స్టార్ డైరెక్టర్‌పై కమెడియన్‌ దారుణ కామెంట్స్.. వాళ్లను ఆ జబ్బు వదలదేమో? | Singer Chinmayi Sripaada slams Kapil Sharma for racist jibes on Atlee | Sakshi
Sakshi News home page

Chinmayi Sripaada: అట్లీపై దారుణమైన కామెంట్స్.. కమెడియన్‌పై మండిపడ్డ సింగర్‌

Published Mon, Dec 16 2024 4:53 PM | Last Updated on Mon, Dec 16 2024 5:47 PM

Singer Chinmayi Sripaada slams Kapil Sharma for racist jibes on Atlee

కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్నారు. వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన బేబీ జాన్ మూవీకి ఆయనే కథను అందించారు. ఈ మూవీకి కలీస్ దర్శకత్వం వహించగా.. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా బేబీ జాన్ టీమ్ ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోకి హాజరైంది.

అయితే ఈ షోలో డైరెక్టర్‌ అట్లీని ఉద్దేశించిన కపిల్ శర్మ అడిగిన ప్రశ్న వివాదానికి దారితీసింది. అట్లీ కలర్‌ను ఉద్దేశిస్తూ వ్యంగ్యమైన ప్రశ్న వేశాడు కపిల్. మీరు ఎవరైనా స్టార్‌ని కలిసినప్పుడు.. మీరు అతనికి కనిపిస్తారా? అంటూ అట్లీ కలర్‌ను ఉద్దేశించి కామెంట్ చేశాడు. దీనికి అట్లీ తనదైన స్టైల్లో సమాధానమిచ్చాడు.

దీనికి అట్లీ మాట్లాడుతూ...'ఒక విధంగా మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది. నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తా. నా మొదటి సినిమాను నిర్మించిన ఏఆర్ మురుగదాస్ సర్‌కి నేను చాలా కృతజ్ఞతలు. అతను నా స్క్రిప్ట్‌, నా సామర్థ్యం మాత్రమే చూశాడు. అంతేకానీ నేను ఎలా ఉన్నానో ఆయన అడగలేదు. అక్కడ ఆయనకు నా కథ నచ్చింది. ప్రపంచం అది మాత్రమే గుర్తిస్తుంది. ఒక వ్యక్తి రూపాన్ని బట్టి మనం అంచనా వేయకూడదు. మీ హృదయంతో మాత్రమే స్పందించాలి. '  అంటూ కపిల్ శర్మకు ఇచ్చిపడేశాడు.

అయితే ఈ ప్రశ్నపై సింగర్ చిన్మయి శ్రీపాద సైతం స్పందించింది. ఈ షో అట్లీ కలర్‌ గురించి కపిల్ శర్మ జోక్ చేశాడని విమర్శించింది. కామెడీ పేరుతో అతని చర్మం రంగు గురించి మాట్లాడే ఈ విపరీతమైన హేళనలను వాళ్లు ఎప్పటికీ ఆపలేరేమో? అంటూ మండిపడింది. కపిల్ శర్మ లాంటి ఫేమ్ ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తనను నిరాశకు గురి చేసిందని చిన్మయి ట్వీట్‌ చేసింది. అయితే కపిల్ కామెంట్స్ తనకు ఎలాంటి ఆశ్చర్యం కలిగించలేదని పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం చిన్మయి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement