చంఢీగర్: పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ పాముకాటుకు గురయ్యారు. రూపనగర్ జిల్లాలోని ఆనంద్‌పూర్ సాహిబ్ ప్రాంతంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సంచరిస్తుండగా.. ఈ ఘటన జరిగింది. ఆగష్టు 15 రాత్రి పాముకాటుకు గిరికాగా.. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
వర్షాల కారణంగా పాంగ్, భాక్రా డ్యామ్‌ల నుంచి నీటిని విడుదల చేయగా.. పంజాబ్‌లో రూప్‌నగర్, గుర్‌దాస్‌పూర్, హోసియాపూర్, కపుర్తలా, ఫిరోజ్‌పూర్ ప్రాంతాలు వరదమయమయ్యాయి. ఈ డ్యామ్‌ల నుంచి విడదలైన నీటితో బియాస్, సట్లేజ్ నదుల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.
With God's grace, the flood situation in my constituency, Shri Anandpur Sahib, is better now.
— Harjot Singh Bains (@harjotbains) August 19, 2023
During the rescue operations, I was bitten by a venomous snake on the intervening night of 15th Aug, but that didn’t deter my determination to help my people.
With God’s grace and… pic.twitter.com/vQkX14xltK
మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ తన సొంత నియోజకవర్గమైన ఆనంద్‌పూర్ సాహిబ్‌లో సహాయక చర్యలు చేపట్టారు. తానే స్వయంగా రంగంలోకి దిగి సహాయక చర్యలను పర్యవేక్షిస్తుండగా..పాముకాటుకు గురయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షితంగా రక్షించినట్లు చెప్పారు.
ఇదీ చదవండి: బీజేపీకి ఎదురుదెబ్బ.. సింధియాను వీడి.. కాంగ్రెస్ చేరి..
Comments
Please login to add a commentAdd a comment