the kapil sharma show
-
స్టార్ డైరెక్టర్‌పై కమెడియన్ దారుణ కామెంట్స్.. వాళ్లను ఆ జబ్బు వదలదేమో?
కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్నారు. వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన బేబీ జాన్ మూవీకి ఆయనే కథను అందించారు. ఈ మూవీకి కలీస్ దర్శకత్వం వహించగా.. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా బేబీ జాన్ టీమ్ ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోకి హాజరైంది.అయితే ఈ షోలో డైరెక్టర్ అట్లీని ఉద్దేశించిన కపిల్ శర్మ అడిగిన ప్రశ్న వివాదానికి దారితీసింది. అట్లీ కలర్‌ను ఉద్దేశిస్తూ వ్యంగ్యమైన ప్రశ్న వేశాడు కపిల్. మీరు ఎవరైనా స్టార్‌ని కలిసినప్పుడు.. మీరు అతనికి కనిపిస్తారా? అంటూ అట్లీ కలర్‌ను ఉద్దేశించి కామెంట్ చేశాడు. దీనికి అట్లీ తనదైన స్టైల్లో సమాధానమిచ్చాడు.దీనికి అట్లీ మాట్లాడుతూ...'ఒక విధంగా మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది. నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తా. నా మొదటి సినిమాను నిర్మించిన ఏఆర్ మురుగదాస్ సర్కి నేను చాలా కృతజ్ఞతలు. అతను నా స్క్రిప్ట్, నా సామర్థ్యం మాత్రమే చూశాడు. అంతేకానీ నేను ఎలా ఉన్నానో ఆయన అడగలేదు. అక్కడ ఆయనకు నా కథ నచ్చింది. ప్రపంచం అది మాత్రమే గుర్తిస్తుంది. ఒక వ్యక్తి రూపాన్ని బట్టి మనం అంచనా వేయకూడదు. మీ హృదయంతో మాత్రమే స్పందించాలి. ' అంటూ కపిల్ శర్మకు ఇచ్చిపడేశాడు.అయితే ఈ ప్రశ్నపై సింగర్ చిన్మయి శ్రీపాద సైతం స్పందించింది. ఈ షో అట్లీ కలర్ గురించి కపిల్ శర్మ జోక్ చేశాడని విమర్శించింది. కామెడీ పేరుతో అతని చర్మం రంగు గురించి మాట్లాడే ఈ విపరీతమైన హేళనలను వాళ్లు ఎప్పటికీ ఆపలేరేమో? అంటూ మండిపడింది. కపిల్ శర్మ లాంటి ఫేమ్ ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తనను నిరాశకు గురి చేసిందని చిన్మయి ట్వీట్ చేసింది. అయితే కపిల్ కామెంట్స్ తనకు ఎలాంటి ఆశ్చర్యం కలిగించలేదని పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం చిన్మయి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Will they never stop these crass and racist jibes at his skin color in the name of ‘comedy’?Someone with the amount of influence and clout like Kapil Sharma saying something like this is disappointing and unfortunately, not surprising. https://t.co/63WjcoqHzA— Chinmayi Sripaada (@Chinmayi) December 15, 2024 -
ప్రముఖ కమెడియన్ కన్నుమూత
ప్రముఖ కమెడియన్, మరాఠీ నటుడు ఇవాళ కన్నుమూశారు. ది కపిల్ శర్మ షో ఫేమ్ అతుల్ పర్చురే తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మరణించారు. బాలీవుడ్లో సినిమాలతో పాటు పలు మరాఠీ సీరియల్స్‌లో నటించారు. అంతేకాకుండా పలు టీవీ రియాలిటీ షోల్లో కనిపించారు. గతేడాది కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన రూల్స్ రంజన్ చిత్రంలో కనిపించారు.అతుల్ పర్చురే మరణం పట్ల బాలీవుడ్‌తో పాటు మరాఠీ చిత్రసీమను దిగ్భ్రాంతికి గురిచేసింది. తనదైన నటనతో పాటు మరాఠీ సినిమాల్లోనే కాకుండా హిందీ సినిమాలు, టెలివిజన్‌లో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. అతని కెరీర్లో టీవీ సీరియల్స్‌లో ఎక్కువగా నటించారు. అతని మరణ వార్త విన్న అభిమానులు, సహచరులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మరాఠీ, హిందీ సినిమా ఇండస్ట్రీలో ఆయన చెరగని ముద్ర వేశారని గుర్తు చేసుకుంటున్నారు. -
అతనంటే చిరాకు.. ఆ షో అంతా ఓ చెత్త: సీనియర్ నటుడు ఆగ్రహం
ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో ది కపిల్ శర్మ షో. పలువురు సెలబ్రిటీలు సైతం ఈ షోకు హాజరవుతుంటారు. అయితే ఈ షో బాలీవుడ్ సీనియర్ నటుడు ముకేశ్ ఖన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి షోలను తాను చూడడని.. వినోదం కంటే అశ్లీలత, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువగా ఉంటాయని ఆయన అన్నారు.ముకేశ్ ఖన్నా మాట్లాడుతూ..'ప్రేక్షకులకు ఎంటర్టైన్ చేసేందుకు కపిల్ శర్మ కష్టపడతారనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ది కపిల్ శర్మ షో, బిగ్‌బాస్‌ను కూడా నేను చూడను. ఎందుకంటే వాటిలో అశ్లీలత ఎక్కువగా ఉంటుంది. అది నాకు అస్సలు నచ్చదు. మరో రెండు సంఘటనల వల్ల నాకు కపిల్ అంటే చిరాకు కలిగింది. గతంలో ఓసారి ఆయన షో చూశా అందులో శక్తిమాన్ గెటప్ వేసుకొని.. చాలా ఇబ్బందికరంగా ప్రవర్తించారు. మేము ఎంతో గొప్పగా ఆ పాత్రను సృష్టిస్తే.. అలా చేయడం నచ్చలేదు. అవార్డుల ఫంక్షన్లో కూడా ఓసారి ఇలాగే ప్రవర్తించాడు. నా పక్కనే కూర్చున్నప్పటికీ నన్ను పలకరించలేదు. అందుకే అతనిపై ఉన్న కాస్తా గౌరవం కూడా పోయింది' అని ముఖేశ్ తెలిపారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ బీటౌన్‌లో వైరల్‌గా మారాయి. -
క్యాన్సర్.. ట్రీట్మెంట్ వికటించడంతో నడవలేని స్థితి!: కమెడియన్
ఇటు బుల్లితెర, అటు వెండితెరపై నవ్వులు పూయించిన నటుడు అతుల్ పరుచూరి. 56 ఏళ్ల వయసున్న ఇతడు 'ద కపిల్ శర్మ షో'తో బాగా పాపులర్ అయ్యాడు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తాను క్యాన్సర్‌తో పోరాడుతున్న విషయాన్ని బయటపెట్టాడు. అసలు క్యాన్సర్ ఎప్పుడు వచ్చింది? ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అన్న విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. డాక్టర్ కళ్లలో భయం.. అతుల్ మాట్లాడుతూ.. 'నాకు పెళ్లై 25 ఏళ్లవుతోంది. ఈ మధ్యే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్లి వచ్చాను. తర్వాత ఉన్నట్లుండి ఆరోగ్యం దెబ్బతింది. సరిగ్గా తినలేకపోయాను. కడుపులో ఏదో వికారంగా అనిపించేది. నాకేదో అవుతోందనిపించింది. నా సోదరుడు కొన్ని మందులిచ్చాడు, కానీ తగ్గలేదు. చాలామంది డాక్టర్లను కలిశాను.. వారు అల్ట్రాసోనోగ్రఫీ చేయించుకోమన్నారు. తీరా ఈ పరీక్ష చేశాక నా ఎదుట నిలబడ్డ డాక్టర్ కళ్లలో భయం కనిపించింది. అప్పుడే నాకేదో సమస్య ఉందని అర్థమైంది. నా కాలేయంలో 5 సెం.మీ. కణతి ఉందని చెప్పారు. అది క్యాన్సర్ గడ్డ అని చెప్పారు. నేను కోలుకుంటానా? లేదా? అని అడిగితే తప్పకుండా నయమవుందని బదులిచ్చారు. చికిత్స వికటించడంతో నడవలేని దుస్థితి కానీ క్యాన్సర్ ఉందని తేలాక నేను తీసుకున్న చికిత్స నాకు తిరగబడింది. వైద్యులు ఇచ్చిన చికిత్స వల్ల నా పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. నడవడానికి కూడా వీల్లేని దుస్థితికి చేరుకున్నాను. మాట్లాడటానికి కూడా తడబడ్డాను. ఆ పరిస్థితిలో సర్జరీ మంచిది కాదని, నెలన్నర రోజులు ఆగుదామని వైద్యులు సూచించారు. కాదని సర్జరీ చేస్తే పచ్చకామెర్ల వ్యాధి వస్తుందని, కాలేయం మొత్తం నీళ్లతో నిండిపోతుందని.. ప్రాణాలకు కూడా గ్యారెంటీ ఇవ్వలేమని చెప్పారు. తర్వాత కీమోథెరపీ సహా మంచి మందులు వాడటంతో నా పరిస్థితిలో కొంత మెరుగుదల కనిపించింది' అని చెప్పుకొచ్చాడు అతుల్. చదవండి: తొలి సినిమాకే స్టార్డమ్.. కానీ బ్రెయిన్ స్ట్రోక్‌తో మంచానపడి.. నోట మాటరాక బేబీ హీరోయిన్ తొలి పారితోషికం ఎంతంటే? -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కమెడియన్
బాలీవుడ్ స్టార్ కమెడియన్లలో కపిల్ శర్మ ఒకరు. ఆయన హోస్ట్‌గా వ్యవహరించే ద కపిల్ శర్మ షో కొత్త సీజన్ త్వరలో మొదలు కాబోతోంది. దీనికోసం కమెడియన్ కొత్త అవతారమెత్తాడు. మరింత యంగ్‌గా తయారై ఫ్యాన్స్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈ మేరకు ఓ ఫొటోను తన ట్విటర్లో వదిలాడు కపిల్. కొత్త సీజన్ కోసం కొత్త లుక్.. త్వరలోనే రాబోతున్నా అంటూ ట్వీట్ చేశాడు. ఇందులో బ్లాక్ టీ షర్ట్‌పైన వైట్ కోట్ వేసుకుని స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చాడు కపిల్. అంతేకాదు, మునుపటి కంటే బరువు తగ్గినట్లు కనిపిస్తున్నాడు. అతడి లుక్ చూసి షాకైన అభిమానులు 'ఏంటి సర్, మిమ్మల్ని అసలు గుర్తుపట్టలేకున్నాం.. మీ వయస్సును ఎలా రివర్స్ చేసుకోగలుగుతున్నారు?', 'వయసు పెరుగుతున్నా నిత్యం యంగ్‌గా ఉండే అనిల్ కపూర్ నుంచి ఏదైనా రహస్యాన్ని రాబట్టారేమో!', 'మీరు ఓ 10 సంవత్సరాలు వెనక్కి వెళ్లినట్లు కనిపిస్తున్నారు' అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా కపిల్ శర్మ షో మూడో సీజన్ ఈ ఏడాది జూన్‌లో ప్రసారమైంది. మరి నాలుగో సీజన్‌ను ఎప్పుడు మొదలు పెడ్తారనేది అధికారికంగా వెల్లడించేవరకు వేచి చూడాల్సిందే! ఇకపోతే ఈ షోలో కృష్ణ అభిషేక్, కికు శారద, సుదేశ్ లాహిరి, భారతీ సింగ్, సుమోన చక్రవర్తి పలువురు ఉండనున్నారు. New season, new look 🤩 #tkss #comingsoon 🙏 pic.twitter.com/Q9ugqzeEJO — Kapil Sharma (@KapilSharmaK9) August 21, 2022 చదవండి: కార్తికేయ 2 సక్సెస్‌పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు, ఆ హీరోలకు చురక కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పిన సదా.. పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు -
కపిల్ శర్మ గురించి ఈ నిజాలు తెలుసా?
మీరు హాయిగా నవ్వుకోవాలనుకుంటున్నారా? కపిల్ శర్మ షో చూడండి. మనసారా నవ్వాలనుకుంటున్నారా? అతడే చిరునామా. పగలబడి? డిటో. తండ్రి చిన్నప్పుడే కేన్సర్‌తో చనిపోయాడు. చదువుకోవడానికి డబ్బులు లేకపోతే టెలిఫోన్ బూత్‌లో పని చేశాడు. నవ్వించాలి అనుకుని నవ్వించి తీరాడు. కపిల్ శర్మ ఒక నవ్వుల అంబాసిడర్. సగటు మనిషి బాధలకుఅతడు కాసేపు పని చేసేదైనా సరే బెస్ట్ వ్యాక్సిన్. 2005. దేశంలో నవ్వుల విస్ఫోటనం జరిగింది. స్టార్ టీవీలో ‘గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్’ మొదలయ్యింది. దాని విజేతగా ‘సునీల్ పాల్’ పది లక్షలు బహుమతి గెలుచుకున్నాడు. మొదటిసారి దేశంలో ‘నవ్వు’కు ‘నవ్వించేవారికి’ చాలా డిమాండ్ వచ్చి పడింది. రోజువారి బతుకులో జనం కాసేపు నవ్వుకోవడానికి అవసరమైన ప్రోగ్రామ్ కోసం ఎదురుచూస్తున్నారని ఈ షో హిట్ కావడం వల్ల తెలిసింది. ఇవాళ తెలుగు టీవీ చానల్స్‌లో ప్రసారం అవుతున్న కామెడీ షోస్‌కు ఈ ‘గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్’ మూలం. అలాంటి ప్రోగ్రామ్ ఆ సమయంలో చాలామందిని ఇన్‌స్పయిర్ చేసింది. అమృత్‌సర్‌కు చెందిన కపిల్ శర్మను కూడా. అమృత్సర్ కుర్రాడు కపిల్ శర్మ అమృత్‌సర్‌లో ఒక హుషారైన కుర్రాడు. తండ్రి పోలీస్ కానిస్టేబుల్. అయితే కేన్సర్ బారిన పడి కుటుంబాన్ని కష్టాల్లో పడేశాడు. ఆ కష్టాన్ని మర్చిపోవడానికి కపిల్ నవ్వును ఒక ఔషధంగా తీసుకున్నాడు. ఫ్రెండ్స్‌ను బాగా నవ్వించేవాడు. జీవితంలో నవ్వును వెతుక్కునేవాడు. కపిల్ చాలా మంచి గాయకుడు. నాటకాలు వేసేవాడు. కాలేజీలు అతణ్ణి పిలిచి సీట్లు ఇచ్చేవి. మా కాలేజీలో చదివి మా కల్చరల్ యాక్టివిటీస్‌లో పాల్గొను అని ఆహ్వానించేవి. కపిల్ శర్మ అలా కాలేజీల కోరిక మేరకు కమర్షియల్ ఆర్ట్ డిగ్రీని, కంప్యూటర్ కోర్సును చదివాడు. రెండూ అన్నం పెట్టలేదు. తాను నమ్ముకున్న నవ్వే అన్నం పెట్టింది. మొదట ఓడి తర్వాత గెలిచి 2005లో ‘గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్’ చూసి 2006లో కపిల్ శర్మ ఆడిషన్స్‌కు వెళ్లాడు. అతను రిజెక్ట్ అయ్యి అతని ఫ్రెండ్ సెలెక్ట్ అయ్యాడు. కాని కపిల్ శర్మ ఓటమిని అంగీకరించలేదు. 2007లో మళ్లీ ఆడిషన్స్ కు వెళ్లాడు. ఈసారి సెలెక్ట్ అయ్యాడు. అంతేనా? పోటీదారులను దాటుకుని ఆ సీజన్ విజేతగా నిలిచాడు. ‘ఆ సమయంలో వచ్చిన 10 లక్షల డబ్బు నా చెల్లెలి పెళ్లికి ఉపయోగపడింది. లాఫ్టర్ చాలెంజ్‌లో గెలిచిన వెంటనే షోస్‌లో పాల్గొని 30 లక్షలు సంపాదించి చెల్లెలు పెళ్లి చేశాను’ అని కపిల్ శర్మ చెప్పుకున్నాడు. కపిల్ శర్మలో స్పీడ్, ఆర్గనైజ్ చేసే సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అందుకే ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ షో ప్రారంభించి పెద్ద హిట్ కొట్టాడు. ఆ తర్వాత ‘ది కపిల్ శర్మ షో’ మొదలెట్టి హిట్ కొట్టాడు. అతని షో ఉన్న చానెల్ టిఆర్పిల్లో ముందుండేది. అందుకే చానల్స్ అతని కోసం వెంటపడ్డాయి. మరోవైపు ప్రయివేట్ షోస్, టూర్స్ అతి త్వరలో కపిల్ సంపన్నుడు అయిపోయాడు. ‘నా షోలో పాల్గొంటానని మీరు కల్లో అయినా అనుకున్నారా’ అని అమితాబ్ వంటి పెద్దలను తన షోలో అడిగి నవ్విస్తాడు కపిల్ శర్మ. నిజానికి అమితాబ్ లాంటి వాళ్లు ‘నేను నీ షోకు వస్తానని కల్లో అయినా అనుకున్నావా’ అని అడగాలి. కాని కపిల్ శర్మ రివర్స్. తన షోకు వచ్చిన సెలబ్రిటీలను మధ్యతరగతి సగటు మనషికి ఉండే డౌట్స్ అడుగుతాడు కపిల్ శర్మ. తన షోకు వచ్చినవారి గురించి పూర్తి హోమ్‌వర్క్ చేసి వారి మీద పంచ్‌లు వేస్తాడు కపిల్ శర్మ. అందుకే అతను షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి వారికి కూడా చాలా ఇష్టమైన కమెడియన్ అయ్యాడు. గతంలో రాజూ శ్రీవాత్సవ్, జానీలీవర్ వంటి కామెడీ స్టార్లు షోలు చేశారు. కాని వారికి కపిల్ శర్మ అంతటి సక్సెస్ రాలేదు. కపిల్లో ఉండే స్పాంటేనిటీ, నవ్వు, వెకిలితనం లేకుండా నవ్వు రాబట్టగలిగే ప్రతిభ అందుకు కారణం. డిప్రెషన్: కపిల్ తనకొచ్చిన పేరుకు తానే భయపడిపోయాడు. ఇది అందరు సెలబ్రిటీలకు ఉండే సమస్యే. కాని కపిల్ ఎక్కువ భయపడ్డాడు. ఈలోపు తన షో పార్ట్నర్ సునీల్ గ్రోవర్ అతనితో విడిపోయాడు. స్క్రిప్ట్స్ రాసేవాళ్లు కొందరు వెళ్లిపోయారు. ఈర్ష్యాసూయలు అతని మీద దుష్ప్రచారం చేశాయి. ఆ సమయంలో కపిల్ షో మూతపడింది. అతను డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. కపిల్ శర్మ ఔట్ అని చాలామంది అనుకున్నారు. కాని కపిల్ తన గర్ల్‌ఫ్రెండ్ జిన్నిని వివాహం చేసుకున్నాక ఆమె సపోర్ట్‌తో ఒకటిన్నర సంవత్సరం తర్వాత తిరిగి షో ప్రారంభించాడు. ఈసారి అతని శ్రద్ధ, ప్రవర్తన చూసి మెల్లగా ప్రేక్షకులు అతనికి పూర్వవైభవం తెచ్చారు. ఇప్పుడు ‘ది కపిల్ శర్మ’ షో అత్యంత సక్సెస్ఫుల్ షోగా నిలిచి ఉంది. మొన్నటి ఏప్రిల్ 2తో కపిల్ శర్మకు 40 ఏళ్లు వచ్చాయి. ఒక వ్యక్తి నలభై ఏళ్లకు ఎవరి మద్దతు లేకుండా ఇంత స్థాయికి ఎదగడం చాలా స్ఫూర్తినిచ్చే విషయం. -
ఆ మాటలకు నా ఇగో హర్ట్ అయ్యింది: జెనీలియా భర్త
పాపులర్ టీవీ ప్రోగ్రాం ‘ది కపిల్ శర్మ కామెడీ షో’కు ఈ వారం జెనీలియా డిసుజా, ఆమె భర్త రితేష్ దేశ్‌ముఖ్ అతిధులుగా రాబోతున్నారు. అయితే ఈ షోలో రితేష్ దేశ్‌ముఖ్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. బెంగుళూరులో ఒకసారి క్రికెట్ లీగ్ చూడటానికి వెళ్లినప్పుడు అక్కడ ఇద్దరు క్రికెటర్లు గుసగుసలాడుకొని ‘మీరు జెనీలియా భర్త కదా’ అని అడిగారని తెలిపారు. ఆ మాటకు తన ఇగో కొంచెం హర్ట్ అయ్యిందని రితేష్ తెలిపారు. ఇక అప్పుడు తను వారితో ‘చూడండి ఇక్కడ నేను జెనీలియా భర్తను అయితే మహారాష్ట్రలో ఆమె రితేష్ భార్య’ అని తెలిపాను. అప్పుడు వారు చూడండి ఒక్క రాష్ట్రం, మహారాష్ట్రలోనే ఆమెను రితేష్ భార్య అంటారు, కానీ కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో మిమ్మల్ని జెనీలియా భర్త అనే అంటారు అని సమాధానం ఇచ్చారు అని రితేష్ చెప్పగానే అక్కడ ఉన్న వారందరూ గట్టిగా నవ్వారు. ఈ ఎపిసోడ్ ప్రోమోను సోని ఛానల్ వారు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. View this post on Instagram Bollywood ke cute aur talented couple Riteish-Genelia ke saath hogi dher saari romanchak baatein jab aayenge woh Kapil ke ghar. Dekhiye #TheKapilSharmaShow iss Sat-Sun raat 9:30 baje. @kapilsharma @kikusharda @krushna30 @bharti.laughterqueen @sumonachakravarti @banijayasia @archanapuransingh @chandanprabhakar @riteishd @geneliad A post shared by Sony Entertainment Television (@sonytvofficial) on Oct 20, 2020 at 12:30am PDT చదవండి: సుశాంత్ కేసు: రూ. 10 లక్షలు ఇప్పించండి! -
సోనూసూద్ కంటతడి!
-
భావోద్వేగం, సోనూ సూద్ కంటతడి!
సినిమాలో విలన్‌గా కనిపించే సోనూసూద్ రియల్‌లైఫ్‌లో మాత్రం అందరి చేత హీరో అనిపించుకుంటున్నాడు. లాక్డౌన్ సమయంలో ఎంతో మంది వలస కార్మికులను సొంత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ల ఊర్లకు చేర్చాడు. ఆ తరువాత కూడా తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాడు. ఎవరు సాయం అడిగిన లేదనకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నాడు సోనూసూద్. ప్రాంతం, భాష, కులం, మతంతో సంబంధం లేకుండా ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో రైతుకు ఒక్కరోజులో ట్రాక్టర్ పంపించి ఎంతో మంది ప్రశంసలు అందుకున్నాడు. లాక్డౌన్ తరువాత ప్రసారం అవుతున్న ‘ది కపిల్ శర్మ’ షోకు సోనూసూద్ గెస్ట్‌గా వస్తున్నాడు. అయితే ఈ షోలో సోనూ సూద్ వల్ల సాయం పొందిన చాలా మంది ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది చూసిన సోనూసూద్ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోను సోని టీవీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. తరువాత కపిల్‌శర్మ యధావిధిగా షోలో నవ్వులు పూయించాడు. ఈ ఎపిసోడ్ శనివారం ప్రసారం కానుంది. చదవండి: సోనూసూద్ క్రేజ్: ‘ఆచార్య’లో ముఖ్య పాత్ర -
క్షమాపణలు కోరిన స్టార్ కమెడియన్
ముంబై: బాలీవుడ్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మ కాయస్థ సామాజిక వర్గానికి క్షమాపణలు చెప్పాడు. తనకు ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని.. తన బృందం తరఫున తాను క్షమాపణ కోరుతున్నట్లు పేర్కొన్నాడు. అసలు విషయమేమిటంటే.. మార్చి 28న ప్రసారమైన ది కపిల్ శర్మ షోలో చిత్రగుప్తుడి గురించి జోకులు పేల్చారు. ఈ నేపథ్యంలో తమ ఆరాధ్య దైవమైన చిత్రగుప్తుడి గొప్పతనాన్ని అసహాస్యం చేశారంటూ కాయస్థ సామాజిక వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో నెలరోజుల క్రితం అఖిల్ భారతీయ కాయస్థ సభ అధినేత కపిల్‌కు ఫోన్ చేసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కపిల్ శర్మను బాయ్‌కాట్ చేయడంతో పాటుగా.. అతడిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తామని హెచ్చరించారు.(బాలీవుడ్ నటుడిపై కేసు నమోదు) ఇక ఈ విషయంపై స్పందించిన కపిల్ శర్మ తాజాగా వారిని క్షమాపణలు కోరాడు. ఈ మేరకు.. ‘‘ప్రియమైన కాయస్థ సమాజానికి నమస్కారం. చిత్రగుప్తుడిపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరుతున్నా. ఇతరుల మనోభావాలను కించపరిచే ఉద్దేశం మాకు లేదు. మీరంతా ఎల్లప్పుడూ సంతోషంగా, క్షేమంగా నవ్వుతూ ఉండాలని ఆ ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నా. హృదయపూర్వక నమస్కారాలు’’అని కపిల్ ట్వీట్ చేశాడు.(నాకు ఎవరితోనూ సంబంధం లేదు: అలియా) प्यारे कायस्थ समाज के लिए 🙏 @kayasthasabha @SubodhKantSahai pic.twitter.com/sord7gTxba — Kapil Sharma (@KapilSharmaK9) May 21, 2020 -
స్టార్ కమెడియన్‌కు అభిమానుల బిగ్ సర్ప్రైజ్
తమ అభిమాన నటుడు వస్తున్నాడంటే ఫ్యాన్స్ సందడి అంతా ఇంతా ఉండదు. ఇక ఆ కార్యక్రమం అభిమాన నటుడికి సైతం చిరకాలం గుర్తుండిపోవాలని కొంతమంది అభిమానులు ఓ ఐడియా వేశారు. అది చూసిన బాలీవుడ్ ప్రముఖ కమెడియన్, నటుడు, వ్యాఖ్యాత కపిల్ శర్మకు ఆనందంతో నోట మాట రానంత పనైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ‘ద కపిల్ శర్మ షో’ టీమ్ తొలిసారిగా విదేశాల్లో లైవ్ ప్రోగ్రాంను ఏర్పాటు చేసింది. దీనికోసం కపిల్, తన తల్లిని వెంటబెట్టుకుని టీమ్‌తో సహా దుబాయ్‌కు వెళ్లాడు. అక్కడ లైవ్ ప్రోగ్రాంకు హాజరైన అభిమానులు ఈ కమెడియన్‌కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. కపిల్ ముద్దుల కూతురు అనైరా ఫొటోలు ఉన్న టీషర్టులతో కార్యక్రమానికి హాజరయ్యారు. అది చూసిన ఈ కమెడియన్ అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. మీరందరూ ఎప్పటికీ నా హృదయంలో ఉంటారంటూ దీనికి సంబంధించిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. అందులో చాలామంది యువతీయువకులు బ్లాక్ టీ షర్ట్‌పై అనైరా చిత్రం ఉన్న దుస్తులను ధరించి ఉన్నారు. కాగా కపిల్ శర్మ- గిన్ని చత్రత్ దంపతులకు అనైరా గతేడాది డిసెంబర్ 10న జన్మించింది. ఇక దుబాయ్ పర్యటనలో ఉన్న ఈ నటుడు తన గారాలపట్టి ఆడుకోడానికి ఓ గిటార్‌ను సైతం కొనుగోలు చేశాడు. చదవండి: అమ్మాయి పుట్టింది: కపిల్ శర్మ కూతురి ఫొటో షేర్ చేసిన స్టార్ కమెడియన్ -
అలా పడుకుంటేనే కదా తెలిసేది..
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ తన నిద్ర గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. నవ్వులు పూయిస్తున్న ప్రోమోను చూసిన అభిమానులు పూర్తి ఎపిసోడ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ‘దబాంగ్ 3’ ప్రమోషన్స్‌లో భాగంగా సల్లూ భాయ్ కపిల్ శర్మ షోలో పాల్గొన్నాడు. ఇందులో వ్యాఖ్యాత కపిల్ శర్మ.. సల్మాన్‌ను ‘నీకు మంచంపై వాలగానే పడుకోడానికి ఎంత సమయం పడుతుంద’ని ప్రశ్నిస్తాడు. దీనికి సల్లూభాయ్.. అసలు మంచం మీదే పడుకుంటే కదా ఎంత సమయం పడుతుందో తెలిసేది అంటూ వెళ్లి అక్కడున్న సోఫాపై తాను ఎలా పడుకుంటాడో చూపిస్తాడు. దీంతో మొదట అందరూ అవాక్కయినా తర్వాత అసలు విషయం తెలిసి నవ్వుకున్నారు. ‘నేను మంచంపై కాకుండా సోఫాపైనే పడుకుంటాను. ఎందుకంటే నేనిప్పటికీ ఒంటరిగానే జీవితాన్ని నెట్టుకొస్తున్నా కదా’ అని చెప్పడంతో అక్కడున్న వారు ఘొల్లున నవ్వారు. కాగా సల్మాన్‌ఖాన్ చుల్‌బుల్‌పాండే పాత్రలో దబాంగ్ 3 ద్వారా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల కానుంది. -
రచ్చకెక్కిన కమెడియన్లు..!
సాక్షి, ముంబై : ప్రముఖ బాలీవుడ్ కామెడీ షో ‘‘ది కపిల్ శర్మ షో’’ హోస్ట్ కపిల్ శర్మ, కమెడియన్ సునీల్ గ్రోవర్ల గొడవ ఇప్పుడు రచ్చకెక్కింది. ట్విటర్ వేదికగా వీరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. శనివారం సునీల్ గ్రోవర్ తన ట్విటర్ ఖాతాలో ఓ అభిమానికి ఇచ్చిన సమాధానం గొడవకు ఆజ్యం పోసినట్లైంది. కపిల్ కొత్త షో నుంచి తనకు ఎలాంటి పిలుపు రాలేదని, తను కూడా కపిల్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నట్లు సునీల్ ట్వీట్ చేశారు. దీనికి సమాధానంగా కపిల్ శర్మ స్పందిస్తూ.. ‘‘సునీల్ అబద్దం చెబుతున్నాడు. నేను వందల సార్లు సునీల్‌కు ఫోన్ చేశాను. సునీల్ గ్రోవర్ ఇంటికి నా మనషులను పంపించాను. స్వయంగా నేను కూడా వెళ్లాను. అయిందేదో అయిపోయింది నా పేరు పాడు చేయాలని చూస్తే ఊరుకోనని’’ కపిల్ పోస్ట్ చేశాడు. దీనికి సమాధానంగా ‘‘ ఈ నవరాత్రి ఎవరూ అబద్దం చెప్పరు ’’అని సునీల్ పోస్ట్ చేశారు. దీంతో మండిపడ్డ కపిల్ ‘‘ఇప్పటికే చాలా ఎక్కువైంది.. వ్యక్తిగతం అంటూ ఏవీ లేవు ఇక అన్నీ ట్విటర్లోనే’’ అని పోస్ట్ చేశారు. కొన్ని నెలల కిందట ఈ గొడవ కారణంగా సునీల్ గ్రోవర్‌ను షో నుంచి పంపేసిన విషయం తెలిసిందే. విమాన ప్రయాణంలో ఇద్దరి మధ్య చోటుచేసుకున్న వివాదం చినికి చినికి గాలి వానగా మారి నెంబర్.1గా ఉన్న షోను తక్కువ రేటింగ్స్ కారణంగా నిలిపివేశారు. చాలా రోజుల తర్వాత కపిల్ శర్మ తన కొత్త షో ‘‘ఫ్యామిలీ టైం విత్ కపిల్ శర్మ’’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. -
నటి తండ్రిపై ఆటో డ్రైవర్ దాడి
సాక్షి, ముంబై : బాలీవుడ్ నటి సుమోన చక్రవర్తి తండ్రిపై ఓ ఆటో డ్రైవర్ దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాల నటిగా కెరీర్‌ను ఆరంభించిన సుమోన.. కపిల్ శర్మ షోతోపాటు పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా చేశారు. ముంబై మిర్రర్ కథనం ప్రకారం... అంధేరీ సెవెన్ హిల్స్ ఆస్పత్రి సమీపంలో వీరి కుటుంబం నివాసం ఉంటుంది. ఈ క్రమంలో ఓరోజు సుమోన తండ్రి సుజిత్.. తన భార్యకు ఆరోగ్యం బాగోలేకపోవటంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆటోను మాట్లాడుకునేందుకు రోడ్డు మీదకు రాగా.. ఒక ఆటో డ్రైవర్ ఎక్కువ డిమాండ్ చేయటంతో అతనితో సుజిత్ వాదనకు దిగారు. ఈ క్రమంలో ఆ ఆటోడ్రైవర్ సుజిత్‌ను బండరాయితో మోది తీవ్రంగా గాయపరిచాడు. అది గమనించిన సుమోన తల్లి.. గాయపడిన సుజిత్‌ను స్థానికుల సహకారంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పొవాయి పోలీసులు దృవీకరించారు కూడా. సుమోన, ఆమె తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదుకాగా, ప్రత్యక్ష సాక్ష్యుల స్టేట్మెంట్ మేరకు ఆటో డ్రైవర్ అమిత్ గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే 5000 రూపాయల పూచీకత్తు మీద చివరకు అతనికి బెయిల్ లభించింది. -
సిద్ధూ.. కొన్నాళ్లు ఆగు!
ఒకవైపు పంజాబ్ కేబినెట్లో మంత్రిగా వ్యవహరిస్తూ, మరోవైపు అత్యధిక టీఆర్పీ రేటింగు వచ్చే కపిల్ శర్మ షోలో కూడా పాల్గొనాలనుకున్న మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ ఆశల మీద నీళ్లు చల్లారు. తన కుటుంబాన్ని పోషించుకోడానికి టీవీ కార్యక్రమాలు చేస్తానని చెప్పిన ఆయనను.. కొన్నాళ్లు ఆగమని ప్రభుత్వం సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. కెప్టెన్ అమరీందర్ సింగ్ మంత్రివర్గంలో సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రిగా ఉన్నందున.. సాంస్కృతిక శాఖతో ప్రత్యక్ష సంబంధం ఉండే టీవీ షోలలో పాల్గొనడం అంత మంచిది కాదని ఆయనకు చెప్పారట. ఈ విషయాన్ని ప్రభుత్వ న్యాయవాదులే తేల్చేశారు. మంత్రులు ప్రైవేటు పనులు చేసుకోకూడదని తెలిపారు. పంజాబ్‌లో ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని ఎంతగానో ఆశపడిన సిద్ధూకు చివరికి అంతగా ప్రాధాన్యం లేని శాఖలు రావడంతో ఆయన తీవ్రంగా అసంతృప్తి చెందారు. అందుకే తాను ఈ షోలో పాల్గొనడం కొనసాగిస్తానన్నారు. తాను రాత్రిపూట ఇలా టీవీ షోలు చేసుకుంటాను తప్ప మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ లాగ బస్సుల వ్యాపారం చేయలేనని, డబ్బు సంపాదనకు అవినీతికి పాల్పడలేనని చెప్పారు. తన ఓటర్లకు తాను టీవీ షోలు చేసినా అభ్యంతరం లేదని, రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు తాను ఏం చేస్తే ఎవరికి నష్టమని సిద్ధూ అడిగారు. టీవీ షోలకు సంబంధించిన 75 శాతం పని ఇప్పటికే వదిలేశానని, ఐపీఎల్లో కామెంట్రీ చెప్పడం లేదని, ఇక తన చట్టబద్ధమైన సంపాదనను పూర్తిగా ఆపేయాలా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. -
కాలర్ పట్టుకొని బూటుతో కొట్టిన కమెడియన్
దేశంలో ప్రముఖ కమెడియన్‌గా పేరొందిన కపిల్ శర్మ తన సహనటుడు సునీల్ గ్రోవర్‌పై విమానంలో దాడి చేసిన ఘటనకు సంబంధించి అనేక కథనాలు తెరపైకి వచ్చాయి. తాజాగా విమానంలో ఉన్న ఓ ప్రత్యక్ష సాక్షి ఈ ఘటన ఎలా జరిగింది, అసలు కపిల్ శర్మ ఎందుకు సునీల్ గ్రోవర్‌ను కొట్టాడు అన్న దానిపై సవివరంగా తెలియజేశాడు. అతడు తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్ట్రేలియాలో షో ముగించుకొని ఎయిరిండియా విమానంలో కపిల్ శర్మ బృందం ('ద కపిల్ శర్మ షో'లో పాల్గొనే నటీనటులు, సహాయక సిబ్బంది) తిరుగుప్రయాణమయ్యారు. అయితే, 12 గంటలపాటు ప్రయాణం సాగే ఈ విమానంలో కపిల్ శర్మ గ్లెన్ఫిడ్డిక్ విస్కీని ఫుల్ బాటిల్‌ను లాగించాడు. అతడు తాగుతుండగానే అతని బృందం సభ్యులు విమాన సిబ్బంది తెచ్చి ఇచ్చిన ఆహారాన్ని తినడం ప్రారంభించారు. తాగిన మత్తులో ఉన్న కపిల్‌కు ఇది ఆగ్రహం తెప్పించింది. 'నేను చెప్పకుండానే మీరు అన్నం తినడం ఎలా మొదలుపెట్టారు?' అంటూ కపిల్ కోపంతో కేకలు వేశాడు. దీంతో సహనటులు విస్తుపోయారు. ఈ దశలో సునీల్ గ్రోవర్ కలుగజేసుకొని కపిల్‌ను శాంతింపజేసేందుకు ప్రయత్నించాడు. దీంతో కపిల్ లేచి షూను అతనిపై విసిరికొట్టాడు. అతని కాలర్ పట్టుకొని లాగి.. పలుసార్లు చెంపదెబ్బలు కొట్టాడు. దీంతో గలాటా వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో కపిల్ బృందంలోని ఓ మహిళకు కూడా దెబ్బలు తగిలాయి. దీంతో విమాన సిబ్బంది కలుగజేసుకొని.. కపిల్‌ను శాంతింపజేయాలని ఆయన బృంద సభ్యులనుకోరారు. అతని తీరుతో భయకంపితులైన వారు తాము ఏం చేయలేమంటూ చేతులు ఎత్తేశారు. కపిల్ బృందం సభ్యులపైనా గట్టిగా కేకలు వేస్తూ.. తిట్లదండకాన్ని అందుకున్నాడు. గట్టిగా అరుస్తూ అతడు చేసిన గలాటాతో ఎకనామిక్ క్లాస్‌లో ఉన్న సాటి ప్రయాణికులు సైతం చికాకు పడ్డారు. పలువురు విమాన సిబ్బంది వద్దకు వెళ్లి.. పరిస్థితి సద్దుమణగడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. చాలాసేపు బృందం సభ్యులపై అరుస్తూ.. నానా దుర్భాషలు ఆడుతూ.. కపిల్ గలాటా చేశాడని ఆ ప్రత్యక్ష సాక్షి వివరించారు. ఈ వ్యవహారం మొత్తం సునీల్ శాంతంగా, నిగ్రహంగా ఉన్నాడని తెలిపారు. అయితే, ఈ ఘటన వెలుగులోకి రాకుండా దృష్టి మళ్లించేందుకు తన ప్రియురాలు జిన్నీని పెళ్లి చేసుకోబోతున్నట్టు కపిల్ ట్విట్టర్లో ప్రకటించినట్టు తెలుస్తోంది. కపిల్ తీరుతో ఇబ్బంది పడిన సునీల్ గ్రోవర్‌తోపాటు.. సహ నటులు అలీ అస్గర్, చందన్ ప్రభాకర్‌లు కూడా 'ద కపిల్ శర్మ షో' షూటింగ్‌కు హాజరవ్వడం లేదని తెలుస్తోంది. -
3 గం. వరకు మంత్రి బాధ్యతలు.. తర్వాత షూటింగ్
చండీగఢ్: పంజాబ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన టీమిండియా మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ.. పాపులరైన 'ద కపిల్ శర్మ షో'లో కూడా పాల్గొననున్నారు. సిధ్దూయే స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. మంత్రిగా విధులు నిర్వహిస్తూనే టీవీ షోలలో పాల్గొనేలా సమన్వయం చేసుకుంటానని తెలిపారు. బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన సిద్ధూ ఇటీవల జరిగిన పంజాబ్ ఎన్నికల్లో అమృత్ సర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అమరీందర్ సింగ్ కేబినెట్లో ఆయనకు మంత్రి పదవి దక్కిన సంగతి తెలిసిందే. ప్రజలు తన టీవీ షోలను వ్యతిరేకించినట్టయితే, తనను దాదాపు 43 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించేవారు కాదని సిద్ధూ అన్నారు. మంత్రిగా మధ్యాహ్నం 3 గంటల వరకు పనిచేస్తానని, ఆ తర్వాత విమానంలో ముంబైకి వెళ్లి టీవీ షో షూటింగ్లో పాల్గొంటానని, మరుసటి రోజు ఉదయానికల్లా తిరిగి వస్తానని చెప్పారు. -
కపిల్.. పెళ్లి చేసుకుంటున్నాడా?
స్టాండప్ కమెడియన్ కపిల్ శర్మ అంటే తెలియని టీవీ ప్రేక్షకులు సాధారణంగా ఉండరు. గతంలో కామెడీ నైట్స్ విత్ కపిల్, ఇప్పుడు ద కపిల్ శర్మ షోలతో పాటు పలు అవార్డు ఫంక్షన్లలో కూడా తనదైన స్పాంటేనియస్ కామెడీతో జనాన్ని నవ్వుల్లో ముంచెత్తుతుంటాడు కపిల్. తన పంజాబీ యాసతో కూడిన హిందీతో కాస్త నాటు జోకులను కూడా మామూలు మాటల్లో కలిపేసే కపిల్‌ను అభిమానించేవాళ్లలో అన్ని వర్గాల వాళ్లు ఉంటారు. ఇక తన షోలకు వచ్చేవాళ్లు, అవార్డు ఫంక్షన్లకు వచ్చే హీరోయిన్లతో అతడు మాట్లాడే తీరు ఒక రకంగా ఉంటుంది. తనకంటే పొడవైన శిల్పాశెట్టి, దీపికా పదుకొనే లాంటి వాళ్ల విషయంలోనూ అలాగే వ్యవహరిస్తాడు. అలాంటి కపిల్.. ఇన్నాళ్లకు ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా కపిలే తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించాడు. తన గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి తీసుకున్న ఓ సెల్ఫీని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ''తను నా బెటర్ హాఫ్ అని చెప్పను. ఆమె నన్ను సంపూర్ణ వ్యక్తిగా చేస్తుంది. లవ్ యూ జిన్నీ.. ఆమెను దయచేసి స్వాగతించండి. నేను ఆమెను ఎంతగానో ప్రేమిస్తున్నాను'' అని చెప్పాడు. ఈ ఫొటోను అప్లోడ్ చేయడానికి కొద్ది ముందుగా.. తన అభిమానులకు ట్విట్టర్లో చిన్న టీజర్ కూడా ఇచ్చాడు. తాను ఒక 'అందమైన' విషయాన్ని పంచుకోబోతున్నట్లు చెప్పాడు. అందుకోసం ఒక్క అరగంట ఆగాలని కోరాడు. ఈలోపు ఏం రాయలో ప్రిపేర్ అయ్యాడో ఏమోగానీ.. చివరకు తన మనసులోని విషయాన్ని ప్రపంచానికి చాటాడు. కపిల్ తన ప్రేయసిని అందరికీ చూపించడం ఇదే మొదటిసారి. దాన్నిబట్టి చూస్తుంటే త్వరలోనే అతడు పెళ్లి కూడా చేసుకుంటాడని భావిస్తున్నారు. 2007 సంవత్సరంలో తొలిసారిగా 'ద గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ షో'తో కపిల్ ప్రాచుర్యం పొందాడు. ఆ తర్వాత సోనీ టీవీ వాళ్ల కలర్స్ చానల్లో తన కామెడీ నైట్స్ విత్ కపిల్ షోతో మంచి పాపులారిటీ సాధించాడు. హీరో హీరోయిన్లు తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవాలంటే ముందుగా ఈ షోనే ఎంచుకుంటారు. సీనియర్ హీరోలు, హీరోయిన్లతో కూడా బాగా చలాకీగా మాట్లాడే కపిల్ పెళ్లి విషయం ఇప్పుడు బాలీవుడ్లో పెద్ద వార్తగానే నిలిచింది. 2015లో నలుగురు హీరోయిన్లతో కలిసి తీసిన కిస్ కిస్కో ప్యార్ కరూ సినిమాతో బాలీవుడ్లో కూడా కపిల్ అడుగుపెట్టాడు. తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నప్పుడు త్వరలోనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. తన తల్లికి మూడ్ తిరిగితే రేపే పెళ్లి చేసేస్తుందని ఆ షోలో కరణ్ జోహార్‌తో అన్నాడు. ప్రస్తుతం కపిల్ చేతిలో రెండు సినిమాలు కూడా ఉన్నాయి. Hi..want to share something very beautiful thing with u guys ...wait for 30 mins .. — KAPIL (@KapilSharmaK9) 18 March 2017 Will not say she is my better half .. she completes me .. love u ginni .. please welcome her .. I love her so much:) pic.twitter.com/IqB6VKauM5 — KAPIL (@KapilSharmaK9) 18 March 2017 -
ఫ్యాన్స్ తో పాటు ఆమె భర్త పరీక్ష పెట్టాడు..
ముంబయి: ఇటీవల పెళ్లి చేసుకున్నారన్న వార్తలతో బాలీవుడ్ జోడీ పేర్లు ఎక్కువగా వినిపించాయి. ఏప్రిల్ 30న బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ బిపాసబసు, హీరో కరణ్ సింగ్ గ్రోవర్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత వారు కొన్ని రోజుల పాటు హనీమూన్ కు వెళ్లి, అక్కడ దిగిన ఫొటోలను నెట్ లో పెట్టి అభిమానులతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. పాపులర్ కామెడీ ఈవెంట్ 'ద కపిల్ శర్మ షో' లో నూతన దంపతులు పాల్గొన్నారు. అయితే బిపాసకు సగటు భార్య చేసే పనులు ఏవైనా తెలుసా.. లేదా అని ఆడియన్స్ ఆమెకు పరీక్ష పెట్టారు. వారితో పాటు భర్త కరణ్ కూడా ఆమెను కాస్త ఆటపట్టించాడు. ఇంట్లో ఏమేం పనులు చేస్తారని అభిమానులు అడగగా వాటికి సమాధానం చెప్పింది. ఆ తర్వాత మీ భర్త షర్ట్ కు ఎప్పుడైనా బటన్ కుట్టారా అని మరో ప్రశ్న సంధించారు. తన భర్తకే కాదు ఎవరి డ్రెస్ కు బటన్స్ కుట్టను. ఎందుకంటే స్టిచింద్ వర్క్ రాదని అసలు విషయాన్ని చెప్పింది. అభిమానుల ఇచ్చిన ఉత్సాహంతో బిపాసను కరణ్ కూడా టెస్ట్ చేశాడు. టై కట్టమని ఆర్డర్ వేయగా, బిపాస మొత్తానికి భర్తకు టై అడ్జస్ట్ చేసింది. భార్య టై కడుతున్నప్పుడు దర్జాగా హోదాలో ఉన్నట్లుగా ఫీలవుతూ కరణ్ కాసేపు నవ్వుకున్నాడు. దీంతో ఫ్యాన్స్, భర్త బిపాసకు పరీక్ష పెట్టినట్లయింది. వివాహం చేసుకున్న తర్వాత వీరిద్దరూ ఓ స్క్రీన్ మీద కనిపించడం ఇదే తొలిసారి. -
'ట్విటర్'ను నవ్వించాడు!
ముంబై: కామెడీ కింగ్ కపిల్ శర్మ బుల్లితెరపైనే కాదు సోషల్ మీడియాలోనూ సత్తా చాటుతున్నాడు. 'ద కపిల్ శర్మ షో'తో తాజా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతడికి సోషల్ మీడియాలో నెటిజన్లు బ్రహ్మరథం పట్టారు. సోనీ ఎంటర్ టైన్ మెంట్ చానల్ ప్రసారమైన ఈ కార్యక్రమం గురించి ట్విటర్ లో లక్షకు పైగా ట్వీట్లు వచ్చాయి. 10 లక్షలకు పైగా ఇంప్రెషన్లు పెట్టారు. కపిల్ షో చూసి నవ్వు ఆపులేకపోయామని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ట్విటర్ ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమం గురించి రెండు రోజుల్లో 1,08,000 కన్వర్జేషన్లు జరిగాయని ట్విటర్ ఇండియా హెడ్ విరాల్ జానీ తెలిపారు. ఇటీవల కాలంలో ఓ టీవీ కార్యక్రమం గురించి ఇంతమంది మాట్లాడుకోవడం ఇదే మొదటిసారి అని తెలిపారు. కాగా, తమపై కురిపించిన అభిమానానికి కపిల్ శర్మ ట్విటర్ ద్వారా ధన్యవాదాలు తెలిపాడు. కలర్స్ చానల్ లో ప్రసారమైన 'కామెడీ నైట్స్ విత్ కపిల్' కార్యక్రమం విశేష ఆదరణ పొందింది. కలర్స్ చానల్ ఈ కార్యక్రమ ప్రసారం ఆపేయడంతో సోనీలో 'ద కపిల్ శర్మ షో'తో కపిల్ గ్యాంగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.