Contempt Of Court
-
కోర్టు ఆదేశించినా ధిక్కరణ!
సాక్షి, హైదరాబాద్: కోర్టు మెట్లెక్కాలంటేనే ప్రజలకు భయం.. తీర్పు కోసం ఎన్నేళ్లు ఎదురుచూడాలో అని. అలాంటిది ట్రయల్ కోర్టులో తీర్పు వచ్చి, అక్కడి నుంచి హైకోర్టుకు చేరిన పిటిషన్లలోనూ తీర్పు వచ్చిన తర్వాత కూడా.. దాని అమలులో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే ఎలా ఉంటుంది? అవును.. న్యాయస్థానాల ఉత్తర్వులను లెక్క చేయడం లేదు కొందరు అధికారులు. శిక్షలు విధించినా వారిలో మార్పు రావడంలేదు. కోర్టు ధిక్కరణ కేసులో శిక్షలు పడినా అప్పీళ్లలో తప్పించుకుంటున్నారు. దీంతో బాధితులు మరోసారి కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తోంది.కోర్టు ధిక్కరణ కేసుల్లో న్యాయమూర్తులు అతిగా ఆవేశానికి లోను కావొద్దని.. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలని సుప్రీంకోర్టు చేసిన సూచనలతో కింది కోర్టులు మానవతా దృక్పథంతో శిక్షలను మాఫీ చేస్తుండటంతో అధికారులు అదే అలుసుగా తీసుకుంటున్నారు. కోర్టు తీర్పు ఇస్తే అమలు చేసి తీరాలా? అని ప్రశ్నిస్తున్నారు. ఏటా పెరుగుతున్న కోర్టు ధిక్కరణ కేసుల గణాంకాలే అందుకు నిదర్శనం. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ –1971 ప్రకారం కోర్టు ధిక్కరణ రెండు రకాలు. సివిల్, క్రిమినల్. ఈ చట్టంలోని సెక్షన్ 1 (15) ప్రకారం.. క్రిమినల్ కంటెంప్ట్ విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు నేరుగా చర్యలు తీసుకోవచ్చు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో దాఖలయ్యే ధిక్కరణ కేసుల్లో సివిల్వే ఎక్కువ. ఏదైనా కోర్టు తీర్పు, ఆదేశం లేదా ఇతర కోర్టు ప్రక్రియలను ఉద్దేశపూర్వకంగానే విస్మరించటాన్ని సివిల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా పరిగణిస్తారు. క్రిమినల్ కంటెంప్్టలో మూడు రకాలున్నాయి. ప్రచురణ రూపంలో, వ్యాఖ్యల రూపంలో, సంజ్ఞల రూపంలో కోర్టుల ఆదేశాలను ఉల్లంఘించినా, కోర్టులను అగౌరవపరిచినా, న్యాయ ప్రక్రియకు అడ్డుపడినా క్రిమినల్ కంటెంప్ట్ కిందికి వస్తుంది.ఎస్ఐకి జరిమానా.. ‘కోర్టు వద్దని చెప్పినా అరెస్టు చేస్తారా? న్యాయస్థానం ఉత్తర్వులంటే లెక్కలేదా? 41ఏ నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేసి ఉద్దేశపూర్వకంగానే ధిక్కరణకు పాల్పడ్డారు. సదరు సబ్ ఇన్స్పెక్టర్ క్షమాపణ చెప్పినా ఆమోదయోగ్యం కాదు. వారంపాటు జైలుతోపాటు రూ.2 వేల జరిమానా విధిస్తున్నాం. అంతేకాదు.. బాధితుడికి రూ.50 వేలు పరిహారం చెల్లించాలి.’ – ఒక ఎస్ఐ తీరుపై హైకోర్టు ఆగ్రహం.ఎంపీకి నోటీసులు.. ‘న్యాయవ్యవస్థపై నిరాధార ఆరోపణలు చేయడం క్షంతవ్యం కాదు. మీడియా సమావేశాల్లో ఇష్టం వచి్చనట్లు ఎలా మాట్లాడతారు? దీనిపై వివరణ ఇస్తూ కౌంటర్ దాఖలు చేయండి.’ – ఒక ఎంపీకి కోర్టు ఆదేశం.కలెక్టర్‌కు జైలు.. ‘ఆరోగ్య కార్యకర్తల వేతనాల చెల్లింపులకు సంబంధించి కోర్టు ఉత్తర్వులను 15 రోజుల్లో అమలు చేయని పక్షంలో కలెక్టర్ నెలరోజులు జైలుకు వెళ్లాల్సిందే. రూ.2 వేల జరిమానా కూడా చెల్లించాలి. అలాగే మున్సిపల్ కమిషనర్‌కు 15 రోజుల జైలు, రూ.వెయ్యి జరిమానా విధిస్తున్నాం.’ ఒక కలెక్టర్ తీరుపై న్యాయస్థానం మండిపాటు.15 ఏళ్లయినా పరిష్కారం కాలేదు.. మా భూమిని ప్రభుత్వ భవనాలు నిర్మించడం కోసం దాదాపు ఒకటిన్నర దశాబ్దాల క్రితం నల్లగొండ జిల్లా కలెక్టర్ తీసుకున్నారు. పరిహారం తర్వాత అందిస్తామని చెప్పారు. ఇప్పటివరకు పరిహారం అందలేదు. కోర్టు చుట్టూ తిరిగి ఆదేశాలు తెచ్చుకున్నా స్పందన లేదు. ఇప్పుడు ధిక్కరణ పిటిషన్ వేశా. విచారణ కొనసాగుతోంది. 70 ఏళ్లు దాటిన వృద్ధుడిని. ఇంకా ఎన్నాళ్లు తిరగాలో.. – భువనగిరికి చెందిన ఓ బాధితుడు కఠిన చర్యలు తీసుకుంటేనే తీర్పుల అమలు సాధ్యం న్యాయం ఆలస్యమైతే న్యాయాన్ని నిరాకరించినట్లే.. అన్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ అయ్యర్ మాట న్యాయవ్యవస్థలో నేడు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కోర్టు మెట్లెక్కిన సామాన్యుడికి వీలైనంత త్వరగా న్యాయం అందించాలి. కోర్టు తీర్పులను కూడా అధికారులు అమలు చేయకపోతే ప్రజలు ఎక్కడికి పోవాలి? ఎన్నిసార్లు కోర్టులను ఆశ్రయించాలి? కోర్టు ఉత్తర్వులను అమలు చేయకుంటే ఉద్యోగాలు పోతాయి అంటే తప్ప అధికారులు అమలు చేయరు. తీర్పులను అమలు చేయనివారికి కఠిన శిక్షలు విధించాలి. – చిక్కుడు ప్రభాకర్, హైకోర్టు న్యాయవాది -
కూల్చివేత బాధితులు కోర్టుకు రావొచ్చు
న్యూఢిల్లీ: బుల్డోజర్ న్యాయానికి సుప్రీంకోర్టు బ్రేక్ వేసినా.. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్తాన్ అధికారులు దీన్ని ఉల్లంఘించారని, ఈ మూడు రాష్ట్రాలపై కోర్టు ధిక్కరణ అభియోగాలు నమోదు చేయాలని దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం గురువారం తిరస్కరించింది. పిటిషనర్‌కు కూల్చివేత బాధితుడు కాదని, ఆయనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా వాటితో ఎలాంటి సంబంధం లేదని జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ పి.కె.మిశ్రా, జస్టిస్ కె.వి.విశ్వనాథన్‌ల ధర్మాసనం పేర్కొంది. తేనెతుట్టను కదల్చాలని తాము అనుకోవడం లేదని, కూల్చివేత బాధితులు ఎవరైనా ఉంటే కోర్టుకు రావొచ్చని స్పష్టం చేసింది. నిందితులు అయినంత మాత్రాన వారి ఇళ్లను, ఇతర నిర్మాణాలను కూల్చవద్దని సుప్రీంకోర్టు బుల్డోజర్ న్యాయానికి బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. తమ అనుమతి లేకుండా ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని తెలిపింది. దీనిపై తాముదేశవ్యాప్తంగా అమలయ్యేలా మార్గదర్శకాలు జారీచేస్తామని చెప్పింది. అయితే ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే.. అది గుడి అయినా, మసీదు అయినా కూల్చివేయాల్సిందేనని స్పష్టం చేసింది. కోర్టు అనుమతి లేకుండా కూల్చివేత చేపట్టవద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కాన్పూర్, హరిద్వార్, జైపూర్లలో అధికారులు కూల్చివేతలకు దిగారని, కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పిటిషనర్ తరఫున న్యాయవాది పేర్కొన్నారు. ఒకచోట అయితే ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే కూల్చివేతకు పాల్పడ్డారని తెలిపారు. ఫుట్‌పాత్ ఆక్రమణనను మాత్రమే తొలగించారని, పిటిషనర్‌కు నేరుగా దీనితో ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఆయనకు వాస్తవాలు తెలియవని ఉత్తరప్రదేశ్ తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ కె.ఎం.నటరాజ్ వాదించారు. పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా పిటిషనర్ సుప్రీంకోర్టుకు వచ్చారని అన్నారు. ఈ కూల్చివేతలతో పిటిషనర్‌కు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి... పిటిషన్‌ను అనుమతించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. పైన పేర్కొన్న మూడు ఘటనల్లో ఇద్దరు జైళ్లో ఉన్నారని పిటిషనర్ తెలుపగా.. వారి కుటుంబీకులు కోర్టును ఆశ్రయించవచ్చని ధర్మాసనం బదులిచి్చంది. -
బుల్డోజర్ చర్యపై అస్సాంకు సుప్రీంకోర్టు ధిక్కార నోటీసులు
కోర్టు అనుమతి లేకుండా ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదన్న అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించిందంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం అసోం ప్రభుత్వానికి ధిక్కార నోటీసు జారీ చేసింది. కామరూప్ మెట్రో డిస్ట్రిక్ట్ పరిధిలోని సోనపుర్ మువాజ ప్రాంతానికి చెందిన 47 మంది పౌరులు దాఖలు చేసిన పిటిషన్‌న్‌పై నేడు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ వరకు కూల్చివేతలను ఆపేయాలంటూ, యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. కాగా రోడ్లు, ఫుట్‌పాత్‌లు, రైల్వే లైన్లు, వాటర్‌బాడీస్‌లో ఉన్న నిర్మాణాలను తప్పితే.. మిగిలిన వాటిని కూల్చే ముందు న్యాయస్థానాల అనుమతి తప్పనిసరి అంటూ సెప్టెంబర్ 17న కోర్టు చెప్పింది. అయినా తమ ఇళ్లను కూల్చడంపై బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన ఆదేశాన్ని ఉల్లంఘించి అధికారులు తమ ఇళ్లను కూల్చివేశారని, అలాగే అసోం అడ్వకేట్ జనరల్ సెప్టెంబరు 20న గౌహతి హైకోర్టుకు తమ పిటిషన్లను పరిష్కరించే వరకు తమపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చారని పిటిషనర్లు పేర్కొన్నారు. -
నచ్చకపోతే భారత్‌లో పనిచేయవద్దు: వికీపీడియాపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: ప్రముఖ ఉచిత సమాచార సంస్థ వికీపీడియాపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వార్తా సంస్థ ఏఎన్ఐ వికీపీడియాపై పరువు నష్టం కేసు వేసిన విషయంలో హైకోర్టు.. వికిపీడియాకు గురువారం ‘కోర్టు ధిక్కార నోటీసులు’ జారీ చేసింది. భారత న్యాయవ్యవస్థ ఆదేశాలను పాటించకపోతే, భారతదేశంలో తమ వ్యాపారాన్ని మూసివేయమని ప్రభుత్వాన్ని ఆదేశిస్తామని స్పష్టం చేసింది. మీకు భారతదేశం నచ్చకపోతే ఇక్కడ మీ కార్యాకలాపాలు మూసివేయాలని హైకోర్టు తెలిపింది.కాగా ప్రముఖ వార్త సంస్థ ఏఎన్‌ఐను వికీపీడియా తన పేజీలో ప్రస్తుత ప్రభుత్వానికి 'ప్రచార సాధనం'గా పేర్కొంది. దీంతో వికీపీడియా తన ప్లాట్‌ఫారమ్‌లో సవరణలు చేసుకోవడానికి వ్యక్తులను అనుమతిస్తోందని ఏఎన్ఐ ఆరోపించింది. తమ గురించి తప్పుడు సమాచారం ఎడిట్ చేసింది వికీపీడియా, దాని ఎడిటర్లు కాదని, ముగ్గురు బయటి వ్యక్తులు అని పేర్కొంది. ఈ క్రమంలో వార్తా సంస్థ ఏఎన్ఐ వికీపీడియాపై ఢిల్లీ కోర్టులో రూ.2 కోట్ల పరువునష్టం దావా వేసింది. ఈ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది.అయితే వికీపీడియాలో ఈ సవరణలు చేసిన వారి వివరాలను బహిర్గతం చేయాలని కోర్టు సదరు సంస్తను ఆదేశించింది. కానీ ఇప్పటి వరకు ఆ వివరాలును వెల్లడించలేదని ఏఎన్ఐ తెలిపింది. దీనిపై వికీపీడియా స్పందిస్తూ.. తమ వైపు నుంచి కొన్ని పత్రాల సమర్పణ పెండింగ్‌లో ఉందని, వికీపీడియా భారతదేశంలో ఆధారితం కానందున వారి వివరాల వెల్లడికి ఆలస్యం అయిందని కోర్టుకు తెలిపింది.అయితే వికీపీడియా సమాధానంపై కోర్టు సంతృప్తి చెందలేదు. ‘ప్రతివాది భారతదేశంలో ఒక సంస్థ కాకపోవడం ప్రశ్న కాదు. మేము మీ వ్యాపార లావాదేవీలను ఇక్కడ మూసివేస్తాము. వికీపీడియాను బ్లాక్ చేయమని మేము ప్రభుత్వాన్ని అడుగుతాము.. ఇంతకుముందు కూడా ఇలాగే చేశారు. మీకు భారతదేశం నచ్చకపోతే, దయచేసి ఇక్కడ పని చేయవద్దు’ అంటూ మండిపడింది.తదుపరి విచారణను అక్టోబర్‌కు వాయిదా వేసిది. అంతేగాక వచ్చే విచారణలో కంపెనీ ప్రతినిధి తప్పక హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా వికీపీడియాను జిమ్మీ వేల్స్ లారీ సాంగర్ 2001లో స్థాపించారు. ఈ వెబ్సైట్ యునైటెడ్ స్టేట్స్‌లోని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తుంది. -
కోర్టు ధిక్కార కేసులో అధికారులకు జైలు శిక్ష, జరిమానా
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో అప్పటి గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే (ప్రస్తుతం రవాణా, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి)కు హైకోర్టు రూ.2 వేల జరిమానా విధించింది. ఆ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) ఎస్.శ్రీనివాస్‌కు 2 నెలల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. ఈ మేరకు న్యా యమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖర్ శుక్రవా రం తీర్పు వెలువరించారు.వారిద్దరినీ రిజి స్ట్రార్ (జ్యుడీషియల్) ముందు లొంగిపోవాలని ఆదేశించారు. ఈ తీర్పు వెలువడగానే, దీనిని సవాలు చేస్తూ కాంతిలాల్ దండే, శ్రీనివాస్‌లు వేర్వేరుగా ధర్మాసనం ముందు కోర్టు ధిక్కార అప్పీళ్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ నూనెపల్లి హరినాథ్ ధర్మాసనం సింగిల్ జడ్జి తీర్పు అమలును రెండు వారాలు నిలిపేసింది. తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది.పదోన్నతినివ్వడం లేదంటూ పిటిషన్..తన సుదీర్ఘ సర్వీసు ఆధారంగా సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ)గా పదోన్నతినివ్వడం లేదంటూ గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జి క్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) బి.వసంత 2021లో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు నాలుగు నెలల్లో ఏఈలు, ఏఈఈలు, డీవైఈఈల సీనియారిటీ జాబితా ఖరారు చేయాలని 2022లో అధికారులను ఆదేశించారు. అనంతరం అధికారులు ఈ ఆదేశాలను అమలు చేయడంలేదంటూ వసంత కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఆగస్టు 1న మరోసారి విచా రణకు రాగా.. న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖరరావు అధికారుల తీరును తీవ్రంగా ఆక్షేపిస్తూ ఈ నెల 9న తీర్పు ఇచ్చారు. కోర్టుకు హాజరైన ఇరువురు అధికారులు కోర్టు ఆదేశాల అమలుకు మరింత గడువు కోరారు. దీంతో న్యాయమూర్తి తన ఉత్తర్వుల అమలును మూడు వారాలు నిలిపివేశారు. తిరిగి ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు రాగా.. గతంలో శిక్ష విధించిన నేపథ్యంలో వెంటనే రిజిస్ట్రార్ ముందు లొంగిపోవాలని ఇరువురినీ ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
కాటంనేని భాస్కర్, నిర్మల్ కుమార్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోండి
సాక్షి, అమరావతి: చట్ట ప్రకారం నడుచుకుంటామని కోర్టుకు చెప్పి, అందుకు విరుద్ధంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం భవనాన్ని కూల్చివేయడంపై ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. పార్టీ కార్యాలయం కూల్చివేతకు బాధ్యులైన సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, మంగళగిరి, తాడేపల్లి మునిసిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్‌పై కోర్టు ధిక్కరణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. వైఎస్సార్సీపీ తరఫున పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఎం.శేషగిరిరావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో కాటంనేని భాస్కర్, నిర్మల్ కుమార్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.చట్ట ప్రకారం నడుచుకోమని కోర్టు ఆదేశించినా.. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం భవనాన్ని కూల్చివేసేందుకు మునిసిపల్ కమిషనర్ జారీ చేసిన ప్రాథమిక ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్సీపీ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యం విచారణ సందర్భంగా వైఎస్సార్సీపీ భవనం విషయంలో చట్ట ప్రకారమే నడుచుకుంటామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చారు.దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఆ భవనం కూల్చివేత విషయంలో తదుపరి చర్యలు చేపట్టే ముందు చట్ట ప్రకారం నడుచుకోవాలని సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, మునిసిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్‌ను ఆదేశిస్తూ ఈ నెల 21న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలను వైఎస్సార్సీపీ తరఫు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి లిఖితపూర్వకంగా సీఆర్డీఏ కమిషనర్, మునిసిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆ మరుసటి రోజు తెల్లారి 5 గంటల సమయంలో పార్టీ ప్రధాన కార్యాలయాన్ని కూల్చేశారు.కోర్టు ఆదేశాలను ధిక్కరించి పార్టీ భవనాన్ని కూల్చివేసినందుకు కాటంనేని భాస్కర్, నిర్మల్ కుమార్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరుతూ తాజాగా వైఎస్సార్సీపీ పిటిషన్ దాఖలు చేసింది. అధికారులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని ఆ పిటిషన్లో పేర్కొంది. తాము ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకోకుండా, దానిపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండా ఏకపక్షంగా పార్టీ కార్యాలయాన్ని కూల్చేశారంది. ఇది కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది.రాజకీయ నాయకులతో చేతులు కలిపిన ఈ ఇద్దరు అధికారులు రాజకీయ దురుద్దేశంతోనే ఏకపక్షంగా, దౌర్జన్యపూరితంగా తమ కార్యాలయాన్ని కూల్చేశారని తెలిపింది. వాస్తవానికి సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమం తరువాత ఎలాంటి కూల్చివేతలు చేపట్టడానికి వీల్లేదని ఇదే హైకోర్టు గతంలో తీర్పునిచ్చిందని తెలిపింది. కోర్టు ఆదేశాలంటే అధికారులకు లెక్క లేదని, ఇష్టానుసారం వ్యవహరించారని, వారి చర్యలను తీవ్రంగా పరిగణించాలని కోరింది. కూల్చివేత విషయంలో అధికారుల హడావుడిని గమనిస్తే వారి దురుద్దేశాలు అర్థమవుతాయంది. వారి చర్యలు కోర్టు ధిక్కరణ పరిధిలోకి వస్తాయంది. కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు వారిని శిక్షించాలని హైకోర్టును కోరింది.క్రిమినల్ చర్యలు కూడా..!ఇదిలా ఉండగా.. పార్టీ కార్యాలయాన్ని ఏకపక్షంగా, దురుద్దేశపూర్వకంగా కూల్చివేసినందుకు కాటంనేని భాస్కర్, నిర్మల్ కుమార్‌పై క్రిమినల్ చర్యలకు సైతం వైఎస్సార్సీపీ సిద్ధమవుతోంది. వీరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేయనుంది. -
ఈసీపై పిటిషన్ కొట్టేసిన సుప్రీం
న్యూఢిల్లీ: ఓటరు గుర్తింపు కార్డు అప్డేట్, కొత్త ఓటరు నమోదు దరఖాస్తుల్లో ఆధార్ సంఖ్యను జత చేయడానికి సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పష్టమైన మార్పులను చేపట్టనందుకు ఎన్నికల సంఘం అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం కొట్టేసింది. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ వేసిన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం విచారించింది. ఈ విషయంలో ఈసీకి మేం డెడ్లైనేదీ పెట్టలేదని పేర్కొంది. -
జస్టిస్ రాకేష్ కుమార్ రాజీనామా
న్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) జ్యూడిషియల్ సభ్యుడు జస్టిస్ రాకేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ట్రిబ్యునల్ పదవిలో భాగంగా జస్టిస్ రాకేష్‌కుమార్ తీసుకున్న నిర్ణయాలపై సుప్రీంకోర్టు గత వారం వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సోమవారం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ అశోక్ భూషణ్, కేంద్ర న్యాయశాఖకు అందజేశారు. ఫినోలెక్స్ కేబుల్ కేసులో కోర్టు ధిక్కారణ చర్యలు ఎదుర్కొంటున్నారు జస్టిస్ రాకేష్‌కుమార్. కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశం(AGM) ఫలితాలపై యధాతథా సిత్థిని కొనసాగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి, ఎన్సీఎల్ఏటీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంపై సీజేఐ జస్టిస్ డీవీ చంద్రచూడ్ తీవ్రంగా స్పందించారు. జస్టిస్ రాకేష్ కుమార్‌తోపాటు ఎన్సీఎల్ఏటీ టెక్నికల్ మెంబర్ అలోక్ శ్రీవాస్తపై కోర్టు ధిక్కరణ చర్యలకు ఆదేశాలిచ్చారు. కాగా జస్టిస్ రాకేష్ కుమార్ గంతో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఏం జరిగింది? ఫినోలెక్స్ కేబుల్స్ వార్షిక సర్వ సభ్య సమావేశానికి సంబంధించిన కేసులో జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ అలోక్ శ్రీవాస్తవలతో కూడిన బెంచ్ ట్రిబ్యునల్ కొన్ని ఉత్తర్వులు ఇచ్చింది. కంపెనీ ఓనర్‌షిప్‌కు సంబంధించి ఇద్దరు సోదరులు ప్రకాష్ ఛాబ్రియా, దీపక్ ఛాబ్రియా మధ్య వివాదం నెలకొనడంతో విషయం ట్రిబ్యునల్‌కు చేరింది. కేసును విచారించిన జస్టిస్ రాకేష్‌కుమార్.. తాము తీర్పు వెలువరించేంతవరకు కంపెనీ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఫలితాలపై స్టే విధించింది. సుప్రీంకోర్టులో ఏం జరిగింది? AGMలో ఫలితాలను వెల్లడించొద్దంటూ ట్రిబ్యునల్‌లో ఇచ్చిన తీర్పును ఫినోలెక్స్ కేబుల్స్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. కేసును విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ట్రిబ్యునల్ ఇచ్చిన స్టేను సెప్టెంబర్ 20, 2023న తొలగించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పిటిషనర్.. ట్రిబ్యునల్ ముందు ఉంచగా.. వాటిని పట్టించుకోలేదు. ఈ విషయాన్ని మళ్లీ సుప్రీంకోర్టుకు తెలిపారు పిటిషనర్. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్.. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలంటూ ట్రిబ్యునల్ ఛైర్మన్ జస్టిస్ అశోక్ భూషణ్‌ను ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులను పక్కనబెట్టినట్టు తేలితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోర్టు ధిక్కరణ తేలడంతో రాజీనామా సుప్రీంకోర్టులో తాము చేసింది కోర్టు ధిక్కరణ అని తేలడంతో జస్టిస్ రాకేష్‌కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన లాయర్ PS పట్వాలియా సుప్రీంకోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించే ఉద్దేశ్యం లేదని, అయితే కోర్టు ధిక్కరణ అని తేలినందున తన పదవి నుంచి జస్టిస్ రాకేష్‌కుమార్ తప్పుకున్నారని పట్వాలియా తెలిపారు. తనపై వచ్చిన అభియోగాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని, ఇప్పటికే రాజీనామా ఇచ్చినందున ఈ కేసును మూసివేయాలని పట్వాలియా సుప్రీంకోర్టును కోరారు. సుప్రీంకోర్టు ఏం తేల్చింది? జస్టిస్ రాకేష్ తరపున పట్వాలియా చేసిన విజ్ఞప్తిని చీఫ్ జస్టిస్ DY చంద్రచూడ్, జస్టిస్ JB పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా స్వీకరించారు. "NCLAT పదవికి, ఆర్థిక శాఖ లా సెక్రటరీ పదవికి జస్టిస్ రాకేష్‌కుమార్ రాజీనామా చేసినట్టు ఆయన తరపు లాయర్ పట్వాలియా ప్రకటన చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పక్కనబెట్టే ప్రయత్నం జరిగిందని మేం నమ్ముతున్నాం. అక్టోబర్ 13న NCLATలో జరిగిన పరిణామాలకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను చూశాం. కనీసం సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా తన ఆదేశాలను మార్చేందుకు ట్రిబ్యునల్ ఆసక్తి చూపలేదు. అయితే ఈ కేసును ఇంతటితో ముగిస్తున్నాం. " అని బెంచ్ తెలిపింది. జస్టిస్ రాకేష్‌కుమార్ గతమేంటీ? జస్టిస్ రాకేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా పనిచేసిన సమయంలో అమరావతి రాజధాని అంశంపై ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వుల్లో పలు వివాదస్పద వ్యాఖ్యలు జోడించడంమే కాకుండా.. రాజ్యాంగ సంక్షోభం అంటూ కొన్ని కామెంట్లు చేశారు. దీనిపై రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయగా.. జస్టిస్ రాకేష్‌కుమార్ ఇచ్చిన తీర్పును తీవ్రంగా తప్పుబట్టింది సుప్రీంకోర్టు. జస్టిస్ రాకేష్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు ఆందోళనకరంగా ఉన్నాయని, రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందంటూ చేసిన వ్యాఖ్యలు సరికావని సూచించింది. -
NCLAT సభ్యులకు కోర్టు ధిక్కార నోటీసులు
ఢిల్లీ: దేశసర్వోన్నత న్యాయస్థానంలో బుధవారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ సభ్యులిద్దరికి సుప్రీం కోర్టు కోర్టు ధిక్కారం కింద షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నవంబర్ 30వ తేదీన వాళ్లిద్దరిని తమ ఎదుట హాజరు కావాలని సీజేఐ ధర్మాసనం ఆ నోటీసుల్లో ఆదేశించింది. ఫినోలెక్స్ కేబుల్స్ వార్షిక సమావేశానికి సంబంధించిన వ్యవహారంలో అక్టోబర్ 13వ తేదీన ‘స్టేటస్ కో’(యధాతథ స్థితి) ఆదేశాలు ఇచ్చింది సుప్రీం కోర్టు. అయితే ఆ ఆదేశాలతో సంబంధం లేకుండా.. ఎన్సీఎల్ఏటీ జ్యూడీషియల్ సభ్యుడు రాకేశ్ కుమార్, టెక్నికల్ మెంబర్ డాక్టర్ అలోక్ శ్రీవాస్తవలు ఈ వ్యవహారంపై దాఖలైన అప్పీల్‌పై తీర్పు ఇచ్చారు. ఈ విషయాన్ని సంబంధిత లాయర్లు సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఈ విషయంపై దర్యాప్తు జరపాలని ఎన్సీఎల్ఏటీ చైర్పర్సన్ జస్టిస్ అశోక్ భూషణ్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. సుప్రీం కోర్టు స్టేటస్ కో ఆదేశాల గురించి తమకు తెలియదని ఆ ఇద్దరు సభ్యులు చైర్పర్సన్ ముందు వివరణ ఇచ్చారు. ఇదే విషయాన్ని దర్యాప్తు నివేదికలో పొందుపరిచారు చైర్పర్సన్. అయితే దర్యాప్తు నివేదిక ఇవాళ సుప్రీం కోర్టుకు చేరింది. దానిని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పరిశీలించింది. అయితే.. సుప్రీం కోర్టు ఆదేశాలు తెలిసి కూడా ఎన్సీఎల్ఏటీ తీర్పు వెల్లడించినట్లు ప్రాథమికంగా ధర్మాసనం గుర్తించింది. ఆ ఇద్దరు సభ్యులను అక్టోబర్ 30వ తేదీన తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. అంతేకాదు సుప్రీం స్టేటస్ కో ఆదేశాల్ని ఉల్లంఘిస్తూ ఎన్సీఎల్ఏటీ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సైతం పక్కనపెట్టేసిన సుప్రీం ధర్మాసనం.. ఈ అంశాన్ని చైర్పర్సన్ జస్టిస్ అశోక్ భూషణ్ ముందుకు బదిలీ చేసింది. -
మంత్రి పువ్వాడకు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: పీజీ మెడికల్ ఫీజులకు సంబంధించి న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలంటూ రాష్ట్ర మంత్రి, మమతా ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ పువ్వాడ అజయ్ కుమార్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 17వ తేదీకి వాయిదా వేసింది. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయవద్దని, ఫీజు రెగ్యులేటరీ కమిటీ (ఎఫ్ఆర్సీ) నిర్ణయించిన మేరకే వసూలు చేయాలని పలు కాలేజీలను ఆదేశిస్తూ ఓ రిట్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు 2022లో ఉత్తర్వులు ఇచ్చింది. ఒకవేళ అధిక ఫీజు వసూలు చేస్తే దాన్ని తిరిగి ఇచ్చేయాలని స్పష్టంచేసింది. అలాగే విద్యార్థుల సర్టిఫికెట్లు కూడా ఇచ్చేయాలని ఆదేశించింది. అయితే ఈ ఉత్తర్వులను మమతా కాలేజీ యాజమాన్యం పాటించకపోవడంతో వరంగల్‌కు చెందిన డాక్టర్ నిఖిల్ గుర్రపు కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది సామ సందీప్‌రెడ్డి వాదనలు వినిపించారు. కోర్టు ఆదేశాలను మమతా కాలేజీ పలు కాలేజీలు కావాలనే పాటించలేదని.. దీంతో విద్యార్థులు అధిక ఫీజు చెల్లించాల్సి వచ్చిందన్నారు. వెంటనే ఆ ఫీజు తిరిగి ఇచ్చేలా కాలేజీ యాజమాన్యాన్ని ఆదేశించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. మంత్రి పువ్వాడకు నోటీసులు జారీ చేస్తూ, విచారణను వాయిదా వేసింది. చదవండి: సాహితీ ఇన్ఫ్రా పిటిషన్‌పై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు.. -
కోర్టు ధిక్కరణ కేసు.. సాయంత్రం వరకు కోర్టులో నిలబడండి: ఏపీ హైకోర్టు
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కారం కేసులో హైకోర్టులో బుధవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలులో అలసత్వం ప్రదర్శించినందుకు పాఠశాల విద్యాశాఖ గత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, ఇంటర్మీడియెట్ విద్య గత కమిషనర్ వి.రామకృష్ణకు సింగిల్ జడ్జి జైలు శిక్ష విధించడం, వారు క్షమాపణలు కోరడంతో జైలుశిక్ష ఉత్తర్వులను సవరించి కోర్టు పని గంటలు ముగిసే వరకు కోర్టులోనే ఉండాలని ఆదేశాలు ఇవ్వడం, ఆ ఆదేశాలను ధర్మాసనం నిలుపుదల చేయడం చకచకా జరిగిపోయాయి. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా వీఈసీ జూనియర్ కాలేజీలో పార్ట్‌టైం లెక్చరర్‌గా పనిచేస్తున్న సాంబశివరావు సర్వీసును క్రమబద్ధీకరించాలని న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ 2020లో ఆదేశాలు జారీ చేయగా.. అప్పటి విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, అప్పటి ఇంటర్మీడియెట్ విద్య కమిషనర్ రామకృష్ణ అమలు చేయలేదు. దీంతో వారిద్దరిపైనా సాంబశివరావు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ దేవానంద్ ఇరువురు అధికారులు ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆదేశాల అమలులో జాప్యం చేశారని ప్రాథమికంగా తేల్చారు. శిక్ష విధించేందుకు వీలుగా వారిద్దరినీ కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో రామకృష్ణ, రాజశేఖర్ బుధవారం కోర్టు ముందు హాజరయ్యారు. కోర్టు ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని న్యాయమూర్తి ప్రశ్నించగా.. వారు క్షమాపణలు తెలిపారు. ఈ క్షమాపణలు సదుద్దేశంతో చెప్పడం లేదంటూ.. ఇరువురికీ నెల రోజుల చొప్పున జైలుశిక్ష, చెరో రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఇద్దరు అధికారులను అదుపులోకి తీసుకుని తుళ్లూరు పోలీసులకు సమాచారం ఇవ్వాలని హైకోర్టు అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ స్పందిస్తూ.. జైలు శిక్ష ఆదేశాల అమలును రెండు రోజులపాటు నిలుపుదల చేయాలని అభ్యర్థించగా.. న్యాయమూర్తి తోసిపుచ్చారు. కోర్టు హాలులోనే ఉన్న ఇరువురు అధికారులు మరోసారి బేషరతు క్షమాపణలు తెలపడంతో వారి వయసు, ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ దేవానంద్ వారికి విధించిన జైలు శిక్షను సవరించారు. కోర్టు పనివేళలు ముగిసేంత వరకు కోర్టు హాలులో ఉండాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. జరిమానా మాత్రం చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. కాగా, సింగిల్ జడ్జి జస్టిస్ దేవానంద్ ఇచ్చిన ఆదేశాలపై ఇరువురు అధికారులు ధర్మాసనం ముందు వేర్వేరుగా కోర్టు ధిక్కార అప్పీళ్లు దాఖలు చేయగా.. న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి ధర్మాసనం అత్యవసర విచారణకు అంగీకరించింది. ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: (రెవెన్యూశాఖలో కలకలం.. ముగ్గురు తహసీల్దార్ల సస్పెన్షన్) -
ధిక్కార కేసులో కోర్టుకు హాజరైన ముత్యాలరాజు
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో పశ్చిమ గోదావరి జిల్లా అప్పటి కలెక్టర్, ప్రస్తుతం ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి రేవు ముత్యాలరాజు గురువారం వ్యక్తిగతంగా హైకోర్టుకు హాజరయ్యారు. అప్పటి నిడదవోలు తహసీల్దార్ శాస్త్రి, పంచాయతీరాజ్ సబ్ డివిజనల్ ఆఫీసర్ గంగరాజు కూడా కోర్టు ముందు హాజరయ్యారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం ఆక్రమణలను తొలగించి, పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మించాలన్న తమ ఆదేశాల అమలులో ఎందుకు జాప్యం జరిగిందని న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ప్రశ్నించారు. అప్పట్లో అధికారులందరూ కోవిడ్ విధుల్లో తీరికలేకుండా ఉన్నారని, దీంతో కోర్టు ఆదేశాల అమలులో జాప్యం జరిగిందని ముత్యాలరాజు న్యాయవాది పోతిరెడ్డి సుభాష్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. జాప్యం ఉద్దేశపూర్వకం కాదని చెప్పారు. ఇందుకు బేషరతుగా క్షమాపణ చెబుతున్నామన్నారు. ఇప్పటికే సర్వేచేసి ఆక్రమణలను తొలగించామన్నారు. తదుపరి విచారణను జనవరి 20కి వాయిదా వేశారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. అధికారులకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించారు. -
కోర్టు ధిక్కార కేసులో టీటీడీ ఈఓ ధర్మారెడ్డికి ఊరట
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి ఊరట లభించింది. జైలు శిక్ష విధిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది హైకోర్టు ధర్మాసనం. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ ఈఓ ధర్మారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేసు ఏమిటి? టీటీడీ ధర్మ ప్రచార పరిషత్‌లో ప్రోగ్రాం అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి 2011లో జారీ చేసిన టీటీడీ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని, తమను ప్రోగ్రాం అసిస్టెంట్లుగా తమ స్వర్వీసులను క్రమబద్ధీకరించేలా ఆదేశించాలని కొమ్ము బాబు, రామావత్ స్వామి నాయక్, భూక్యా సేవ్లానాయక్‌లు పిటిషన్ దాఖలు చేశారు. క్రమబద్ధీకరించాలంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది. అయితే, హైకోర్టు తీర్పును అమలు చేయటం లేదని పిటిషనర్లు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది జూన్ 16న కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్.. టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డికి నెలరోజుల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో వారం పాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తాజాగా హైకోర్టు ధర్మాసనం స్టే విధించటంతో ఊరట లభించింది. ఇదీ చదవండి: సింగిల్ జడ్జి తీర్పుపై ధర్మారెడ్డి అప్పీల్ -
AP: ఒకే అంశంపై రెండు పిటిషన్లు.. హైకోర్టు ఆగ్రహం
సాక్షి, అమరావతి: మొదట ఓ పిటిషన్ వేసి, ఆ విషయాన్ని దాచి పెట్టి... అదే అంశంపై మరో పిటిషన్ దాఖలు చేసిన విశాఖ వాసి పి.రంగారావుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని స్పష్టం చేసింది. ఖర్చుల కింద నెల రోజుల్లో రూ.లక్ష హైకోర్టు న్యాయ సేవాధికార సంస్థ వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. గడువు లోపు చెల్లించకపోతే ఆ మొత్తం వసూలుకు చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రార్ జనరల్‌కు తెలిపింది. వాస్తవాలను దాచిపెట్టి కోర్టు ప్రక్రియలో జోక్యం చేసుకున్నందుకు అతనిపై క్రిమినల్ కోర్టు ధిక్కారం కింద చర్యలకు ఉపక్రమించింది. ఈ కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని సంబంధిత బెంచ్ ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరి ఇటీవల తీర్పు వెలువరించారు. చదవండి: విజయవాడ మీదుగా 100 ప్రత్యేక రైళ్లు విశాఖపట్నం సాగర్‌నగర్ ఎంఐజీ ఇళ్ల సమీపంలో కామన్ ఏరియా స్థలాన్ని ఈశ్వరరావు, మరొకరు ఆక్రమించారని, దీనిపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదంటూ అదే ప్రాంతానికి చెందిన రంగారావు ఈ ఏడాది సెప్టెంబర్‌లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది పెండింగ్‌లో ఉండగానే, ఇదే అంశంపై అక్టోబర్‌లో మరో పిటిషన్ వేశారు. మొదటి దాని గురించి రెండో పిటిషన్లో పేర్కొనలేదు. అలాగే ఈ విషయానికి సంబంధించి ఇంతకు ముందు తానెలాంటి పిటిషన్ వేయలేదని అందులో లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. ఈ రెండు వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరి విచారణ జరిపారు రెండో పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు రంగారావు వేసిన మొదటి పిటిషన్ గురించి విశాఖపట్నం పట్టణాభివృద్ధి సంస్థ న్యాయవాది వి.సూర్యకిరణ్, గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ న్యాయవాది ఎస్.లక్ష్మీనారాయణరెడ్డి న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. మొదటి పిటిషన్ దాఖలుకు స్థానిక న్యాయవాదికి అన్ని కాగితాలు ఇచ్చారని, అయితే, ఆ పిటిషన్ వేసిన సంగతి మాత్రం రంగారావుకు తెలియదని ఆయన తరఫు న్యాయవాది వివరించారు. రెండో పిటిషన్ దాఖలుకు ఆయన తన వద్దకు వచ్చారని, గత పిటిషన్ సంగతి చెప్పలేదని అన్నారు. దీంతో న్యాయమూర్తి మొదట పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాదిని పిలిపించారు. రంగారావే ఆ పిటిషన్ దాఖలు చేశారని ఆ న్యాయవాది తెలిపారు. దీంతో మొదటి పిటిషన్ దాఖలు చేసింది రంగారావే అని నిర్ధారణకు న్యాయమూర్తి వచ్చారు. రంగారావు దాఖలు చేసిన రెండో పిటిషన్‌ను కొట్టేస్తూ ఖర్చుల కింద రూ.లక్ష చెల్లించాలని ఆయన్ను ఆదేశించారు. ఆయనపై క్రిమినల్ కోర్టు ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశించారు. -
అక్రమ మైనింగ్‌దారులను విడిచిపెట్టం
సాక్షి, అమరావతి: అక్రమ మైనింగ్‌దారులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి పరిధిలో అక్రమ గ్రావెల్ తవ్వకాలను నిలిపేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేశాక కూడా తవ్వకాలు జరిగాయా, లేదా అనే వ్యవహారాన్ని తేలుస్తామంది. దీనిపై సుమోటోగా కోర్టు ధిక్కార కేసు నమోదు చేయాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ నెల 17న దీనిపై విచారణ జరుపుతామని తెలిపింది. ఈ కేసులో పిటిషనర్ల తరఫు వాదనలు వినిపిస్తున్నందుకు తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని న్యాయవాది మహేశ్వరరావు చేసిన ఫిర్యాదుపై హైకోర్టు స్పందించింది. బెదిరింపుల విషయాన్ని లిఖితపూర్వకంగా తమ ముందుంచాలని పేర్కొంది. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు చేసిన వారిపై ఆగిరిపల్లి పోలీసులు కేసు నమోదు చేయడంపై మండిపడ్డ హైకోర్టు తమ ముందు హాజరైన ఎస్ఐ చంటిబాబును వివరణ కోరింది. ఈ వ్యవహారానికి దూరంగా ఉండాలని, లేనిపక్షంలో ఇబ్బందులు పడతారని హెచ్చరించింది. మైనింగ్ ఆపాలంటూ తాము ఆదేశాలు ఇచ్చిన రోజునే ఫిర్యాదుదారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని ప్రశ్నించింది. ఇలాంటి చర్యలకు పాల్పడితే అరెస్టుకు ఆదేశాలిస్తామని ఎస్ఐను హెచ్చరించింది. ఒంటిపై ఉన్న యూనిఫాంను ఎలా తీయించాలో తమకు బాగా తెలుసంది. గ్రావెల్ తవ్వకాలకు అనుమతినిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ వ్యవహారంపై తిరిగి విచారణ జరపాలని సింగిల్ జడ్జికి సూచిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజుల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. ఇదీ కేసు.. తోటపల్లి పరిధిలో గ్రావెల్ తవ్వకాలు జరుపుకునేందుకు బసవపూర్ణయ్యకు తాత్కాలిక అనుమతి మంజూరు చేస్తూ గనుల శాఖ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను సవాల్ చేస్తూ జె.లక్ష్మణరావు, మరో ఐదుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మొదట విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ రావు రఘునందన్‌రావు తవ్వకాలు జరపొద్దంటూ ఉత్తర్వులిచ్చారు. మరో సింగిల్ జడ్జి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు తవ్వకాలు జరుపుకునేందుకు అనుమతినిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషనర్లు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన సీజే ధర్మాసనం గ్రావెల్ తవ్వకాలకు అనుమతినిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేసింది. హైకోర్టును ఆశ్రయించిన రైతులపైనే ఆగిరిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారని తెలుసుకున్న ధర్మాసనం మైనింగ్ నిలుపుదలకు చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. -
న్యాయస్థానంపై తీవ్రవ్యాఖ్యలు.. యూట్యూబర్ శంకర్‌కు 6 నెలల జైలు
సాక్షి, చెన్నై: యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు ఎస్. శంకర్‌కు ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ ధర్మాసనం గురువారం తీర్పు ఇచ్చింది. రెండు నెలల క్రితం తన ఛానల్లో న్యాయ మూర్తులు, న్యాయవర్గాలపై తీవ్ర ఆరోపణలు చేస్తూ శంకర్ ఓ వీడియో విడుదల చేశారు. న్యాయశాఖ అవినీతి మయమైందని అందులో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ కథనాన్ని మధురై ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. సుమోటోగా కేసు నమోదు చేసి విచారించి, నిందితుడికి 6 నెలల జైలు శిక్ష విధించింది. చదవండి: (మాజీ సీఎం కాన్వాయ్‌ని అడ్డుకున్న ఏనుగు... పరుగులు తీసిన మంత్రి) -
జవహర్‌రెడ్డిపై హైకోర్టు అసహనం
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార వ్యాజ్యంలో వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలన్న తమ ఆదేశాలను గౌరవించకపోవడంపై ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డిపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సమావేశం ఉందన్న కారణంతో కోర్టు ముందు హాజరు కాకపోవడాన్ని తప్పుపట్టింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సమావేశాలు నిర్వహిస్తున్నారా..అంటూ ప్రశ్నించింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లో పూర్తి వివరాలు పేర్కొనలేదని ఆగ్రహం వ్యక్తంచేసింది. సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఓ రోజులో ఎన్ని సమావేశాలు నిర్వహిస్తారో వివరాలు తెప్పించుకోగలమని తెలిపింది. న్యాయస్థానాల ఆదేశాలను గౌరవించి మహోన్నత వ్యక్తులైన మహాత్మాగాంధీ, బాలగంగాధర్ తిలక్ వంటి వారే కోర్టు ముందు హాజరయ్యారని, వారికన్నా మీరు గొప్ప వారా అంటూ ప్రశ్నించింది. కోర్టు ఆదేశాల అమలులో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్యానించింది. కోర్టు ధిక్కార వ్యాజ్యంలో మిగిలిన అధికారులు హాజరు కావడం, పిటిషనర్‌కు చెల్లించాల్సిన వేతన బకాయిలన్నింటినీ చెల్లించడంతో కోర్టు ధిక్కార పిటిషన్‌ను మూసివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణమూర్తి అనే ఉద్యోగి తనకు 2005 నుంచి 2019 వరకు చెల్లించాల్సిన వేతన బకాయిలు రూ.10.59 లక్షలను వడ్డీతో సహా చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు బకాయిల చెల్లింపునకు ఆదేశాలిచ్చింది. అధికారులు అమలు చేయలేదంటూ కృష్ణమూర్తి కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. అప్పటి నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి జవహర్‌రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శంషేర్ సింగ్ రావత్, ఏలూరు జల వనరుల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీరామకృష్ణ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ సోమయాజులు బకాయిలు ఎందుకు చెల్లించలేదో కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రావత్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. జవహర్‌రెడ్డి మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పిటిషనర్‌కు బకాయిలను చెల్లించినట్లు మిగిలిన అధికారులు చెప్పడంతో న్యాయమూర్తి దానిని రికార్డ్ చేసి కోర్టు ధిక్కార పిటిషన్‌ను మూసివేశారు. -
యోగి సర్కార్‌పై కోర్టు ధిక్కరణ దావా!
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ యోగి సర్కార్‌పై కోర్టు ధిక్కరణ దావాకి సిద్ధమయ్యారు సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజాం ఖాన్. రామ్పూర్లోని తన యూనివర్సిటీని సీల్ చేసిన విషయంలో యోగి ప్రభుత్వంపై కోర్టుకెక్కనున్నట్లు ప్రకటించారు ఆజాం ఖాన్. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా.. తనకు చెందిన మొహమ్మద్ అలీ జవుహార్ యూనివర్సిటీ చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌ను తొలగించకపోవడంపై కోర్టు ధిక్కరణ కింద సుప్రీంను ఆశ్రయించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు సుప్రీం కోర్టు సైతం ఈ వ్యవహారంపై గురువారం యూపీ ప్రభుత్వం నుంచి వివరణ కోరింది. ఫెన్సింగ్ తొలగించకపోవడం వల్ల.. యూనివర్సిటీ కార్యకలాపాలు నిలిచిపోయానని కోర్టుకు తెలిపారు ఆజాంఖాన్. ఈ మేరకు జస్టిస్ ఏఎం ఖాన్‌వలీకర్, జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసం.. జులై 19లోపు వివరణ ఇవ్వాలని యూపీ సర్కార్‌ను కోరుతూ.. జులై 22వ తేదీకి విచారణను వాయిదా వేసింది. మే 27వ తేదీన జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ బెలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం.. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన యూనివర్సిటీ స్థలాల జప్తు ఆదేశాలపై స్టే విధించింది. ఈ క్రమంలో యూనివర్సిటీ ఫెన్సింగ్‌ను తొలగించకపోవడం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆక్రమించారు ఆయన. ఇదిలా ఉంటే.. ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేతగా పేరున్న ఆజాం ఖాన్.. వివాదాస్పద వ్యాఖ్యలు, వైఖరితో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు కూడా. భూ కబ్జాతో పాటు చాలా కేసులు ఆయనపై నమోదు అయ్యాయి. ఒకానొక తరుణంలో ఆయన జైలు శిక్షపై న్యాయస్థానాల్లోనూ ఆసక్తికరమైన చర్చ కూడా నడిచింది. మరోవైపు రాజకీయ వైరంతోనే జైలుకు పంపారంటూ ఆజాం ఖాన్ అనుచరులు ఆరోపిస్తున్నారు. మొన్న యూపీ ఎన్నికల్లో జైలు నుంచే ఆయన ఘన విజయం సాధించడం విశేషం. 27 నెలలు జైల్లో గడిపిన ఈయన.. మే నెలలో జైలు నుంచి విడుదల అయ్యారు. -
అబ్బే! శిక్ష 9000 కోట్లు ఎగ్గొట్టినందుకు కాదు!
అబ్బే! శిక్ష 9000 కోట్లు ఎగ్గొట్టినందుకు కాదు! -
విజయ్ మాల్యాకు 2 వేల జరిమానా! మీమ్స్ వైరల్!
బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయిన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో విజయ్ మాల్యాకు కోర్టు 2వేల జరిమానా విధించిడంపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. రూ.9వేల కోట్లకు పైగా రుణాల్ని ఎగవేసి లండన్‌కు పారిపోయిన మాల్యాకు కోర్టు విధించిన ఈ జరిమానా సరిపోదని అంటున్నారు. న్యాయ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని కోరుతూ మీమ్స్‌ను షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవేంటే చూసేద్దాం. Vijay Mallya gets 4-month jail sentence, Rs 2000 fine in contempt case of bank default case of over Rs 9,000 crore. Very very strict punishment. 🤣 pic.twitter.com/cLOiMySxsx — Tushar Kant Naik ॐ♫₹ (@Tushar_KN) July 11, 2022 కోర్టు దిక్కారం కేసులో విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు యుయు లలిత్, ఎస్ రవీంద్ర భట్, పిఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం..కోరు ధిక్కారం నేరం కింద జైలు శిక్షతోపాటు, 2 వేల రూపాయల జరిమానా విధించింది. అలాగే నిబంధనలకు విరుద్ధంగా డియాజియో నిధులను తన కుమారుడు సిద్ధార్థ్ మాల్యా, కుమార్తెలు లియానా మాల్యా, తాన్యా మాల్యాలకు అక్రమంగా తరలించిన 40 మిలియన్ల డాలర్ల సొమ్మును తిరిగివ్వాలని ఆదేశించింది. #SupremeCourt #VijayMallya SC awards 4-month jail sentence and imposes Rs 2000 fine. Vijay Mallya : pic.twitter.com/wEP9TKVRNb — g0v!ñD $#@®mA (@rishu_1809) July 11, 2022] #VijayMallya's feelings after #SupremeCourt imposed fine of RS 2000 👇 सुप्रीम कोर्ट विजय माल्या pic.twitter.com/oX3UTIjo7M — Ashutosh Sharma (@AshutosSharma25) July 11, 2022 -
విజయ్ మాల్యాకు భారీ షాక్, మొత్తం చెల్లించకపోతే: సుప్రీం కొరడా
సాక్షి, న్యూఢిల్లీ: వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు కోర్టు ధిక్కారణ కేసు కింద సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. భారతీయ బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసి విదేశాలకు పారిపోయిన మాల్యాకు సుప్రీంకోర్టు నాలుగు నెలల జైలు శిక్ష విధించింది. కోరు ధిక్కారం నేరం కింద జైలు శిక్షతోపాటు, 2 వేల రూపాయల జరిమానా విధించింది. అలాగే కుటుంబానికి అక్రమంగా తరలించిన 40 మిలియన్ల డాలర్ల సొమ్మును తిరిగివ్వాలని మాల్యా కుటుంబ సభ్యులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు యుయు లలిత్, ఎస్ రవీంద్ర భట్, పిఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2017లో కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు కోర్టు నుంచి సమాచారాన్ని దాచిపెట్టినందుకు దోషిగా తేలడంతో సుప్రీం తాజా తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాలకు భిన్నంగా 40 మిలియన్ డాలర్లను కుటుంబానికి బదిలీ నేరం కింద మాల్యాకు "ఈ శిక్ష తప్పదు. మాల్యా ఎలాంటి పశ్చాత్తాపం చూపలేదు" అని సుప్రీం పేర్కొంది. జరిమానాను నాలుగు వారాల్లోగా సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీకి జమ చేయాలని, లేని పక్షంలో మరో రెండు నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉందని కోర్టు తెలిపింది. ఈ మొత్తాన్ని 8 శాతం వడ్డీతో నాలుగు వారాల్లోగా రికవరీ అధికారికి తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. ఒకవేళ ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వకపోతే మాల్యా ఆస్తులను అటాచ్ చేసుకోవచ్చని కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ అంశంపై 2017లో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ మాల్యా పిటిషన్‌ను 2020లో అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసిన సంగతి తెలిసిందే. కాగా 9వేల కోట్లకు పైగా రుణాన్ని ఎగవేసి లండన్‌కు పారిపోయిన మాల్యాపై ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం కేంద్రం దర్యాప్తు సంస్థలు, సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వాస్తవాలను దాచిపెట్టి, డియాజియో నిధులను తన కుమారుడు సిద్ధార్థ్ మాల్యా, కుమార్తెలు లియానా మాల్యా, తాన్యా మాల్యాలకు డబ్బును మళ్లించారని, కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను 'ద్వేషపూరితంగా ఉల్లంఘించారని' బ్యాంకులు ఆరోపించాయి. 2016 మార్చిలో యూకేకు పారిపోయిన మాల్యాను ఏప్రిల్ 18, 2017న స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు. -
కేంద్ర హోం కార్యదర్శికి హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: కోర్టు ధిక్కార కేసులో కేంద్ర హోం శాఖ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ట్విట్టర్లో ‘ఇస్లామిక్ కరోనా వైరస్ జిహాద్, కరోనా జిహాద్, తబ్లిగ్‌జామాత్, ఇస్లామోఫోబిక్’లాంటి పేర్లతో చేస్తున్న అసభ్య పోస్టులను వెంటనే ఆపా లని 2020లో హైకోర్టు పిటిషన్ దాఖలైంది. ఒక వర్గాన్ని కించపరుస్తూ పెట్టే మెసేజ్‌ల ను ఆపాలని, ట్విట్టర్ సీఈవోతోపాటు సదరు పోస్టులు పెట్టిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకునేలా కేంద్ర హోం శాఖను ఆదేశించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. పోస్టులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని 2021లో హోంశాఖ కార్యదర్శిని ఆదేశించింది. ఇప్పటివరకు ఉద్దేశపూర్వకంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇది కోర్టు ధిక్కారం కిందికే వస్తుందని 2022లో పిటిషనర్ మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆరు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. -
కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ హైకోర్టు సీరియస్
-
తెలంగాణ: నలుగురు పోలీసు అధికారులకు జైలు శిక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు సోమవారం సంచలన తీర్పు ఒకటి ఇచ్చింది. నలుగురు పోలీసు అధికారులకు నాలుగు వారాల జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో పోలీసు అధికారులకు జైలు శిక్ష విధించింది తెలంగాణ హైకోర్టు. జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ నరేశ్ కు జైలు శిక్ష విధించింది హైకోర్టు. అంతేకాదు నలుగురిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ పోలీసు అధికారుల మీద గతంలో భార్యభర్తల వివాదం కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. సుప్రీం నిబంధనల మేరకు సీఆర్ పీసీ 41ఏ నోటీసు ఇవ్వలేదని అభియోగం మోపబడింది. అయితే.. అప్పీలు వెళ్లేందుకు నాలుగు వారాల జైలు శిక్ష అమలును.. ఆరు వారాల పాటు నిలిపివేసింది తెలంగాణ హైకోర్టు.