏను పునర్వ్యవస్థీకరించి, అవసరమైన కొత్త పోస్టులను సృష్టిస్తామని చెప్పారు. అంతేకాకుండా, నీట్‌ను సంప్రదాయ పెన్, పేపర్ విధానం బదులుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ)గా చేపట్టేందుకు ఆరోగ్య శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి ప్రధాన్ మంగళవారం మీడియాకు చెప్పారు. వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ సహా పలు పరీక్షా పత్రాల లీకేజీలు, రద్దు వంటి పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఇచ్చిన సిఫారసుల ఆధారంగా పునర్వ్యవస్థీకరణకు పలు చర్యలు తీసుకుంటోంది. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (క్యూయెట్– యూజీ)ను ఇకపైనా ఏడాదిలో ఒక్క పర్యాయం మాత్రమే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఎన్టీఏను ప్రవేశ పరీక్షల బాధ్యతలను మాత్రమే అప్పగించాలి. దాని సామర్థాన్ని పెంచిన తర్వాత ఇతర పరీక్షల బాధ్యతలను అప్పగించే విషయం ఆలోచించాలి’అని ఇస్రో మాజీ చీఫ్ ఆర్. రాధాకృష్ణన్ సారథ్యంలోని కమిటీ సిఫారసు చేసింది. సంబంధిత కోర్సులో జాయినయ్యే విద్యార్థి మాత్రమే ఆన్లైన్ పరీక్ష రాసేలా డిజి–యాత్ర మాదిరిగానే డిజి–ఎగ్జామ్ విధానాన్ని తీసుకురావాలని కమిటీ పేర్కొంది. ఇందుకోసం, ఆధార్, బయో మెట్రిక్‌తోపాటు ఏఐ ఆధారిత డేటా అనలిటిక్స్‌ను వినియోగించుకోవాలని సూచించింది. పరీక్షల నిర్వహణ, భద్రత, నిఘా, సాంకేతికత వంటి అంశాలకు సంబంధించి డైరెక్టర్ స్థాయిలో 10 సిఫారసులను చేసిందిఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల ధర తగ్గింపు2025 నుంచి ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల ధరలను తగ్గించనున్నట్లు మంత్రి ప్రధాన్ వివరించారు. ప్రస్తుతం ఏడాదికి 5 కోట్ల టెక్ట్స్ బుక్స్‌ను మాత్రమే ప్రచురిస్తున్నారన్నారు. 2025 నుంచి ముద్రణ సామర్థ్యాన్ని 15 కోట్లకు పెంచుతామని, నాణ్యమైన పుస్తకాలను అందిస్తామని ప్రక టించారు. పాఠ్య పుస్తకాల ధరలను పెంచి, విద్యా ర్థుల తల్లిదండ్రులపై భారం పెంచబోమన్నారు. మారిన సిలబస్ ప్రకారం 2026–27 నుంచి 9 నుంచి 12వ తరగతి వరకు కొత్త పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తెస్తామని మంత్రి వెల్లడించారు. -
కాంగ్రెస్ చిల్లర రాజకీయాలకు చెంపపెట్టు
న్యూఢిల్లీ: నీట్–యూజీ అంశంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు కాంగ్రెస్ బాధ్యతారాహిత్యానికి, చిల్లర రాజకీయాలకు చెంపపెట్టని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. సుప్రీం నిర్ణయం విద్యార్థుల ఓటమి కానేకాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి కేంద్రం ప్రభుత్వంపైనే కాదు, సుప్రీంకోర్టుపైనా విశ్వాసం లేదని విమర్శించారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనూ పేపర్ లీకేజీలు జరగడం తెలియదా అని ఆ పార్టీ చీఫ్ ఖర్గేను ఆయన ప్రశ్నించారు. అప్పటి ఘటనలపై ఎందుకు మౌనంగా ఉన్నారన్నారు. పేపర్ లీకేజీలకు, అవినీతికి తండ్రివంటిది కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. రాజకీయ మనుగడ కోసం ఆ పార్టీ అబద్ధాలు, అరాచకాలనే నమ్ముకుందని మంత్రి మండిపడ్డారు. స్వార్థ ప్రయోజనాలపైనే తప్ప, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఖర్గేకు, రాహుల్ గాం«దీకిగానీ, కాంగ్రెస్ పార్టీకిగానీ ఏమాత్రం పట్టింపు లేదని ఆరోపించారు. -
Dharmendra Pradhan: రెండు రోజుల్లో నీట్–పీజీ పరీక్ష షెడ్యూల్
న్యూఢిల్లీ: నీట్–పీజీ పరీక్షల కొత్త షెడ్యూల్‌ను నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్(ఎన్బీఈ) ఒకటి రెండ్రోజుల్లో ప్రకటిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. నీట్–పీజీ పరీక్ష ప్రశ్నపత్నం డార్క్‌నెట్‌లో లీకైందని, టెలిగ్రామ్ యాప్‌లో షేర్ చేశారని తెలిపారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తోందన్నారు. కీలకమైన పోటీ పరీక్షల్లో పేపర్ లీకవుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో గతవారం జరగాల్సిన నీట్–పీజీ పరీక్షను ముందు జాగ్రత్తగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. అలాగే జూన్ 18న జరిగిన యూజీసీ–నెట్ పరీక్ష సైతం రద్దయ్యింది. -
నీట్ ఒక కుంభకోణం: ఎంకే స్టాలిన్
చెన్నై: మెరిట్‌కు కొలమానంగా పేర్కొంటున్న నీట్ ఒక కుంభకోణం, ఈ పరీక్ష పేద విద్యార్థుల ప్రయోజనాలకు, సామాజిక న్యాయానికి విరుద్ధమని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. ఇటువంటి విధానం అమలును నిలిపివేయాలని ఆదివారం ఆయన ‘ఎక్స్’లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ‘నీట్ చుట్టూ ముసురుకున్న వివాదాలు, ఈ విధానంతో జరుగుతున్న అన్యాయాన్ని చెప్పకనే చెబుతోంది. సమాజంలో అణగారిన వర్గాల విద్యార్థుల అభ్యున్నతికి మరిన్ని దారులు తెరవడానికి బదులుగా వారికి నీట్ అవకాశాలను దూరం చేస్తోంది’అని ఆరోపించారు. ‘కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎన్టీఏను సమరి్థస్తున్నప్పటికీ వాస్తవం మరోలా ఉంది. గుజరాత్లో ఓఎంఆర్ షీట్లను ట్యాంపర్ చేసినట్లుగా వచ్చిన ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదంతా ఓ కుట్ర. నీట్ కోచింగ్ సెంటర్లు, ఫిజిక్స్ ఉపాధ్యాయుడు, ఓ స్కూల్ ప్రిన్సిపల్‌కు ఇందులో హస్తముంది. ఈ వ్యవస్థను మార్చాల్సిన అవసరముంది’అని స్టాలిన్ పేర్కొన్నారు. -
NEET-UG 2024: లీక్ కాలేదు, రిగ్గింగ్ జరగలేదు: ప్రధాన్
న్యూఢిల్లీ: నీట్–యూజీ పరీక్షలో ప్రశ్నపత్రం లీక్ అయ్యిందంటూ వచి్చన ఆరోపణలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఖండించారు. అందుకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని అన్నారు. పేపర్ లీక్గానీ, రిగ్గింగ్ గానీ జరగలేదని చెప్పారు. పేపర్ లీక్ అయ్యే అవకాశమే లేదని పేర్కొన్నారు. ఏ ఒక్క అభ్యరి్థకీ అన్యాయం జరగకూడదన్నదే తమ ఉద్దేశమని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. నీట్ పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)కు ఎంతో విశ్వసనీయత ఉందని తెలిపారు. విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. -
చెక్ బౌన్స్ కేసులో దోషిగా మంత్రి
బెంగళూరు: కర్ణాటక పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ మంత్రి మధు బంగారప్పను చెక్ బౌన్స్ కేసులో ప్రత్యేక కోర్టు దోషిగా తేలి్చంది. ఫిర్యాదుదారులైన రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థకు రూ.6.96 కోట్లు జరిమానాగా చెల్లించాలని ఆయనను ఆదేశించింది. మరో రూ.10 వేలను కర్ణాటక ప్రభుత్వానికి చెల్లించాలని స్పష్టం చేసింది. జరిమానా చెల్లించకపోతే ఆరు నెలలపాటు సాధారణ జైలు శిక్ష అనుభించాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఇటీవల తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆకాశ్ ఆడియో–వీడియో ప్రైవేట్ లిమిటెట్‌ను మొదటి నిందితులుగా, ఆకాశ్ ఆడియో–వీడియో ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మధు బంగారప్ప రెండో నిందితుడిగా కోర్టు గుర్తించింది. రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థ నుంచి మధు బంగారప్ప రూ.6 కోట్లు డిపాజిట్ రూపంలో తీసుకున్నారు. చాలా రోజులు తిరిగి చెల్లించలేదు. గట్టిగా నిలదీయగా చెక్కు ఇచ్చారు. బ్యాంకు ఖాతాలో నగదు లేకపోవడంతో అది బౌన్స్ అయ్యింది. దాంతో రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. -
చంద్రయాన్ 3 పోర్టల్ ప్రారంభం
ఢిల్లీ: చంద్రయాన్ 3 ప్రాజెక్టుపై కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రయాన్ 3పై పోర్టల్‌ను నేడు ప్రారంభించనుంది. కోర్సులను కూడా ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేసింది. చంద్రయాన్‌పై ప్రత్యేక కోర్సు మాడ్యూళ్లను ప్రారంభించినట్లు పేర్కొంది.'అప్నా చంద్రయాన్' వెబ్సైట్ ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. పోర్టల్‌ను ప్రోత్సహించాలని ఉన్నత విద్యా సంస్థలను కోరింది. విద్యార్థులు, ఉపాధ్యాయులలో అవగాహన కల్పించి ప్రచారం చేయాలని తెలిపింది. విద్యార్థులందరినీ ఈ ప్రత్యేక కోర్సుల్లో చేరేలా ప్రోత్సహించాలని కోరింది. చంద్రయాన్-3 మహా క్విజ్‌కు రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్వహించాలని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ విద్యా సంస్థలను కోరింది. చంద్రయాన్-3 మిషన్, అంతరిక్ష శాస్త్రం గురించి విద్యార్థుల జ్ఞానాన్ని పరీక్షించేందుకు వీలుగా క్విజ్ నిర్వహించనున్నారు. అంతరిక్ష కార్యక్రమాలపై తెలుసుకోవడానికి విద్యార్థులను ప్రోత్సహించడం ఈ క్విజ్ ప్రధాన లక్ష్యం. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో అక్టోబర్ 31, 2023 వరకు నమోదు చేసుకోవచ్చు. ఇదీ చదవండి: స్వలింగ జంటల వివాహంపై సుప్రీంకోర్టు తీర్పు -
10, 12 బోర్డు పరీక్షలు ఇకపై ఏడాదిలో రెండుసార్లు
న్యూఢిల్లీ: పది, పన్నెండో తరగతి బోర్డు పరీక్షలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడాదిలో రెండుసార్లు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. రెండు పరీక్షలు రాయాలా, లేదా ఒక్క పరీక్షకే హాజరు కావాలా అన్నది విద్యార్థుల ఇష్టమని స్పష్టం చేసింది. ఈ ఆప్షన్ ఐచ్ఛికమే తప్ప, నిర్బంధం కాదని వివరించింది. విద్యార్థుల్లో పరీక్షంటే భయం దూరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం పీటీఐకి ఇంటర్వ్యూలో పలు అంశాలను వివరించారు. నూతన కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్సీఎఫ్) సాధాసాధ్యాలపై మంత్రి ప్రధాన్ మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈకి మాదిరిగానే విద్యార్థులకు రెండుసార్లు పరీక్ష రాసేందుకు వీలు దొరుకుతుంది. బెస్ట్ స్కోర్ సాధించొచ్చు. ఈ ఆప్షన్ పూర్తిగా విద్యార్థుల ఇష్టానికే వదిలేశాం. ఇందులో ఎటువంటి నిర్బంధం లేదు. ఏడాదిలో ఒకేసారి పరీక్ష ఉండటం, ఈ చాన్స్ మిస్సయితే ఒక సంవత్సరం కోల్పోతామనే భయం, ఒత్తిడి ఎక్కువమంది విద్యార్థుల్లో ఉంటున్నాయి. దీంతో, వారు పరీక్షలు సరిగా రాయలేకపోతున్నారు. రెండుసార్లు పరీక్షలు రాసే అవకాశమిస్తే ఇలాంటి భయాలు వారిలో ఉండవు. పూర్తిస్థాయిలో ప్రిపేరయి పరీక్ష రాస్తే సంతృప్తికరమైన స్కోర్ సాధించగలుగుతారు. ఒకసారి మంచి స్కోర్ తెచ్చుకున్న విద్యార్థి మరో విడత పరీక్ష రాయాలా వద్దా అనేది ఐచ్చికం. ఇందులో ఎటువంటి నిర్బంధం లేదు’అని వివరించారు. 2024 నుంచే ఈ విధానాన్ని అమల్లోకి తెస్తున్నామని తెలిపారు. డమ్మీ స్కూల్స్ పనిపడతాం రాజస్తాన్‌లోని కోటాలో పరీక్షలకు శిక్షణ నిమిత్తం వచ్చిన విద్యార్థులు ఈ ఏడాదిలో రికార్డు స్థాయిలో బలవన్మరణాలకు పాల్పడటంపై మంత్రి ప్రధాన్ స్పందిస్తూ.. ‘ఇది చాలా సున్నితమైన అంశం. విస్మరించరానిది’అన్నారు. అదేవిధంగా, తమ సొంత రాష్ట్రంలోని స్కూల్లో అడ్మిట్ అయిన విద్యార్థులు అక్కడ చదవకుండా, పరీక్షల శిక్షణ కోసం కోటా వంటి చోట్లకు వెళ్తుండటంపై మంత్రి.. ఇటువంటి డమ్మీ స్కూళ్లపై చర్యలకు ఉపక్రమించాల్సిన సమయం వచ్చిందన్నారు. పాఠశాలకు హాజరు కాకపోవడం విద్యార్థుల వ్యక్తిగత ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుందని, వారు ఒంటరితనంతో బాధపడుతూ, ఒత్తిడులకు గురవుతున్నట్లు నిపుణులు చెబుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విద్యా సంబంధ విధాన నిర్ణయాలపై ప్రభుత్వానికి సలహాలిచ్చే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్(సీఏబీఈ)ని ఆధునీకరిస్తామని మంత్రి ప్రధాన చెప్పారు. -
విద్యార్థుల ఆత్మహత్యలు నివారించేలా..మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు!
ఇటీవల కాలంలో చదువుకునే విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. ఎగ్జామ్స్‌లో అనుకున్నన్ని మార్కులు రాకపోయినా లేదా తమ లక్ష్యాన్ని చేరుకోలేకపోయినా ఆందోళనకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కన్నవాళ్లకు తీరని వ్యధను మిగులుస్తున్నారు. ఇలాంటి వాటిని అరికట్టేలా పాఠశాల స్థాయి నుంచే మార్పులు తీసుకువచ్చేలా విద్యామంత్రిత్వ శాఖ వినూత్న నిర్ణయం తీసుకుంది. అందుకోసం ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేసింది. సున్నిత మనస్తత్వం గల విద్యార్థులను గుర్తించి స్వీయ హాని తలపెట్టుకోకుండా మద్దతు ఇచ్చేలా పాఠశాలల్లో సమగ్రమైన టీమ్ విధానాన్ని అవలంభించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ మేరకు విద్యార్థులు స్వీయ హానిని చేసుకోకుండా నిరోధించేలా ప్రేరేపించడం, నిర్వహించడం, సానుభూతి, సాధికారత, అభివృద్ధి తదితద మద్దతు అందించేలా మార్గదర్శకాలను విడుదల చేసింది మంత్రిత్వ శాఖ. అందుకు అనుగుణంగా స్కూల్ వెల్నెస్ టీమ్‌ని ఏర్పాటు చేయడం. స్వీయ హాని ప్రమాదంలో ఉన్న విద్యార్థులను ఆ టీమ్ గుర్తించి స్పందించడం, మద్దతు ఇవ్వడం వంటి చర్యలు ఈ ముసాయిదా మార్గదర్శకాల్లో ఉన్నాయి. విద్యార్థులు వ్యక్తిగత సామాజిక సమస్యలు, ఆందోళనలను సమర్ధవంతంగా నిర్వహించలేనప్పుడూ నిరంత దుఃఖం, అసంతృప్తి, నిరాశ, మానసిక కల్లోలం, నిస్సహాయ భావన వంటి తీవ్ర పరిణామాలకి దారితీస్తుంది. చాలామటుకు ఇలాంటి కేసులు చివరకు స్వీయ హానికి దారితీస్తున్నాయని ముసాయిదా మార్గదర్శకాలు పేర్కొన్నాయి. అందువల్ల ముందుగా ఆత్మహత్యల నివారణ దిశగా ఈ స్కూల్ టీమ్‌లు ప్రయత్నాలు చేయాలని విద్యామంత్రిత్వ శాఖ పేర్కొంది. పాఠశాలల్లో అందుబాటులో ఉన్న వనరులను బట్టి స్కూల్ వెల్నెస్ టీమ్ క్రమం తప్పకుండా విద్యార్థుల తీరు తెన్నులను గమనిస్తూ ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండేలా మద్దతు ఇచ్చి వారిని గైడ్ చేయాలని పేర్కొంది. పాఠశాలలోని ఈ స్కూల్ వెల్నెస్ టీమ్‌లు పనితీరును వార్షిక ప్రాతిపదికన సమీక్షించాలి. అలాగే ఆత్మహత్యలను సమర్ధవంతంగా నిరోధించేలా పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి కుటుంబాలు సమిష్టిగా భాగస్వామ్యం అయ్యి పనిచేయాలని ముసాయిదా సిఫార్సు చేసింది. (చదవండి: గురక ఇబ్బంది పెడుతోందా!..వెంటనే తగ్గిపోవాలంటే..) -
అర్హులైన టీచర్లకు మెసేజ్‌లు పంపండి: మంత్రి సబిత
సాక్షి, హైదరాబాద్: టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను న్యాయస్థానం తీర్పుకు లోబడి నిర్వహించాలని మంత్రి సబిత ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. బదిలీకి అర్హత గల ప్రతి ఉపాధ్యాయుడికీ బదిలీల సమాచారం అందించాలని సూచించారు. ఈ మేరకు దరఖాస్తు చేసుకోవలసిందిగా ప్రతి ఒక్కరికీ మెసేజ్‌లు పంపాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో గురువారం ఎస్సీఈఅర్టీ కార్యాలయంలో ఆమె అధికారులతో సమావేశమయ్యారు. పారదర్శకతతో ఎలాంటి అపోహలకు తావులేకుండా పదోన్నతులు, బదిలీల ప్రక్రియను నిర్వహించాలని ఆదేశించారు. వెంటనే సంబంధిత విధివిధానాలు రూపొందించాలని సూచించారు. ఆన్లైన్ ప్రక్రియలో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బదిలీల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు వీలుగా రాష్ట్రస్థాయి అధికారులను జిల్లాల్లో పర్యవేక్షకులుగా నియమించాలని సూచించారు. సమావేశంలో పాఠశాల విద్యా సంచాలకులు దేవసేన తదితరులు పాల్గొన్నారు. పదోన్నతుల తర్వాత ఖాళీల భర్తీ పదోన్నతులు, ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) పూర్తయిన తర్వాత విద్యాశాఖలో ఉండే ఇతర ఖాళీలను భర్తీ చేస్తామని సమావేశానంతరం మంత్రి మీడియాకు తెలిపారు. టీచర్ పోస్టుల భర్తీకి కొంతమంది అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయ ఖాళీల్లో గెజిటెడ్ హెడ్ మాస్టర్, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ పోస్టులను, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రయతి్నస్తున్నదని, ఈ సమయంలో అన్ని పారీ్టలు, అన్ని వర్గాలు సహకరించాలని మంత్రి కోరారు. ఇది కూడా చదవండి: నెల రోజుల్లోనే బదిలీలు, పదోన్నతులు -
నెల రోజుల్లోనే బదిలీలు, పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన అధికారిక కసరత్తు ఊపందుకుంది. విద్యాశాఖ మంత్రి నుంచి ఉన్నతాధికారుల వరకూ అధికారులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయి అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో నెల రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ శుక్రవారం విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 3 నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టే వీలుంది. వెంట వెంటనే ఎడిట్ ఆప్షన్లు, జాబితాల తయారీ చేపట్టి, సెప్టెంబర్ నెలాఖరుకు ప్రక్రియను ముగించాలని భావిస్తున్నారు. కొన్నేళ్లుగా బదిలీలు, పదోన్నతులు లేకపోవడంతో టీచర్లలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 1.05 లక్షల మంది టీచర్లుండగా ఎన్నికల సమయంలో వీరిని ఆకట్టుకోవడానికి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బదిలీలు, పదోన్నతుల ప్రక్రియనే ప్రధాన ఆయుధంగా ప్రభుత్వం భావిస్తోంది. డీఈవోలతో డైరెక్టర్ టెలీకాన్ఫరెన్స్ జిల్లా విద్యాశాఖాధికారులతో పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన హైదరాబాద్ నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ సక్రమంగా చేపట్టేందుకు సన్నద్ధమవ్వాలని కోరారు. అవసరమైన సమాచారంతో సిద్ధంగా ఉండాలని చెప్పారు. బదిలీలకు కటాఫ్ డేట్‌ను గతంలో ఫిబ్రవరి 1గా నిర్ణయించారని, ఇప్పుడు ఆ తేదీని సెప్టెంబర్ 1గా నిర్ణయించాలని భావిస్తున్నట్లు తెలిపారు. గతంలో బదిలీల కోసం దాదాపు 78 వేల దరఖాస్తులు అందాయి. ఇందులో 58 వేలు అర్హమైనవిగా గుర్తించారు. ఇప్పుడీ సంఖ్య మరింత పెరిగే వీలుందని భావిస్తున్నారు. టీచర్లు 8 ఏళ్ళు, ప్రధానోపాధ్యాయులు 5 ఏళ్ళు ఒకే చోట పనిచేసినట్లయితే బదిలీకి అర్హులవుతారు. కటాఫ్ తేదీని పొడిగించడంతో సెప్టెంబర్ 1 నాటికి 8, 5 ఏళ్ళు నిండే వాళ్ళ జాబితాను కొత్తగా రూపొందించాల్సి ఉంటుంది. గతంలో దరఖాస్తు చేసిన టీచర్లు సర్వీస్ కాలాన్ని ఆన్లైన్లో పొందు పర్చడమా? డీఈవోలే ఈ డేటాను అప్డేట్ చేస్తారా? అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, ఖాళీల విషయంలో సమగ్ర వివరాలను మాత్రం డీఈవోలు అందించాల్సి ఉంటుంది. మూడేళ్లలో పదవీ విరమణ చేయనున్న టీచర్లకు బదిలీల నుంచి మినహాయింపు ఇస్తారు. కటాఫ్ తేదీ పొడిగించడంతో ఇప్పుడు ఖాళీల సంఖ్యలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది. చిక్కుముడిగా దివ్యాంగుల వ్యవహారం అంగ వైకల్యం ఉన్న వారికి బదిలీల్లో ప్రత్యేక ప్రాధాన్యమిస్తారు. గతంలో రూపొందించిన నిబంధనల ప్రకారం 70 శాతం అంగవైకల్యాన్ని పరిగణలోనికి తీసుకుంటారు. అయితే ఇటీవల న్యాయస్థానం ఈ వ్యవహారాన్ని తప్పుబట్టింది. 40 శాతం అంగవైకల్యాన్ని పరిగణలోనికి తీసుకోవాలని ఓ కేసులో తీర్పు ఇచి్చంది. దీంతో బదిలీల్లోనూ దీన్నే కొలమానంగా తీసుకోవాలని దివ్యాంగ ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై సమగ్ర వివరాలు అందజేయాల్సిందిగా మంత్రి సబిత అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. 317 జీవో ద్వారా బదిలీ అయిన వారికి సర్వీస్ పాయింట్లలో అన్యాయం జరిగిందని, దీన్ని సరిచేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) నేతలు హన్మంతరావు, నవాత్ సురేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపకుండా ఏకపక్షంగా షెడ్యూల్ విడుదలకు అధికారులు సన్నాహాలు చేయడం అన్యాయమని టీఎస్పీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు షౌకత్ అలీ విమర్శించారు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో అన్ని స్థాయిల నేతల సలహాలు, సూచనలు తీసుకోవాలని పీఆర్టీయూటీఎస్ నేతలు శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్ రావు సూచించారు. సంఘాల హల్చల్ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మొదలవ్వడంతో ఉపాధ్యాయ సంఘాల నేతలు అధికారులను, మంత్రి సబితను కలుస్తున్నారు. పలు సలహాలు సూచనలతో వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. సప్టెంబర్ 1ని కటాఫ్‌గా నిర్ణయించాలని కోరుతూ ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్ మంత్రి సబితకు వినతి పత్రం సమర్పించారు. ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకెళ్ళాలని టీఎస్‌యూటీఎఫ్ నేతలు జంగయ్య, చావా రవి అధికారులను కోరారు. ఇది కూడా చదవండి: సాగు పరిశోధనలో అమెరికా సహకారం కావాలి.. మంత్రి నిరంజన్ రెడ్డి -
ఏటా రెండుసార్లు బోర్డు పరీక్షలు
న్యూఢిల్లీ: జాతీయ విద్యావిధానంలో భాగంగా పరీక్షల విధానంలో కేంద్రం కొత్త మార్పులకు సిద్ధమైంది. ఇకపై ఇంటర్లో ఏటా రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలని, భారతీయ భాషలు తప్పనిసరిగా చదవాలని నూతన కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్సీఎఫ్) ప్రతిపాదనలు చేసింది. అలాగే, 9–12 తరగతుల విద్యార్థులకు కనీస సబ్జెక్టుల సంఖ్యను పెంచాలని చెప్పింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎన్సీఎఫ్ నివేదికను బుధవారం జాతీయ విద్య, పరిశోధన శిక్షణ మండలికి అందించారు. ఏటా రెండు సార్లు పరీక్షలు నిర్వహించడం వల్ల ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థులు ఏ పరీక్షలో అయితే ఉత్తమ మార్కులు సాధిస్తారో వాటినే ఎంచుకునే అవకాశం ఉంటుందని కేంద్ర విద్యాశాఖ చెప్పింది. ఏటా రెండుసార్లు నిర్వహించడం వల్ల విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసే అవకాశం ఉంటుందని పేర్కొంది. క్రమక్రమంగా అన్ని బోర్డులు కూడా సెమిస్టర్ లేదా టర్మ్ బేస్డ్ వ్యవస్థకు మారతాయని కేంద్ర విద్యాశాఖ స్పష్టంచేసింది. దీనివల్ల విద్యార్థులు ఒక సబ్జెక్టును పూర్తిచేయగానే అతడు పరీక్ష రాయొచ్చని, ఇలా ఒక పరీక్ష పూర్తయినా విద్యార్థిపై కంటెంట్ భారం తగ్గుతుందని చెప్పింది. ఎన్‌సీఎఫ్‌ను ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరిరంగన్ నేతృత్వంలోని జాతీయ స్టీరింగ్ కమిటీ రూపొందించింది. బోర్డు పరీక్షల్లో ఇలాంటి సంస్కరణలు తొలిసారి కాదు. 2009లో పదో తరగతిలో ‘నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ)’ విధానాన్ని ప్రవేశపెట్టగా, 2017లో రద్దుచేసి తిరిగి వార్షిక పరీక్షల విధానాన్ని తెచ్చారు. 9, 10 తరగతుల విద్యార్థులు ఇకపై కచ్చితంగా మూడు లాంగ్వేజ్ సబ్జెక్టులు చదవడం తప్పనిసరని ఎన్సీఎఫ్ సిఫార్సు చేసింది. వీరు మూడు లాంగ్వేజ్‌లతోపాటు మ్యాథ్స్, కంప్యూటేషనల్ థింకింగ్, సోషల్ సైన్స్, సైన్స్, ఆర్ట్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, వెల్–బియింగ్, వొకేషనల్ ఎడ్యుకేషన్ లాంటి వాటి నుంచి ఏడు సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. -
పాము కాటుకు గురైన ప్రముఖ మంత్రి..
చంఢీగర్: పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ పాముకాటుకు గురయ్యారు. రూపనగర్ జిల్లాలోని ఆనంద్‌పూర్ సాహిబ్ ప్రాంతంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సంచరిస్తుండగా.. ఈ ఘటన జరిగింది. ఆగష్టు 15 రాత్రి పాముకాటుకు గిరికాగా.. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా పాంగ్, భాక్రా డ్యామ్‌ల నుంచి నీటిని విడుదల చేయగా.. పంజాబ్‌లో రూప్‌నగర్, గుర్దాస్పూర్, హోసియాపూర్, కపుర్తలా, ఫిరోజ్‌పూర్ ప్రాంతాలు వరదమయమయ్యాయి. ఈ డ్యామ్‌ల నుంచి విడదలైన నీటితో బియాస్, సట్లేజ్ నదుల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. With God's grace, the flood situation in my constituency, Shri Anandpur Sahib, is better now. During the rescue operations, I was bitten by a venomous snake on the intervening night of 15th Aug, but that didn’t deter my determination to help my people. With God’s grace and… pic.twitter.com/vQkX14xltK — Harjot Singh Bains (@harjotbains) August 19, 2023 మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ తన సొంత నియోజకవర్గమైన ఆనంద్‌పూర్ సాహిబ్‌లో సహాయక చర్యలు చేపట్టారు. తానే స్వయంగా రంగంలోకి దిగి సహాయక చర్యలను పర్యవేక్షిస్తుండగా..పాముకాటుకు గురయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షితంగా రక్షించినట్లు చెప్పారు. ఇదీ చదవండి: బీజేపీకి ఎదురుదెబ్బ.. సింధియాను వీడి.. కాంగ్రెస్ చేరి.. -
సీబీఎస్ఈ బోధన... ఇకపై తెలుగులో కూడా
భువనేశ్వర్: ఉన్న సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) స్కూళ్లలో విద్యార్థులు ఇకపై తెలుగుతో పాటు 22 భారతీయ భాషల్లో చదువుకోవచ్చు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం ఈ మేరకు వెల్లడించారు. ప్రస్తుతం వాటిల్లో హిందీ, ఇంగ్లిష్ మీడియాల్లో మాత్రమే చదువుకునేందుకు వీలుంది. ఇకపై రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో గుర్తించిన తెలుగు, బెంగాలీ, కన్నడ, కొంకణి, మరాఠీ, పంజాబీ, సంస్కృతం, తమిళం, మైథిలి, డోగ్రీ వంటి 22 భాషల్లో తమకిష్టమైన వాటిలో చదువుకోవచ్చు. పరీక్షలు కూడా ఆయా భాషల్లోనే జరుగుతాయి. -
60 వేల తరగతి గదుల్లో ఇంటరాక్టీవ్ ప్యానల్స్ ఏర్పాటు: మంత్రి బొత్స
సాక్షి, కృష్ణా: "ఎండల కారణంగా వారం పాటు ఒంటిపూట బడులు పొడిగించాం. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్లతో బోధన ఉంటుంది, 6వ తరగతి నుంచి పైస్థాయి వరకు ఇంటరాక్టీవ్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తున్నాం, విద్యా బోధనపై టీచర్లకు ఆన్లైన్, ఆఫ్ లైన్లో శిక్షణ ఇస్తాం", అని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎండల కారణంగా సీఎం ఆదేశానుసారం వారం పాటు ఒంటిపూట బడులు పొడిగించామని తెలిపారు. అంతేకాకుండా పూర్తి పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీలు పూర్తి చేశామన్నారు. ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమైయ్యామని వారి సహకారంతో విద్యా వ్యవస్థని మరింత పటిష్టం చేస్తామని చెప్పారు. 1.75 లక్షల మంది ఉపాద్యాయులలో 82 వేల మంది బదిలీకి ధరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. ఈ క్రమంలో 52 వేల మందికి పైగా ఉపాధ్యాయులు బదిలీ అయ్యారని తెలిపారు. సీనియర్ హెడ్ మాస్టర్లని సెకండ్ ఎంఈఓలగా నియమించామని.. కొత్తగా 679 మంది సెకండ్ ఎంఈఓ పోస్టులని భర్తీ చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 355 ఎంఈఓ వన్ పోస్టులు ఖాళీగా ఉండగా వాటిని కూడా సీనియర్ హెడ్ మాస్టర్లతో భర్తీ చేయిస్తామని పేర్కొన్నారు. నాడు–నేడు పనులు జరుగుతున్న స్కూళ్లకు వాచ్మెన్ పోస్టులు ఇచ్చామని చెప్పారు. కంప్యూటర్ పోస్టుల ఫైల్ కూడా మూవ్ అవుతోందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లతో బోధన 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్లతో బోధన విధానాన్ని నూటికి నూరు శాతం అమలు చేస్తామని మంత్రి చెప్పారు. ప్రతి సబ్జెట్‌కు టీచర్ ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. అంతేకాకుండా ఇంటరాక్ట్ ఫ్యానల్ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చేందుకు రాష్ట్రంలో 175 ఇంజినీరింగ్ కాలేజీలను కూడా ఎంపిక చేశామన్నారు. ఇద్దరు, ముగ్గురు ప్రొఫెసర్లను మాస్టర్ ట్రైనింగ్ కూడా ఇప్పించామన్నారు. వారి ద్వారా టీచర్లకు ఆఫ్ లైన్, ఆన్లైన్లో ట్రైనింగ్ ఇస్తామన్నారు. డిసెంబర్ 21వ తేదీ నాటికి ఆరో తరగతి పైనున్న అన్ని క్లాస్‌లకు ఇంటరాక్ట్ ఫ్యానల్స్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. 60 వేల తరగతి గదుల్లో ఇంటరాక్టీవ్ ప్యానల్స్ ఏర్పాటు సుమారు 60 వేల క్లాస్ రూమ్స్‌లో ఇంటరాక్టీవ్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న స్కూళ్లకు ఒక్కో స్కూల్‌కు ఒక్కో స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 10 టీవీలు ఏర్పాటు చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. మిగతా స్కూళ్లలో కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలు కూడా క్షేత్ర స్థాయిలో ఉపాధ్యాయులతో సమావేశమై ఈ ఏడాది కూడా మంచి ఫలితాలు సాధించేలా కృషి చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. చదవండి: స్కూల్ నిర్మించడం కోసం ఆ రైతు ఏం చేశాడంటే.. -
జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి టైగర్ జగర్నాథ్ కన్నుమూత..
రాంచీ: జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి జగర్నాథ్ మహతో దా కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 'తీరని నష్టం జరిగింది. మన టైగర్ జగర్నాథ్ దా ఇక లేరు. జార్ఖండ్ గొప్ప ఉద్యమకారుడు, నిరంతరం శ్రమించే వ్యక్తి, విశేష ప్రజాధరణ గల నాయకుడ్ని మనం కోల్పోయాం. చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలి. ఈ విపత్కర పరిస్థితిలో కుటుంబసభ్యులకు మనోధైర్యం చేకూర్చాలని ప్రార్థిస్తున్నా.' అని సీఎం ట్వీట్ చేశారు. अपूरणीय क्षति! हमारे टाइगर जगरनाथ दा नहीं रहे! आज झारखण्ड ने अपना एक महान आंदोलनकारी, जुझारू, कर्मठ और जनप्रिय नेता खो दिया। चेन्नई में इलाज के दौरान आदरणीय जगरनाथ महतो जी का निधन हो गया। परमात्मा दिवंगत आत्मा को शांति प्रदान कर शोकाकुल परिवार को दुःख की यह विकट घड़ी सहन करने की… — Hemant Soren (@HemantSorenJMM) April 6, 2023 అయితే జగర్నాథ్కు ఇటీవలే చెన్నై ఆస్పత్రిలో ఊపరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది. 2020లో కరోనా బారిన పడిన అనంతరం కూడా ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. గతనెల అనారోగ్యం బారినపడటంతో రాంచీ నుంచి హెలికాప్టర్ ద్వారా చెన్నై ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు కోల్పోయారు. చదవండి: దిగ్భ్రాంతికి లోనయ్యా... చాలా బాధగా ఉంది: ప్రకాష్ రాజ్ -
ఆ బుడ్డోడి కాన్ఫిడెన్స్‌కి మంత్రి ఫిదా!
చిన్నారులకు సంబంధించిన పలు వీడియోలు చూసి ఉంటాం. వాటిల్లో వాళ్ల అమ్మనాన్నలు లేదా గురువులు వారి చేత దగ్గరుండి పాడించటం లేదా డ్యాన్సులు చేయించడం వంటివి చేస్తారు. అప్పుడూ ఎవరైన ధైర్యంగా చేయడం వేరు. కానీ ఇక్కడొక బుడ్డోడు మాత్రం పాఠశాలలో తన క్లాస్మేట్స్ అందరి ముందు ఏ మాత్రం బెణుకులేకుండా భలే అద్భుతంగా పాట పాడాడు. అతను పాడే విధానం ఏదో ఒక పెద్ద స్టార్ సింగర్ మాదిరి ఓ రేంజ్లో మంచి కాన్ఫిడెన్స్‌తో పాడాడు. దీన్ని చూసి నాగాలాండ్ ఉన్నత విద్య, గిరిజన వ్యవహారాల మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ ఫిదా అయ్యారు. ఇలాంటి ఆత్మవిశ్వాసమే జీవితంలో కావలని క్యాప్షెన్న్ జోడించి మరీ అందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు ఆత్మివశ్వాసం అంటే భయం లేకపోవడం కాదు, దానిని ఎదుర్కొంటూ ముందుగు సాగే సామర్థ్యం! అని చెబుతూ ఆ పిల్లవాడికి హ్యాట్సాప్ అంటూ ప్రశంసిస్తూ.. ట్వీట్ చేశారు. Bas itna confidence chahiye life me. 😀 "ज़िन्दगी जीने के लिए नज़रो की नहीं ! नज़ारो की ज़रूरत होती है !!" pic.twitter.com/EcGrUnXtUi — Temjen Imna Along (@AlongImna) January 18, 2023 (చదవండి: మోదీ ఇలా అనడం తొలిసారి కాదు!: బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు) -
విద్యాశాఖ మంత్రి సబితకు నిరసన సెగ
-
ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ " స్ట్రెయిట్ టాక్ "
-
తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు: మంత్రి బొత్స
సాక్షి, విజయవాడ: పాదయాత్ర ముసుగులో టీడీపీ చేస్తోంది రియల్ ఎస్టేట్ యాత్ర అని ప్రజలు గ్రహించాలని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన బొత్స.. ‘విశాఖ వచ్చి రాజధాని వద్దు అంటే ఆ ప్రాంత ప్రజలు ఎందుకు ఒప్పుకుంటారు. పాదయాత్రను రైతుల ముసుగులో టీడీపీ చేస్తోంది. అది రియల్ ఎస్టేట్ యాత్ర అని తెలుసుకోవాలి. లాండ్ పూలింగ్‌లో భూములు ఇవ్వడం ఇది మొదటిసారి కాదు కదా? పోలవరంకు ఇస్తే త్యాగం చేసినట్లు. అమరావతిలో భూములు ఇచ్చిన వారికి మంచి పరిహారం ఇచ్చాం. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి మా ప్రభుత్వం విధానం. రైతులకు ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం ముందుకెళ్తాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత లెక్కలు తీస్తే ఉత్తరాంధ్ర బాగా వెనుకబడి ఉంది. ఐదు లక్షల కోట్లు మట్టిలో పోసి తగలెయ్యాలా? 10 వేల కోట్లతో విశాఖ అభివృద్ధి చెందతుంది. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్రకు అనేక ప్రాజెక్టులు తెచ్చాను.’ అని స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇదీ చదవండి: సీఎం జగన్ స్పీచ్ ముందు ఆ నిరసనలకు విలువే లేకుండా పోయింది -
ప్రభుత్వాఫీసుల్లోనూ ఫేస్ రికగ్నిషన్ యాప్
సాక్షి, అమరావతి: త్వరలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ వ్యవస్థను తీసుకురానున్నామని.. అందులో భాగంగా తొలుత విద్యాశాఖలో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. విజయవాడలో గురువారం ఉపాధ్యా య సంఘాలతో ఆయన సమావేశమయ్యారు. పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల అటెండెన్స్ నమోదు కోసం రూపొందించిన యాప్ వినియోగంలో ఉన్న అపోహలు, ఎదురవుతున్న ఇబ్బందులపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. సమావేశం అనంతరం బొత్స మీడియాతో మాట్లాడు తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఆఫీస్ సబార్డినేట్ వరకు అందరూ ఈ ఫేస్ రికగ్నిషన్ యాప్‌నే వినియోగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, అందులో భాగంగా తొలుత విద్యాశాఖ లో దీనిని ప్రవేశపెట్టామన్నారు. అటెండెన్స్ యాప్ విషయంలో ఉపాధ్యాయులు ఎంతమాత్రం ఆందోళ న చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టంచేశా రు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాత ప్రభుత్వమని మంత్రి అన్నారు. విద్యార్థుల బాగోగులు, మంచి ప్రమాణాలతో విద్యను అందించడమే లక్ష్యంగా, పూర్తి సానుకూల దృక్పథంతోనే విధానపరమైన నిర్ణయా లు తీసుకుంటున్నామని, వాటిని అమలుచేయడంలో ఏమైనా సమస్యలు ఎదురైతే వాటిని అధిగమించ డానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని బొత్స తెలిపా రు. విద్యాశాఖలో ఉపాధ్యాయుల అటెండెన్స్‌కు సం బంధించిన యాప్ విషయంలో కొంత సమాచార లోపం వచ్చిందని.. దానిని సరిదిద్దే క్రమంలో ఆయా సంఘాలతో సమావేశం నిర్వహించి వారి సందేహా లను నివృత్తిచేసే చర్యలు చేపట్టామన్నారు. వారి అభ్యంతరాలను పరిగణనలోనికి తీసుకుని కొన్ని మార్పులు చేర్పులు చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. పాఠశాలకు ఆలస్యంగా వస్తే ఆ రోజును సెలవుగా పరిగణిస్తారన్న ప్రచారం పై మంత్రి స్పష్టతనిస్తూ.. ఉద్యోగుల హాజరు విషయంలో ఏళ్ల తరబడి ఉన్న నిబంధనలనే అమలుచేస్తున్నామని, కొత్తగా ఏమీ చేర్చలేదన్నారు. మూడు సార్లకు మించి నాలుగోసారి ఆలస్యంగా వస్తే హాఫ్ డే లీవ్ కింద పరిగణించడం తప్ప కొత్త నిబంధనలేమీ పెట్టలేదని ఆయన స్పష్టంచేశారు. రాష్ట్రంలో 1.83 లక్షల మంది ఉపాధ్యాయులు ఉంటే, ఇంతవరకు దాదాపుగా లక్ష మంది యాప్‌లో రిజిస్టర్ చేసుకున్నారని, మిగిలిన వారందరూ కూడా యా ప్ను డౌన్లోడ్ చేసుకుని దాని వినియోగాన్ని అల వాటు చేసుకునేందుకు 15 రోజులను ట్రైనింగ్ పీరి యడ్గా పరిగణించాలని నిర్ణయించామన్నారు. 5 జూనియర్ కాలేజీలు క్లస్టర్ కళాశాలలుగా మార్పు మరోవైపు.. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురంలోని ఐదు జూనియర్ కాలేజీలను గుర్తించి వాటిని క్లస్టర్ జూనియర్ కాలేజీలుగా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. వీటిల్లో వర్చువల్ క్లాస్ రూమ్స్, లాంగ్వేజ్ల్యాబ్స్, డిజిటల్ బోర్డ్స్ ఇతర ఆధునిక మౌలిక సదుపాయాల ఏర్పాటుపై చర్చిం చారు. ఇంటర్ విద్యాశాఖ సర్వీస్ అంశాలపై ఇంట ర్మీడియట్ విద్యామండలి కార్యాలయంలో ఆయన అధికారులతో సమావేశమయ్యారు. ప్రిన్సిపాళ్ల పదోన్నతుల సమస్యలపై చర్చించి పరిష్కారం దిశగా పలు ఆదేశాలు జారీచేశారు. కొత్తగా విశాఖపట్నంలో రీజినల్ జాయింట్ డైరెక్టర్ కార్యాలయానికి ఆమోదం తెలిపారు. నాడు–నేడు కింద ఉన్న అన్ని జూనియర్ కళాశాలల్లోని అన్ని తరగతులకు డిజిటిల్ బోర్డుల ఏర్పాటుకు మంత్రి అంగీకరించారు. సమావేశంలో మండలి కార్యదర్శి శేషగిరిబాబు కూడా పాల్గొన్నారు. ఇదీ చదవండి: ‘టీడీపీ కుట్ర బట్టబయలు.. ఫేక్ సర్టిఫికెట్తో దొరికిపోయిన బాబు అండ్ గ్యాంగ్’ -
ఇంజనీరింగ్ ఫీజుపై నిర్ణయించలేదు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో వార్షిక ఫీజుల పెంపు నిలిపివేతపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అసలు ఇందుకు సంబంధించిన ప్రతిపాదనే ప్రభుత్వానికి రాలేదని ఆమె స్పష్టం చేశారు. ఎంసెట్ ఫలితాల వెల్లడి సందర్భంగా శుక్రవారం మంత్రి వద్ద ఈ విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా.. ఫీజులు పెంచాలా? వద్దా? అనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవలసి ఉందన్నారు. దీనికోసం ఏర్పాటైన కమిటీ అన్నీ పరిశీలించాక అవసరమైన సిఫార్సులు చేస్తుందని వివరించారు. రాష్ట్ర అడ్మిషన్ల కమిటీ (టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ) ఇప్పటి వరకూ తమ దృష్టికి ఎలాంటి ప్రతిపాదన తీసుకురాలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజుల పెంపుపై ఎఫ్ఆర్సీ కొన్ని నెలలుగా కసరత్తు చేస్తోంది. యాజమాన్యాలతో చర్చించిన తర్వాత కనిష్టంగా రూ.45 వేలు, గరిష్టంగా రూ.1.73 లక్షల వరకూ ఫీజుల పెంపునకు సమ్మతించింది. అయితే, అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో ఈఏడాది పాత ఫీజులే అమలు చేయాలని భావించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ దిశగా నివేదిక పంపినట్టు ఎఫ్ఆర్సీ వర్గాలు ఇటీవల పేర్కొన్నాయి. దీంతో ఈ ఏడాది ఫీజుల పెంపు ఉండదని అందరూ భావించారు. కానీ మంత్రి తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఫీజుల పెంపు వ్యవహారం మళ్లీ తెరమీదకొస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: ఇంజనీరింగ్‌లో బాలురు.. అగ్రికల్చర్లో బాలికలు -
బెంగాల్ కేబినెట్ నుంచి పార్థ ఛటర్జీ బర్తరఫ్
-
Partha Chatterjee: పార్థా ఛటర్జీపై సీఎం మమత బెనర్జీ వేటు
కోల్‌కత: టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పార్థా ఛటర్జీకీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ షాకిచ్చారు. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ వేటేశారు. టీచర్ల నియామకానికి సంబంధించిన కేసులో ఛటర్జీ ఇప్పటికే అరెస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన వాణిజ్యం, పరిశ్రమల శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఇండస్ట్రియల్ రికన్స్ట్రక్షన్ మంత్రిగా ఉన్నారు. టీఎంసీ ప్రధాన కార్యదర్శిగానూ కొనసాగుతున్నారు. (చదవండి: పార్థా ఛటర్జీ ఇంట్లోకి దూరిన దొంగ.. ఈడీ రైడ్‌గా భావించిన స్థానికులు) అవన్నీ చెప్పలేం ‘పార్థా ఛటర్జీని మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నా. తప్పు చేసినవారిపై టీఎంసీ కఠిన చర్యలు తీసుకుంటుంది. అధికారాన్ని దుర్వినియోగం చేసేవారి పని పట్టడానికి మా వద్ద చాలా ప్లాన్స్ ఉంటాయి.. అవన్నీ చెప్పలేం’ అని మమత పేర్కొన్నారు. ఛటర్జీకి ఉద్వాసన నేపథ్యంలో ఆ శాఖలు సీఎం మమత తనవద్దే పెట్టుకోనున్నారు. కాగా, టీచర్ రిక్రూట్మెంట్ బోర్డు స్కామ్‌లో పార్థా ఛటర్జీ భారీ స్థాయిలో వెనకేసినట్టు గుర్తించిన ఈడీ కేసులు నమోదు చేసి విచారిస్తోంది. అతని సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ వద్ద నుంచి దాదాపు రూ.50 కోట్ల వరకు నగదు, కిలోలకొద్దీ బంగారాన్ని రికవరీ చేసింది. ఇవేకాకుండా స్థిరాస్తులు, విదేశీ నగదు ఎక్చేంజీకి సంబంధించిన పత్రాలను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. (చదవండి: ఈడీ సోదాలపై స్పందించిన క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్) -
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వద్ద ఉద్రిక్తత
-
పది పాసైనందుకు విద్యార్థి చేసిన పని... తెగ మెచ్చుకుంటున్న విద్యా మంత్రి
మనం ఏదైనా ఎగ్జామ్ పాసైతే మన దోస్తులకు మనకు తోచిన విధానంలో ఓ చిన్న పార్టీ ఇచ్చి సంబంరం చేసుకుంటాం. బాగా డబ్బు ఉన్నవాడేతే వాడి రేంజ్లో పార్టీ ఇవ్వడమే లేక ఖరీదైన వస్తువులు తల్లిదండ్రులు గిఫ్ట్‌గా ఇవ్వడమో జరుగుతుంది. వీటన్నింటీకీ చాలా భిన్నంగా ఉన్నంతంగా ఒక విద్యార్థి తన సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. వివరాల్లోకెళ్తే...కేరళలో పదోతరగతి ఫలితాలు ఈ నెల 15న విడుదలయ్యాయి. ఈ మేరకు జిష్ణు అనే అబ్బాయి మంచి మార్కులో పదోతరగతి పాసయ్యాడు. దీంతో తన సాధించిన విజయాన్ని చాలా వెరైటీగా సెబ్రేట్ చేసుకున్నాడు జిష్ణు. తనను తాను అభినందించుకంటూ ఒక ఫ్లక్సీ బోర్డు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది కేరళ విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టికి తెగ నచ్చేసింది. ఈ క్రమంలో ఆ మంత్రి జిష్ణు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీని ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ...ఆ విద్యార్థి ఫ్లెక్సీ బోర్డులో ఏం రాశాడో వివరించారు. ఇంతకీ ఆ అబ్బాయి ఫ్లెక్సీలో.... కొంతమంది వస్తే చరిత్ర మారిపోతుంది. తాను కూడా అంతేనని. అలాగే జీవిత పరీక్షలో కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నాడు. దీంతో మంత్రి ఆ అబ్బాయి తను సాధించిన వియాన్ని సెలబ్రేట్ చేసుకున్న తీరు నచ్చిందని, చదువుకు సంబంధించిన అన్ని విషయాల్లో సహాకరాం అందిస్తాం అని పోస్ట్ చేశారు. కేరళలో ఈ ఏడాది సుమారు నాలుగు లక్షల మంది పైనే పదోతరగతి ఉత్తీర్ణులయ్యారు. ప్రస్తుతం ఈ విషయం ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ప్రపంచంలోనే అందవిహీనమైన ముఖం.. కదిలించే కథ) -
ఏపీ పాలీసెట్ ఫలితాలు విడుదల
-
హిందీ మాట్లాడేవాళ్లు పానీపూరి అమ్ముకుంటున్నారు
హిందీ భాషపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికీ కౌంటర్లు వస్తూనే ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలను మొదటి నుంచి తమిళనాడు సర్కార్, సీఎం స్టాలిన్ ఖండించిన విషయం తెలిసిందే. తాజాగా తమిళనాడు విద్యాశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల ప్రకారం.. కోయంబత్తూర్‌లోని భారతీయర్ యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి కే పొన్నుడి మాట్లాడుతూ.. హిందీ మాట్లాడేవారు కోయంబత్తూర్‌లో పానీపూరీలు అమ్ముకుంటున్నారని ఎద్దేవా చేశారు. హిందీ భాష మరిన్ని ఎక్కువ ఉద్యోగాలు కల్పించేదే అయితే ఉత్తర భారతీయులు ఇక్కడ(తమిళనాడులో) పానీ పూరీ ఎందుకు అమ్ముకుంటున్నారని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే తమిళనాడు ప్రజలు ఇంగ్లీష్, తమిళ్ మాట్లాడుతారని అన్నారు. అలాగే, తాము అంతర్జాతీయ భాషగా ఇంగ్లీష్ నేర్చుకుంటుండగా ఇతర భాషలతో పనేముందని మంత్రి ఆయన ప్రశ్నించారు. మరో అడుగుముందుకేసి.. హిందీ కేవలం ఆప్షనల్ ల్యాంగ్వేజ్ మాత్రమేనని, దాన్ని నేర్చుకోవడం తప్పనిసరి కాదని కుండబద్దలుకొట్టారు. తమిళ విద్యార్ధులు ఏ భాష నేర్చుకునేందుకైనా సిద్ధంగా ఉంటారని చెప్పారు. అంతకు ముందు.. హిందీ జాతీయ భాష కాదంటూ కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: మీ ఇంటిని కూల్చివేస్తామంటూ బీజేపీ చీఫ్‌కు వార్నింగ్ -
బాలికలను స్కూళ్లకు అనుమతించండి...తాలిబన్లను ఆదేశించిన యూఎన్
Taliban on allowing girls in high schools: గతేడాది అఫ్గనిస్తాన్‌ని స్వాధీనం చేసుకుని తాలిబన్లు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బాలికలను పాఠశాలలకు వెళ్లకుండా నిషేధిస్తూ తాలిబాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ విషయమై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు యూఎన్ఎస్సీ సభ్యుల ఈ విషయమై అఫ్గనిస్తాన్‌కి సంబంధించిన సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధి డెబోరా లియోనన్స్తో చర్చించారు. ఆ సమావేశలో బాలికలతో సహా అఫ్గాన్లందరి విద్యా హక్కు గురించి పునరుద్ఘాటించారు. విద్యా హక్కును గౌరవించడమే కాకుండా విద్యార్థులందరూ పాఠశాలకు వెళ్లేలా స్కూళ్లు తెరవాలని తాలిబన్లకు పిలుపునిచ్చారు. అఫ్గనిస్తాన్ ఐక్యరాజ్యసమితి సహాయ మిషన్ (యూఎన్ఏఎంఏ) , ఈ సమస్యపై సంబంధిత అఫ్గాన్ వాటాదారులందరితో పరస్పర చర్చ కొనసాగించాలని సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిని ఆదేశించింది. అంతేగాదు ఈ అంశం పురోగతిపై భద్రతా మండలికి తెలియజేయాలని కూడా కోరింది. విద్యతో సహా అన్ని అంశాల్లో అఫ్గనిస్తాన్‌కు మద్దతు ఇవ్వడానికి అంతర్జాతీయ సమాజం చేస్తున్న ప్రయత్నాల ప్రాముఖ్యతను భద్రతా మండలి సభ్యులు నొక్కి చెప్పారు. అయితే గతేడాది అఫ్గనిస్తాన్‌లోని వేలాది మంది సెకండరీ పాఠశాల బాలికలు ఆగస్టు 2021 తర్వాత మొదటిసారి తరగతులకు హాజరు కావడానికి ఆసక్తి కనబర్చారు. కానీ కొన్ని గంటల్లోనే పాఠశాలలను మూసివేయాలని తాలిబన్లు ఆదేశాలు జారీ చేశారు. అంతేగాదు తాలిబాన్ ప్రభుత్వం తన తదుపరి నిర్ణయాన్ని ప్రకటించే వరకు బాలికలు ఇంట్లోనే ఉండాలని సూచించారు కూడా. ఒక వారంలోగా బాలికల మాధ్యమిక పాఠశాలలను తిరిగి తెరవడంలో తాలిబాన్ విఫలమైతే దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతామని అప్గాన్‌లోని మహిళా హక్కుల కార్యకర్తలు హెచ్చరించారు. ఇదిలా ఉండగా రాజధాని నగరం కాబూల్‌లో విద్యార్థినిలు విద్య మన సంపూర్ణ హక్కు అని నినాదాలు చేశారు. అయితే ఈ విషయమై తాలిబానీ విద్యా మంత్రిత్వ శాఖ పూర్తి వివరణ ఇవ్వలేదు. కానీ ఇస్లామిక్ ఎమిరేట్ సీనియర్ నాయకుడు మాత్రం పాఠశాలలను తిరిగి తెరవడానికి ముందు కొన్ని ఆచరణాత్మక సమస్యలను ఇంకా పరిష్కరించాల్సి ఉందని చెప్పారు. (చదవండి: రష్యా బలగాల ఉపసంహరణ దిశగా వ్యూహం.. భయాందోళనలో ఉక్రెయిన్) -
టెన్త్ పరీక్షలు షురూ.. హిజాబ్‌పై విద్యాశాఖ మంత్రి సంచలన ప్రకటన
శివాజీనగర: విద్యార్థి జీవితంలో ఎంతో ముఖ్యమైన టెన్త్ పరీక్షలు రానేవచ్చాయి. రాష్ట్రమంతటా నేడు సోమవారం నుంచి ఎస్ఎస్ఎల్సీ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. గత 2 సంవత్సరాల నుంచి కోవిడ్ బెడద వల్ల పరీక్షలు జరపకుండానే అందరినీ ఉత్తీర్ణులను చేశారు. అయితే ఈసారి కోవిడ్ లేకపోవడంతో మామూలుగా పరీక్షలు జరుగుతున్నాయి. ఉదయం 10:30 నుంచి ఆరంభం - రాష్ట్రంలో మొత్తం 3,444 పరీక్షా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. - పరీక్ష ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.45 గంటల వరకు జరుగుతుంది. - 5,387 పాఠశాలల నుంచి మొత్తం 8,73,846 మంది విద్యార్థులు రాయబోతున్నారు. ఇందులో 4,52,732 బాలురు, 4,21,110 బాలికలు, శారీరక, మానసిక దివ్యాంగ విద్యార్థులు 5,307 మంది ఉన్నారు. - అక్రమాల నివారణకు విస్తృతంగా స్క్వాడ్లను నియమించారు. అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ సీసీ టీవీ కెమెరాలను అమర్చారు. పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల 144 సెక్షన్ క్రింద నిషేధాజ్ఞలను విధించారు. - విద్యార్థులు హాల్‌టికెట్‌ను చూపించి కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. - సమాధాన పత్రాల స్పాట్ వాల్యూయేషన్ ఏప్రిల్ 21 నుంచి జరుగుతుంది. హిజాబ్‌కు అనుమతి లేదు: విద్యామంత్రి కోర్టు ఆదేశాన్ని పాటించి విద్యార్థులు హిజాబ్‌తో కాకుండా యూనిఫాం ధరించి పరీక్ష రాయాలి. హిజాబ్ కోసం పరీక్షను కాదనుకుంటే మళ్లీ పరీక్ష కూడా ఉండదని విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్ ఆదివారం తెలిపారు. హిజాబ్ ధరించి వచ్చే వారిపై పోలీసులు చర్యలు తీసుకొంటారన్నారు. -
ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా..
-
నాడు-నేడు: సీఎం వైఎస్ జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, తాడేపల్లి: విద్యాశాఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష సమావేశం నిర్వంచారు. ఈ సమీక్షా సమావేశంలో పాఠశాల విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, మహిళా,శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ►వచ్చే విద్యాసంవత్సరం (జూన్) నాటికి నూతన విద్యావిధానానికి అనుగుణంగా అన్ని సంస్కరణలు పూర్తిగా అమల్లోకి రావాలన్న సీఎం ►విద్యార్థుల సంఖ్యకు తగిన నిష్పత్తిలో టీచర్లు ఉండాలన్న సీఎం ►సబ్జెక్టుల వారీగా టీచర్లు కూడా ఉండాలన్న సీఎం ►నూతన విద్యావిధానంలో ఏర్పాటవుతున్న స్కూల్స్ కారణంగా సుమారు 22 వేలమందికిపైగా ఉపాధ్యాయులకు ప్రమోషన్లు వస్తాయన్న సీఎం ►వీరందరికీ ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇవ్వాలన్న సీఎం ►వీరి సామర్థ్యాలను మెరుగుపరిచేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం ►స్కూళ్లలో సరిపడా సిబ్బంది ఉన్నప్పుడే పురోగతి కనిపిస్తుందన్న సీఎం ►ప్రమోషన్లు, బదిలీలు ఇవన్నీకూడా పూర్తిచేసి జూన్‌నాటికి నూతన విద్యావిధానం సంస్కరణలు పూర్తిగా అమల్లోకి రావాలి ►ప్రతి మండలానికి ఒక హైస్కూల్‌ను జూనియర్ కాలేజీగా తీర్చిదిద్దుదామని అనుకున్నాం ►ఇప్పుడు ప్రతి మండలానికి రెండు స్కూళ్లను 2 జూనియర్ కాలేజీలుగా మార్చండి ►ఒకటి కో – ఎడ్యుకేషన్ కోసం అయితే, ఒకటి బాలికలకోసం జూనియర్ కళాశాలగా మార్చాలి ►ఎస్ఈఆర్టీ ఇచ్చిన సిఫార్సులు అన్నీకూడా అమల్లోకి రావాలన్న సీఎం ►మండల రీసోర్స్ సెంటర్ పేరును మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంగా మార్చేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ►ఎండీఓ పరిధిలో కాకుండా ఎంఈవోకే నేరుగా డ్రాయింగ్ అధికారాలు ►ఇకపై విద్యాసంబంధిత కార్యకలాపాలు ఎంఈవోకే అప్పగిస్తూ ఎస్ఈఆర్టీ సిఫార్సుకు సీఎం ఆమోదం ►ఎంఈఓ పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్ ►పలురకాల ఆప్స్ కన్నా... రియల్‌టైం డేటా ఉండేలా, డూప్లికేషన్ లేకుండా చూడాలన్న ఎస్ఈఆర్టీ సిఫార్సును అమల్లోకి తీసుకురావాలన్న సీఎం ►అటెండెన్స్‌ను ఫిజికల్‌గా కాకుండా ఆన్లైన్ పద్ధతుల్లో తీసుకోవాలన్న సిఫార్సునూ అమలు చేయాలన్న సీఎం ►విద్యార్ధుల మార్కులనూ ఆన్లైన్లో ఎంట్రీ చేయాలన్న ఎస్ఈఆర్టీ ►పాఠాలు బోధించే ఉపాధ్యాయులకు నాన్ అకడమిక్ పనులకు వినియోగించవద్దన్న ఎస్ఈఆర్టీ ►హెడ్మాస్టర్లను పలు రకాల మీటింగులు కాకుండా సమన్వయంకోసం నెలకు ఒకే సమావేశం ఏర్పాటు చేయాలన్న ఎస్ఈఆర్టీ.. వీటికి ఆమోదం తెలిసిన సీఎం ►స్కూళ్ల నుంచి ఫిర్యాదుల పరిష్కారంపై వెంటనే చర్యలు తీసుకోవాలన్న సీఎం ►సదుపాయాల లేమి, మౌలిక వసతుల మరమ్మతులు తదితర అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్న సీఎం ►నాడు నేడులో ఏర్పాటుచేసిన ఏ సదుపాయాల్లో ఎలాంటి సమస్యవచ్చినా వెంటనే చర్యలు తీసుకోవాలన్న సీఎం ►స్కూళ్ల నిర్వహణ, టాయిలెట్స్, తాగునీరు వీటి నిర్వహణపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం ►ప్రభుత్వ పాఠశాలల్లో నాడు – నేడు రెండో విడత పనులపై సీఎం కీలక ఆదేశాలు ►త్వరగా పనులు మొదలుపెట్టాలని సీఎం ఆదేశం ►ఫిబ్రవరి 15 నుంచి పనులు మొదలుపెడుతున్నామన్న అధికారులు ►సెప్టెంబరుకల్లా పనులు పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటామన్న అధికారులు ►జగనన్న విద్యాకానుక, టాయిలెట్ల నిర్వహణ, గోరుముద్ద నాణ్యత, స్కూళ్ల నిర్వహణకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయడానికి 14417 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు ►ఇది సమర్థవంతంగా పనిచేయాలన్న సీఎం ►స్కూళ్లలో కొత్తగా చేరిన విద్యార్ధులకు డిక్షనరీ ఇవ్వాలన్న సీఎం ►ప్రతిరోజూ ఒక పదాన్ని పిల్లలకు నేర్పాలన్న సీఎం ►ఆ పదాన్ని ఎలా ఉపయోగించాలన్నదానిపై పిల్లలకు నేర్పాలని సీఎం ఆదేశం ►పాఠ్యప్రణాళికలో ఇదొక భాగం చేయాలన్న సీఎం ►డిజిటల్ లెర్నింగ్‌పైనా కూడా దృష్టిపెట్టాలన్న సీఎం ►8,9,10 తరగతుల్లో డిజిటల్ లెర్నింగ్ ఉండేలా చూడాలన్న సీఎం ►దీన్నొక సబ్జెక్టుగా కూడా పెట్టే ఆలోచన చేయాలన్న సీఎం -
తెరుచుకోనున్న పాఠశాలలు!...వచ్చేవారం నుంచే తరగతుల ప్రారంభం!
ముంబై: వచ్చే వారం నుంచే పాఠశాలలు తెరుకోనున్నాయని, అన్ని తరగతులు ప్రారంభమవుతాయని మహారాష్ట్ర విద్యామంత్రి వర్ష గైక్వాడ్ పేర్కొన్నారు. కోవిడ్ ప్రోటోకాల్‌ని అనుసరించే ఒకటి నుంచి 12 తరగతులు పాఠశాలలు ప్రారంభవుతాయని తెలిపారు. పైగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేఈ ప్రతిపాదనను అంగీకరించారని చెప్పారు. ఈ మేరకు ఆరోగ్య మంత్రి రాజేష్ మాట్లాడుతూ..."పిల్లలు చదువుకు దూరమవుతున్నందున పాఠశాలలను తిరిగి తెరవాలంటూ కొన్ని వర్గాల నుంచి డిమాండ్లు వచ్చాయి." అని తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ ఉధృతి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 15 వరకు రాష్ట్రంలోని పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నిపుణులతో చర్చించిన తర్వాత, కరోనా కేసుల సంఖ్య తక్కువగా ఉన్న సెషన్లను ప్రారంభించాలని నిర్ణయించామని విద్యామంత్రి గైక్వాడ్ పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 73,25,825కి చేరగా, మరణాల సంఖ్య 1,41,934కి పెరిగిందని ఆరోగ్య శాఖ తెలిపింది. (చదవండి: ఎన్నికల ప్రచారంతో చీరల వ్యాపారానికి పెరిగిన డిమాండ్!!) -
'వైద్య నిపుణుల సూచనలతో బడులు ప్రారంభిస్తాం'
సాక్షి, ముంబై: వైద్య నిపుణులు ఇచ్చే సూచనలు సలహాల మేరకు రాష్ట్రంలో తిరిగి బడులు ప్రారంభించే యోచనలో ఉన్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్ పేర్కొన్నారు. బడుల పునఃప్రారంభంపై ఇప్పటికే ఓ ప్రతిపాదనను రూపొందించినట్లు ఆమె బుధవారం విలేకరులకు వెల్లడించారు. రాష్ట్రంలో నెలకొన్న కరోనా కేసుల తాజా పరిస్థితులపై ఒక నివేదిక రూపొందించినట్లు ఆయన తెలిపారు. వాటిని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు పంపించామని, త్వరలో సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. ముంబైతోపాటు రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరగడంతో ఫిబ్రవరి 15వ తేదీ వరకు పాఠశాలలు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ, పాఠశాలలు పూర్తిగా మూసి ఉంచాలని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో అసంతృప్తి, వ్యతిరేకత వాతావరణం నెలకొంది. అంతేగాకుండా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో సందేశాలు వైరల్ అవుతున్నాయి. శుభకార్యాలకు, మాల్స్, థియేటర్లలో 50% అనుమతిస్తున్నారు. కానీ, పాఠశాలలు తెరిస్తే విద్యార్థులకు కరోనా సోకుతుందని మూసి ఉంచడం సమంజసం కాదని, విద్యార్థులు నష్టపోతున్నారని సందేశాలు వైరల్ అవుతున్నాయి. అలాగే పాఠశాలలు పూర్తిగా మూసి ఉంచే బదులు ఒక ప్రణాళిక ప్రకారం తెరవాలని ఉపాధ్యాయులు కూడా డిమాండ్ చేస్తున్నారు. చదవండి: (ప్రముఖ క్రిమినల్ లాయర్ శ్రీకాంత్ షివాడే కన్నుమూత) రెండు నెలల కిందట కరోనా తగ్గుముఖం పట్టడంతో విద్యావేత్తలు, నిపుణుల సలహాల ప్రకారం అప్పట్లో పాఠశాలలు తెరిచామని వర్షా తెలిపారు. కానీ, గత పక్షం రోజుల కిందట కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరగడంతో మూసివేయాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం రోగుల సంఖ్య మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతోంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల సంఘటనలతో చర్చించామని, ఆ సమయంలో వారు ఒక నివేదక అందజేశారని వర్షా వెల్లడించారు. పాఠశాలలు ప్రారంభించాల్సిందేనని అనేక మంది డిమాండ్ చేశారని తెలిపారు. దీంతో రోగుల సంఖ్య ఎక్కడెక్కడ తక్కువగా ఉందో అక్కడ పాఠశాలలు తెరిచేందుకు స్థానిక అధికారులకే అధికారమివ్వాలని ప్రతిపాదించామని, ఆ మేరకు ముఖ్యమంత్రికి నివేదిక అందజేశామని పేర్కొన్నారు. పాఠశాలలు ప్రారంభించాలనే ఉద్ధేశం తమకు కూడా ఉందని, ప్రస్తుతం 15–18 ఏళ్లలోపు పిల్లలకు కరోనా టీకా డోసు వేసే ప్రక్రియకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలకు వచ్చే విద్యార్థులతో పాటు బోధన, బోధనేతర సిబ్బంది కూడా రెండు టీకాలు తీసుకుని విధుల్లో చేరేలా సూచనలిస్తున్నట్లు వర్షా స్పష్టం చేశారు. లేదంటే పరిస్థితి మొదటికే వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. -
ఇంజనీరింగ్ కోర్సుల్లో రామాయణ, మహాభారతాలు....!
న్యూఢిల్లీ: తులసీదాస్ రచించన రామాయణాన్ని గ్రాడ్యుయేషన్ విద్యార్థుల పాఠ్యాంశాల్లో చేర్చడం వల్ల ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎంతగానో ఉపకరిస్తుందని మధ్య ప్రదేశ్ వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాశ్ సారంగ్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో భవిష్యత్తరాలలో వైద్య విద్యను హిందీ మాధ్యమంలో చదువుకునే అవకాశం అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. దీని కోసం ఒక కమిటీని కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. సిలబస్ కమిటీ ఉన్నత విద్యా విధానంలో భాగంగా 2021-22 విద్యా సంవత్సారానికి గానూ రామచరిత మానస్ కీ వ్యవహార దర్శన్ (అప్లైడ్ ఫిలాసఫీ ఆఫ్ రామచరిత మానస్)ని ప్రవేశ పెట్టేలా చేశానని చెప్పారు. (చదవండి: మహిళల రక్షణకై నిర్భయ స్క్వాడ్: ముంబై ) ఇంగ్లీష్ ఫౌండేషన్ కోర్సులో మహాభారతం లాంటి పురాణాలను ప్రవేశపెడితే.. విద్యార్థులకు వ్యక్తిత్వ వికాశానికి, నాయకత్వ లక్షణాల అభివృద్ధి తోపాటు మానవతా దృక్పథాన్ని పెంపొందించేలా దోహదపడుతుందన్నారు. ఈ మేరకు భారతదేశ సంస్కృతి ఆధ్యాత్మికతకు సంబంధించి 100 మార్కుల ప్రశ్నా పత్రం ఒకటి ఉంటుందని చెప్పారు. ఆర్ఎస్ఎస్ నాయకుల బయోగ్రఫి కూడా పాఠ్యాంశాల్లో చేర్చాలనే ప్రతిపాదన ఉందన్నారు. దీంతో విద్యార్థులు సామాజికంగా, వైద్య పరంగానూ నైతిక విలువలతో కూడిన విద్యను అభ్యసించగలిగే అవకాశం ఉంటుందంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మధ్య ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి మోహన్ యాదవ్ మాట్లాడుతూ...." విద్యా వ్యవస్థను కాషాయికరణం చేస్తున్నాంటు వస్తోన్న ప్రతి పక్షాల విమర్శలను ఖండించారు. ఈ క్రమంలో నాసా సైతం 'రామసేతు' నిర్మాణాన్ని ప్రాచీన మానవ నిర్మిత నిర్మాణంగా అభివర్ణించిన విషయాన్ని గుర్తు చేశారు. విద్యావ్యవస్థలో కాలనుగుణంగా మార్పులు చోటు చేసుకుంటాయి." అని అన్నారు. దీంతో ప్రతిపక్షాలు గురుగ్రంథ సాహెబ్, ఖురాన్, బైబిల్ కూడా చేరిస్తే విద్యార్థులు మరిన్ని నేర్చుకునే అవకాశంతో పాటు రాజ్యంగ స్ఫూర్తి కూడా నెరవేరుతుందంటూ వ్యంగ్యాస్తాలు కురిపించారు. (చదవండి: పర్యాటకుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే ఇక అంతే !: రాజస్తాన్) -
విద్యాదీవెన, ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లపై అప్పీల్‌కు వెళ్తాం..
-
ఫీజు వసూళ్లపై ప్రైవేటు విద్యాసంస్థలకు తెలంగాణ సర్కారు హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలను ప్రారంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం.. కళాశాలలు, స్కూళ్లలో కరోనా నిబంధనల అమలుతో పాటు ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల వసూళ్లపై దృష్టి సారించింది. కరోనా కష్టకాలంలో ఫీజుల కోసం తల్లిదండ్రులను ఒత్తిడి చేసే విద్యాసంస్థల విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ప్రైవేటు సంస్థలు మానవత్వంతో వ్యవహరించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదివారం మీడియా ప్రతినిధులతో ఆమె ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజుల కోసం వేధిస్తున్న ఉదంతాలు తమ దృష్టికొచ్చాయని మంత్రి తెలిపారు. దీనిపై నిఘా పెట్టాల్సిందిగా అధికారులకు సూచించామన్నారు. ఫీజుల కోసం వేధిస్తే రాష్ట్ర ప్రభుత్వం సహించదని హెచ్చరించారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా ఇచ్చామని, అయితే ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా మానవీయ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. తల్లిదండ్రుల కోరిక మేరకే.. విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకే వచ్చేనెల ఒకటి నుంచి అన్ని విద్యాసంస్థలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు మంత్రి సబిత తెలిపారు. కరోనా నిబంధనల అమల్లో ప్రభుత్వం రాజీపడబోదని, ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో పర్యవేక్షణకు అధికారులను నియమించామని వెల్లడించారు. తల్లిదండ్రులు ఇష్టపడితేనే పిల్లలను స్కూళ్లకు పంపాలని చెబుతున్నామని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి ఒత్తిడీ లేదన్నారు. అవసరమైతే అందరికీ పరీక్షలు పాఠశాలలకు పంపే విద్యార్థులకు అనారోగ్య సమస్యలొస్తే తమదే బాధ్యతంటూ.. తల్లిదండ్రుల నుంచి ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ముందుగానే అంగీకారపత్రం తీసుకుంటున్న వైనంపై మంత్రి ఘాటుగా స్పందించారు. విద్యార్థులు కరోనా బారిన పడకుండా చూసే విషయంలో అందరూ భాగస్వాములు కావాల్సిందేనన్నారు. తరగతి గదిలో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే క్లాసులోని పిల్లలందరికీ పరీక్షలు చేయిస్తామని, ఎక్కువ మందికి లక్షణాలుంటే స్కూలు మొత్తం పరీక్షలు చేయిస్తామని మంత్రి తెలిపారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విద్యాసంస్థను మొత్తం మూసేసే ఆలోచన లేదన్నారు. నేడు డీఈవోలతో భేటీ.. విద్యాసంస్థల పునఃప్రారంభంపై సోమవారం డీఈవోలతో సమీక్షించనున్నట్లు మంత్రి తెలిపారు. అవసరమైతే కొత్త మార్గదర్శకాలూ ఇస్తామని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ఇప్పటికే క్షేత్రస్థాయి సమాచారం సేకరిస్తున్నామని, ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. విశ్వవిద్యాలయాల సమస్యలపై త్వరలో వీసీలతో సమావేశం కానున్నట్లు తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాయాల్సిందే.. ఇంటర్ సెకండియర్‌కు ప్రమోట్ అయిన విద్యార్థులంతా ఫస్టియర్ పరీక్షలు రాయాల్సిందేనని మంత్రి సబిత స్పష్టం చేశారు. పరీక్షలు ఎప్పుడనేది త్వరలో ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతేడాది ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను ప్రభుత్వం పరీక్షలు నిర్వహించకుండా సెకండియర్‌కు ప్రమోట్ చేసింది. వీరికి ఫస్టియర్ పరీక్షలు ఐచ్ఛికమనే ప్రచారం తొలుత జరిగింది. కానీ మంత్రి సబిత దీన్ని కొట్టిపారేశారు. విద్యార్థులంతా పరీక్షలు రాయాల్సిందేనంటూ స్పష్టత ఇచ్చారు. దీని వెనుక బలమైన కారణాలున్నట్టు తెలుస్తోంది. కరోనా మూడోదశ ప్రచారం నేపథ్యంలో ఒకవేళ సెకండియర్ పరీక్షలనూ నిర్వహించలేకపోతే అప్పుడు పరిస్థితి ఏమిటనే సందేహాలు విద్యాశాఖ వర్గాల్లో వ్యక్తమయ్యాయి. ఫస్టియర్ మార్కుల్నే ప్రాతిపదికగా తీసుకోవాల్సి ఉంటుందని ఇంటర్ బోర్డు అధికారులు అభిప్రాయపడినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు స్పష్టమవుతోంది. -
15 కోట్ల మంది పాఠశాలలకు దూరం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 15 కోట్ల మంది పిల్లలు, యువత విద్యా వ్యవస్థకి దూరంగా ఉన్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. మరో 25 కోట్ల మందికి అక్షరజ్ఞానం కూడా లేదని వెల్లడించారు. భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) గురువారం ‘‘ఉద్యోగాల కల్పన, పెట్టుబడులు’’ అనే అంశంపై నిర్వహించిన వార్షిక సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం, ప్రైవేటు, చారిటబుల్ సంస్థలు, అంగన్వాడీ కేంద్రాలు, ఉన్నత విద్యా సంస్థల్లో 3–22 ఏళ్ల మధ్య వయసున్న వారి గణాంకాలను పరిశీలిస్తే దాదాపుగా 35 కోట్ల మంది చదువుకుంటున్నారని తెలిపారు. ఆ వయసు కలిగిన వారు దేశ జనాభాలో 50 కోట్లు మంది ఉన్నారని, దీనిని బట్టి చూస్తే 15 కోట్ల మంది విద్యకు దూరంగా ఉన్నారని అర్థమవుతోందన్నారు. వారందరినీ బడిబాట పట్టించడమే లక్ష్యంగా కేంద్రం పని చేస్తుందని, మన దేశ ఆర్థిక వ్యవస్థలో పని చేసే వారి సంఖ్య పెంచాలంటే అందరికీ విద్య అందుబాటులోకి రావాలని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న ఈ తరుణంలో అక్షరాస్యత 80 శాతానికి చేరుకుందని ప్రధాన్ చెప్పారు. దాదాపుగా 25 కోట్ల మంది ఇప్పటికీ నిరక్షరాస్యులుగా ఉన్నారని తెలిపారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) మరో 25 సంవత్సరాలకి సాధించాల్సిన లక్ష్యాలకు సంబంధించిన రోడ్ మ్యాప్ అన్నారు. దేశ స్వాతంత్య్ర శతాబ్ది వేడుకల సమయానికి ఏం సాధించాలో మార్గనిర్దేశం చేస్తుందని తెలిపారు. కరోనా సంక్షోభం సమయంలో డిజిటల్ విద్యకు ప్రాధాన్యం పెరిగిందని, తద్వారా విద్యారంగంలో సృజనాత్మకత, పెట్టుబడులకు అవకాశం పెరుగుతుందని అన్నారు. భవిష్యత్‌లో పల్లె పల్లెకి హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్లు వస్తాయని, దీనివల్ల విద్యా వ్యవస్థలో డిజిటలైజేషన్ పెరిగి వినూత్న మార్పులు వస్తాయని చెప్పారు. -
15 శాతం ఫీజు తగ్గించండి
సాక్షి, ముంబై: రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లలో 2021–22 విద్యా సంవత్సరానికి 15 శాతం ఫీజు తగ్గించాలని విద్యాశాఖ మంత్రి వర్షాగైక్వాడ్ ఆదేశించారు. ఫీజు తగ్గించని పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఈ మేరకు ఫీజుల తగ్గింపు విషయంపై మంత్రిమండలిలో సైతం ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలిపారు. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రభుత్వం త్వరలో జారీ చేయనున్నట్లు తెలిసింది. ఆర్థిక ఇబ్బందులతో. గత సంవత్సరం మార్చిలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేసింది. అప్పటి నుంచి అనేక మంది ఉపాధి కోల్పోయారు. వ్యాపారాలు మందగించాయి. అనేక సంస్థలు తమ ఉద్యోగులకు జీతాలు సక్రమంగా చెల్లించకపోవడంతో కుటుంబాన్ని పోషించడమే కష్టంగా మారింది. ఇలాంటి సందర్బంలో పేదలతోపాటు మధ్య తరగతి కుటుంబాలు కూడా తమ పిల్లల స్కూలు ఫీజులు చెల్లించడం సాధ్యం కాలేదు. దీంతో విద్యార్థుల ఫీజులు వసూలు చేయవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ అనేక పాఠశాలలు ఫీజులు వసూలు చేయడం కొనసాగిస్తున్నాయి. దీన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు కొద్ది నెలల కిందట సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఇచ్చింది. అంతేగాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందో నివేదిక సమర్పించాలని సూచించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఎదురు చూడసాగారు. ఆ మేరకు బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో 15 శాతం ఫీజు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు వర్షా గైక్వాడ్ తెలిపారు. మంత్రిమండలి తీసుకున్న నిర్ణయంతో కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు కొంత ఊరట లభించింది. ఈ ఆదేశాలను బేఖాతరు చేసే పాఠశాలల యాజమాన్యాలపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. అదేవిధంగా కొన్ని పాఠశాలలు ఫీజు చెల్లించని విద్యార్థుల ఫలితాలు (రిజల్ట్), ప్రొగ్రెస్ కార్డు ఇవ్వలేదు. ఇలాంటి యాజమాన్యాలపై కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టంచేశారు. చెల్లించిన ఫీజులపై రాని స్పష్టత.. లాక్డౌన్ కారణంగా పాఠశాలలన్ని మూసే ఉన్నాయి. కొందరు ఉపాధ్యాయులు మినహా మిగతా బోధన, బోధనేతర సిబ్బంది అందరు ఇంటి నుంచి విధులు నిర్వహించారు. విద్యార్థులకు కూడా ఆన్లైన్లోనే బోధన తరగతులు ప్రారంభించారు. ఇలాంటి సమయంలో పాఠశాలల్లో విద్యుత్ వినియోగం, స్పోర్ట్స్, లైబ్రరీ, ల్యాబ్ ఇతర అనేక మౌలిక సదుపాయాల వినియోగం కాలేదు. దీంతో ఫీజులు తగ్గించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఎట్టకేలకు మంత్రిమండలి తీసుకున్న నిర్ణయంతో పేదలు, మధ్యతరగతి కుటుంబాల్లో కొంత ఆశలు చిగురించాయి. కానీ, ఇప్పటికే అనేక పాఠశాలలు అన్లైన్లో తరగతులు ప్రారంభించాయి. విద్యార్థులు ఆ తరగతులకు హాజరు అవుతున్నారు. దీంతో అనేక మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఇదివరకే ఫీజులు చెల్లించారు. మరి వీరి సంగతేంటనేది ఇంకా స్పష్టం చేయలేదు. -
NEET-2021: నీట్ పరీక్ష తేదీ ఖరారు!
సాక్షి, న్యూఢిల్లీ: మెడికల్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్షల తేదీలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఖరారు చేశారు. కోవిడ్-19 ప్రోటోకాల్స్ పాటిస్తూ సెప్టెంబర్ 12 న నీట్ ఎంట్రన్స్ పరీక్షను నిర్వహించనున్నారు. విద్యార్థుల నుంచి దరఖాస్తులను జులై 13 మంగళవారం సాయంత్రం నుంచి స్వీకరించనున్నారు. ఎన్టీఏ వెబ్సైట్ ద్వారా విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. కోవిడ్-19 దృష్ట్యా పరీక్షా నిర్వహించే నగరాల సంఖ్యను 155 నుంచి 198 కి పెంచినట్లు ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. దాంతో పాటుగా పరీక్ష కేంద్రాల సంఖ్యను పెంచుతున్నట్లు తెలిపారు. ఇటీవల, మాజీ విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ జేఈఈ మెయిన్ 2021 తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలు జూలై 20 నుంచి 25 వరకు, జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహించనున్నారు. The NEET (UG) 2021 will be held on 12th September 2021 across the country following COVID-19 protocols. The application process will begin from 5 pm tomorrow through the NTA website(s). — Dharmendra Pradhan (@dpradhanbjp) July 12, 2021 -
97 శాతం బడుల్లో.. బాలికలకు మరుగుదొడ్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల ఫలితాల ప్రభావం కనిపిస్తోంది. 2018–19తో పోల్చి చూస్తే 2019–20లో పాఠశాల విద్యకు సంబంధించిన అన్ని స్థాయిలలో స్థూల నమోదు నిష్పత్తి మెరుగుపడింది. అంతేగాక విద్యుత్ సౌకర్యం, కంప్యూటర్ల లభ్యత, ఇంటర్నెట్ సదుపాయం కలిగిన పాఠశాలల సంఖ్య 2019–20లో గణనీయంగా పెరిగిందని యూడీఐఎస్ఈ ప్లస్ నివేదిక వెల్లడించింది. భారతదేశంలో పాఠశాల విద్యపై రూపొందిన యునైటెడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యూడీఐఎస్ఈ ప్లస్) 2019–20 నివేదికను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గురువారం విడుదల చేశారు. 2019–20 సంవత్సరానికి సంబంధించి యూడీఐఎస్ఈ విధానంలో సేకరించిన సమాచారం ఆధారంగా ప్రస్తుత నివేదికను సిద్ధం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 15 లక్షల పాఠశాలలు, 96.87 లక్షల మంది ఉపాధ్యాయులు, 26.45 కోట్ల మంది విద్యార్థుల సమాచారాన్ని యూడీఐఎస్ఈ పర్యవేక్షిస్తోంది. 2019–20లో మొత్తం 26.45 కోట్ల మంది విద్యార్థులు ప్రీప్రైమరీ నుంచి హయ్యర్ సెకండరీ క్లాసుల వరకు పాఠశాలల్లో చదువుతున్నారని నివేదిక వెల్లడించింది. 2018–19తో పోలిస్తే 42.3 లక్షల మంది విద్యార్థులు పెరిగారు. 90% పాఠశాలల్లో హ్యాండ్ వాష్ సదుపాయం 2019–20లో 12.50 కోట్లకు పైగా బాలికలు ప్రాథమిక విద్య పూర్తి చేసుకుని మాధ్యమిక, ఉన్నత విద్యలో నమోదు చేసుకున్నారని నివేదికలో పేర్కొన్నారు. 2018–19తో పోలిస్తే బాలికల నమోదు సంఖ్య గణనీయంగా 14.08 లక్షలకు పైగా పెరిగింది. అంతేగాక పాఠశాల విద్యా రంగంలో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి (పీటీఆర్) సైతం మెరుగుపడిందని నివేదిక వెల్లడించింది. దేశంలో స్వచ్ఛతా అభియాన్ ప్రచారం పెరగడంతో విద్యార్థులు చేతులను శుభ్రం చేసుకునే సౌకర్యం గల పాఠశాలల సంఖ్యలో మెరుగుదల నమోదైంది. 2019–20 సంవత్సరంలో దేశంలో 90% కంటే ఎక్కువ పాఠశాలల్లో హ్యాండ్‌వాష్ సౌకర్యాన్ని కల్పించారు. ఏపీలో 95% పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం 2019–20 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 63,824 పాఠశాలల్లో 83,23,103 మంది విద్యార్థులు ఉండగా, 3,17,430 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. రాష్ట్రంలోని 90% పాఠశాలల్లో బాలికల మరుగుదొడ్లు, 89% పాఠశాలల్లో లైబ్రరీ, 68% పాఠశాలల్లో అన్ని రకాల పుస్తకాలతో ఉన్న లైబ్రరీలు, 95% విద్యుత్ సౌకర్యం, 90% తాగునీటి సరఫరా, 84% హ్యాండ్ వాష్ సదుపాయం, 87% మెడికల్ ఫెసిలిటీ ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. తెలంగాణలో 96% పాఠశాలల్లో బాలికల మరుగుదొడ్లు తెలంగాణలో 42,575 పాఠశాలల్లో 69,37,640 మంది విద్యార్థులు ఉండగా, 3,05,597 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. రాష్ట్రంలోని 96% పాఠశాలల్లో బాలికల మరుగుదొడ్లు, 93% పాఠశాలల్లో లైబ్రరీ, 85% పాఠశాలల్లో అన్ని రకాల పుస్తకాలతో ఉన్న లైబ్రరీలు, 96% విద్యుత్ సౌకర్యం, 96% తాగునీటి సరఫరా, 88% హ్యాండ్ వాష్ సదుపాయం, 86% మెడికల్ ఫెసిలిటీ ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. యునైటెడ్ ఢిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యుడిఎస్ఇ +) 2019–20 నివేదిక ముఖ్యాంశాలు: 2019–20లో పాఠశాల విద్యలో ప్రీ–ప్రైమరీ నుంచి హయ్యర్ సెకండరీ వరకు చదువుతున్న విద్యార్థుల సంఖ్య 26.45 కోట్లు దాటింది. 20 18–19తో పోలిస్తే ఇది 42.3 లక్షలు ఎక్కువ. 2018–19తో పోలిస్తే 2019–20లో అన్ని స్థాయిలలో పాఠశాల విద్య స్థూల నమోదు నిష్పత్తి మెరుగుపడింది. స్థూల నమోదు నిష్పత్తి 2018–19తో పోలిస్తే 2019–20లో అప్పర్ ప్రైమరీ స్థాయిలో 87.7% నుంచి 89.7% కి, ప్రాథమిక స్థాయిలో 96.1% నుంచి 97.8%కి, సెకండరీ స్థాయిలో 76.9% నుంచి 77.9%కి, హయ్యర్ సెకండరీ స్థాయిలో 50.1% నుంచి 51.4%కి పెరిగింది. 2019–20లో పాఠశాల విద్యారంగంలో 96.87 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేయగా, 2018–19తో పోలిస్తే ఇది సుమారు 2.57 లక్షలు ఎక్కువ. 2019–20లో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి (పిటిఆర్) ప్రైమరీ విద్యలో 26.5 గా, అప్పర్ ప్రైమరీ–సెకండరీలో పిటిఆర్ 18.5 గా, హయ్యర్ సెకండరీలో పిటిఆర్ 26.1 గా ఉంది. వికలాంగులకు సార్వత్రిక విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలను ఇస్తున్నాయి. 2018–19తో పోలిస్తే దివ్యాంగులైన విద్యార్థుల నమోదు 6.52% పెరిగింది. 2019–20లో ప్రైమరీ నుంచి హయ్యర్ సెకండరీ వరకు చేరిన బాలికల సంఖ్య 12.08 కోట్లకు పైగా ఉంది. 2018–19తో పోలిస్తే ఈ సంఖ్య 14.08 లక్షలకు పైగా పెరిగింది. 2018–19 నుంచి 2019–20లో బాలికల స్థూల నమోదు నిష్పత్తి అప్పర్ ప్రైమరీ స్థాయిలో 88.5% నుంచి 90.5%నికి, ఎలిమెంటరీ స్థాయిలో 96.7% నుంచి 98.7%నికి, సెకండరీ స్థాయిలో 76.9% నుంచి 77.8%నికి, హయ్యర్ సెకండరీ స్థాయిలో 50.8% నుంచి 52.4%కి పెరిగింది. 2019–20లో సెకండరీ, హయ్యర్ సెకండరీ స్థాయిలలో లింగ సమానత్వ సూచిక (జిపిఐ) మెరుగుపడింది. జిపిఐ మెరుగుదల హయ్యర్ సెకండరీ స్థాయిలో ఎక్కువగా కనిపించింది. 2019–20లో 1.04 కు చేరింది. కంప్యూటర్ సౌకర్యం ఉన్న పాఠశాలల సంఖ్య 2019–20లో 5.2 లక్షలకు చేరగా, 2018–19లో 4.7 లక్షల పాఠశాలలు కంప్యూటర్ సౌకర్యాన్ని కలిగి వున్నాయి. ఇంటర్నెట్ సదుపాయం ఉన్న పాఠశాలల సంఖ్య 2018–19లో 2.9 లక్షలు ఉండగా, 2019–20లో 3.36 లక్షలకు పెరిగింది. 2019–20 నాటికి 83% కంటే ఎక్కువ పాఠశాలలు విద్యుత్తు కలిగి ఉన్నాయి. 2018–19తో పోలిస్తే దాదాపు 7% వరకు పెరిగింది. 2019–20లో 82% కి పైగా పాఠశాలలు విద్యార్థులకు వైద్య పరీక్షలను నిర్వహించాయి. ఇది 2018–19తో పోలిస్తే 4% కంటే ఎక్కువ. భారతదేశంలో 2019–20 నాటికి 84%కి మించి పాఠశాలల్లో లైబ్రరీ/రీడింగ్ రూమ్/రీడింగ్ కార్నర్ సౌకర్యం ఉంది. చదవండి: ఆ కిడ్నాపర్‌కు జీవితకాల జైలు శిక్ష విధించలేం: సుప్రీంకోర్టు -
కేజీ టు పీజీ ఆన్లైన్ బోధనే..: మంత్రి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యక్ష బోధన చేపట్టే పరిస్థితి లేదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రత్యామ్నాయంగా ఎల్కేజీ నుంచి పీజీ వరకు డిజిటల్, ఆన్లైన్ బోధనను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా ఉండేందుకు డిజటల్, ఆన్లైన్ తరగతులను నిర్వహించనున్నట్లు చెప్పారు. విద్యా సంవత్సరం ప్రారంభం, బోధన తదితర అంశాలపై సోమవారం తన కార్యాలయంలో మంత్రి సబిత అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 3వ తరగతి, ఆపై తరగతులను... ప్రైవేటు విద్యాసంస్థల్లో ఎల్కేజీ నుంచి ఆన్లైన్ బోధనను జూలై 1 నుంచి ప్రారంభించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి డిజిటల్ పాఠాలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆన్లైన్ తరగతులకు సంబంధించి ప్రైవేటు విద్యాసంస్థలు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి సబిత ఆదేశించారు. ప్రభుత్వ బడులకు పాఠ్యపుస్తకాలు... అనంతరం సబిత మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 27 లక్షల మంది విద్యార్థులకు డిజిటల్, ఆన్లైన్ బోధన అందుతుందన్నారు. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల ఇళ్లలో టీవీలు లేకపోతే గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో, గ్రంథాలయాల్లోని టీవీలను వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించామన్నారు. విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలను పాఠశాలలకు పంపిణీ చేసే ప్రక్రియ 90 శాతం పూర్తయిందన్నారు. ఏదైనా కారణం వల్ల దూరదర్శన్, టీశాట్ పాఠాలను వీక్షించని వారికోసం ఆ డిజిటల్ పాఠాలను ప్రత్యేకంగా టీశాట్ యాప్‌లోనూ, దూరదర్శన్ యూట్యూబ్ చానల్లోనూ అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. డిజిటల్ క్లాసులు, వర్క్ షీట్లను కూడా రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి వెబ్సైట్లో (https://scert.telangana.gov.in) పొందవచ్చన్నారు. 75 వేల వాట్సాప్ గ్రూపులు... పాఠశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య అనుసంధానం కోసం దాదాపు 75 వేల వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసినట్లు మంత్రి సబిత తెలిపారు. పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ వరకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు విడతలవారీగా ప్రతిరోజూ 50 శాతం హాజరైతే చాలన్నారు. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, డిప్లొమా ఫైనలియర్ పరీక్షలను జూలైలో నిర్వహించేలా ఆయా యూనివర్సిటీలు కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాయన్నారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ లింబాద్రి, వెంకట రమణ, విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీ అనంతరం జూలై 1 నుంచి స్కూళ్ల ప్రారంభంపై విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: TS Inter Results 2021: ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల -
అటానమస్ కాలేజీలో పరీక్షల విధానం లో మార్పులు: మంత్రి ఆదిమూలపు సురేష్
-
‘చదువుకున్నవాళ్లు లైంగికదాడులు చేయరు’
జోహన్నస్బర్గ్: దక్షిణాఫ్రికా విద్యాశాఖ మంత్రి ఆంగీ మొషెకా వివాదంలో చిక్కుకున్నారు. ఓ పాఠశాల ప్రారంభోత్సవంలో భాగంగా అత్యాచారం గురించి చేసిన వ్యాఖ్యలు ఆమెను ఇరకాటంలో నెట్టాయి. విద్యావంతులైన పురుషులు లైంగికదాడులకు పాల్పడరంటూ ఆంగీ వ్యాఖ్యానించడంపై దుమారం రేగుతోంది. ఈ క్రమంలో ఆమె మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష పార్టీ డిమాండ్ చేస్తోంది. కాగా దక్షిణాఫ్రికాలో సగటున రోజుకు 110 చొప్పున అత్యాచార కేసులు నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంగీ సోమవారం ప్రిటోరియాలో జరిగిన కార్య క్రమంలో మాట్లాడుతూ.. ‘‘కేవలం విద్య ద్వారానే మనం కొన్ని కఠినతరమైన సవాళ్లను అధిగమించగలం. ఎందుకంటే చదువుకున్న మగవాళ్లు అత్యాచారాలు చేయరు. వారు కాస్త నాగరికుల్లా ప్రవర్తిస్తారు. అలాంటి పనులు చేసేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు’’ అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో స్థానిక మీడియాలో వైరల్ అయ్యింది. ఈ క్రమంలో ఆంగీపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధాన ప్రతిపక్షం డెమొక్రటిక్ అలయన్స్ క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేశాయి. ఆఫ్రికా సంస్కృతి, సంప్రదాయాలను ఆంగీ కించపరిచారని, తక్షణమే ఆమె పదవి నుంచి తొలగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ విషయంపై స్పందించిన ఆంగీ.. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, లింగ వివక్ష రూపుమాపాలంటే విద్య ఒక్కటే మార్గమని తాను అన్నానని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ఈ దుమారం మాత్రం సద్దుమణగడం లేదు. చదవండి: పార్లమెంటులో మహిళా ఉద్యోగినిపై అత్యాచారం! -
చచ్చిపోవాలనే ఆలోచన మానుకో: మంత్రి
బెంగళూరు : నగరంలోని సోమసుందరపాల్యకు చెందిన 17 ఏళ్ల బాలుడు అక్కడి హెచ్ఆర్ఎస్ లేఅవుట్లోని ఓ స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాడు. స్కూలు ఫీజు కట్టకపోవటంతో అతడ్ని తోటి విద్యార్థుల ముందు తిట్టడమే కాకుండా పరీక్షలు రాయటానికి ఒప్పుకోలేదు యజమాన్యం. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతడు మంగళవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు అతడ్ని కాపాడారు. అయితే ఈ కథ అంతటితో ముగిసిపోలేదు. బాలుడి ఆత్మహత్యాయత్నం విషయం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సురేష్‌కుమార్ దృష్టికి వెళ్లింది. చలించిపోయిన ఆయన ఏకంగా బాలుడి ఇంటికే వెళ్లారు. (ఆమె కోసం ఇల్లు అమ్మేసి... ఆటోలోనే తిండి, నిద్ర) గురువారం ఆయన బాలుడితో మాట్లాడుతూ.. ‘‘ నీకేమైనా అయితే మీ అమ్మానాన్న, సోదరి ఏమైపోతారో ఎప్పుడైనా ఆలోచించావా? నీ జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాన్నైనా నువ్వు ఎదురించగలగాలి. చచ్చిపోవాలనే ఆలోచనలు మానుకోవాలి. వలస కార్మికుడి కుమారుడు మహేష్ సంగతే చూడు! ఎస్ఎస్ఎల్సీలో అత్యధిక మార్కులు సాధించాడు. అతడి చదువును కొనసాగించడానికి అవసరమైన సహాయం చేయటానికి చాలా మంది ముందుకొచ్చారు. జీవితం అంటే అలా ఉంటుంది. కష్టాలు వచ్చినపుడు గుండె ధైర్యం కోల్పోకూడదు’’ అని ధైర్యం చెప్పాడు. -
మాతృభాషలో ఇంజనీరింగ్!
న్యూఢిల్లీ: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ సహా టెక్నికల్ కోర్సులు స్థానిక భాషల్లో నేర్చుకునే వీలు కల్పించనున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు కేంద్ర విద్యా మంత్రి రమేశ్ పొఖ్రియాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన రివ్యూమీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నారు. ఇంజనీరింగ్ కోర్సులతో సహా టెక్నికల్ కోర్సులను మాతృభాషలో నేర్చుకునే వీలుకల్పించేలా కీలక నిర్ణయం తీసుకున్నామని, వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుందని, ఇందుకోసం కొన్ని ఐఐటీ, ఎన్ఐటీలను ఎంపిక చేస్తామని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. స్కాలర్షిప్పులు, ఫెలోషిప్పులు సమయానికి విద్యార్ధులకు అందించాలని, ఇందుకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి ఒక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయమని యూజీసీని సమావేశంలో ఆదేశించారు. కష్టమే..: సాంకేతిక పదబంధాలు అధికంగా ఉండే టెక్నికల్ కోర్సులను ఇంగ్లిష్‌లో కాదని స్థానిక భాషల్లో బోధించడం సవాలేనని, పైగా వచ్చే విద్యాసంవత్సరం దగ్గరలో ఉన్న ఈ స్వల్పతరుణంలో ఈ సవాలను అధిగమించడం కష్టమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. మాతృభాషలో ఇంజనీరింగ్ సిలబస్‌కు తగిన పుస్తకాలు, స్టడీ మెటీరియల్ రూపొందించాలని, బోధించేందుకు సిబ్బందికి తర్ఫీదు ఇవ్వాల్సిఉంటుందని నిపుణులు వివరించారు. -
బాధ్యతలు చేపట్టిన కాసేపటికే రాజీనామా
పట్నా: బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటల్లోనే బిహార్ విద్యా శాఖ మంత్రి రాజీనామా చేశారు. జేడీయూ నేత మేవా లాల్ చౌధరి గురువారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ.. ఆయనకు మంత్రి పదవి ఇచ్చారన్న విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. చౌధరి రాజీనామాను ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సిఫారసు మేరకు, గవర్నర్ ఫగు చౌహాన్ ఆమోదించారు. కొన్నేళ్ల క్రితం ఒక వ్యవసాయ వర్సిటీకి వీసీగా ఉన్న సమయంలో అక్కడ నియామకాల విషయంలో అక్రమాలు జరిగాయని ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలకు సంబంధించి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కాసేపటికి చౌధరి వివరణ ఇచ్చారు. ఈ ఆరోపణలకు సంబంధించి తనను ఏ కోర్టు కూడా దోషిగా తేల్చలేదని, ఏ దర్యాప్తు సంస్థ కూడా తనపై చార్జిషీటు దాఖలు చేయలేదని వివరించారు. ‘వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్‌గా నియామకాల విషయంలో నేను నేరుగా పాలు పంచుకోలేదు. నిపుణుల కమిటీకి చైర్మన్‌గా మాత్రమే ఉన్నాను’ అని తెలిపారు. రాజీనామా చేసేముందు చౌధరి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో కాసేపు భేటీ అయ్యారు. -
జాతీయగీతం మర్చిపోయిన విద్యాశాఖ మంత్రి
పట్నా: బిహార్ నూతన విద్యాశాఖ మంత్రిని నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు. బడికి పోయావా లేదా సామి అంటూ ఎగతాళి చేస్తున్నారు. బాధ్యతలు చేపట్టి పట్టుమని వారం రోజులు కూడా కావడం లేదు.. ఇన్ని విమర్శలు మూటగట్టుకుంటున్నాడంటే.. అయ్యగారు ఇంతలోనే ఏం ఘనకార్యం వెలగబెట్టారో అనుకుంటున్నారా. నిజమే మంత్రిగారు చేసింది మాములు తప్పు కాదు. భారతీయుడు అయ్యి ఉండి.. అందులోనూ ప్రజాప్రతినిధిగా ఎన్నికై.. ఏకంగా జాతీయ గీతాన్ని మర్చిపోయాడంటే మామూలు తప్పిదం కాదు కదా. అందుకే నెటిజనులు సదరు మినిస్టర్‌ని ఇంతలా ట్రోల్ చేస్తున్నారు. వివరాలు.. బిహార్ విద్యాశాఖ మంత్రి మేవలాల్ చౌదరీ ఓ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యి.. జెండా ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతం ఆలపించారు. అయితే మేవలాల్ జనగణమణ పాడుతూ.. మధ్యలో కొన్ని పదాలను మర్చిపోయారు. "పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా" కు బదులుగా "పంజాబ్ వసంత గుజరాత్ మరాఠా" అని పాడారు. (చదవండి: బిహార్ ఫలితాలు-ఆసక్తికర అంశాలు) ఇందుకు సంబంధించిన వీడియో ఆర్జేడీ నాయకులకు చిక్కింది. "అనేక అవినీతి కేసుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీహార్ విద్యాశాఖ మంత్రి మేవలాల్ చౌదరికి జాతీయ గీతం కూడా తెలియదు. నితీష్ కుమార్ జీ ఇంతకన్నా అవమానం ఏం ఉంటుంది? మీ మనస్సాక్షి ఎక్కడ మునిగిపోయింది?" అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరలవ్వడమే కాక ట్రోల్ అవుతోంది. ఈ వీడియోని ఇప్పటికే 2.2 లక్షల మంది వీక్షించారు. ఇక దీనిపై నెటిజనులు ‘ఇలాంటి వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు.. ఇక విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకోండి’.. ‘ఇది 2020 సంవత్సరం.. ఇప్పటికి జాతీయ గీతం రాని వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉండటం నిజంగా సిగ్గు చేటు’.. ‘స్కూల్లో ప్రాథమిక స్థాయిలో నేర్చుకున్న అంశాలు విద్యాశాఖ మంత్రికి తెలియకపోవడం దురదృష్టం.. అసలు మీరు బడికి వెళ్లారా లేదా’ అంటూ నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు. (చదవండి: బిహార్ అసెంబ్లీలో నేర చరితులెక్కువ!) ఇక మేవలాల్ చౌదరిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన అగ్రికల్చర్ యూనివర్సిటీకి హెడ్‌గా ఉన్నప్పుడు జరిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ స్కామ్‌లో మేవలాలక్కు భాగం ఉందనే ఆరోపణలు వచ్చాయి. ఇక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి మంత్రి పదవి కట్టబెట్టిన నితీష్ కుమార్ ద్వంద్వ వైఖరికి సిగ్గుపడుతున్నాం. 60 స్కాముల్లో మేవలాల్‌కు భాగస్వామ్యం ఉంది. అలాంటి వ్యక్తిని విద్యాశాఖ మంత్రిగా నియమించి ఆ పదవిని కించపరిచారు అంటూ ఆర్జేడీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
నితీశ్ కేబినెట్లో 57% మంది నేరచరితులే
పట్నా: బిహార్‌లో నితీశ్‌కుమార్ సర్కార్ ప్రమాణ స్వీకారం చేసిందో లేదో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేరచరిత కలిగిన వారికి నితీశ్ కేబినెట్లో చోటు దక్కడంతో విపక్షాలు దాడికి దిగాయి. విద్యాశాఖ మంత్రిగా జేడీ(యూ)కి చెందిన మేవాలాల్ చౌధురిని నియమించడంతో రగడ మొదలైంది. గతంలో వ్యవసాయ యూనివ ర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా మేవాలాల్ అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఆయనకు విద్యాశాఖ మంత్రి పదవి కట్టబెట్టడంతో విపక్ష ఆర్జేడీ కూటమికి ఒక ఆయుధం దొరికింది. కేబినెట్లో మరో ఏడుగురు నేర చరిత కలిగిన వారు ఉన్నారని అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజా నివేదిక వెల్లడించింది. నితీశ్ కేబినెట్లో బెర్త్ సంపాదించిన 14 మంది ఎన్నికల అఫిడవిట్లో సమర్పించిన వివరాలను విశ్లేషించిన ఆ సంస్థ ఎనిమిది మంది (57%) నేరచరిత్ర కలిగినవారని పేర్కొంది. వారిలో ఆరుగురు (43%)అత్యంత తీవ్రమైన క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్నారు. ఎనిమిది మంది కళంకిత మంత్రుల్లో బీజేపీ నుంచి నలుగురు, జేడీ(యూ) నుంచి ఇద్దరు కాగా మిగతా ఇద్దరు కూటమి పార్టీలకు చెందినవారు. -
అది దేశ విద్యా విధానం
న్యూఢిల్లీ: నూతన జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) కేవలం ప్రభుత్వ విధానం కాదని.. అది మొత్తంగా భారత దేశ విద్యా విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం కూడా దేశ విదేశాంగ, రక్షణ విధానాలతో సమానమైన ప్రాముఖ్యత కలిగినదన్నారు. నూతన జాతీయ విద్యా విధానం అమలులో సాధ్యమైనంతగా మార్పుచేర్పులకు వీలు కల్పించాలని, ఈ విద్యా విధానానికి సంబంధించిన అన్ని అనుమానాలను నివృత్తి చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. ‘రోల్ ఆఫ్ ఎన్ఈపీ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ హయ్యర్ ఎడ్యుకేషన్’అనే అంశంపై సోమవారం జరిగిన గవర్నర్ల సదస్సును ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ విద్యా విధానంపై సంబంధిత వర్గాలకు అనేక అనుమానాలు, ప్రశ్నలు ఉండటం సహజమేనని ప్రధాని పేర్కొన్నారు. ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానాలిచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ‘విద్యా విధానంలో భాగమైన ప్రతీ వ్యక్తి అభిప్రాయాలను గౌరవిస్తాం. ప్రశ్నలకు జవాబిస్తాం. అనుమానాలను నివృత్తి చేస్తాం’అని స్పష్టం చేశారు. చాలా ప్రశ్నలు ఎన్ఈపీ అమలుకు సంబంధించే ఉన్నాయన్నారు. దేశ విద్యా విధానం ఆ దేశ ఆకాంక్షలను ప్రతిఫలిస్తుందని అభివర్ణించారు. ఈ విద్యా విధానాన్ని రూపొందించిన తీరు తరహాగానే.. అమలులోనూ సాధ్యమైనంత సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించాలని సూచించారు. సదస్సులో రాష్ట్రాల గవర్నర్లతో పాటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రాల విద్యా శాఖల మంత్రులు, వర్సిటీల వైస్ చాన్సెలర్లు పాల్గొన్నారు. ఎన్ఈపీ–2020పై సెప్టెంబర్ 25 లోపు యూనివర్సిటీల్లో వర్చువల్ సదస్సులు నిర్వహించాలని ఈ సందర్భంగా ప్రధాని కోరారు. నూతన విద్యా విధానాన్ని పాఠశాల ఉపాధ్యాయుల నుంచి, ప్రఖ్యాత విద్యావేత్తల వరకు అంతా స్వాగతిస్తున్నారని గుర్తు చేశారు. అకడమిక్, వొకేషనల్, టెక్నికల్ సహా అన్ని అంశాలను, అలాగే, పాలనాపరమైన అనవసర జాప్యాలను నివారించే చర్యలను కూడా నూతన ఎన్ఈపీలో సమగ్రంగా పొందుపర్చారన్నారు. కళాశాలలకు, విశ్వవిద్యాలయాలకు దశలవారీగా స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించాలనే ఆలోచన వెనుక.. ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించాలి, సమర్థ్ధతకు పట్టం కట్టాలనే ఉద్దేశం ఉందని ప్రధాని మోదీ వివరించారు. ‘ఈ స్ఫూర్తిని విజయవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది’అన్నారు. చదవడం కన్నా నేర్చుకోవడంపై, విశ్లేషణాత్మక ఆలోచనాధోరణిని పెంపొందించుకోవడంపై ఈ నూతన విద్యా విధానంలో ప్రధానంగా దృష్టి పెట్టారన్నారు. విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న పుస్తకాలు, సిలబస్, పరీక్షల ఒత్తిడి భారాన్ని తగ్గించేందుకు తగిన చర్యలు ఈ విధానంలో ఉన్నాయన్నారు. చిన్న క్లాసుల నుంచే వృత్తి విద్యకు, శిక్షణకు ప్రాధాన్యతనిచ్చి, వారిని దేశీయ, అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్‌కు సిద్ధ్దం చేయడం లక్ష్యంగా ప్రణాళిక రూపొందించారని పేర్కొన్నారు. ‘స్వావలంబ భారత్’లక్ష్యాన్ని చేరుకునేందుకు వీలుగా ఈ నూతన ఎన్ఈపీ రూపొందిందన్నారు. గతంలో విద్యార్థులు తమకు ఆసక్తి లేని అంశాలను బలవంతంగా నేర్చుకోవాల్సి వచ్చేదని, నూతన విద్యా విధానంలో ఆ సమస్యకు పరిష్కారం చూపామని వివరించారు. 21వ శతాబ్దపు నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా భారత్‌ను రూపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నూతన విద్యా విధాన స్థూల రూపకల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువగా జోక్యం చేసుకోలేదన్నారు. విద్యావేత్తలు, విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలకు ఈ విధానంలో సముచిత ప్రాధాన్యతనిచ్చారన్నారు. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన వర్సిటీలు భారత్‌లో తమ కేంద్రాలను ప్రారంభించేలా నూతన విధానంలో అవకాశం కల్పించామన్నారు. దీనివల్ల మేధో వలస సమస్య కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. ‘పరిశోధన’కు నిధులు పెంచాలి పరిశోధన, అభివృద్ధి’పై ప్రభుత్వ నిధులను భారీగా పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సూచించారు. ఇతర దేశాలతో పోలిస్తే...భారత్ ఈ రంగంలో అతి తక్కువ నిధులను కేటాయిస్తోందన్నారు. పరిశోధన, సృజనాత్మక ఆవిష్కరణలపై భారీగా పెట్టుబడులు పెట్టడం భారత్ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థకు అత్యావశ్యకమన్నారు. నూతన విద్యా విధానంపై సోమవారం వర్చువల్‌గా జరిగిన గవర్నర్ల సదస్సునుద్దేశించి ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ‘రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్’కు జీడీపీలో అమెరికా 2.8%, దక్షిణ కొరియా 4.2%, ఇజ్రాయెల్ 4.3% నిధులను కేటాయిస్తుండగా, భారత్ మాత్రం జీడీపీలో 0.7% నిధులను మాత్రమే కేటాయిస్తోందన్నారు. -
మంత్రి భార్య, కుమార్తెకు కోవిడ్-19
బెంగళూర్ : కర్ణాటక వైద్యవిద్యా శాఖ మంత్రి కే సుధాకర్ భార్య, కుమార్తెకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా మంత్రి తండ్రికి నిర్వహించిన కరోనా వైరస్ పరీక్షలో పాజిటివ్‌గా తేలిన మరుసటి రోజే వారికి పాజిటివ్‌గా రిపోర్ట్ వచ్చింది. తమ కుటుంబ సభ్యులకు నిర్వహించిన కోవిడ్-19 టెస్ట్ రిపోర్టులు వచ్చాయని, తన భార్య కుమార్తెకు పాజిటివ్ ఫలితాలు రావడం దురదృష్టకరమని మంగళవారం మంత్రి ట్వీట్ చేశారు. ప్రసుత్తం వారిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని మంత్రి సుధాకర్ పేర్కొన్నారు. తనకు తన ఇద్దరు కుమారులకు కరోనా పరీక్షలో నెగెటివ్ వచ్చిందని చెప్పారు. జ్వరం, దగ్గుతో బాధపడుతున్న సుధాకర్ తండ్రికి సోమవారం నిర్వహించిన కరోనా టెస్టులో పాజిటివ్‌గా తేలడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చదవండి : భారత్‌లో కరోనా వ్యాప్తి తక్కువే -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఉత్తీర్ణతలో బాలురకన్నా బాలికలే ఆధిక్యంలో నిలిచారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం విజయవాడలో ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలో 10,64,626 మంది (ఫస్టియర్ 5,46,365, సెకండియర్ 5,18,261) ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ఫస్టియర్ జనరల్‌లో 59 శాతం, ఒకేషనల్‌లో 41 శాతం, సెకండియర్ జనరల్‌లో 63 శాతం, ఒకేషనల్‌లో 52 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అన్ని కేటగిరీల్లోనూ బాలికలు పైచేయి సాధించారు. జనరల్ కేటగిరీ ఫస్టియర్ పరీక్షలకు 2,57,619 మంది బాలికలు హాజరు కాగా 1,64,365 (64 శాతం), సెకండియర్ పరీక్షలకు 2,22,798 మంది బాలికలు హాజరు కాగా.. 1,49,010 (67 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలుర విషయానికి వస్తే.. జనరల్ కేటగిరీ ఫస్టియర్ పరీక్షలకు 2,49,611 మంది హాజరు కాగా.. 1,36,195 (55 శాతం), సెకండియర్‌లో 2,12,857 మందికి గాను 1,27,379 (60 శాతం) మంది పాసయ్యారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లోనూ 75 శాతం ఉత్తీర్ణత సాధించి కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఫస్టియర్‌లో 65 శాతం, సెకండియర్‌లో 71 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమ గోదావరి జిల్లా రెండో స్థానంలో నిలిచింది. విశాఖ జిల్లా ఫస్టియర్‌లో 63 శాతం, సెకండియర్‌లో 68 శాతం ఉత్తీర్ణత సాధించి మూడో స్థానంలో నిలిచింది. ఉత్తీర్ణతా శాతంలో వైఎస్సార్ (ఫస్టియర్ 47 శాతం, సెకండియర్ 52 శాతం), శ్రీకాకుళం (ఫస్టియర్ 51 శాతం, సెకండియర్ 53 శాతం), కర్నూలు (ఫస్టియర్ 51 శాతం, సెకండియర్ 54 శాతం) జిల్లాలు వెనుకబడ్డాయి. -
ఆన్లైన్ క్లాస్‌లు వద్దు.. ఓకే!
సాక్షి, చెన్నై: ఆన్లైన్ తరగతుల నిర్వహణ గురించి ఒకే రోజు విద్యా మంత్రి సెంగోట్టయన్ చేసిన రెండు రకాల వ్యాఖ్యలు సర్వత్రా విస్మయంలో పడేశాయి. ఉదయాన్నే ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన మంత్రి, సాయంత్రం అనుమతులు ఇస్తున్నామని ప్రకటించడం గమనార్హం. లాక్డౌన్ సడలింపుల ప్రక్రియ సాగుతున్నా, ఇప్పట్లో విద్యా సంస్థలు తెరచుకునే అవకాశాలు లేవు. దీంతో ఆయా విద్యా సంస్థలు ఆన్లైన్ తరగతులపై దృష్టి పెట్టాయి. జూన్ నుంచి ప్రైవేటు విద్యా సంస్థలు మెజారిటీ శాతం ఆన్లైన్ తరగతుల నిర్వహణకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభం, విద్యా వ్యవహారాల పర్యవేక్షణకు ఓ ఉన్నత స్థాయి కమిటీని సీఎం పళనిస్వామి రంగంలోకి దించారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక మేరకు స్కూళ్ల రీ ఓపెనింగ్ ఆగస్టులో ఉండ వచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ సమాచారంతో ప్రైవేటు సీబీఎస్ఈ, మెట్రిక్యులేషన్ యాజమాన్యాలు ఆన్లైన్ తరగతులు అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఎస్ఎంఎస్లు పంపించే పనిలో పడ్డాయి. (వారిద్దరూ అమ్మ వారసులే) మాట మార్చేశారు.. జూన్ ఒకటి నుంచి ఈ తరగతుల నిర్వహణ వేగం పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో బుధవారం ఉదయం విద్యా మంత్రి సెంగోట్టయన్ మీడియాతో మాట్లాడుతూ ఆన్లైన్ తరగతులపై ఆగ్రహన్ని వ్యక్తం చేశారు. ప్రైవేటు విద్యా సంస్థలు ఆన్లైన్ క్లాసులు అంటూ వేధింపులు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఇబ్బందులు కల్గించే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్న హెచ్చరికలు చేశారు. అయితే, సాయంత్రానికి మాట మార్చేశారు. ఆన్లైన్ తరగతుల నిర్వహణకు అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించారు. (విమానం ఎక్కుతానని ఎప్పుడూ అనుకోలేదు ) అయితే, ఉపాధ్యాయుల్ని స్కూళ్లకు రప్పించడం, అక్కడి నుంచి తరగతులు నిర్వహించే రీతిలో చర్యలు తీసుకుంటే చర్యలు తప్పదన్న హెచ్చరిక చేశామని దాట వేశారు. ఉన్న చోట నుంచే ఆన్లైన్లో తరగతుల్ని నిర్వహించుకోవచ్చని, ఇందుకు ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు విధించలేదన్నారు. పాఠశాలలను తెరిచే విషయంగా ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా, అన్ని సమీక్షల మేరకు సీఎం పళనిస్వామి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఉన్న చోటే పరీక్షలు.. పదో తరగతి విద్యార్థులకు ఊరట కల్గించే ఉత్తర్వులు వెలువడ్డాయి. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జూన్ 15 నుంచి జరగనున్న విషయం తెలిసిందే. కంటైన్మెంట్ జోన్లలో ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా పరీక్షా కేంద్రాల ఏర్పాటు సాగుతున్నాయి. అలాగే, అనేక మంది విద్యార్థులు పరీక్షలు ఓ చోట రాయాల్సి ఉండగా, వారు మరో చోట నివాసం ఉండడం, మరో ప్రాంతానికి వెళ్లి ఉండడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్రం తాజాగా ఓ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు ప్రస్తుతం ఎక్కడైతే ఉన్నారో, అక్క డి పరీక్షా కేంద్రంలోనే పరీక్షలు రాసుకోవచ్చని కేంద్ర మానవ వనరుల శాఖ ప్రకటించింది. ఇక, పదీ పరీక్షలు రాయనున్న విద్యార్థుల్ని మానసికంగా సిద్ధం చేయడానికి తగ్గట్టు వారికి ప్రత్యేకంగా కథల్ని వినిపించే రీతిలో సరికొత్త యాప్‌లు తెరపైకి రావడం విశేషం. -
‘కొందరు మగాళ్లలో అయినా మార్పు వస్తుందేమో అని’
ప్రిటౌన్: పిల్లల్ని కనడం, పెంచడం వంటి పనులన్ని ఆడవారివే అని భావించే తండ్రులు నేటికి కొకొల్లలు. ప్రస్తుతం దంపతులు ఇద్దరు ఉద్యోగాలు చేస్తుండటంతో ఈ పరిస్థితుల్లో కాస్త మార్పు వచ్చింది. ఈ క్రమంలో సియెర్రా లియోన్‌కు చెందిన ఓ మంత్రి తండ్రులు నిర్వహించాల్సిన బాధ్యతల గురించి చాలా బాగా చెప్పి.. మరి కొందరు మగాళ్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆ వివరాలు.. సియెర్రా లియోన్ విద్యా శాఖమంత్రి డేవిడ్ మొయినినా సెంగే పది నెలల తన కుమార్తెకు పాలు తాగిస్తూ జూమ్ మీటింగ్‌కు హాజరయ్యాడు. పాలు పట్టడం పూర్తయ్యాక బిడ్డను వీపుకు కట్టుకున్నాడు. మీటింగ్ పూర్తయ్యేంతవరకూ బిడ్డను అలానే ఉంచుకున్నాడు. ఈ క్రమంలో బిడ్డను వీపుకు కట్టుకున్న ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశాడు డేవిడ్. అంతేకాక ‘ఇంటి నుంచి పని చేస్తున్నారా.. మీ లాస్ట్ జూమ్ కాల్‌కు మీరు ఎలా అటెండ్ అయ్యారు? నేను మాత్రం నా 10 నెలల బిడ్డకు పాలు పడుతూ మీటింగ్‌కు హాజరయ్యాను. తను పాలు తాగడం పూర్తయిన తర్వాత నా వీపుకు కట్టుకుని మిగతా మీటింగ్ పూర్తి చేశాను. ఈ ప్రజెంట్షన్ తనను నిద్ర పుచ్చింది. మీరు ఇంటి నుంచి ఎలా పని చేస్తున్నారో ప్రపంచానికి తెలపండి’ అంటూ ట్వీట్ చేశాడు డేవిడ్. Working from home? How did u join your last zoom call? As Minister, I started my last call feeding my 10 month old, then carried her on my back for the rest of the call. The presentations helped her sleep. I invite you to share with the world how you worked from home as a leader. pic.twitter.com/wrkDwu58B5 — David Moinina Sengeh (@dsengeh) April 28, 2020 దీని గురించి బీబీసీ డేవిడ్‌ను ప్రశ్నించగా.. ‘పశ్చిమ ఆఫ్రికా దేశంలో ఓ తండ్రి పిల్లలను ఇలా వీపుకు కట్టుకోవడం అనేది చాలా అరుదు. ఓ తల్లి బిడ్డను వీపున మోసుకెళ్లడం ఇక్కడ సర్వసాధరణంగా కనిపించే అంశం. ఇదే పని నా భార్య చేస్తే.. ఆ ఫోటో ఇంత వైరల్ అయ్యేది కాదు. నా స్నేహితుల్లో చాలా మంది వారి పిల్లలకు కనీసం డైపర్ కూడా మార్చరు. అలాంటి వారిలో మార్పు తేవడం కోసమే నేను ఈ ఫోటోను షేర్ చేశాను ’అని తెలిపాడు. -
పాఠశాలలు ప్రారంభం: వారంలో 70 కేసులు
సాక్షి, పారిస్: మార్చి 17 నుంచి ఫ్రాన్స్‌లో లాక్డౌన్ కఠినంగా అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే వారం రోజులక్రితం ఆంక్షల్ని సడలించడంతో మే 11 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో సుమారు 75 శాతం మంది విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారు. పాఠశాలలు ప్రారంభమై వారం రోజులైనా గడవక ముందే 70 కేసులు నమోదు కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. చదవండి: మాజీ కేంద్ర మంత్రి అరెస్ట్ నేటి నుంచి సడలింపులు మరింత విస్తృతం చేయడంతో సుమారు 1,50,000 మంది విద్యార్థులు తరగతులకు హాజరయ్యారు. అయితే తరగతి గదికి 15 మంది విద్యార్థులు మాత్రమే ఉండాలి. తప్పని సరిగా మాస్కులను ధరించాలి. ఈ నిబంధనలతోనే స్కూళ్లు తెరచుకున్నాయి. పాఠశాలలతో సంబంధం ఉన్న వారిలో 70 కేసులు నమోదు కావడంపై ఫ్రాన్స్ విద్యాశాఖ మంత్రి మిచెల్ బ్లాంకెర్ మాట్లాడుతూ.. కేసులు నమోదైన స్కూళ్లను వెంటనే మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే నమోదైన కేసులు విద్యార్థుల్లోనా లేక సిబ్బందా అన్న విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. అయితే ప్రాన్స్‌లో ఇప్పటిదాకా 1,42,411 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 28,108 మంది ప్రాణాలు కోల్పోయారు. చదవండి: చైనాకు మరో ముప్పు తప్పదా..! -
ఏపీలో షెడ్యూల్ ప్రకారమే టెన్త్ పరీక్షలు
-
బైక్‌పై దూసుకొచ్చి మంత్రి ఫోన్‌ను కాజేశారు..
చెన్నై : ఆదమరిస్తే దొంగలు ఎంతటి దుస్సాహసానికైనా ఒడిగడతారనేందుకు ఉదాహరణగా పుదుచ్చేరిలో ఓ ఘటన వెలుగు చూసింది. పుదుచ్చేరి విద్యా శాఖ మంత్రి ఆర్ కమలకణ్ణన్ బీచ్ రోడ్లో సెక్యూరిటీ లేకుండా వాకింగ్ చేస్తుండగా బైక్‌పై వచ్చిన దుండగులు ఆయన మొబైల్ ఫోన్‌ను లాక్కుని పరారయ్యారు. మంత్రి ఫిర్యాదుపై చోరీ కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. పోన్‌ను కాజేసిన దుండగులను అదుపులోకి తీసుకునేందుకు బీచ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు పరిశీలిస్తున్నారు. చదవండి : రూ. 473 కోట్ల విలువైన ఆభరణాల చోరీ -
ఇంగ్లీష్ మీడియంపై ప్రముఖంగా ప్రశంసలు!
సాక్షి, అమరావతి : టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసి, విద్యను వ్యాపారంగా మార్చారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి ప్రవేశపెట్టిన పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ-2019 బిల్లును సభ మధ్యాహ్నం ఆమోదించింది. ఈ బిల్లుపై చర్చ గురించి మంత్రి ఆదిమూలపు సురేష్ వివరిస్తూ.. బిల్లు పరిధిలోకి జూనియర్ కాలేజీలు కూడా వస్తాయని వెల్లడించారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీలు నష్టపోయాయని, ప్రభుత్వ జూనియర్ కాలేజీల కంటే, ప్రైవేటు జూనియర్ కాలేజీల సంఖ్య ఎక్కువగా ఉండడమే దానికి నిదర్శనమన్నారు. మరోవైపు ప్రైవేటు సెక్టార్లో కూడా విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇదికాక, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్య ఆవశ్యకత - నాడు, నేడు అనే అంశంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఇంగ్లీష్ ప్రపంచ భాష అని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఇంగ్లీష్ మీడియం నిర్ణయం పట్ల ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ పత్రికలు ప్రశంసిస్తూ కథనాలు రాశాయని సభ దృష్టికి తీసుకొచ్చారు. ప్రైవేట్ పాఠశాలల్లో 90 శాతం ఆంగ్ల మాధ్యమం ఉంటే, ప్రభుత్వ పాఠశాలల్లో 35 శాతంలోపే ఉన్నాయని తెలిపారు. అధిక ఫీజులు ఇత్యాది కారణాల వల్ల పేదవారు, దళితులు, అగ్రవర్ణ పేదలు ఆంగ్ల విద్యకు దూరమయ్యారని వివరించారు. అలాగే తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. దశాబ్దంపైగా పెండింగ్‌లో ఉన్న తెలుగు పండిట్ల అప్‌గ్రెడేషన్ ప్రక్రియను తమ ప్రభుత్వం చేపట్టిందని, వారందరికీ స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఇచ్చామని గుర్తు చేశారు. గత ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఈ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. తెలుగు అకాడమీని ఏర్పాటు చేశాం. మీరెందుకు చేయలేదు? అని నిలదీశారు. చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో ఉన్న 216 స్కూళ్లను కూడా నాడు - నేడు కార్యక్రమం కింద మౌలిక వసతులు కల్పించబోతున్నామని వెల్లడించారు. సమాజ భవిష్యత్తు పట్ల సామాజిక శాస్త్రవేత్తలా ఆలోచించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. -
'పిల్లలపై ఆంగ్ల బోధనను ఒకేసారి రుద్దం'
సాక్షి, ప్రకాశం : రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టనున్న ఆంగ్ల మాద్యమం ద్వారా పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఎంతో మేలు జరగనుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఒంగోలు క్యాంప్ కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించిన సురేష్ మాట్లాడుతూ.. పిల్లలెవరు ఆంగ్ల బోధనకు సంబంధించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఒకేసారి రుద్దకుండా దశలవారిగా ప్రక్రియను చేపడతామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్య కోసం పెద్ద పీట వేశారని తెలిపారు. అందుకోసం ప్రభుత్వ బడ్జెట్లో విద్య కోసం 16 శాతం కేటాయించినట్లు గుర్తుచేశారు. ఈ నెల 14న ఒంగోలు నుంచే సీఎం జగన్ నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమం ద్వారా అన్ని పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. -
వారి మనవళ్లు తెలుగుమీడియం చదువుతున్నారా ?
సాక్షి, అమరావతి : గ్రామీణ విద్యార్థుల ప్రపంచస్థాయి పోటీని తట్టుకునేందుకే పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను తీసుకువస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 70 లక్షల మంది విద్యార్థుల్లో 43 శాతం మంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. వీరిలో 33.23 శాతం ఎస్టీలు,49. 6 శాతం ఎస్సీలు, 62.5 శాతం బీసీ విద్యార్థులు మాత్రమే ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారని తెలిపారు. గతంలోనే పట్టణ ప్రాంతాల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నా గ్రామీణ స్థాయిలో మాత్రం అవి చెప్పుకునే విధంగా లేవని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 'నాడు-నేడు' పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టేలా అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు. ఒకవేళ 'నాడు-నేడు' కార్యక్రమం విజయవంతం అయితే నారా లేడు అన్న పరిస్థితి వస్తుందన్న ఆందోళన టీడీపీ నేతల్లో నెలకొన్నట్లు పేర్కొన్నారు. ఇంగ్లీష్ మీడియం విద్యను భోదించేందుకు 98వేల మంది టీచర్లకు ఇఫ్లూ పనిచేస్తున్న నిపుణులతో శిక్షణ ఇప్పిస్తామని మంత్రి ప్రకటించారు. పనిగట్టుకొని విమర్శలు గుప్పిస్తున్న కన్నా లక్ష్మీ నారాయణ, చంద్రబాబు, రామోజీరావు మనవళ్లు తెలుగుమీడియం చదువుతున్నారా అంటూ ప్రశ్నించారు. మేము అమలు చేయబోతున్న ఇంగ్లీష్ మీడియం విధానంలో తెలుగు సబ్జెక్టు తప్పనిసరిగా ఉంటుందని మంత్రి స్పస్టం చేశారు. -
'ప్రతి కుటుంబంలో చిరునవ్వు చూడాలి'
సాక్షి, ఒంగోలు : ‘మీకు ఏ కష్టం వచ్చిన తోడుగా జగనన్న ఉన్నాడనే విషయం మరిచిపోవద్దు.. మాటకు కట్టుబడి నాలుగు నెలలు గడవక ముందే మీకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారు. ఆటోడ్రైవర్లకు, మాక్సీక్యాబ్, టాక్సీ డ్రైవర్లకు ఆయన అత్యంత ప్రీతిపాత్రుడయ్యారు’ అని రాష్ట్ర విద్యాశాఖామంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ చెప్పారు. శుక్రవారం ఒంగోలులోని ఏ1 ఫంక్షన్ హాలులో వైఎస్సార్ వాహన మిత్ర కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. డ్రైవింగ్ లైసెన్స్‌లు కలిగిన వాహన యజమానుల బ్యాంకు ఖాతాలకు ఆన్లైన్ ద్వారా నగదు జమ చేశారు. జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ వైఎస్సార్ వాహన మిత్ర పథకంలో రాష్ట్రవ్యాప్తంగా 173102 మంది, జిల్లాలో 8565 కుటుంబాలు రూ.10వేలు ఆర్థిక సాయన్ని పొందుతున్నాయన్నారు. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోలేకపోయి ఉంటే వారికి కూడా ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందన్నారు. ఈ పది వేలతో ఆటోకు బీమా చేయించడం, అవసరమైన మరమ్మతులు చేపట్టడం, ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవడం వంటివి చేయాలని సూచించారు. నిబంధనలకు అనుగుణంగా వాహనాలను నడుపుతూ మీరు, మీ కుటుంబంతోపాటు మీ వాహనాలలో ప్రయాణిస్తున్న ప్రతి కుటుంబంలోనూ చిరునవ్వులు చూడాలనే ఉద్దేశాన్ని ప్రతి వాహన డ్రైవర్ కలిగి ఉండాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి, గెలిచాక వాటిని విస్మరించి, మళ్లీ ఓటు బ్యాంకు కోసం వచ్చే వారిలా కాకుండా కేవలం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోపే 80 శాతం హామీలు నెరవేర్చిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. ఎంతో పారదర్శకంగా పాలన సాగిస్తుంటే సచివాలయ పరీక్షల్లో పేపర్ లీక్ అయిందంటూ తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. అలాంటివి ఏవైనా ఉంటే సాక్ష్యాలతో స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయాలని కోరారు. వాహన డ్రైవర్లను ఇబ్బంది పెట్టొద్దు.. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాలు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిందన్నారు. దీనిపై పార్లమెంట్లో తాము అభ్యంతరం వ్యక్తం చేశామని, అయినప్పటికీ చట్టం కార్యరూపం దాల్చిందన్నారు. కనుక ప్రతి ఒక్కరు నిబంధనలను అనుసరించాలని పేర్కొంటూనే జరిమానాలు విధించే సమయంలో కాస్తంత మానవత్వాన్ని కూడా ప్రదర్శిస్తూ, వాహన డ్రైవర్లను ఇబ్బందులకు గురి చేయవద్దంటూ పోలీసు శాఖకు, రవాణాశాఖకు విజ్ఞప్తి చేశారు. ఇంధన శాఖామంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వాహన డ్రైవర్లకు పంపిన సందేశాన్ని వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు చదివి వినిపించారు. కల్లబొల్లి మాటలు చెప్పం.. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం మాదిరి కల్లబొల్లి మాటలు చెప్పి లబ్దిదారుల సంఖ్యను ఎలా కుదించాలి అని కాకుండా ఎంత ఎక్కువమందికి లబ్ది చేకూర్చాలనేదే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అందువల్లే రాష్ట్ర వ్యాప్తంగా 175352 మంది దరఖాస్తు చేసుకుంటే 173102 మందికి, జిల్లా స్థాయిలో 8704 మంది దరఖాస్తు చేసుకుంటే 8565 మందికి ప్రయోజనం కలిగిందన్నారు. రవాణాశాఖ ఉప కమిషనర్ భువనగిరి శ్రీకృష్ణవేణి లబ్దిదారులు, వేదికపై ఆశీనులైన అందరితో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోకుండా వాహనాలను నడుపుతామని, ప్రమాద రహిత సమాజం కోసం తోటి వారిని సైతం చైతన్యం చేస్తానంటూ ప్రతిజ్ఞ› చేయించారు. అనంతరం పలువురు లబ్దిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. మిగిలిన వారికి గ్రామ, వార్డు వలంటీర్లు, పంచాయతీ కార్యదర్శులు త్వరలోనే వచ్చి అందిస్తారన్నారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు గజమాలతో మంత్రి సురేష్, ఎంపీ మాగుంటలను సత్కరించి కృతజ్ఞతలు చాటుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, ఆర్టీవో సీహెచ్‌వీకే సుబ్బారావు, జిల్లా ఇన్‌ఛార్జి అదనపు ఎస్పీ ఎ.ప్రసాద్‌కుమార్, పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ మేదరమెట్ల శంకరారెడ్డి, ఏఎంసీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యాం, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ బెల్లం సత్యన్నారాయణ, ఎంవీఈఐ సుందరరావు, ఏఎంవీఐ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. -
అమ్మ ఒడి పథకాన్ని వివరించాం: మంత్రి ఆదిమూలపు
ఢిల్లీ: చదువుకు పేదరికం అడ్డు కాకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘అమ్మఒడి’ కార్యక్రమాన్ని ప్రారంభించారని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఆయన శనివారం నూతన విద్యా విధానం ముసాయిదాపై ఏపీ ప్రభుత్వం తరఫున పలు సూచనలు అందజేశారు. ‘అమ్మ ఒడి’ పథకాన్ని సమావేశంలో వివరిస్తూ.. ఈ పథకంలో 43 లక్షల మంది తల్లులు ఉన్నారని, ఒక్కో తల్లికి రూ.15 వేల చొప్పున ఏడాదికి ఆరు వందల కోట్ల రూపాయలకు పైగా అందజేస్తున్నామని తెలిపారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వ సాయం చేయాలని ఆయన కోరారు. ఇందులో విద్యార్థుల ఓట్ల రేట్లు తగ్గుతాయని, ఉన్నత విద్యను బలోపేతం చేసేందుకు రూ. 5 వేల కోట్ల నిధులు కావాలని ముసాయిదాకు విజ్ఞప్తి చేశారు. మూడో తరగతి నుంచి కంప్యూటర్ బోధన జరిగేలా ఉండాలని సూచనలు చేస్తూ.. టెక్నాలజీని వీలైనంత ఏక్కువగా ఉపయోగించుకోవాలి తెలిపారు. ప్రైవేటు టీచర్ల స్థితిగతులు మెరుగుపరిచేందుకు ఒక పాలసీ రావాలని.. ప్రైవేటు పాఠశాలల కోసం ప్రత్యేకంగా ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఐఏఎస్ ఐపీఎస్ వలె ‘ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీసెస్’ కూడా ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా పరిశ్రమలకు అనుగుణంగా విద్యార్థులకు సిలబస్ కూడా మార్పులు చేయాలన్నారు. ఉన్నత విద్యలో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇందుకోసం రాష్ట్రంలో ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశామని మంత్రి పేర్కొన్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో స్థానిక వనరులను బట్టి పరిశ్రమల కోసం ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా రూపొందిస్తామన్నారు. పాలిటెక్నిక్, ఐటిఐ, ఇంజనీరింగ్ కాలేజీలను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు పరిశ్రమలతో అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్లో 16 శాతం నిధులతో సుమారు రూ. 33 వేల కోట్లలను ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయమని మంత్రి పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా ఖాళీగా ఉన్న ప్రొఫెసర్లు, సీనియర్ అకడమిక్లను కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తామని సూచించారు. ఫీజు రియంబర్స్మెంట్ను పూర్తిగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ఫీజు విధానంపై కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. పాత ఫీజుల ప్రకారమే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని తెలిపారు. ప్రైవేటు కాలేజీలో పని చేస్తున్న టీచర్ల స్థితిగతులపై కమిషన్ సూచనలు చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అవసరానికి మించి డీఎడ్ కాలేజీలు ఉన్నాయని.. డీఎస్సీ నిర్వహణకు కొంత సమయం పడుతుందన్నారు. కోర్టులో కేసుల కారణంగా కొంత ఆలస్యం అవుతోందని తెలిపారు. అక్టోబర్ చివరివరకు పోస్టుల భర్తీని పూర్తి చేస్తామని వెల్లడించారు. హ్యాపీనెస్ ఇండెక్స్, క్వాలిటీ, పరిశోధనకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ముసాయిదా విద్యావిధానాన్ని మేము పూర్తి స్థాయిలో అంగీకరించడం లేదు స్పష్టం చేశారు. వాటిలో కొన్ని మార్పులు చేయాలని మంత్రి సూచనలు చేశారు. మనది లౌకిక ప్రభుత్వం.. దాని ఆధారంగానే ‘విద్యావిధానం’ ఏర్పడుతుందని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. -
మీతోనే అభివృద్ధి : సబితా ఇంద్రారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలోనే 26 వేల స్కూళ్లు.. 30 లక్షల మంది విద్యార్థులు.. 1.25 లక్షల మంది టీచర్లు.. చాలా పెద్ద వ్యవస్థ.. ఇవీ కాకుండా ప్రైవేటు విద్యా సంస్థలు, సాంకేతిక, ఉన్నత విద్యా శాఖల బాధ్యత చాలా పెద్దదే. పాఠశాల విద్య పటిష్టంగా ఉంటేనే విద్యార్థి భవిష్యత్తు బాగుంటుంది. అందుకే పాఠశాల విద్యపై ప్రత్యేక దృష్టి సారిస్తాను’అని విద్యా శాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. ఇటీవల విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా వెల్లడించిన పలు అంశాలు ఆమె మాటల్లోనే.. అందరి భాగస్వామ్యంతో.. టీచర్లు, సంఘాలు, ప్రజాప్రతినిధులు, పౌర సమాజాన్ని భాగస్వామ్యం చేసి ప్రభుత్వ బడుల అభివృద్ధికి చర్యలు చేపడతాం. ‘ఇది మీ బడి.. మీతోనే అభివృద్ధి’అంటూ ఆయా పాఠశాలల్లో చదువుకున్న ప్రముఖులను ఆహా్వనిస్తాం. విదేశాల్లో ఉండే వారిని, స్థానికంగా మంచి స్థాయిలో ఉన్న వారిని సంప్రదించి ఆయా పాఠశాలల అభివృద్ధికి నడుం బిగించాలని కోరుతాం. పాఠశాలల దత్తత ప్రోత్సహిస్తాం. విరాళాలు ఇచ్చే దాతల పేర్లను పెట్టే విషయంలో ప్రస్తుతం ఉన్న ప్రక్రియ, ఇతరుల పేర్లను పెడితే బడుల అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చే దాతలు అనేక మంది వస్తారు. సుదీర్ఘ ప్రక్రి య కారణంగా కొందరు ముందుకు రావట్లేదు. ఆ సమస్యను తొలగిస్తాం. దీంతో పాఠశాలకు ఆరి్థక చేయూత అందించి వాటి నిర్వహణ మెరుగుపరుస్తాం. గ్రామాల్లో స్వచ్ఛత కార్యక్రమం చేపడుతున్న సర్పంచులు రోజుకు గంట పాటు పాఠశాలలకు కూడా సమయం కేటాయించాలని కోరుతున్నా. సీఎం ఆకాంక్షలకు అనుగుణంగా.. నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్య అందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం. అందుకు అనుగుణంగా కృషి చేస్తా. సీఎం ప్రత్యేక దృష్టి సారించిన గురుకులాల విద్య ప్రత్యేకతను చాటుకుంది. వాటిల్లో సీట్ల కోసం 1:10 నిష్పత్తిలో డిమాండ్ ఉంది. వాటి తరహాలోనే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు టీచర్లు, సంఘాలతో కలసి కృషి చేస్తాం. వారి సమస్యలపైనా చర్చించి పరిష్కరిస్తాం. త్వరలోనే ఎస్టీటీ పోస్టులు భర్తీ చేస్తాం.ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రుల్లో నమ్మకం పెంచి, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఉండేలా తీర్చిదిద్దుతాం. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు కూడా ప్రభుత్వ బడులకు వచ్చేలా చర్యలు చేపడతాం. డ్రాపౌట్స్ తగ్గింపుపై దృష్టి పాఠశాలలు, ఉన్నత విద్యలో డ్రాపౌట్స్ తగ్గించేందుకు, విద్యార్థుల హాజరు పెంచేందుకు అధికారులతో సమీక్షించి కార్యాచరణ అమలు చేస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఉచిత యూనిఫారాలు, ఉచిత పుస్తకాలు ఇస్తున్నా అవి కని్పంచట్లేదు. ఆ దిశగా మార్పులు తీసుకొస్తాం. విద్యార్థులు, టీచర్లలో పోటీతత్వం పెంపొందించేందుకు ఈ–మేగజైన్ ద్వారా వారు రాసిన ఆరి్టకల్స్ ఇస్తాం. తద్వారా తమ పేరు అందులో రావాలన్న తపన వారిలో పెరుగుతుంది. సక్సెస్ స్టోరీలు ఇవ్వడం ద్వారా టీచర్లలో మరింత అంకిత భావాన్ని పెంపొందిస్తాం. నోటుబుక్కులు,పెన్నులు తీసుకెళ్లండి.. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను కలిసేందుకు వెళ్లేవారు శాలువాలు, బొకేలు తీసుకెళ్లవద్దు. నోటు బుక్స్, పెన్నులు తీసుకెళ్లండి. అవి పేద విద్యార్థులకు ఉపయోగపడతాయి. ఇప్పటివరకు నాకు 50 వేల నోటు బుక్స్ వచ్చాయి. కాగా, తన భర్త ఇంద్రారెడ్డి మంత్రిగా పనిచేసిన విద్యా శాఖను తనకు అప్పగించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సబితారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. -
డ్రాపౌట్స్‌కు చెక్!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్లు లేకుండా చూడాలని విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా యంత్రాంగం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేజీ టు పీజీ మిషన్‌లో భాగంగా సీఎం కేసీఆర్ విద్యాసంస్థలకు వసతులు సమకూరుస్తూ విద్యారంగాన్ని ముందు కు తీసుకెళ్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. బుధవారం ఎస్సీఈఆర్టీ సమావేశ మందిరంలో విద్యాశాఖ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. విద్యాశాఖలో విభాగాల వారీగా సంబంధిత అధికారులతో మాట్లాడి చేపడుతున్న కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, పురోగతి తదితరాలను సమీక్షించారు. పదోతరగతిలో మెరుగైన ఫలితాలు సాధించినందుకు అధికారులు, ఉపాధ్యాయులను ఆమె అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో డ్రాపౌ ట్ విద్యార్థుల సంఖ్య అధికంగా ఉందని, వీటి నివారణ సంతృప్తికరంగా లేదని, ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రాన్ని విద్యారంగంలో ప్రథమ స్థానంలోకి తీసుకురావాలన్నారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలన్నారు. అసెంబ్లీ సమావేశాలనంతరం సుదీర్ఘ సమీక్ష స్వచ్ఛ విద్యాలయ పేరుతో ప్రతి పాఠశాలల్లో 30 రోజుల ప్రణాళికను అమలు చేయాలని సబిత సూచించారు. ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తామన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో తక్కువ సమయం కేటాయించానని.. సమావేశాల అనంతరం ప్రతి విభాగంతో సుదీర్ఘంగా సమావేశం నిర్వహిస్తానన్నారు. -
బడిపిల్లలకు ‘ఈ–మ్యాగజైన్’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విద్యార్థుల కోసం పాఠశాల విద్యాశాఖ సరికొత్తగా ఈ–మ్యాగజైన్ (ఎడ్యుషూర్)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పత్రికలో విద్యార్థుల విజయగాథలు, పాఠ్యాంశ బోధన, అభ్యసన కార్యక్రమాలపై ఉపాధ్యాయుల సలహాలు సూచనలు ఇందులో ప్రస్తావిస్తారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ మ్యాగజైన్ ఉపయోగపడనుంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ ఎడిషన్‌ను ప్రదర్శిస్తారు. వీటిలోని అంశాలను విద్యార్థులకు బోధిస్తారు. ఈ మ్యాగజైన్‌ను మంత్రి పి.సబితారెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రం లో దాదాపు 29 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారన్నారు. వీరందరూ ఈ– మ్యాగజైన్‌ను చదవాలన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల శాసనసభ్యుడు కాలె యాదయ్య, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ నాగేందర్, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మూడోసారి మంత్రిగా.. సబితా ఇంద్రారెడ్డి
సాక్షి, రంగారెడ్డి: తాండూరు ఆడపడచు, సీనియర్ నేత, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి ముచ్చటగా మూడోసారి అమాత్యపదవిని దక్కించుకున్నారు. సీఎం కేసీఆర్ ఆమెకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రి ఆదివారం చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో సబితకు చోటు లభించింది. మూడోసారి మహిళా మంత్రిగా పదవిని అలంకరించిన ఆమె ఇప్పటికే తనదైన ముద్రవేశారు. సీఎం కేసీఆర్ సబితకు విద్యాశాఖ బాధ్యతలు అప్పగించగా.. రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్‌కు దూరమై అనూహ్యంగా టీఆర్ఎస్లో చేరిన ఆమె స్వల్పకాలంలోనే ప్రభుత్వంలో కీలక పదవిని దక్కించుకోవడం విశేషం. గతంలో రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేసిన సబితమ్మకు తాజాగా మరోసారి ఆ యోగం లభించింది. జిల్లాకు చెందిన పలువులు ఆయా పార్టీల నుంచి మంత్రులుగా బాధ్యతలు నిర్వహించినప్పటికీ... మూడు పర్యాయాలు మంత్రిగా పనిచేసే అవకాశం కొందరికే లభించింది. ఈ జాబితాలో చేవెళ్ల చెల్లమ్మ ఒకరు. మలుపు తిప్పిన నిర్ణయం.. టీఆర్ఎస్ నుంచి చేవెళ్ల ఎంపీగా గెలుపొందిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన జిల్లా కాంగ్రెస్‌ను శాసిస్తున్నారని, పార్టీ అధిష్టానం కూడా ఆయనకే ప్రాధాన్యం ఇచ్చిందని సబితా ఇంద్రారెడ్డి మనస్తాపం చెందారు. మరోపక్క పార్టీలో తనకు రోజురోజుకూ గౌరవాన్ని తగ్గిస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఇదే సమయంలో రాజేంద్రనగర్ టికెట్‌ను తన కుమారుడు కార్తీక్‌రెడ్డి ఆశించగా అది సాధ్యపడలేదు. ఈ పరిణామాలు కాంగ్రెస్‌కు ఆమెను దూరం చేయగా.. టీఆర్ఎస్కు చేరువ చేశాయి. ఈ క్రమంలో సబిత తన కుటుంబంతో కలిసి కేసీఆర్‌ను కలిశారు. ముఖ్యమంత్రి కార్తీక్‌రెడ్డి రాజకీయ భవిష్యత్‌కు భరోసా, సబితకు భవిష్యత్‌లో మంత్రి పదవిగా అవకాశం కల్పిచేందుకు హామీ ఇచ్చినట్లు అప్పట్లో రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఇటీవల కాంగ్రెస్ శాసనసభా పక్షం టీఆర్ఎస్ఎల్పీలో విలీనమవగా ఆ పార్టీలోని ఎమ్మెల్యేల్లో సబిత ఒకరు. ఇలా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఆరు నెలల్లోపే ఆమెకు అమాత్యయోగం లభించింది. అభివృద్ధికి అవకాశం మంత్రివర్గ విస్తరణలో సబిత రూపంలో మరోసారి ఉమ్మడి జిల్లాకు ప్రాతినిథ్యం దక్కడం శుభపరిణామం. ఇప్పటికే మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మంత్రిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2004లో తొలిసారిగా వైఎస్సార్ హయాంలో సబిత గనులశాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి రాగానే హోంశాఖ బాధ్యతలు అప్పగించారు. రెండు దఫాలుగా విజయవంతంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించి జిల్లాలో తిరుగులేని నేతగా ఎదిగారు. అందరినీ ఆప్యాయంగా పలకరించే సబితమ్మకు మరోసారి పదవి రావడం పట్ల జిల్లా నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు. సస్యశ్యామలం చేస్తా జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతోపాటు సస్యశ్యామలం చేస్తామని మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. ‘సీఎం కేసీఆర్ నమ్మకంతో నాకిచ్చిన బాధ్యతను అంకితభావంతో నిర్వహిస్తా. మంత్రిగా అవకాశమిచ్చిన ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రత్యేక తెలంగాణలో మంత్రిగా పనిచేసేందుకు అవకాశం రావడం నా అదృష్టం. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను వీలైనంత త్వరలో పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తాం. కృష్ణానీటితో జిల్లాలోని పంటపొలాలను పారించి అన్నదాతలకు మేలు చేస్తా. విద్యాశాఖను పటిష్టం చేయడంతోపాటు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తా. సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన నాణ్యమైన విద్యను అందజేసేలా చర్యలు తీసుకుంటా’నని పేర్కొన్నారు. ప్రొఫైల్ పేరు: పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి భర్త: పట్లోళ్ల ఇంద్రారెడ్డి సంతానం: ముగ్గురు కుమారులు పుట్టిన తేదీ: 05–05–1963 చదువు: బీఎస్సీ గతంలో నిర్వహించిన పదవులు: గనులు, హోంశాఖ మంత్రిగా పనిచేశారు. చేవెళ్ల నుంచి ప్రస్థానం చేవెళ్ల/మహేశ్వరం: దేశ, రాష్ట్ర రాజకీయాల్లో చేవెళ్ల నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి నుంచి భార్యాభర్తలు పట్లోళ్ల ఇంద్రారెడ్డి, సబితారెడ్డి రాష్ట్ర హోంమంత్రులుగా పనిచేసి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. వీరిది చేవెళ్ల మండలం కౌకుంట్ల స్వగ్రామం. స్వర్గీయ పట్లోళ్ల ఇంద్రారెడ్డి 1980లో రాజకీయాల్లోకి వచ్చారు. కౌకుంట్ల సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన 1984లో జరిగిన ఎన్నికల్లో చేవెళ్ల అసెంబ్లీ నుంచి పోటీచేసి ఓటమిచెందారు. అనంతరం 1985లో టీడీపీ టికెట్‌పై పోటీ చేసి ఘన విజయం సాధించారు. వరుసగా 1989, 1994, 2000 సంవత్సరంలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ మంత్రి వర్గంలో హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలు.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా దిగిపోవటం తదితరాల నేపథ్యంలో చంద్రబాబునాయుడు సీఎంగా పదవి చేపట్టారు. దీంతో ఇంద్రారెడ్డి సైతం తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఇంద్రారెడ్డి కార్మిక, ఉపాధిశాఖ మంత్రిగా, హోంశాఖమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. నాలుగుసార్లు గెలిచిన సబితారెడ్డి ఇంద్రారెడ్డి 2000 సంవత్సరంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో ఆయన రాజకీయ వారసురాలిగా సబితారెడ్డి కొన్నిరోజుల తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి పోటీచేసి అఖండ విజయం సాధించారు. ఆ తరువాత 2004లోనూ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో వైఎస్సాఆర్ మంత్రి వర్గంలో మొదటిసారిగా భూగర్భ గనుల, జలవనరుల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో (డీ లిమిటేషన్) చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్ ఎస్సీ రిజర్వ్ అయింది. దీంతో ఆమె నియోజకవర్గం మారాల్సి వచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సూచన మేరకు జిల్లాలోని మహేశ్వరం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. దీంతో వైఎస్సాఆర్ రాష్ట్ర హోంమంత్రిగా కీలకమైన పదవిని కట్టబెట్టారు. దీంతో ఆమె రాష్ట్రంతోపాటు దేశ చరిత్రలో మహిళా హోంమంత్రిగా రికార్డు సృష్టించారు. అంతేకాకుండా భార్యాభర్తలు పి.ఇంద్రారెడ్డి, సబితారెడ్డి హోంమంత్రులుగా పదవిని అలంకరించి సరికొత్త చరిత్ర లిఖించారు. వైఎస్సార్ అప్పట్లో ప్రతి సంక్షేమ పథకాన్ని చేవెళ్ల నుంచి ప్రారంభించారు. చేవెళ్లను ఆయన సెంటిమెంట్‌గా భావించారు. 2014 ఎన్నికల్లో సబిత తనయుడు కార్తీక్‌రెడ్డి చేవెళ్ల ఎంపీగా పోటీ చేశారు. కుటుంబంలో ఒక్కరికే అవకాశం అని అధిష్టానం సూచించడంతో ఆమె మిన్నకుండిపోయారు. 2018లో మళ్లీ మహేశ్వరం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన విజయం సాధించారు. ఇటీవల టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కేసీఆర్ ఆమెకు విద్యాశాఖ అప్పగించారు. -
స్కూల్ టైమ్‌లో ఫోన్ వాడితే కఠిన చర్యలు
సాక్షి, ఒంగోలు టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు పాఠాలు చెప్పకుండా ఫోన్‌ను వినియోగిస్తున్నారా.. జాగ్రత్త! ఇక నుంచి ప్రభుత్వం అలాంటి వారిపై ప్రత్యేక దృష్టి సారించనుంది. తరగతి గదుల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా సెల్ ఫోన్లలో మాట్లాడుకుంటున్నా, మెసేజ్‌లు పంపించుకుంటున్నా, వీడియోలు చూస్తున్నా, నెట్లో చిట్చాట్లు చేసుకుంటున్నా ఇక నుండి వాటన్నింటికీ ఉపాధ్యాయులు స్వస్తి పలకాల్సిందే. తరగతి గదుల్లో పాఠాలు చెప్పే సమయంలో ఉపాధ్యాయులు సెల్ఫోన్లను వినియోగించరాదంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆదేశించారు. మంత్రి ప్రకటనతో ఉపాధ్యాయులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అంతేగాకుండా ఉపాధ్యాయులకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేసుకునేందుకు వీలుగా ఉపాధ్యాయ సంఘాలన్నీ సెల్ఫోన్లో గ్రూపులు పెట్టుకున్నాయి. ఆ గ్రూపుల ద్వారా వారికి సంబంధించిన సమాచారం చేరవేసేందుకు గ్రూపులో మెసేజ్‌లు, వీడియోలు పోస్టు చేసుకోవడం ఆనవాయితీగా మారింది. మంత్రి ప్రకటనతో ఆయా గ్రూపులకు చెందిన అడ్మిన్లు సమాచారం చేరవేస్తున్నారు. పాఠశాలల్లో తరగతులు చెప్పే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మెసేజ్‌లు, వీడియోలు పోస్టు చేయరాదని, ఒకవేళ పోస్టు చేస్తే అడ్మిన్‌తో పాటు పోస్టు చేసిన వారు కూడా ఇబ్బందులు పడే ప్రమాదం ఉందని ఉపాధ్యాయులు ఒకరికొకరు హెచ్చరించుకుంటున్నారు. స్వాగతిస్తున్న విద్యారంగ నిపుణులు పాఠశాలల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా సెల్ఫోన్లు వాడుతున్న వారిపై ప్రభుత్వం కొంతమేర కఠినంగా వ్యవహరించడాన్ని విద్యారంగ నిపుణులు స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా సెల్ఫోన్లు వాడరాదంటూ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటనను స్వాగతిస్తూ ఉపాధ్యాయులు కూడా సమయాన్ని తరగతి గదుల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకే కేటాయించుకోవాలని సూచిస్తున్నారు. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యను బలోపేతం చేయడంలో భాగంగా తరగతి గదుల్లో సెల్ఫోన్ల వినియోగానికి చెక్ పెట్టడం మంచి పరిణామమని విద్యారంగ నిపుణులతో పాటు అనేకమంది ఉపాధ్యాయులు హర్షిస్తున్నారు. -
పోస్టులు దాచుకున్నారు
సాక్షి, హైదరాబాద్ : సెకండరీ గ్రేడ్ టీచర్ల ఖాళీల ప్రదర్శనపై విద్యా శాఖలో దుమారం రేగుతోంది. తాజా బదిలీల ప్రక్రియలో పూర్తిస్థాయి ఖాళీలను చూపడం లేదంటూ టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీచర్ల బదిలీ ప్రక్రియలో ప్రస్తుతం ఎస్జీటీల వెబ్ కౌన్సెలింగ్ సాగుతోంది. బదిలీ కోసం దరఖాస్తు చేసుకుని కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్న ఎస్జీటీలు ఖాళీలను çసరిచూసుకుని అవాక్కవుతున్నారు. విద్యాశాఖ తొలుత ప్రకటించిన ప్రాథమిక ఖాళీల జాబితాతో పోల్చితే ప్రస్తుత ఖాళీల సంఖ్య భారీగా తగ్గింది. ముఖ్యంగా పట్టణ ప్రాంత పాఠశాలల్లో ఖాళీలు కనిపించడమే లేదు. బదిలీల ప్రక్రియ ఈ నెల 30తో ముగియనుంది. తర్వాత సాధారణ బదిలీలపై నిషేధం వస్తే దొడ్డిదారి బదిలీలకు మార్గం సులువవుతుందనే భావనతోనే కొందరు ప్రభుత్వ పెద్దలు కీలక ఖాళీలను దాచిపెట్టేలా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని, అందులో భాగంగానే పట్టణ ప్రాంత పోస్టులను చూపడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంగ్లిష్ మీడియం సాకుతో ప్రాథమిక జాబితాలో ఉన్న ఖాళీలను దాయడంపై విద్యా శాఖ అధికారులు వింత వాదన విన్పిస్తున్నారు. స్థానిక పరిస్థితులు, క్షేత్రస్థాయిలో పిల్లల తల్లిదండ్రుల డిమాండ్‌తో పలు స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం తరగతులు నిర్వహిస్తున్నారు. అందుకు విద్యాశాఖ అనుమతిచ్చినా, అక్కడ పోస్టులపై ఏ నిర్ణయమూ తీసుకోలేదు. కానీ వాటిని ఇంగ్లిష్ మీడియం వారికి కేటాయిస్తున్నట్లు ఇప్పుడు అధికారులు చెబుతున్నారు. ‘‘త్వరలో టీఆర్టీ నియామకాలు చేపట్టనుండటంతో వాటిని ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులకు కేటాయించనున్నాం. అందుకే వాటిని ప్రస్తుత ఖాళీల జాబితా నుంచి తొలగించాం’’అంటున్నారు. పోస్టులపై నిర్ణయం తీసుకోకుండానే ఇలా ఖాళీలను దాచిపెట్టడంపై ఉపాధ్యాయ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో మోడల్ స్కూల్ నియామకాలప్పుడు ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులకే అవకాశం కల్పిస్తామన్న నిర్ణయంపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అందరికీ అవకాశం కల్పించాలని, అవసరమైతే ఇంగ్లిష్ మీడియం బోధించేలా శిక్షణ ఇవ్వాలని కోర్టు సూచించింది. ఇంగ్లిష్ మీడియం స్కూళ్లకూ ఈ నిబంధనలే వర్తిస్తాయని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. సాధారణ బదిలీలకు ప్రత్యేక కోటాలో ముందు వందల సంఖ్యలో టీచర్లకు స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఏకంగా 80 మంది టీచర్లు రంగారెడ్డి జిల్లాలోని గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతానికి బదిలీపై వచ్చారు. మరికొన్ని పెండింగ్‌లో ఉండగానే బదిలీల షెడ్యూల్ వచ్చేసింది. రంగారెడ్డి జిల్లాలో ప్రాథమిక ఖాళీల జాబితాలో 1,739 ఖాళీలు (క్లియర్ వేకెన్సీలు) చూపగా... ఇప్పుడు 1,501కు తగ్గించారు! మహబూబ్‌నగర్ జిల్లాలోనూ తుది జాబితాలో 52 పోస్టులను దాచేశారు. వరంగల్ జిల్లాలోనూ గ్రేటర్ వరంగల్ పరిధిలో 36 పోస్టులను గోప్యంగా ఉంచారు. నల్లగొండ జిల్లాలో 23 పోస్టులు, మెదక్‌లో 50 పోస్టులు దాచిపెట్టారు. ఖాళీలన్నీ ప్రదర్శించాలి : ఉపాధ్యాయ జేఏసీ డిమాండ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఖాళీలన్నింటినీ వెబ్ కౌన్సెలింగ్‌లో ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉపాధ్యాయ ఐక్య కార్యా చరణ సమితి (జేఏసీ)పాఠశాల విద్యాశాఖ సంచాలకుడి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది. జాక్టో ప్రతినిధి జి.సదానంద్ గౌడ్ మాట్లాడుతూ సెకండరీ గ్రేడ్ టీచర్ ఖాళీల్లో పావువంతు దాచిపెట్టడంతో దీర్ఘకాలం ఒకేచోట పనిచేసిన టీచర్లకు తీవ్ర నష్టం కలుగు తుందన్నారు. కొన్నిచోట్ల ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో ఖాళీలను చూపడం లేదని, 30 శాతం హెచ్ఆర్ఏ ఉన్న పట్టణ ప్రాంతా ల్లోని ఖాళీలు సైతం ప్రదర్శించడం లేదని పేర్కొన్నారు. విద్యాశాఖ నివారణ చర్యలు చేపట్టకుంటే వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొన బోమని ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. -
75,307 దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. సోమ వారం సాయంత్రానికి రాష్ట్రవ్యాప్తంగా 75,307 మంది టీచర్లు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి బదిలీల ప్రక్రియకు భారీ స్పందన వచ్చింది. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారంతా బదిలీకి అర్హులని విద్యా శాఖ సూచించడంతో ఆ మేరకు అర్హత ఉన్న టీచర్లంతా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించారు. దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో వాటి పరిశీలనకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో వాటిని ఎలా పరిశీలించాలనే అంశంపై విద్యా శాఖ మల్లగుల్లాలు పడుతోంది. సందేహాలపై స్పష్టత కరువు.. బదిలీలకు సంబంధించిన అంశాల్లో ఉపాధ్యాయుల సందేహాలపై విద్యాశాఖ మౌనం ప్రదర్శిస్తోంది. ప్రధానంగా మెడికల్ కేటగిరీకి సంబంధించి కొన్ని రకాల వ్యాధులనే ప్రిఫరెన్షియల్ కోటాలో నమోదు చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రధాన వ్యాధులను పేర్కొన్నప్పటికీ వాటిని పక్కాగా నిర్దేశించలేదని, వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల సమన్వయంతో వ్యాధులను నిర్ధారిస్తే అందరికీ న్యాయం జరిగేదని ఎస్టీయూ అధ్యక్షుడు భుజంగరావు, ప్రధాన కార్యదర్శి జి.సదానంద్‌గౌడ్ పేర్కొన్నారు. స్కూళ్ల కేటగిరీ పాయింట్ల కేటాయింపుపై ఉన్న అపోహలు ఇంకా తొలగలేదు. మానసిక వైకల్యం ఉన్న పిల్లలున్న తల్లిదండ్రులకూ ప్రత్యేక పాయింట్లు ఇచ్చినప్పటికీ.. ఆ నిబంధనలో స్పష్టత లేదని, దీంతో పాత సర్టిఫికెట్లతో ఈ పాయింట్లు పొందుతున్నట్లు పలువురు టీచర్లు ఆరోపిçస్తు న్నారు. పదోతరగతి ఉత్తీర్ణత ఫలితాలను ప్రామాణికంగా తీసుకుని టీచర్లకు బదిలీ ప్రక్రియలో పాయింట్లు ఇస్తుండగా.. వాటిని గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు కూడా వర్తింపజేయాలని రాష్ట్ర గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మారెడ్డి, చంద్రప్రకాశ్ డిమాండ్ చేశారు. -
వర్సిటీ అధ్యాపకుల భర్తీపై న్యాయసలహా
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీ వ్యవహారంలో రోస్టర్ విధానంపై న్యాయ సలహా ఇవ్వాలని ప్రభుత్వం అడ్వొకేట్ జనరల్‌ను కోరింది. ఈమేరకు విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య లేఖ రాసినట్లు తెలిపింది. పోస్టుల భర్తీలో యూనివర్సిటీల వారీగా రోస్టర్ అమలు చేయాలా? లేక విభాగాల (సబ్జెక్టు) వారీగా రోస్టర్‌ను అమలు చేయాలా? అన్న విషయంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇచ్చిన సమాధానంపై ఈ లేఖ రాశారు. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని గతంలోనే యూజీసీకి లేఖ రాయగా, అది సెంట్రల్ యూనివర్సిటీలకు వర్తిస్తుందని ఒక చోట, అన్ని యూనివర్సిటీలకు వర్తిస్తుందనే అర్థం వచ్చేలా మరొక చోట పేర్కొనడంతో గందరగోళం నెలకొంది. దీంతో ఆ లేఖను ఎలా అన్వయించు కోవాలన్న విషయంలో సలహా ఇవ్వాలని ప్రభుత్వం అడ్వొకేట్ జనరల్‌ను కోరింది. -
‘హాజరు తీసుకునేప్పుడు జైహింద్ అనండి’
సాక్షి, భోపాల్: స్కూల్లో టీచర్లు హాజరు తీసుకునేప్పుడు ఎస్ సర్/ మేడమ్ అనే బదులు జైహింద్ అనాలని సాత్నా జిల్లా ప్రైయివేట్ స్కూల్ విద్యార్థులకు మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి విజయ్ షా సూచించారు. దీంతో విద్యార్థుల్లో దేశభక్తి పెరుగుతుందన్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ అనుమతితో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాల్లో అమలు చేస్తామన్నారు. ఇది ప్రయివేట్ స్కూల్ విద్యార్థులకు ఒక సలహా మాత్రమేనని షా పేర్కొన్నారు. చిత్రకూట్‌లో జరిగిన ప్రిన్సిపాల్స్, టీచర్ల డివిజనల్ స్థాయి సమావేశంలో మంత్రి ఈ ప్రకటన చేశారు. -
1 నుంచి 9 తరగతులకు 7 నుంచి వార్షిక పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఒకటి నుంచి 9వ తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించేందుకు విద్యా శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. 7, 10, 13, 14, 15, 16 తేదీల్లో పరీక్షలను నిర్వహించేలా గురువారం డీఈవోలకు టైం టేబుల్‌తో కూడిన ఆదేశాలు జారీ చేసింది. జవాబు పత్రాల మూల్యాంకనం కూడా 7వ తేదీ నుంచే ప్రారంభించి 17లోగా పూర్తి చేయాలని, 18న జవాబు పత్రాలను విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు పంపించాలని పేర్కొంది. 7వ తేదీ నుంచి 19వ తేదీలోగా వాటిని రికార్డుల్లో నమోదు చేయాలని, 20న తల్లిదం డ్రులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చిం చాలని చెప్పింది. 21వ తేదీ నుంచి పై తరగతుల బోధనను ప్రారంభించాలని విద్యా శాఖ స్పష్టం చేసింది. -
కర్ణాటక మంత్రి రాసలీలలు!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అధికార కాంగ్రెస్ మరో ‘నీలి వివాదం’లో చిక్కుకుంది. టిప్పు సుల్తాన్ జయంతి రోజున రాష్ట్ర ప్రాథమిక విద్యా మంత్రి తన్వీర్‌సేఠ్ వేదికపై ఫోన్లో నీలిచిత్రాలను చూస్తూ మీడియా కంటపడ్డం తెలిసిందే. తాజాగా అబ్కారీ మంత్రి హెచ్‌వై మేటీ విధానసౌధలోని తన కార్యాలయంలోనే రాసలీలలు సాగించారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. బాగల్కోటేకు చెందిన ఓ ఉద్యోగిని బదిలీ విషయమై కొన్నిరోజుల ముందు మేటీ వద్దకు వచ్చింది. మేటీ ఆమెతో తన కార్యాలయంతో పాటు వివిధ చోట్ల పలు దఫాలుగా రాసలీలలు సాగించారని ఆరోపణలొచ్చాయి. ఈ అశ్లీల దృశ్యాలను ఆయన మాజీ గన్‌మేన్ సుభాష్ రహస్యంగా చిత్రీకరించాడు. అనంతరం ఆ మహిళతో కలసి మంత్రిని బెదిరించారు. రూ.15 కోట్లు ఇవ్వకుంటే వీడియోలను బయటపెడతామనగా, మంత్రి మేటీ రూ.15 లక్షలు ఇస్తానన్నారు. ఇదే సమయంలో ఆర్టీఐ కార్యకర్త రాజశేఖర్ కొన్ని ప్రసార మాధ్యమాలకు రాసలీలల వీడియోలను ఇవ్వడానికి యత్నించారు. దీంతో మంత్రి అనుచరులు ఫోన్లో రాజశేఖర్‌ను బెదిరించారు. రాజశేఖర్ బళ్లారిలోని గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. తానెలాంటి తప్పూ చేయలేదని మేటీ అన్నారు. ‘నా భార్యతో ఉన్నప్పుడు వీడియోలు తీస్తే ఏం చేయాలి?’ అని అన్నారు. -
'మోదీ టీంలో మేమంతా క్రేజీ బోయ్స్'
న్యూఢిల్లీ: 'వి ఆర్ ది క్రేజీ బోయ్స్' అంటూ కొత్తగా మానవ వనరుల అభివృద్ధిశాఖ పగ్గాలు అందుకోబోతున్న ప్రకాశ్ జవదేకర్ అన్నారు. గురువారం బాధ్యతలు స్వీకరించనున్న ఆయన ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో తాము గొప్పగా పనిచేస్తామని చెప్పారు. బుధవారం ఓ మీడియాతో మాట్లాడిన జవదేకర్ ప్రధాని నరేంద్రమోదీ కలగంటున్న అభివృద్ధి ఎజెండాకు అనుకూలంగా ఫ్యాషన్, జీల్ తో పనిచేస్తామని అన్నారు. 'ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో సమర్థంగా పనిచేయగల టీం మాకుంది. ఇది భారత్ టీం. దీనికి అభివృద్ధి మాత్రమే కాకుండా సుస్థిర అభివృద్ధి కోసం పనిచేయాలన్న బలమైన కోరిక ఉంది. మేమంతా ఆ మార్గంలో పనిచేసే క్రేజీ బాయ్స్ లాంటి వాళ్లం' అంటూ జవదేకర్ అన్నారు. 'మానవ వనరుల శాఖ మంత్రిగా పనిచేసేవారికి కచ్చితంగా క్యాబినెట్ ర్యాంక్ అవసరం. అది సాంకేతికపరంగా కూడా' అని ఆయన అన్నారు. మార్పు సాకారానికి విద్య ఒక ఆయుధంలాంటిదని అన్నారు. అందుకోసం నాణ్యమైన విద్య అందించడం ఎంతో ముఖ్యం అని చెప్పారు. విద్యకు సంబంధించి రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఈ శాఖ నిర్వహించిన స్మృతి ఇరానీ సలహాలు కూడా తీసుకుంటానని ఆయన చెప్పారు. -
ఏళ్లతర'బడి' సమస్యలే..
నేడు విద్యాశాఖ మంత్రి సమీక్ష సంగారెడ్డి మున్సిపాలిటీ: సర్కార్ బడులు అనేక సమస్యలతో సతమతమవుతున్నాయి. ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. శిథిల భవనాలు భయపెడుతున్నాయి. గదుల కొరతతో ఆరుబయటే పాఠాలు. కనీస సౌకర్యాల దిక్కే లేదు. ఈ దశలో ప్రభుత్వ పాఠశాలల వైపు రావడానికి విద్యార్థులు జంకుతున్నారు. బడిబాట కార్యక్రమాన్ని పెట్టినా ఆశించిన మేర విద్యార్థులు చేరకపోవడం ఇందుకు నిదర్శనం. ఈ పరిస్థితుల్లో సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి మంగళవారం సంగారెడ్డిలో విద్యా వ్యవస్థపై ఆ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో నెల కొన్న విద్యారంగ సమస్యలను ఏ మేరకు పరిష్కరిస్తారనే ఆసక్తితో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,974 ప్రాథమిక పాఠశాలలు, 420 ప్రాథమికోన్నత, 502 ఉన్నత పాఠశాలల్లో 3.50 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న గజ్వేల్‌తోపాటు నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈనెల 2 నుంచి 12 వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించినా ఆశించిన స్థాయిలో సర్కార్ బడుల్లో విద్యార్థులు చేరలేకపోయారు. మరోవైపు జిల్లాలో 3,289 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా 127 పాఠశాలలు ఉపాధ్యాయులు లేక మూతపడే పరిస్థితి నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి, మూత్రశాలల సదుపాయం కల్పించాలి. కానీ జిల్లాలో ఇప్పటివరకు 1,260 పాఠశాలల్లో విద్యార్థులు తాగేందుకు నీటి వసతిని కల్పించలేకపోయారు. 13 పాఠశాలల్లో కనీసం మరుగుదొడ్లు నిర్మించలేని పరిస్థితి. మొత్తంగా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ముందుకు రావడం లేదు. మరోవైపు ప్రైవేటు పాఠశాలలకు పోటీగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ స్థానికంగా ఉపాధ్యాయుల్లో నెలకొన్న సమన్వయంతోపాటు ఉపాధ్యాయుల కొరత, తరగతి గదులు సరిపోనందున కేవలం 117 పాఠశాలల్లోనే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి నిర్వహించే సమీక్ష సమావేశంలో ఏ మేరకు సమస్యలను పరిష్కరిస్తారో వేచి చూడాలి. -
తాగునీరు, కరువు సమస్యలపై నివేదికలు ఇవ్వండి
ఆలమట్టి నుంచి రోజు 200 క్యుసెక్కుల నీరు విడుదల రాయచూరు రూరల్ : జిల్లాలో తాగునీరు, కరువు సమస్యలపై శాసన సభ్యులకు వారం రోజులో నివేదికలు అందించాలని ఆదేశాలు చేసినట్లు రాష్ట్ర వైద్య విద్యా శాఖా మంత్రి శరణు ప్రకాష్ పాటిల్ అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన జిల్లాధికారి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తాగునీటిపై యుద్ధప్రాతిపదికన తాగునీటి పథకాలకు త్వరితగతిన విద్యుత్ సౌకర్యం కల్పించి మార్చి నాటికి నీరందించాలని అధికారులను కోరామన్నారు. వారం రోజులలో టాస్క్ఫోర్సు సమావేశం ఏర్పాటు చేసి నివేదికలు అందించాలని శాసన సభ్యులకు వివరించామన్నారు. అవ సరం ఉన్న చోట్ల నీటి ట్యాంకుల ద్వారా పంపిణీ చేయాలని కోరామన్నారు. రాయచూరు జిల్లాలో తాగు నీటి కోసం ప్రతి శాసన సభ్యుడికి రూ.50 లక్షల నిధులు ఖర్చు చేసేందుకు అవకాశం కల్పించామన్నారు. జిల్లాలో తాగునీరు, విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి ఆలమట్టి నుంచి ప్రతి రోజు 200 క్యుసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారని వివ రించారు. తెలంగాణ ప్రజలు కృష్ణ నదీ తీర ప్రాంతంలో రింగ్ బండ్లను తొలగించకుండా చర్యలు తీసుకువాలని జిల్లాధికారి సింథల్కు సూచించామని వివరించారు. సమావేశంలో శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, బాదర్లి హంపన గౌడ, జిల్లాధికారి శశికాంత్ సింథల్, సీఈఓ కూర్మారావు తదితరులు పాల్గొన్నారు. -
విపత్తు నిర్వహణపై విద్యార్థులకు శిక్షణ
- వెల్లడించిన విద్యా శాఖ మంత్రి వినోద్ తావ్డే - వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని స్పష్టం సాక్షి, ముంబై: ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు, ప్రమాదాల సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాఠశాల విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని విద్యా శాఖ మంత్రి వినోద్ తావ్డే మంత్రాలయ భవనంలో చెప్పారు. ఇందుకోసం వచ్చే నెలలో పాఠశాలలు ప్రారంభమైన తర్వాత ప్రత్యేకంగా కొంత సమయాన్ని కేటాయించి శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇటీవల నేపాల్‌లో సంభవించిన భూకంపం వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. మరోవైపు నేపాల్, పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఆర్మీ పాఠశాలలోకి ఉగ్రవాదులు చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అభం శుభం తెలియని విద్యార్థులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. కొద్ది సంవత్సరాల కిందట తమిళనాడులో ఓ పాఠశాల భవనానికి అగ్ని ప్రమాదం సంభవించింది. పాఠశాల భవనానికి ఒకే వైపు మెట్లు ఉండటంతో ఎటు వెళ్లాలో విద్యార్థులకు అర్థంకాక పాఠశాలలో తొక్కిసలాట జరిగింది. దీంతో అనేక మంది విద్యార్థులు మృతి చెందారు. దీంతో ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాల సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. -
ప్రజలు సహకరించాలి
- స్కూళ్ల వద్ద పొగాకు విక్రయాల నియంత్రణపై విద్యా మంత్రి - అత్యధికంగా దానికి బానిసలవుతున్నది 15 ఏళ్లలోపు వారేనని వెల్లడి - 10 నిమిషాల నిడివి ఉన్న లఘ చిత్రం విడుదల - ఘనంగా ఐసీఎస్ వ్యవస్థాపక దినోత్సవం సాక్షి, ముంబై: పాఠశాల సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలను అరికట్టడానికి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల సహాయం అవసరమని విద్యా శాఖ మంత్రి వినోద్ తావ్డే అభిప్రాయపడ్డారు. శనివారం ఇండియన్ క్యాన్సర్ సొసైటీ (ఐసీఎస్) అనే ఎన్జీవో సంస్థ 64వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పొగాకు వ్యతిరేక చిత్రాన్ని ప్రదర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. పొగాకు వ్యతిరేక చట్టాన్ని అమలు చేసేందుకు ప్రజలను కూడా భాగస్వాములను చేయనున్నట్లు తెలిపారు. పాఠశాల ఆవరణలో 90 మీటర్ల మేర పొగాకు ఉత్పత్తుల విక్రయాన్ని నిషేధించినట్లు తెలిపారు. అయినా కొందరు విక్రయాలను కొనసాగిస్తూనే ఉన్నారని అన్నారు. దీంతో పాఠశాలల సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలు జరిగితే నివేదిక సమర్పించాల్సిందిగా పేరెంట్స్ అండ్ టీచర్స్ అసోసియేషన్స్ (పీటీఏఎస్) సభ్యులకు కూడా విజ్ఞప్తి చేశానన్నారు. విద్యా శాఖకు వీరు ఫోన్లు లేదా ఈ-మెయిల్స్ ద్వారా సమాచారం అందించాల్సిందిగా కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్ నటుడు వరుణ్ ధవన్ మాట్లాడుతూ.. తాను 15 ఏళ్ల వయస్సులో ధూమపానానికి అలవాటు పడ్డానని, తరువాత స్నేహితుల సాయంతో వదిలించుకున్నానని తెలిపారు. పొగాకు వినియోగానికి వ్యతిరేకంగా రూపొందించిన 10 నిమిషాల నిడివి ఉన్న ఓ లఘు చిత్రాన్ని కార్యక్రమంలో ప్రదర్శించారు. ఐసీఎస్ లెక్కల ప్రకారం.. పొగాకు వినియోగానికి బానిసలైన వారిలో సగం మంది 15 ఏళ్లలోపు వాళ్లే ఉన్నారని తేలింది. ప్రతి ఏడాది పొగాకుకు బానిసలై దాదాపు మూడు లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. గన నాలుగేళ్లుగా 1,320 మంది క్యాన్సర్ రోగులకు ఎన్జీవో సంస్థ సహాయాన్ని అందజేసింది. ఇందులో 196 మంది రాష్ట్రానికి చెందినవారు ఉండగా, 249 మంది బెంగాల్‌కు చెందిన వారు ఉన్నారు. -
వృత్తివిద్యకు పెద్దపీట!
నేడు ఢిల్లీలో విద్యాశాఖ మంత్రుల సమావేశం సాక్షి, హైదరాబాద్: జాతీయస్థాయిలో కేంద్రం రూపొందిస్తున్న నూతన విద్యావిధానంలో వృత్తివిద్యకు పెద్దపీట వేయబోతోంది. ఇందులో భాగంగా ఈ నెల 21న ఢిల్లీలో అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, ముఖ్య కార్యదర్శులతో సమావేశాన్ని నిర్విహ స్తోంది. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రంజీవ్.ఆర్.ఆచార్య హాజరుకానున్నారు. రాష్ట్రంలోనూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాల స్థాయిలో వృత్తివిద్యను అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కేంద్రం రూపొందించిన నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్(ఎన్ఎస్క్యూఎఫ్) ప్రకారం 9వ తరగతి నుంచే వృత్తి విద్యను ప్రవేశపెట్టాల్సి ఉంది. ఈ అంశంతోపాటు ఎలిమెంటరీ విద్యలో నైపుణ్యాల పెంపు, పాఠశాల పరీక్ష విధానాల్లో సంస్కరణలు, ఉపాధ్యాయ విద్య పునర్వ్యవస్థీకరణ, పిల్లల ఆరోగ్యం తదితర అంశాలపై చర్చించి నిర్ణయం సమావేశం తీసుకోనుంది. -
కేజీ టు పీజీలోనూ వృత్తి విద్య!
- అనుసంధానించాలనే యోచనలో విద్యాశాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని భావిస్తున్న కేజీ టు పీజీ ఉచిత నిర్భంద విద్యలో వృత్తి విద్య కోర్సులను ప్రవేశపెట్టే అంశంపైనా విద్యాశాఖ ఆలోచనలు చేస్తోంది. నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్‌ను (ఎన్ఎస్క్యూఎఫ్) రూపొందించిన కేంద్ర ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచే వృత్తి విద్యా కోర్సులను ప్రవేశ పెట్టాలని స్పష్టం చేసింది. తద్వారా విద్యార్థులు వివిధ దశల్లోని ఆయా కోర్సులను చదువుకోవడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా అమల్లోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్న కేజీ టు పీజీలో వృత్తి విద్యా కోర్సుల ప్రవేశంపైనా ప్రభుత్వం ఆలోచిస్తోంది. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో దీనిపై చర్చించినట్లు తెలిసింది. కేజీ టు పీజీపై విధాన పత్రం రూపొందించేందుకు నిర్వహించిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, విద్యావేత్త చుక్కా రామయ్య, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య, పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు, అదనపు డెరైక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివి ద అంశాలపై చర్చించారు. ఇప్పటివరకు రాష్ట్ర విద్యా విధానంలో గురుకుల విద్య మాత్రమే పక్కాగా సత్ఫలితాలు ఇస్తోందన్న భావనకు ప్రభుత్వం వచ్చిం ది. అందుకే కేజీ టు పీజీ విద్యా సంస్థల్లో గురుకుల విద్య, ఇంగ్లిషు మీడియం విద్యను ప్రవేశపెట్టాలని సమావేశంలో ప్రాథమికంగా ఓ అవగాహనకు వచ్చారు. అయితే ఏ తరగతి నుంచి ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టాలి? ఏ తరగతి నుంచి గురుకుల విద్యను అమలు చేయాలన్న ఆంశాలపై వివిధ కోణాల్లో ఆలోచనలు చేశారు. కొంత మంది కిండర్‌గార్టెన్ (కేజీ) నుంచే ఇంగ్లిషు మీడియం ప్రవేశ పెట్టాలని పేర్కొనగా మరికొంత మంది 4వ తరగతి నుంచి ఇంగ్లిషు మీడియం ఉండాలన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలోనే విద్యా బోధన ఉండాలని కొందరు పేర్కొనగా, తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు కేజీ నుంచే ఇంగ్లిషు మీడియం ప్రవేశ పెట్టాలని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ప్రాథమిక స్థాయిలో తెలుగుతోపాటు ఇంగ్లిషు మీడియంను కూడా కొనసాగించడానికి వీలు అవుతుందా? ఇంగ్లిషును ఒక సబ్జెక్టుగా కొనసాగిస్తే ఎలా ఉంటుందన్న ఆంశాలపై చర్చించారు. ఇప్పటివరకు అంతర్జాతీయంగా ఎక్కడా లేని కొత్త విధానం అమల్లోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ, జాతీయ చట్టాలు ఏం చెబుతున్నాయని, ఎలా ముందుకు సాగాలన్న అంశాలపై చర్చ జరి గింది. మొత్తానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, అణగారిన వర్గాలకు చెందిన నిరుపేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలన్న ముఖ్య లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎలా ముందుకు సాగాలన్న అంశాలపై ఈనెల 18 లేదా 19 తేదీల్లో మరోసారి సమావేశమై విధాన పత్రాన్ని ఖరారు చేయాలని నిర్ణయించారు. ఆ తరువాత ఆ విధానపత్రాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదానికి పంపించనున్నారు. సీఎం ఆమోదం తరువాత తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలతో చర్చించాలని, వెబ్సైట్లో పెట్టి అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించారు.