కొత్తజంటకు ఊహించని షాక్! | Groom Bitten By Rattlesnake During Wedding Photo Shoot | Sakshi
Sakshi News home page

కొత్తజంటకు ఊహించని షాక్!

Published Thu, Jun 23 2016 9:41 AM | Last Updated on Mon, Sep 4 2017 3:13 AM

కొత్తజంటకు ఊహించని షాక్!

కొత్తజంటకు ఊహించని షాక్!

ఫోర్ట్ కొలిన్స్: ఓ జంట తమ పెళ్లి గురించి అందరిలాగే ఎన్నో కలలుకంది. తమ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను కొన్ని నెలల ముందుగానే  పక్కాగా ప్లాన్ చేసుకొని రంగంలోకి దిగారు. వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాట్లను ఘనంగా చేసుకున్నారు. అయితే అక్కడ వారు ఊహించని మలుపొకటి చోటుచేసుకుంది. మరికాసేపట్లో రిసెప్షన్ అనగా పెళ్లి కొడుకును ప్రమాదకరమైన ర్యాటిల్ స్నేక్ కాటేసింది.

అమెరికాలోని కొలరాడోలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. జానీ, లారా జంట సోమవారం ఫోర్ట్ కొలిన్స్ పట్టణంలోని క్యాథలిక్ చర్చిలో పెళ్లి చేసుకున్నారు. ఇంకాసేపట్లో రిసెప్షన్ ఉందనగా.. అవుట్ డోర్లో వారు సరదాగా పెళ్లి ఫోటోలు దిగుతున్నారు. ఫోటో గ్రాఫర్ మ్యాడీ కొత్త జంట నవ్వులు, ముద్దులను తన కెమెరాలో బంధిస్తున్న సమయంలో.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ ఓ రాటిల్ స్నేక్ జానీ కాలి మడమపై  కాటేసింది.

ఫోటోలకు ఫోజులివ్వడంలో బిజీగా ఉన్న జానీ తన కాలిపై ఏదో తగలడంతో కిందకు చూడగా అక్కడ ర్యాటిల్ స్నేక్ కనిపించింది. అంతే.. ఒక్కసారిగా ఫోటో షూట్ కాస్తా హారర్గా మారిపోయింది. అటుగా వచ్చిన అధికారి ఒకరు వారికి సహాయం అందించాడు. అనంతరం పారామెడికల్ సిబ్బంది జానీని అత్యవసర సేవల విభాగానికి తరలించి చూడగా.. ర్యాటిల్ స్నేక్ కరిచింది గానీ విషాన్ని ఇంజెక్ట్ చేయలేదని గుర్తించారు. దీంతో ఊపిరిపీల్చుకున్న కొత్తజంట సంతోషంగా రిసెప్షన్కు బయలు దేరింది. ఈ ఘటనపై జానీ మాట్లాడుతూ.. పాము కరిచిన సమయంలో తాను దేని గురించీ అలోచించలేదు గానీ.. ఎంతో ప్లాన్ చేసి ఏర్పాటు చేసిన రిసెప్షన్ ఎలా అని మాత్రం ఆలోచించానని వెల్లడించాడు. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ మ్యాడీ మాత్రం పెళ్లి ఫోటోలతో పాటు ఈ పాము ఎపిసోడ్ను కూడా తన కెమెరాలో బంధించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement