Marathi actor
-
ప్రముఖ కమెడియన్ కన్నుమూత
ప్రముఖ కమెడియన్, మరాఠీ నటుడు ఇవాళ కన్నుమూశారు. ది కపిల్ శర్మ షో ఫేమ్ అతుల్ పర్చురే తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మరణించారు. బాలీవుడ్లో సినిమాలతో పాటు పలు మరాఠీ సీరియల్స్‌లో నటించారు. అంతేకాకుండా పలు టీవీ రియాలిటీ షోల్లో కనిపించారు. గతేడాది కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన రూల్స్ రంజన్ చిత్రంలో కనిపించారు.అతుల్ పర్చురే మరణం పట్ల బాలీవుడ్‌తో పాటు మరాఠీ చిత్రసీమను దిగ్భ్రాంతికి గురిచేసింది. తనదైన నటనతో పాటు మరాఠీ సినిమాల్లోనే కాకుండా హిందీ సినిమాలు, టెలివిజన్‌లో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. అతని కెరీర్లో టీవీ సీరియల్స్‌లో ఎక్కువగా నటించారు. అతని మరణ వార్త విన్న అభిమానులు, సహచరులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మరాఠీ, హిందీ సినిమా ఇండస్ట్రీలో ఆయన చెరగని ముద్ర వేశారని గుర్తు చేసుకుంటున్నారు. -
స్టేజీపై నటిస్తూ కన్నుమూసిన ప్రముఖ నటుడు
ప్రముఖ నటుడు సతీష్ జోషి చనిపోయారు. స్టేజీపై నటిస్తూ తుదిశ్వాస విడిచారు. మరాఠీలో పలు సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. ఇప్పుడు ఇలా అకాల మరణం చెందడం అభిమానులు షాక్‌కి గురిచేసింది. సతీష్ మరణించిన విషయాన్ని ఈయన ఫ్రెండ్ రాజేశ్ దేశ్ పాండే సోషల్ మీడియాలో ధ్రువీకరించారు.(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరో నాగచైతన్య తల్లి!)'మా స్నేహితుడు సతీష్ జోషి.. మరణానికి ముందు రంగోత్సవ్‌లో వేదికపై నటించారు. ఉదయం 11 గంటలకు చనిపోయారు. అయితే తుదిశ్వాస విడవడానికి ముందు కూడా ఆయన ఎంతో ఎనర్జీతో కనిపించారు' అని రాజేశ్ తన సంతాపాన్ని తెలియజేశారు.మరాఠీ సీరియల్ 'భాగ్యలక్ష్మి'లో కీలక పాత్ర చేసిన సతీష్ జోషి.. బాగా పాపులర్ అయ్యారు. ఎప్పటికప్పుడు నాటకాల్లోనూ నటించేవారు. ఇప్పుడు ది క్రియేషన్ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా రామభూమిలో జరుగుతున్న వేడుకలో పాల్గొన్నారు. ఇందులోనే స్టేజీ ఫెర్ఫార్మెన్స్ ఇస్తూ తుదిశ్వాస విడిచారు. (ఇదీ చదవండి: ముట్టుకుంటే రూ.20 లక్షలు.. ఫొటోకి రూ.25 లక్షలు) -
ఆ దెబ్బతో రోడ్డున పడ్డాం.. నెలకు రూ.35తో కుటుంబమంతా..
ప్రముఖ నటుడు, పద్మ శ్రీ గ్రహీత నానా పటేకర్ ఎన్నో కష్టాలను దాటుకుని ఈ స్థాయికి వచ్చాడు. ఎక్కువగా హిందీ, మరాఠి భాషల్లో నటించిన ఆయన మూడు జాతీయ, నాలుగు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నాడు. రెండు మూడు సినిమాల్లో పాటలు కూడా పాడాడు. డైరెక్టర్‌గా 'ప్రహార్: ద ఫైనల్ అటాక్' అనే సినిమా కూడా తీశాడు. 27 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న ఈయన 28 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయాడు. ఆ తర్వాత మొదటి కొడుకునూ కోల్పోయాడు. తాజాగా అతడు చిన్నతనంలో పడ్డ కష్టాలను ఏకరువు పెట్టాడు. దివాలా తీశాం.. 'ఎందుకో తెలియదు కానీ ఈ మధ్య తండ్రీ పిల్లల మధ్య దూరం పెరుగుతోంది. మా చిన్నతనంలో ఇలా ఉండేది కాదు. బయటకు ప్రేమ చూపించుకోకపోయినా అది మా మధ్య అంతర్లీనంగా ఉండేది. మా నాన్న మా కోసం కష్టపడుతున్నాడన్న విషయం మాకు అర్థమయ్యేది. ఓసారి మా నాన్న వ్యాపారాన్ని ఎవరో లాక్కోవడంతో మేము దివాలా తీశాం. అప్పటివరకు ధనవంతుడైన మా నాన్న ఆ దెబ్బతో నడివీధిలో నిలబడాల్సి వచ్చింది. తను దిగాలుగా, ఏదో శిక్ష పడిన ఖైదీలా కూర్చునేవాడు. ఒక్క పూట భోజనం.. ఆకలి.. అది చూసి నేను ఎందుకు నాన్న, అంత దిగులు చెందుతున్నావు? నీకు ఒక ఫ్యాక్టరీనే కదా పోయింది.. వదిలెయ్.. నీకింకా రెండు ఫ్యాక్టరీలున్నాయి. ఒకటి అన్నయ్య, రెండు నేను. ఎక్కువగా ఆలోచించకు, అంతా సర్దుకుంటుంది అని నచ్చజెప్పాను. 13 ఏళ్ల వయసులోనే పనికి వెళ్లడం మొదలుపెట్టాను. నెలంతా పని చేస్తే రూ.35 ఇచ్చేవారు, రోజుకు ఒక పూట భోజనం పెట్టేవారు. రాత్రిపూట భోజనం చేసేటప్పుడు ఇంటి దగ్గర అమ్మ, నాన్న తిన్నారా? లేదా? అన్న అనుమానం వచ్చేది. కానీ ఆకలికి ఆగలేక నేను తినేసేవాడిని' అని చెప్పుకొచ్చాడు. ఆరోపణలతో నటుడిపై మరక! చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యక స్థానం సంపాదించుకున్న నానా పటేకర్ మీద నటి తనుశ్రీ దత్తా.. లైంగిక ఆరోపణలు చేసింది. మీ టూ ఉద్యమ సమయంలో ఆమె చేసిన ఆరోపణలు నిజమని రుజువు కాకపోయినప్పటికీ నానా మీద విమర్శలు వెల్లువెత్తాయి దీంతో కొంతకాలం పాటు ఆయన సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్యే వ్యాక్సిన్ వార్‌లో కనిపించిన అతడు 'లాల్ బత్తి' అనే ఓటీటీ మూవీ చేస్తున్నాడు. అలాగే మరాఠీలో 'ఒలె ఆలె' అనే చిత్రంలో నటిస్తున్నాడు. చదవండి: అమ్మ గదిలో దొంగతనం.. నా కొడకా.. అని తిట్టేది! -
దీనస్థితిలో నటుడు.. 40 రోజుల కంటే ఎక్కువ బతకలేడన్న డాక్టర్స్!
సీనియర్ నటుడు, దర్శకుడు జూనియర్ మహ్మద్ అలియాస్ నయూమ్ సయ్యద్ తీవ్ర అనారోగ్యానికి లోనయ్యాడు. గత నవంబర్‌లో ఇతడికి క్యాన్సర్ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. అప్పటినుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ దిగజారుతూ వచ్చింది. ప్రస్తుతం అతడికి క్యాన్సర్ నాలుగోదశలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఊపిరితిత్తులు సహా ఇతర శరీర అవయవాలు పాడయ్యాయి. ప్రస్తుతం అతడు ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నాడు. జూనియర్ మహ్మద్ ఆరోగ్య పరిస్థితి గురించి అతడి ఆప్తమిత్రుడు సలాం కాజీ మాట్లాడుతూ.. 'నెల రోజుల కిందటే అతడికి క్యాన్సర్ సోకినట్లు తెలిసింది. మొదట కడుపులో కణతి కనిపించింది. పరీక్షించగా క్యాన్సర్ అని తేలింది. శరీరంలో వచ్చిన మార్పుల కారణంగా అప్పుడే 20 కిలోలు తగ్గిపోయాడు. అతడు కోలుకోవడం కష్టమని వైద్యులు చేతులెత్తేశారు. నెల రోజుల్లోనే నాలుగో స్టేజీకి రావడంతో 40 రోజుల కంటే ఎక్కువ బతకలేడని వైద్యులు చెప్పారు' అని తెలిపాడు. దీంతో ఆయనకు సాయం చేయడానికి కమెడియన్ జానీ లివర్.. ముంబైలోని మహ్మద్ ఇంటికి వెళ్లాడు. నటుడితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ అతడికి శరీరం సహకరించడం లేదని తెలుస్తోంది. చికిత్సకుగానూ కొంత డబ్బు ఇచ్చేందుకు ప్రయత్నించగా కానీ వారి కుటుంబసభ్యులు అందుకు నిరాకరించడంతో బలవంతంగా కొంత డబ్బును అక్కడ పెట్టి వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా జూనియర్ మహ్మద్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టాడు. మరాఠీ భాషలో అనేక సినిమాలను తెరకెక్కించాడు, నటించాడు. దాదాపు 265 చిత్రాల్లో నటించాడు. కైటీ పతంగ్, ఆన్ మిలో సజ్నా, కారవాన్ వంటి పలు సినిమాలతో ఆయన పాపులర్ అయ్యాడు. Viral | Popular actor of yester years, Junior Mehmood has not been keeping well. Comedian Jonny liver seen here trying to lift up his spirits. pic.twitter.com/KQyErg4EBL — MUMBAI NEWS (@Mumbaikhabar9) December 1, 2023 చదవండి: స్టార్ హీరోయిన్ మాజీ భర్తతో నాలుగేళ్లుగా డేటింగ్.. బ్రేకప్‌కు అదే కారణమంటూ.. -
నటుడి ఇంట్లో దొంగతనం.. డబ్బులు, బంగారంతో పనిమనిషి పరార్!
ప్రముఖ నటుడి ఇంట్లో దొంగతనం జరిగింది. కొన్ని నెలల నుంచి ఇంట్లో పనులు చేస్తున్న ఒకామె.. లక్షలు విలువ చేసే డబ్బు, బంగారం తీసుకుని జంప్ అయిపోయింది. ఇప్పుడీ విషయమై సదరు నటుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె పనిమనిషి కాదని, దొంగతనంలో ఎలా ముదిరిపోయిందనేది కూడా సదరు నటుడు బయటపెట్టాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: 'పిచ్చోడు' గొడవపై నాగ్ సీరియస్.. బయటపడ్డ యవర్ అసలు రంగు!) ఇంతకీ ఏం జరిగింది? మరాఠీ నటుడు పుష్కర్ ష్రోత్రి ఇంట్లో ముగ్గురు పనివాళ్లు ఉన్నారు. ఇంటిపనులు చూసుకోవడంతో పాటు ఇతడి తండ్రి బాగోగులని చూసుకోవడం వాళ్ల పని. కానీ ఇందులో ఉష(41) అని ఆమె మాత్రం 5-6 నెలల నుంచి పుష్కర్ ఇంట్లో పనిచేస్తోంది. ఈమెనే.. పుష్కర్ ఇంట్లో ఉన్న రూ.1.20 లక్షలు డబ్బులు, 60 వేల విదేశీ కరెన్సీని.. అక్టోబరు 22న దొంగతనం చేసింది. కానీ అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ మొత్తం యజమానికి తిరిగొచ్చేసింది. ఈ సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత అంటే అక్టోబరు 24న.. బంగారం విషయంలోనూ పుష్కర్ దంపతులకు ఎందుకో అనుమానమొచ్చింది. బీరువాలో బంగారం ఉన్నా సరే దాన్ని పరిశీలించి చూడగా, అది నకిలీది అని తేలింది. పనిమనిషి ఉషనే.. రూ.10 లక్షలు విలువ చేసే బంగారంతో ఆల్రెడీ పరార్ అయిపోయినట్లు బయటపడింది. దీంతో పుష్కర్, అక్టోబరు 26న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం వాళ్లు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడీ ఇదంతా వెలుగులోకి వచ్చింది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7లో ఈసారి షాకింగ్ ఎలిమినేషన్.. క్రేజీ కంటెస్టెంట్ ఔట్?) -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ మరాఠీ నటుడు మిలింద్ సఫాయ్(53) కన్నుమూశారు. క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ నటుడు జయవంత్ వాడ్కర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు. (ఇది చదవండి: 'పుష్ప 2' ముందున్న కొత్త సవాళ్లు.. బన్నీ ఏం చేస్తాడో? ) మిలింద్ సఫాయ్ మరాఠీ టీవీ సీరియల్ 'ఆయ్ కుతే కే కర్తే' ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాకుండా మేకప్, థాంక్ యు విఠలా, పోస్టర్ బాయ్స్, చడీ లగే చమ్ చమ్, ప్రేమచి గోష్టా, టార్గెట్, బి పాజిటివ్ వంటి చిత్రాల్లో కూడా నటించారు. ఒకరోజు ముందే ఆగస్టు 24న ప్రముఖ మరాఠీ నటి సీమా డియో సైతం ముంబైలో తుది శ్వాస విడిచారు. ఆమె చాలా కాలంగా అల్జీమర్స్ వ్యాధితో పోరాడుతోంది. కాగా.. సీమా గతేడాది మృతి చెందిన ప్రముఖ నటుడు రమేష్ డియో భార్య. దీంతో వరుసగా ఇద్దరు నటీనటులు మృతి చెందడంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. (ఇది చదవండి: ఇల్లు అమ్మేస్తోన్న జబర్దస్త్ కమెడియన్.. కన్నీటిని ఆపుకుంటూ!) -
తల్లికి రెండో పెళ్లి చేసిన నటుడు.. నెటిజన్ల ప్రశంసలు!
మరాఠీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సిద్ధార్థ్ చందేకర్. 'జెండా', 'క్లాస్మేట్స్', 'బాలగంధర్వ' లాంటి చిత్రాల్లో నటించారు. మధుర దేశ్‌పాండే, స్వప్నిల్ జోషి, అమృతా ఖాన్విల్కర్తో కలిసి 'జీవ్లగా' షోలో కూడా కనిపించారు. ఇటీవలే నాగేష్ కుకునూర్ దర్శకత్వంలోని 'సిటీ ఆఫ్ డ్రీమ్స్' అనే వెబ్ సిరీస్‌లో నటించాడు. తాజాగా సిద్ధార్థ్ చేసిన పనికి నెటిజన్స్ మనసులను గెలుచుకున్నారు. ఇటీవల తన తల్లిని రెండవ వివాహం చేసి ఆదర్శంగా నిలిచాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తల్లి కోసం ఉద్వేగభరితమైన నోట్ రాసుకొచ్చారు. అంతేకాకుండా తల్లి సీమా చందేకర్ రెండో పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. (ఇది చదవండి: నరేశ్-పవిత్ర ప్రేమాయణం.. ఫస్ట్ నుంచీ ఇదే జరుగుతుంది!) సిద్ధార్థ్ నోట్లో రాస్తూ.. ' అమ్మా.. హ్యాపీ సెకండ్ ఇన్నింగ్స్. నీ బిడ్డలతో పాటు నీ జీవితం ఇంకా ఉంది. నీకు స్వతంత్రమైన అందమైన ప్రపంచం ఉంది. ఇప్పటివరకు మా కోసం చాలా త్యాగం చేశారు. ఇప్పుడు మీ గురించి, మీ కొత్త భాగస్వామి గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. ఈ విషయంలో మీ పిల్లలు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటారు. మీరు నా పెళ్లిని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇప్పుడు నేను అదే చేశా. నా జీవితంలో అత్యంత ఎక్కుగా ఆనందపడే పెళ్లి. ఐ లవ్ యూ అమ్మ.. హ్యాపీ మ్యారీడ్ లైఫ్.' అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్స్ సిద్ధార్థ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మీరు చాలా మందికి ఆదర్శంగా నిలిచారంటూ అభినందిస్తున్నారు. (ఇది చదవండి: జైలర్ కంట కన్నీరు.. ఆ డైలాగ్ రజనీ నిజ జీవితానిదే: డైరెక్టర్) View this post on Instagram A post shared by Siddharth Seema Chandekar (@sidchandekar) -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. అత్యంత దారుణస్థితిలో నటుడు మృతి!
ప్రముఖ నటుడు, మరాఠీ సినిమా దర్శకుడు రవీంద్ర మహాజనీ ఆకస్మికంగా కన్నుమూశారు. రవీంద్రకు 77 ఏళ్లు. పూణేలోని తలేగావ్ దభాడేలోని అంబి ప్రాంతంలోని అతని ఫ్లాట్‌లో నటుడి మృతదేహం కనుగొనబడినట్లు చెప్పబడింది. రెండు మూడు రోజుల క్రితమే మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. (ఇది చదవండి: ‘బిగ్‌బాస్ 7’లోకి బ్యాకాంక్ పిల్ల.. వీడియోతో క్లారిటీ) అయితే రవీంద్ర మహాజని గత కొన్ని నెలలుగా అద్దె ఫ్లాట్‌లోనే ఒంటరిగా నివాసముంటున్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఉంటున్న అతని ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పక్కనే ఉంటున్నవారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించగా నటుడు శవమై కనిపించాడు. దీంతో ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారమిచ్చారు. ఆయన మృతితో మరాఠాతో పాటు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. రవీంద్ర మరాఠీ సినిమాతో పాటు హిందీ సినిమాల్లో కూడా పనిచేశారు. మరాఠీ చిత్ర పరిశ్రమలో ఆయనను వినోద్ ఖన్నా అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అతని వ్యక్తిత్వం, రూపం రెండూ వినోద్ ఖన్నాను పోలి ఉన్నాయి. రవీంద్ర పలు మరాఠీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. అమితాబ్ బచ్చన్ నటించిన 'సాత్ హిందుస్తానీ' చిత్రంలో రవీంద్ర మహాజని పోలీస్ ఇన్స్పెక్టర్గా నటించారు. ఇదే అతని మొదటి సినిమా. ఆ తర్వాత మరాఠీలో 'ఆరం హరమా ఆహే', 'దునియా కరీ సలామ్', 'హల్దీ కుంకు' చిత్రాలకు పనిచేశాడు. 'ముంబయి చా ఫౌజ్దార్' (1984), 'కలత్ నకలత్' (1990)తో పాటు ఆయన నటించిన 'లక్ష్మీ చి పావ్లే' బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. రవీంద్ర మహాజని కుమారుడు గష్మీర్ మహాజని హిందీ సీరియల్ 'ఇమ్లీ'లో నటించారు. కుమారుడితో కలిసి తెరపై తొలి మరాఠీ చిత్రం 'క్యారీ ఆన్ మరాఠా'లో అతిథి పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని కూడా గష్మీర్ తన తండ్రికి అంకితమిచ్చాడు. ఆ తర్వాత ఇద్దరు 2019లో వచ్చిన అర్జున్ కపూర్, కృతి సనన్ చిత్రం 'పానిపట్'లో కూడా కలిసి పనిచేశారు. రవీంద్ర చివరిసారిగా నటించిన చిత్రం కూడా ఇదే. (ఇది చదవండి: స్లిమ్ కోసం కసరత్తులు.. హీరోయిన్‌పై దారుణంగా ట్రోల్స్!) -
ఆ నటుడు నన్ను మోసం చేశాడు.. నిర్మాత సంచలన ఆరోపణలు
ప్రముఖ నటుడు షాయాజీ షిండే టాలీవుడ్లో పలు సినిమాల్లో నటించారు. పోకిరి సినిమాలో పోలీస్ పాత్రలో ఆ డైలాగ్ ఆయనకు మరింత ఫేమ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రల్లో నటించారు. టాలీవుడ్లో సోలో, సీమ టపాకాయ్, యముడికి మొగుడు, సుడిగాడుతో సహా పలు చిత్రాల్లో కనిపించారు. తాజాగా ఆయనపై మరాఠీ చిత్రనిర్మాత సచిన్ ససన్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. సినిమా నుంచి తప్పుకుని తనను మోసం చేశారని ఆయన ఆరోపించారు. అసలేం జరిగిందంటే..: అయితే మరాఠీ చిత్రనిర్మాత సచిన్ ససన్ తెరకెక్కిస్తున్న గిన్నాద్ మూవీలో నటించేందుకు రూ.5 లక్షలకు షాయాజి షిండే సంతకం చేశారు. నిర్మాత నుంచి డబ్బులు కూడా తీసుకున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. నవంబర్ 25, 26 తేదీల్లో షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. షాయాజి షిండే అందుబాటులో లేరని నిర్మాత అన్నారు. ఆ తర్వాత 27న షూటింగ్ రోజు స్క్రిప్ట్ మార్చమని షాయాజీ కోరడంతో ఆశ్చర్యపోయానని చిత్ర నిర్మాత వెల్లడించారు. నిర్మాత అందుకు ఒప్పుకోకపోవడంతోఆగ్రహించిన షాయాజి సినిమా నుంచి తప్పుకున్నారు. షూటింగ్ ఆగిపోవడంతో చిత్రనిర్మాత సచిన్ తన ఫీజును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలగినందుకు పారితోషికం రూ. 5 లక్షలతో పాటు అన్ని ఖర్చులు భరించి మొత్తం రూ.17 లక్షలు చెల్లించాలని నిర్మాత కోరారు. -
ఎంగేజ్మెంట్ చేసుకున్న సీరియల్ జంట, ఫొటోలు వైరల్
ఆన్‌స్క్రీన్ మీద జంటగా కనిపించే తారలు నిజజీవితంలోనూ ఒక్కటైన సందర్భాలు చాలానే ఉన్నాయి. రీల్ లైఫ్‌లో హిట్ పెయిర్ అనిపించుకున్న మరాఠీ జంట రియల్ లైఫ్‌లోనే జత కట్టేందుకు రెడీ అయింది. 'తుజ్యత్ జీవ్ రంగ్ల' అనే సీరియల్లో హీరోహీరోయిన్‌గా నటించిన హార్దిక్ జోషి, అక్షయ డియోధర్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ మేరకు మే 3న నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అతి కొద్దిమంది బంధుమిత్రుల మధ్య ఈ ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ విషయాన్ని అక్షయ 'ఎట్టకేలకు మా ఎంగేజ్మెంట్ జరిగిపోయింది' అన్న క్యాప్షన్ ఇస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పలు ఫొటోలు, వీడియోలు షేర్ చేసింది. అందులోని ఓ వీడియోలో అక్షయను తన మోకాలిపై కూర్చోబెట్టుకుని ఆమె వేలికి రింగ్ తొడిగి ప్రపోజ్ చేశాడు హార్దిక్. అనంతరం అక్షయ అతడి వేలికి ఉంగరం తొడిగి కాబోయే భర్తను హత్తుకుంది. ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాబోయే దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Akshaya Mahesh (@akshayaddr) View this post on Instagram A post shared by Akshaya Mahesh (@akshayaddr) View this post on Instagram A post shared by Akshaya Mahesh (@akshayaddr) View this post on Instagram A post shared by Akshaya Mahesh (@akshayaddr) View this post on Instagram A post shared by HARDEEK JOSHI (@hardeek_joshi) View this post on Instagram A post shared by Madhuri Kobal (@madhurikhese_makeupartist) చదవండి: సినీప్రియులకు ఆహా గుడ్‌న్యూస్, మేలో ఏకంగా 40కి పైగా సినిమాలు! -
కంగనా వివాదస్పద వ్యాఖ్యలకు ప్రముఖ నటుడి మద్దతు..
ప్రముఖ మరాఠీ నటుడు విక్రమ్ గోఖలే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చారు. ఆదివారం మహారాష్ట్రలోని పూణెలో జరిగిన ఓ కార్యక్రమంలో గోఖలే మాట్లాడుతూ కంగనా చెప్పింది నిజమేనని అన్నారు. '1947లో భారతదేశానికి వచ్చింది భిక్ష. 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాకే నిజమైన స్వాతంత్ర్యం వచ్చింది.' అని కంగనా అన్నారు. చదవండి: Kangana Ranaut: నాటి స్వాతంత్య్రం భిక్ష "కంగనా రనౌత్ వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తున్నాను. మనకు స్వాతంత్ర్యం ఇచ్చారు. కానీ స్వాతంత్ర్య సమరయోధులను ఉరితీసినప్పుడు (బ్రిటీష్ పాలనలో) చాలా మంది మూగ ప్రేక్షకులుగా మాత్రమే ఉన్నారు. ఈ మూగ ప్రేక్షకులలో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. వారు పోరాడుతున్న స్వాతంత్ర్య సమరయోధులను రక్షించలేదు. " అని గోఖలే అన్నారు. మరాఠీ థియేటర్, బాలీవుడ్, టెలివిజన్‌లో చేసిన పాత్రలతో గోఖలే గుర్తింపు పొందారు. బీజేపీతో సహా ప్రతి రాజకీయ పార్టీ వివాదాల నుంచి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తుందని గోఖలే అభిప్రాయపడ్డారు. త్రిపురలో జరిగిన మత హింస, అమరావతి, మహారాష్ట్రలోని ఇతర నగరాల్లో రాళ్ల దాడి ఘటనలు చోటుచేసుకున్నాయని, వాటిపై నటుడి అభిప్రాయాన్ని అడగ్గా.. 'మతపరమైన అల్లర్లు ఓటు బ్యాంకు రాజకీయాల ఫలితమే. ప్రతి రాజకీయ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు ఆడుతుంది' అని గోఖలే పేర్కొన్నారు. చదవండి: నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి.. పద్మశ్రీ తిరిగి ఇచ్చేస్తా: కంగనా మహారాష్ట్ర రాజకీయ పరిస్థితులపై గోఖలే మాట్లాడుతూ, దేశాభివృద్ధి కోసం మాజీ మిత్రపక్షాలైన శివసేన, బీజేపీ మళ్లీ కలిసి రావాలని అన్నారు. 'బీజేపీ, శివసేన మళ్లీ కలిసి రావాలి. సీఎం పదవిని సమానంగా పంచుకునే షరతుపై రెండు పార్టీల మధ్య పొత్తు సాధ్యమేనా అని నేను (ప్రతిపక్ష నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి) దేవేంద్ర ఫడ్నవీస్‌ను ప్రశ్నించాను. రెండు పార్టీలు ప్రయత్నించాలి. ప్రజల విశ్వాసాన్ని చూరగొనేందుకు.. రాజకీయ పార్టీలు ప్రజలను మోసం చేయకూడదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రజలు వారిని శిక్షించగలరు" అని విక్రమ్ గోఖలే తెలిపారు. -
అభిమానులకు శుభవార్త చెప్పిన సోనాలి
మరాఠి నటి సోనాలి కులకర్ణి తన పుట్టినరోజు(మే 18) సందర్భంగా అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. తను కునాల్ అనే వ్యక్తితో నిశ్చితార్థం చేసుకున్నట్టు ప్రకటించారు. లాక్డౌన్ విధించడానికి ముందే ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన తమ నిశ్చితార్థం జరిగిందని సోనాలి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘నా పుట్టిన రోజు ముగియడానికి ముందు నేను ఒక ప్రత్యేక ప్రకటన చేస్తున్నాను. నాకు కాబోయే భర్త కునాల్‌ను మీకు పరిచయం చేస్తున్నాను. 02-02-2020 రోజున మా ఇద్దరి నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడానికి ఇంతకంటే మంచి రోజు ఉంటుందని నేను అనుకోవడం లేదు. మాకు మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను’ అని సోనాలి తెలిపారు. ఈ సందర్భంగా ఓ ప్రముఖ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ... లండన్‌లో ఓ చిత్రం షూటింగ్ సమయంలో కునాల్‌తో పరిచయం అయినట్టు వెల్లడించారు. అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం జరిగినట్టు తెలిపారు. రెండు నెలల క్రితం దుబాయ్‌లో ఉంటున్న కునాల్‌ను కలవడానికి వెళ్లానని.. అయితే లాక్డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయానని చెప్పారు. కాగా, తొలుత మోడల్‌గా కేరీర్ ప్రారంభించిన సోనాలి.. ఆ తర్వాత పలు మరాఠి చిత్రాల్లో నటించారు. బాలీవుడు చిత్రం గ్రాండ్ మస్తీలో హీరో రితేష్ దేశ్‌ముఖ్ భార్య పాత్రల్లో కనిపించారు. View this post on Instagram Before my birthday ends, I want to mark it by making a SPECIAL ANNOUNCEMENT!!! Introducing my fiancé Kunal Benodekar! @keno_bear आमचा ०२.०२.२०२० ला साखरपुडा झाला, आणि आमचा हा आनंद तुम्हा सगळ्यांसोबत वाटण्यासाठी आजच्या पेक्षा योग्य दिवस असूच शकत नाही असं मला वाटतं... आपले शुभाशीर्वाद कायम पाठीशी असू द्या...!!! #sakharpuda #engaged #palindrome #02022020 #precovid #engagement #fiancé A post shared by Sonalee Kulkarni (@sonalee18588) on May 18, 2020 at 8:22am PDT -
ప్రేమ కథలకూ సిద్ధమే!
మంచి స్క్రిప్టులు దొరకాలే కానీ మరిన్ని ప్రేమకథా సినిమాల్లో నటించేం దుకు అభ్యంతరం లేదని జాతీయ అవార్డు గ్రహీత, మరాఠీ నటుడు ఉపేంద్ర లిమయే అంటున్నాడు. గిరీశ్ మోహితే తాజాగా రూపొందిస్తున్న ‘గురుపూర్ణిమ-ఏక్ లవెబుల్ స్టోరీ’ మనోడి తాజా సినిమా. సినిమాకు సంబంధించి అన్నింటికంటే తనకు కథే ముఖ్యమని, అదే ప్రేమకథైనా ఫర్వాలేదనని స్పష్టం చేశాడు. ‘మంచి స్క్రిప్టులు ఉంటే రొమాంటిక్ సినిమాల్లో నటించడానికి అభ్యంతరాలు లేవు. నా వరకైతే కథే కీలకం. ఆసక్తికరంగా అనిపించే స్క్రిప్టుల కోసం నిరంతరం అన్వేషిస్తుంటాను’ అని ఉపేంద్ర వివరించాడు. గురుపూర్ణిమలో ఉపేంద్ర సరసన సాయి తమహంకర్ కనిపిస్తుంది. కాలేజీ యువలెక్చరర్, విద్యార్థిని మధ్య నడిచే ప్రేమ వ్యవహారం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ‘గురుపూర్ణిమ నా మొదటి ప్రేమకథా సినిమా కాదు. నాకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన జోగ్వా చిత్రంలోనూ ప్రేమకథ ఉంటుంది. ఇందులో సామాజిక సందేశం ఉన్నప్పటికీ, ఇది రొమాంటిక్ సినిమాయే’ అని ఉపేంద్ర వివరించాడు. ఇక గురుపూర్ణిమ సినిమా ట్రైలర్‌ను నిర్మాత మేధా మనోజ్ కాకులో, దర్శకుడు గిరీశ్, చిత్ర యూనిట్ సభ్యుల సమక్షంలో ఇటీవల ముంబైలో విడుదల చేశారు. ఇది సెప్టెంబర్ 12న థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రేమకథా సినిమాలతో ఉపేంద్ర బిజీగా ఉంటున్నా, కెరీర్లో ప్రారంభంతో మాత్రం ముక్తా, కల్ కా ఆద్మీ వంటి యాక్షన్ సినిమాలనే ఎంచుకున్నాడు. మధుర్ భండార్కర్ తీసిన ట్రాఫిక్సిగ్నల్, పేజ్ 3, చాందినీబార్ వంటి హిందీ సినిమాల్లోనూ నటించాడు. భారతీయ సినిమా సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుందని, దానికి తగ్గట్టుగానే నటుడు స్క్రిప్టులను ఎంచుకోవాలని ఉపేంద్ర లిమయే అన్నాడు.