బెంగళూరు: కర్ణాటక పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ మంత్రి మధు బంగారప్పను చెక్ బౌన్స్ కేసులో ప్రత్యేక కోర్టు దోషిగా తేలి్చంది. ఫిర్యాదుదారులైన రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థకు రూ.6.96 కోట్లు జరిమానాగా చెల్లించాలని ఆయనను ఆదేశించింది. మరో రూ.10 వేలను కర్ణాటక ప్రభుత్వానికి చెల్లించాలని స్పష్టం చేసింది. జరిమానా చెల్లించకపోతే ఆరు నెలలపాటు సాధారణ జైలు శిక్ష అనుభించాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది.
ఈ మేరకు ఇటీవల తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆకాశ్ ఆడియో–వీడియో ప్రైవేట్ లిమిటెట్‌ను మొదటి నిందితులుగా, ఆకాశ్ ఆడియో–వీడియో ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మధు బంగారప్ప రెండో నిందితుడిగా కోర్టు గుర్తించింది. రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థ నుంచి మధు బంగారప్ప రూ.6 కోట్లు డిపాజిట్ రూపంలో తీసుకున్నారు. చాలా రోజులు తిరిగి చెల్లించలేదు. గట్టిగా నిలదీయగా చెక్కు ఇచ్చారు. బ్యాంకు ఖాతాలో నగదు లేకపోవడంతో అది బౌన్స్ అయ్యింది. దాంతో రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థ కోర్టును ఆశ్రయించింది.
Comments
Please login to add a commentAdd a comment