Punjab minister
-
ఆప్ మంత్రి డర్టీ పిక్చర్
చంఢీగడ్: పంజాబ్ ఆప్ మంత్రి బాల్కర్ సింగ్‌కు సంబంధించిన ఓ అభ్యంతర వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆయనపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిస్తానని చెప్పి ఓ మహిళతో మంత్రి బాల్కర్ సింగ్ అసభ్యంగా ప్రవర్తించారని బీజేపీ ఆరోపణలు చేసింది. అయితే దీనిపై మంత్రి స్పందించారు. ఆ వీడియో గురించి తనుకు తెలియదని, అది తనది కాదని స్పష్టం చేశారు. బాల్కర్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కేబినెట్లో స్థానిక ప్రభుత్వం, అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్నారు.ఉదోగ్యం కోసం తన వద్దకు వచ్చిన ఓ మహిళ పట్ల మంత్రి అసభ్యంగా ప్రవర్తించిన వీడియోను సోమవారం బీజేపీ నేతలు సోషల్‌మీడియాలో షేర్ చేయటంతో వైరల్‌గా మారింది. వీడియో కాల్లో సదరు మహిళను దుస్తులు తొలగించాలని మంత్రి బలవంతం చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు.బీజేపీ ఆరోపణల నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ వ్యవహారంపై పూర్తి దర్యాప్తు చేపట్టి.. మూడు రోజుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఓ నివేదిక ఇవ్వాలని పంజాబ్ పోలీసులను ఆదేశించింది. ఆరోపణలు నిజమని తేలితే మంత్రిని అరెస్ట్ చేయాలని ఆదేశించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా రాజకీయంగా దుమారం రేపటంతో మంత్రి బాల్కర్ సింగ్ స్పందించారు. ‘‘ఆ వీడియో ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. నాకు ఆ వీడియో గురించి తెలియదు. నేను ఏం వ్యాఖ్యలు చేయలేను’’ అని తెలిపారు.21 ఏళ్ల మహిళకు వీడియో కాల్ చేసి.. అభ్యంరంగా ప్రవర్తించిన మంత్రి బాల్కర్ సింగ్ వెంటనే పదవి నుంచి తొలగించాలని బీజేపీ నేత తాజిందర్ బగ్గా సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందిస్తూ.. ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడిని ఉదహరిస్తూ ఆప్ (AAP)అంటే ఒక స్త్రీ ద్వేషి పార్టీ అని మండిపడ్డారు. -
పాము కాటుకు గురైన ప్రముఖ మంత్రి..
చంఢీగర్: పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ పాముకాటుకు గురయ్యారు. రూపనగర్ జిల్లాలోని ఆనంద్‌పూర్ సాహిబ్ ప్రాంతంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సంచరిస్తుండగా.. ఈ ఘటన జరిగింది. ఆగష్టు 15 రాత్రి పాముకాటుకు గిరికాగా.. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా పాంగ్, భాక్రా డ్యామ్‌ల నుంచి నీటిని విడుదల చేయగా.. పంజాబ్‌లో రూప్‌నగర్, గుర్దాస్పూర్, హోసియాపూర్, కపుర్తలా, ఫిరోజ్‌పూర్ ప్రాంతాలు వరదమయమయ్యాయి. ఈ డ్యామ్‌ల నుంచి విడదలైన నీటితో బియాస్, సట్లేజ్ నదుల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. With God's grace, the flood situation in my constituency, Shri Anandpur Sahib, is better now. During the rescue operations, I was bitten by a venomous snake on the intervening night of 15th Aug, but that didn’t deter my determination to help my people. With God’s grace and… pic.twitter.com/vQkX14xltK — Harjot Singh Bains (@harjotbains) August 19, 2023 మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ తన సొంత నియోజకవర్గమైన ఆనంద్‌పూర్ సాహిబ్‌లో సహాయక చర్యలు చేపట్టారు. తానే స్వయంగా రంగంలోకి దిగి సహాయక చర్యలను పర్యవేక్షిస్తుండగా..పాముకాటుకు గురయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షితంగా రక్షించినట్లు చెప్పారు. ఇదీ చదవండి: బీజేపీకి ఎదురుదెబ్బ.. సింధియాను వీడి.. కాంగ్రెస్ చేరి.. -
ఐపీఎస్‌ను పెళ్లాడనున్న ఆప్ మంత్రి
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత, పంజాబ్ మంత్రి హర్జోత్ సింగ్ బెయిన్స్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారిణి జ్యోతి యాదవ్‌ను ఆయన మనువాడనున్నారు. వీరి వివాహం ఈ నెల చివర్లో జరగనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అంతేగాక ఇటీవలె ఈ జంట నిశ్చితార్థం కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వివాహ బంధంతో ఒకటై కొత్త జీవితాన్ని ప్రాంభించనున్న హర్జోత్ సింగ్, జ్యోతి యాదవ్‌లకు పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వన్ అభినందనలు తెలిపారు. రూపానగర్ జిల్లాలోని ఆనంద్‌పూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి తొలిసారి శాసనసభకు ఎన్నికైన హర్జోత్ సింగ్ ప్రస్తుతం భగవంత్ మాన్ కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అనంతర్పూర్ సాహిబ్‌లోని గంభీపూర్ గ్రామానికి చెందిన 32 ఏళ్ల బైన్స్.. రాజకీయాల్లోకి రాకముందు వృత్తిరీత్యా అడ్వకేట్. పంజాబ్ యూనివర్సిటీ నుంచి 2014లో బీఏ ఎల్ఎల్బీ పూర్తి చేశారు. అంతేగాక 2018లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ లాలో సర్టిఫికెట్ పొందారు. పంజాబ్ ఆప్ యూత్ వింగ్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2017లో జరిగిన ఎన్నికల్లో సాహ్నేవాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తరువాత 2022లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన జ్యోతి యాదవ్. పంజాబ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారణి.. ప్రస్తుతం మానస జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. అంతకుముందు లుథియానాలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా పనిచేస్తున్న సమయంలో లుథియానా సౌత్ ఎమ్మెల్యే రాజిందర్‌పాల్ కౌర్ చిన్నతో వివాదం కారణంగా ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు. కాగా పంజాబ్‌లో గతేడాది ఆప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరాష్ట్ర సీఎం భగవంత్ మాన్ గురుప్రీత్ కౌర్‌ను పెళ్లాడారు, ఆప్ ఎమ్మెల్యే నరీందర్ కౌర్ భరాజ్-నరీందర్‌పాల్ సింగ్ సవానా పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం మరో జంట పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. చదవండి: పార్లమెంట్లో రాహుల్ వ్యాఖ్యల దుమారం.. క్షమాపణలు చెప్పాల్సిందే! -
రోహ్తక్లో పంజాబ్ మంత్రి సిద్ధూకి షాక్
-
పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్‌పై దేశద్రోహం కేసు
-
సొంతడబ్బులతో ఆదుకున్న మంత్రి సిద్ధూ
అమృత్సర్: పంజాబ్ టూరిజం మంత్రి, టీమిండియా మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ మరోసారి దయాగుణం చాటుకున్నారు. అగ్నిప్రమాదంలో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వ్యక్తిగతంగా 24 లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వనున్నట్టు సిద్ధూ ప్రకటించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరి, అమృత్సర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సిద్ధూకు సీఎం అమరీందర్ సింగ్ మంత్రి వర్గంలో స్థానం లభించిన సంగతి తెలిసిందే. ఓథియన్ అనే గ్రామం సమీపంలో ఇటీవల హై టెన్షన్ విద్యుత్ వైర్ తెగిపడటంతో అగ్నిప్రమాదం సంభవించి దాదాపు 300 ఎకరాల్లో పంట కాలిబూడిదైంది. ఆదివారం ఈ గ్రామాన్ని సందర్శించిన సిద్ధూ రైతులను ఆదుకుంటానని ప్రకటించారు. ఒక్కో ఎకరాకు 8 వేల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు చెప్పారు. 'అగ్ని ప్రమాదం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. నేనిచ్చే పరిహారం వారికి చాలదని తెలుసు. రైతులను కొంత మేరకైనా ఆదుకోవాలనే ఉద్దేశంతో వ్యక్తిగతంగా సాయం చేయాలని నిర్ణయించుకున్నా. ప్రభుత్వంపై భారం పడకుండా సొంత నిధులు విరాళంగా ఇస్తున్నా' అని సిద్ధూ చెప్పారు. సిద్ధూ గతంలో కూడా పెద్ద మొత్తంలో విరాళం ప్రకటించారు. అమృత్‌సర్‌లో 'గో గ్రీన్, గో క్లీన్' అనే కార్యక్రమానికి ఆయన కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. -
3 గం. వరకు మంత్రి బాధ్యతలు.. తర్వాత షూటింగ్
చండీగఢ్: పంజాబ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన టీమిండియా మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ.. పాపులరైన 'ద కపిల్ శర్మ షో'లో కూడా పాల్గొననున్నారు. సిధ్దూయే స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. మంత్రిగా విధులు నిర్వహిస్తూనే టీవీ షోలలో పాల్గొనేలా సమన్వయం చేసుకుంటానని తెలిపారు. బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన సిద్ధూ ఇటీవల జరిగిన పంజాబ్ ఎన్నికల్లో అమృత్ సర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అమరీందర్ సింగ్ కేబినెట్లో ఆయనకు మంత్రి పదవి దక్కిన సంగతి తెలిసిందే. ప్రజలు తన టీవీ షోలను వ్యతిరేకించినట్టయితే, తనను దాదాపు 43 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించేవారు కాదని సిద్ధూ అన్నారు. మంత్రిగా మధ్యాహ్నం 3 గంటల వరకు పనిచేస్తానని, ఆ తర్వాత విమానంలో ముంబైకి వెళ్లి టీవీ షో షూటింగ్లో పాల్గొంటానని, మరుసటి రోజు ఉదయానికల్లా తిరిగి వస్తానని చెప్పారు. -
ఢిల్లీ సీఎం మరో మంత్రి పరువు తీశారంట
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై మరో పరువు నష్టం దావా కేసు పడింది. అమృత్ సర్ కోర్టులో పంజాబ్ మంత్రి మజీతియా కేజ్రీవాల్ పై పరువు నష్టం దావా వేశారు. డ్రగ్స్ సిండికేట్ తో మజితియాకు సంబంధం ఉందని గతంలో కేజ్రీవాల్ ఆరోపించారు. దీంతో ఆయన ఆరోపణలు కొట్టిపారేశారు. తనపై కేజ్రీవాల్ తప్పుడు ఆరోపణలు చేశారని, నలుగురిలో పరువు తీసే చర్యలకు దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఓసారి అరుణ్ జైట్లీ డీసీసీబీ విషయంలో కేజ్రీవాల్ పై పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే.