తీర్పుపై వెంటనే ధర్మాసనాన్ని ఆశ్రయించిన అధికారులు
సింగిల్ జడ్జి తీర్పును రెండు వారాలు నిలిపేసిన ధర్మాసనం
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో అప్పటి గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే (ప్రస్తుతం రవాణా, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి)కు హైకోర్టు రూ.2 వేల జరిమానా విధించింది. ఆ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) ఎస్.శ్రీనివాస్‌కు 2 నెలల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. ఈ మేరకు న్యా యమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖర్ శుక్రవా రం తీర్పు వెలువరించారు.
వారిద్దరినీ రిజి స్ట్రార్ (జ్యుడీషియల్) ముందు లొంగిపోవాలని ఆదేశించారు. ఈ తీర్పు వెలువడగానే, దీనిని సవాలు చేస్తూ కాంతిలాల్ దండే, శ్రీనివాస్‌లు వేర్వేరుగా ధర్మాసనం ముందు కోర్టు ధిక్కార అప్పీళ్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ నూనెపల్లి హరినాథ్ ధర్మాసనం సింగిల్ జడ్జి తీర్పు అమలును రెండు వారాలు నిలిపేసింది. తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది.
పదోన్నతినివ్వడం లేదంటూ పిటిషన్..
తన సుదీర్ఘ సర్వీసు ఆధారంగా సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్‌ఈ)గా పదోన్నతినివ్వడం లేదంటూ గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జి క్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) బి.వసంత 2021లో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు నాలుగు నెలల్లో ఏఈలు, ఏఈఈలు, డీవైఈఈల సీనియారిటీ జాబితా ఖరారు చేయాలని 2022లో అధికారులను ఆదేశించారు. అనంతరం అధికారులు ఈ ఆదేశాలను అమలు చేయడంలేదంటూ వసంత కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు.
ఆగస్టు 1న మరోసారి విచా రణకు రాగా.. న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖరరావు అధికారుల తీరును తీవ్రంగా ఆక్షేపిస్తూ ఈ నెల 9న తీర్పు ఇచ్చారు. కోర్టుకు హాజరైన ఇరువురు అధికారులు కోర్టు ఆదేశాల అమలుకు మరింత గడువు కోరారు. దీంతో న్యాయమూర్తి తన ఉత్తర్వుల అమలును మూడు వారాలు నిలిపివేశారు. తిరిగి ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు రాగా.. గతంలో శిక్ష విధించిన నేపథ్యంలో వెంటనే రిజిస్ట్రార్ ముందు లొంగిపోవాలని ఇరువురినీ ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment