జొమాటో, స్విగ్గీ వంటివి అందుబాటులో వచ్చిన తరువాత కావలసిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు, ఉన్న చోటుకే తెప్పించుకుని ఆరగిస్తున్నారు. అయితే ఈ సర్వీసుల్లో అప్పుడప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి ఘటన ఇటీవల కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. దీనిని విచారించిన కోర్టు జొమాటోకు రూ. 60వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
కర్ణాటకలోని ధార్వాడ్‌కు చెందిన శీతల్ అనే మహిళ 2023 ఆగస్టు 31న జొమాటోలో మోమోస్ ఆర్డర్ చేశారు. దీనికి 133 రూపాయలు గూగుల్ పే ద్వారా చెల్లించారు. ఆర్డర్ పెట్టిన 15 నిమిషాల తరువాత డెలివరీ అయినట్లు జొమాటో యాప్ చూపించింది. నిజానికి ఆమెకు మోమోస్ డెలివరీ కాలేదు.
ఆర్డర్ పెట్టిన మోమోస్ డెలివరీ కాకపోవడంతో రెస్టారెంటుకు కాల్ చేయగా, డెలివరీ ఏజెంట్ ఆర్డర్ తీసుకున్నారని, ఇతర వివరాలు కోసం డెలివరీ ఏజెంట్‌ను సంప్రదించమని వెల్లడించారు. అయితే ఏజెంట్‌ను సంప్రదించడానికి ప్రయత్నించింది. కానీ అతను స్పందించలేదు. దీంతో శీతల్ జొమాటోకు ఇమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ప్రతిస్పందన కోసం 72 గంటల పాటు వేచి ఉండాల్సిందిగా కంపెనీ రిప్లై ఇచ్చినట్లు సమాచారం. అయినా శీతల్‌ను ఎలాంటి రిప్లై అందలేదు.
ఇదీ చదవండి: పెరిగిన ఎస్‌బీఐ వడ్డీ రేట్లు: ఈ రోజు నుంచే అమలు..
జొమాటో నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో 2023 సెప్టెంబర్ 13న కంపెనీకి లీగల్ నోటీసు పంపించారు. నోటీసుకు ప్రతిస్పందనగా, కోర్టుకు హాజరైన జొమాటో తరపు న్యాయవాది ఈ ఆరోపణ తప్పు అని పేర్కొన్నారు. ఆ తరువాత పొంతనలేని సమాధానాల ఆధారంగా కోర్టు తీర్పునిస్తూ.. జొమాటో నిర్లక్ష్యం వల్ల మహిళ మానసిక వేదనకు గురైందని.. దీనికి పరిహారంగా రూ. 50000, కేసు.. ఇతర ఖర్చుల కారణంగా మరో పదివేలు.. ఇలా మొత్తం జొమాటోకు రూ. 60000 జరిమానా విధించింది.
Lady Ordered Momos on Zomato For ₹133
She Didn’t Receive The Order
But Zomato Marked Delivered in The App
She Sent a Legal Notice and Filed a Complaint
Now Consumer Forum Ordered Zomato To Pay ₹60,000 Compensation To Complainant— Ravisutanjani (@Ravisutanjani) July 14, 2024
Comments
Please login to add a commentAdd a comment