Milk producers
-
రెండో స్థానానికి కర్ణాటక
భారతదేశంలో కర్ణాటక రెండో అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా అవతరిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రకటించారు. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్), మాండ్య జిల్లా సహకార మిల్క్ యూనియన్లు సంయుక్తంగా కొత్త నందిని పాల ఉత్పత్తులను ప్రారంభించిన సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడారు. దేశంలో పాల ఉత్పత్తిలో గుజరాత్ మొదటి స్థానంలో ఉంది.డెయిరీ రంగానికి రాష్ట్రం అపార మద్దతు ఇవ్వడంతోనే ఈ విజయం సాధ్యమైందని ముఖ్యమంత్రి చెప్పారు. పాడి పరిశ్రమను పెంపొందించడంలో, పాల ఉత్పత్తిదారులకు సరసమైన ధర కల్పించడంలో ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. కర్ణాటక ప్రస్తుతం రోజుకు 92-93 లక్షల లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకు 2.5 లక్షల లీటర్లు సరఫరా చేస్తున్నారు. ‘క్షీరధారే పథకం’ ద్వారా, పాలను లీటరుకు రూ.32 చొప్పున కొనుగోలు చేస్తోంది. అదనంగా లీటరుకు రూ.5 ప్రోత్సాహకాన్ని అందజేస్తోంది.ఇదీ చదవండి: అధిక వడ్డీ కావాలా? ఇది మీ కోసమే!స్టాక్ మార్కెట్లో పాల ఆధారిత ఉత్పత్తులను అందించే కంపెనీలకు కర్ణాటక రాష్ట్రంలోని మిల్క్ యూనియన్ల సహకారం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆ పాలతోనే విభిన్న ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారని తెలియజేస్తున్నారు. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి, పాల ఉత్పత్తులు తయారీ చేస్తున్న కొన్ని కంపెనీలు కింద తెలియజేస్తున్నాం.పరాగ్ మిల్క్ ఫుడ్స్ లిమిటెడ్: గోవర్ధన్ అండ్ గో బ్రాండ్లకు ప్రసిద్ధి.దొడ్ల డెయిరీ లిమిటెడ్: పాల ఉత్పత్తుల తయారీ, పంపిణీలో దొడ్లా డెయిరీ దక్షిణ భారతదేశంలో బిజినెస్ చేస్తోంది.హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్ లిమిటెడ్: హట్సన్, అరుణ్, ఆరోక్య వంటి బ్రాండ్లను ఇది నిర్వహిస్తోంది.హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్: ఈ సంస్థ ఆధ్వర్యంలోని హెరిటేజ్ ఫుడ్స్ డెయిరీ ఉత్పత్తులను తయారు చేస్తోంది.వాడిలాల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్: ఐస్ క్రీములకు ఇది ప్రసిద్ధి. వాడిలాల్ పాల ఉత్పత్తులను కూడా తయారు చేస్తోంది. -
రైతుల సొమ్ము రాజధాని పాలు
గతంలోనే రూ.5.80 కోట్లు విరాళం ఇచ్చిన కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్ రాజధాని నిర్మాణానికి మళ్లీ రూ.5 కోట్ల విరాళం పదవులు కాపాడుకునేందుకే పెద్దల ప్రయత్నాలని విమర్శలు\ పాలకు ఇచ్చే ధర అర్ధ రూపాయి పెంచమన్నా తిరస్కరించిన బోర్డు సొమ్మొకరిది.. సోకొకరిది.. అన్న చందంగా ఉంది కృష్ణాజిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సమితి (విజయ డెయిరీ) పెద్దల తీరు. సంస్థకు వచ్చిన లాభాల్లో రైతులకు చెల్లించే పాల సేకరణ ధర అర్ధ రూపాయి పెంచాలని కోరినా అంగీకరించని పాలకవర్గం రాజధాని నిర్మాణం కోసం మరో రూ.5 కోట్లు విరాళం సమర్పించింది. గతంలో ఇచ్చిన రూ.5.80 కోట్లకు ఈ మొత్తం అదనం. పాలకవర్గంలో ముఖ్యులు టీడీపీకి చెందినవారు కావడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పాడి రైతులు విమర్శిస్తున్నారు. విజయవాడ : నూతనంగా నిర్మిస్తున్న రాజధానికి విరాళాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునివ్వడంతో కృష్ణా మిల్క్ యూనియన్ పాలకవర్గంలో కొంతమంది ఎక్కువగా స్పందిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో తొలి విడత రూ.2 కోట్లు, మరోసారి రూ.2 కోట్లు, పాల సహకార సంఘాల నుంచి రూ.1.80 కోట్లు వసూలు చేసి మొత్తం రూ.5.80 కోట్లు రాజధానికి విరాళంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. ఇది చాలదన్నట్టు తాజాగా మరో రూ.5 కోట్లు ఇచ్చారు. నిబంధనలకు నీళ్లొదిలి... వాస్తవంగా విరాళం ఇవ్వాలంటే యూనియన్ బోర్డులో ముందుగా ఆమోదం పొందాలి. ఆ తరువాత దానిని జనరల్ బాడీలో ప్రవేశపెట్టి నిర్ణయం తీసుకోవాలి. అయితే రాజధాని నిర్మాణానికి రూ.5 కోట్లు ఇస్తున్న విషయం బోర్డు సమావేశంలో కాకుండా గత నెల 18న జరిగిన జనరల్ బాడీలో ప్రవేశపెట్టారు. జనరల్ బాడీ మీటింగ్‌లోనూ చాకచక్యంగా వ్యవహరించారు. సమావేశం జరిగే హాలులోకి వెళ్లాలంటే బయట ఉన్న రిజిస్టర్లో పాల సహకార సంఘాల అధ్యక్షులు సంతకం చేయాలి. ఈ సంతకాలనే అడ్డుపెట్టుకుని రూ.5 కోట్ల విరాళం ఇచ్చేందుకు జరనల్ బాడీ ఆమోదించినట్లు మినిట్స్‌లో రాసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సమావేశంలో ఏం జరిగిందంటే... జిల్లాలో 427 పాల సహకార సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల ద్వారా జిల్లాలోని రైతుల నుంచి లక్షా 70 వేల లీటర్ల పాలు సేకరిస్తున్నారు. 427 సంఘాల అధ్యక్షులకు జనరల్ బాడీలో ఓటు వేసే హక్కు, రైతుల సమస్యలను పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. జనల్బాడీలో పాల్గొన్న సహకార సంఘాల అధ్యక్షుల్లో కొంతమంది రాజధాని నిర్మాణానికి రూ.5 కోట్లు ఇవ్వడాన్ని వ్యతిరేకించారని, గతంలో రూ.5.80 కోట్లు ఇచ్చి ఇప్పుడు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారని సమాచారం. తాము వ్యతిరేకిస్తున్నట్లు మినిట్స్‌లో నమోదు చేయాలంటూ 11 సంఘాల అధ్యక్షులు పట్టుబట్టడంతో గందరగోళం నెలకొని జనరల్‌బాడీ సమావేశం వాయిదా పడింది. మినిట్స్‌లో మాత్రం రూ.5 కోట్ల విరాళానికి ఆమోదం లభించినట్లు రాసేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులకు అర్ధ రూపాయి పెంచమంటే... ఎండలు తీవ్రంగా ఉండి నీటిఎద్దడి ఏర్పడటంతో గ్రామాల్లో నీరు, పచ్చగడ్డి, ఎండుగడ్డి లభించక పాడి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాల దిగుబడి తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో యూనియన్ లీటర్ పాలకు చెల్లిస్తున్న ధర రూ.58ని రూ.60కి పెంచాలని రైతులు కోరారు. గత నెల 18న జరిగిన జనరల్‌బాడీలో రెండు రూపాయలు కాకపోయినా రైతుల కోరిక మేరకు కనీసం అర్ధ రూపాయి పెంచాలని అన్ని సంఘాల అధ్యక్షులు పట్టుబట్టారు. దీనిని పాలకవర్గంలో ముఖ్యులు, అధికారులు తోసిపుచ్చారు. తరువాత సొసైటీలకు బోసస్ ఇస్తామని సర్దిచెప్పారు. వాస్తవంగా బోసస్ ఇవ్వడం వల్ల సహకార సంఘానికి, పాల రేటు పెంచితే రైతులకు ఉపయోగమని పాలసంఘాల అధ్యక్షులు చెబుతున్నారు. తెర వెనుక కథ ఇదీ యూనియన్ పాలకవర్గానికి వచ్చే సెప్టెంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. యూనియన్ పాలకవర్గమంతా అధికార తెలుగుదేశం పార్టీ నేతల చేతుల్లోనే ఉంది. యూనియన్ కీలక పదవుల్లో ఉన్నవారు ముఖ్యమంత్రిని ఆకర్షించి తిరిగి తమ పదవులను కాపాడుకునేందుకు రూ.11 కోట్ల విరాళాలు ఇచ్చారని విజయ డెయిరీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. రైతులకు తక్షణం బోసస్ ఇవ్వకుండా ఆగస్టులో ప్రకటించి తద్వారా రైతుల ప్రాపకం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. రైతుల కష్టం నుంచి వచ్చిన సొమ్మును రాజధానికి ధారాదత్తం చేయడంపై రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు... ప్రస్తుతం రాజధాని నిర్మాణానికి రూ.5 కోట్లు ఇవ్వడం వెనుక పెద్ద పథకమే ఉందని యూనియన్‌లోని కొంతమంది సభ్యులు ఆరోపిస్తున్నారు. పాల డెయిరీలో సుదీర్ఘకాలం పాతుకుపోయి కీలకమైన పోస్టులో ఉన్న ఒక ముఖ్య నేత తిరిగి ఆ పదవి పొం దేందుకు ముఖ్యమంత్రి దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. దీంతో పాటు ఆయన మనుమడికి క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీఏ)లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ రెండు అంశాల్లోనూ లబ్ధి పొందేందుకు ముఖ్యమంత్రికి రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చారని పేర్కొంటున్నారు.