న్యూఢిల్లీ: ప్రముఖ ఉచిత సమాచార సంస్థ వికీపీడియాపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వార్తా సంస్థ ఏఎన్ఐ వికీపీడియాపై పరువు నష్టం కేసు వేసిన విషయంలో హైకోర్టు.. వికిపీడియాకు గురువారం ‘కోర్టు ధిక్కార నోటీసులు’ జారీ చేసింది. భారత న్యాయవ్యవస్థ ఆదేశాలను పాటించకపోతే, భారతదేశంలో తమ వ్యాపారాన్ని మూసివేయమని ప్రభుత్వాన్ని ఆదేశిస్తామని స్పష్టం చేసింది. మీకు భారతదేశం నచ్చకపోతే ఇక్కడ మీ కార్యాకలాపాలు మూసివేయాలని హైకోర్టు తెలిపింది.
కాగా ప్రముఖ వార్త సంస్థ ఏఎన్‌ఐను వికీపీడియా తన పేజీలో ప్రస్తుత ప్రభుత్వానికి 'ప్రచార సాధనం'గా పేర్కొంది. దీంతో వికీపీడియా తన ప్లాట్‌ఫారమ్‌లో సవరణలు చేసుకోవడానికి వ్యక్తులను అనుమతిస్తోందని ఏఎన్‌ఐ ఆరోపించింది. తమ గురించి తప్పుడు సమాచారం ఎడిట్ చేసింది వికీపీడియా, దాని ఎడిటర్లు కాదని, ముగ్గురు బయటి వ్యక్తులు అని పేర్కొంది. ఈ క్రమంలో వార్తా సంస్థ ఏఎన్ఐ వికీపీడియాపై ఢిల్లీ కోర్టులో రూ.2 కోట్ల పరువునష్టం దావా వేసింది. ఈ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది.
అయితే వికీపీడియాలో ఈ సవరణలు చేసిన వారి వివరాలను బహిర్గతం చేయాలని కోర్టు సదరు సంస్తను ఆదేశించింది. కానీ ఇప్పటి వరకు ఆ వివరాలును వెల్లడించలేదని ఏఎన్‌ఐ తెలిపింది. దీనిపై వికీపీడియా స్పందిస్తూ.. తమ వైపు నుంచి కొన్ని పత్రాల సమర్పణ పెండింగ్‌లో ఉందని, వికీపీడియా భారతదేశంలో ఆధారితం కానందున వారి వివరాల వెల్లడికి ఆలస్యం అయిందని కోర్టుకు తెలిపింది.
అయితే వికీపీడియా సమాధానంపై కోర్టు సంతృప్తి చెందలేదు. ‘ప్రతివాది భారతదేశంలో ఒక సంస్థ కాకపోవడం ప్రశ్న కాదు. మేము మీ వ్యాపార లావాదేవీలను ఇక్కడ మూసివేస్తాము. వికీపీడియాను బ్లాక్ చేయమని మేము ప్రభుత్వాన్ని అడుగుతాము.. ఇంతకుముందు కూడా ఇలాగే చేశారు. మీకు భారతదేశం నచ్చకపోతే, దయచేసి ఇక్కడ పని చేయవద్దు’ అంటూ మండిపడింది.
తదుపరి విచారణను అక్టోబర్‌కు వాయిదా వేసిది. అంతేగాక వచ్చే విచారణలో కంపెనీ ప్రతినిధి తప్పక హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా వికీపీడియాను జిమ్మీ వేల్స్ లారీ సాంగర్ 2001లో స్థాపించారు. ఈ వెబ్‌సైట్ యునైటెడ్ స్టేట్స్‌లోని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment