
ప్రముఖ కమెడియన్, మరాఠీ నటుడు ఇవాళ కన్నుమూశారు. ది కపిల్ శర్మ షో ఫేమ్ అతుల్ పర్చురే తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మరణించారు. బాలీవుడ్‌లో సినిమాలతో పాటు పలు మరాఠీ సీరియల్స్‌లో నటించారు. అంతేకాకుండా పలు టీవీ రియాలిటీ షోల్లో కనిపించారు. గతేడాది కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన రూల్స్ రంజన్ చిత్రంలో కనిపించారు.
అతుల్ పర్చురే మరణం పట్ల బాలీవుడ్‌తో పాటు మరాఠీ చిత్రసీమను దిగ్భ్రాంతికి గురిచేసింది. తనదైన నటనతో పాటు మరాఠీ సినిమాల్లోనే కాకుండా హిందీ సినిమాలు, టెలివిజన్‌లో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. అతని కెరీర్‌లో టీవీ సీరియల్స్‌లో ఎక్కువగా నటించారు. అతని మరణ వార్త విన్న అభిమానులు, సహచరులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మరాఠీ, హిందీ సినిమా ఇండస్ట్రీలో ఆయన చెరగని ముద్ర వేశారని గుర్తు చేసుకుంటున్నారు.