3 గం. వరకు మంత్రి బాధ్యతలు.. తర్వాత షూటింగ్ | Navjot Singh Sidhu to continue to be in Kapil Sharma show? | Sakshi
Sakshi News home page

3 గం. వరకు మంత్రి బాధ్యతలు.. తర్వాత షూటింగ్

Published Sat, Mar 18 2017 8:19 PM | Last Updated on Tue, Sep 5 2017 6:26 AM

3 గం. వరకు మంత్రి బాధ్యతలు.. తర్వాత షూటింగ్

3 గం. వరకు మంత్రి బాధ్యతలు.. తర్వాత షూటింగ్

చండీగఢ్‌: పంజాబ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన టీమిండియా మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ.. పాపులరైన 'ద కపిల్ శర్మ షో'లో కూడా పాల్గొననున్నారు. సిధ్దూయే స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. మంత్రిగా విధులు నిర్వహిస్తూనే టీవీ షోలలో పాల్గొనేలా సమన్వయం చేసుకుంటానని తెలిపారు.

బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన సిద్ధూ ఇటీవల జరిగిన పంజాబ్‌ ఎన్నికల్లో అమృత్ సర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అమరీందర్ సింగ్ కేబినెట్‌లో ఆయనకు మంత్రి పదవి దక్కిన సంగతి తెలిసిందే. ప్రజలు తన టీవీ షోలను వ్యతిరేకించినట్టయితే, తనను దాదాపు 43 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించేవారు కాదని సిద్ధూ అన్నారు. మంత్రిగా మధ్యాహ్నం 3 గంటల వరకు పనిచేస్తానని, ఆ తర్వాత విమానంలో ముంబైకి వెళ్లి టీవీ షో షూటింగ్‌లో పాల్గొంటానని, మరుసటి రోజు ఉదయానికల్లా తిరిగి వస్తానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement