'ట్విటర్'ను నవ్వించాడు! | Kapil Sharma's TV show wins over Twitterati | Sakshi
Sakshi News home page

'ట్విటర్'ను నవ్వించాడు!

Published Tue, Apr 26 2016 7:58 PM | Last Updated on Sun, Sep 3 2017 10:49 PM

'ట్విటర్'ను నవ్వించాడు!

'ట్విటర్'ను నవ్వించాడు!

ముంబై: కామెడీ కింగ్ కపిల్ శర్మ బుల్లితెరపైనే కాదు సోషల్ మీడియాలోనూ సత్తా చాటుతున్నాడు. 'ద కపిల్ శర్మ షో'తో తాజా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతడికి సోషల్ మీడియాలో నెటిజన్లు బ్రహ్మరథం పట్టారు. సోనీ ఎంటర్ టైన్ మెంట్ చానల్ ప్రసారమైన ఈ కార్యక్రమం గురించి ట్విటర్ లో లక్షకు పైగా ట్వీట్లు వచ్చాయి. 10 లక్షలకు పైగా ఇంప్రెషన్లు పెట్టారు.

కపిల్ షో చూసి నవ్వు ఆపులేకపోయామని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ట్విటర్ ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమం గురించి రెండు రోజుల్లో 1,08,000 కన్వర్జేషన్లు జరిగాయని ట్విటర్ ఇండియా హెడ్ విరాల్ జానీ తెలిపారు. ఇటీవల కాలంలో ఓ టీవీ కార్యక్రమం గురించి ఇంతమంది మాట్లాడుకోవడం ఇదే మొదటిసారి అని తెలిపారు.

కాగా, తమపై కురిపించిన అభిమానానికి కపిల్ శర్మ ట్విటర్ ద్వారా ధన్యవాదాలు తెలిపాడు. కలర్స్ చానల్ లో ప్రసారమైన 'కామెడీ నైట్స్ విత్ కపిల్' కార్యక్రమం విశేష ఆదరణ పొందింది. కలర్స్ చానల్ ఈ కార్యక్రమ ప్రసారం ఆపేయడంతో సోనీలో 'ద కపిల్ శర్మ షో'తో కపిల్ గ్యాంగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement