భారతదేశంలో కర్ణాటక రెండో అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా అవతరిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రకటించారు. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్), మాండ్య జిల్లా సహకార మిల్క్ యూనియన్‌లు సంయుక్తంగా కొత్త నందిని పాల ఉత్పత్తులను ప్రారంభించిన సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడారు. దేశంలో పాల ఉత్పత్తిలో గుజరాత్ మొదటి స్థానంలో ఉంది.
డెయిరీ రంగానికి రాష్ట్రం అపార మద్దతు ఇవ్వడంతోనే ఈ విజయం సాధ్యమైందని ముఖ్యమంత్రి చెప్పారు. పాడి పరిశ్రమను పెంపొందించడంలో, పాల ఉత్పత్తిదారులకు సరసమైన ధర కల్పించడంలో ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. కర్ణాటక ప్రస్తుతం రోజుకు 92-93 లక్షల లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకు 2.5 లక్షల లీటర్లు సరఫరా చేస్తున్నారు. ‘క్షీరధారే పథకం’ ద్వారా, పాలను లీటరుకు రూ.32 చొప్పున కొనుగోలు చేస్తోంది. అదనంగా లీటరుకు రూ.5 ప్రోత్సాహకాన్ని అందజేస్తోంది.
ఇదీ చదవండి: అధిక వడ్డీ కావాలా? ఇది మీ కోసమే!
స్టాక్ మార్కెట్‌లో పాల ఆధారిత ఉత్పత్తులను అందించే కంపెనీలకు కర్ణాటక రాష్ట్రంలోని మిల్క్ యూనియన్ల సహకారం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆ పాలతోనే విభిన్న ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నారని తెలియజేస్తున్నారు. స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయి, పాల ఉత్పత్తులు తయారీ చేస్తున్న కొన్ని కంపెనీలు కింద తెలియజేస్తున్నాం.
పరాగ్ మిల్క్ ఫుడ్స్ లిమిటెడ్: గోవర్ధన్ అండ్ గో బ్రాండ్లకు ప్రసిద్ధి.
దొడ్ల డెయిరీ లిమిటెడ్: పాల ఉత్పత్తుల తయారీ, పంపిణీలో దొడ్లా డెయిరీ దక్షిణ భారతదేశంలో బిజినెస్ చేస్తోంది.
హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్ లిమిటెడ్: హట్సన్, అరుణ్, ఆరోక్య వంటి బ్రాండ్లను ఇది నిర్వహిస్తోంది.
హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్: ఈ సంస్థ ఆధ్వర్యంలోని హెరిటేజ్ ఫుడ్స్ డెయిరీ ఉత్పత్తులను తయారు చేస్తోంది.
వాడిలాల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్: ఐస్ క్రీములకు ఇది ప్రసిద్ధి. వాడిలాల్ పాల ఉత్పత్తులను కూడా తయారు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment