స్టేజీపై నటిస్తూ కన్నుమూసిన ప్రముఖ నటుడు | Marathi Actor Satish Joshi Passed Away On Stage | Sakshi
Sakshi News home page

Satish Joshi: స్టేజీపై కుప్పకూలి తుదిశ్వాస విడిచిన నటుడు

May 13 2024 12:30 PM | Updated on May 13 2024 12:43 PM

Marathi Actor Satish Joshi Passed Away On Stage

ప్రముఖ నటుడు సతీష్ జోషి చనిపోయారు. స్టేజీపై నటిస్తూ తుదిశ్వాస విడిచారు. మరాఠీలో పలు సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. ఇప్పుడు ఇలా అకాల మరణం చెందడం అభిమానులు షాక్‌కి గురిచేసింది. సతీష్ మరణించిన విషయాన్ని ఈయన ఫ్రెండ్ రాజేశ్ దేశ్ పాండే సోషల్ మీడియాలో ధ్రువీకరించారు.

(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరో నాగచైతన్య తల్లి!)

'మా స్నేహితుడు సతీష్ జోషి.. మరణానికి ముందు రంగోత్సవ్‌లో వేదికపై నటించారు. ఉదయం 11 గంటలకు చనిపోయారు. అయితే తుదిశ్వాస విడవడానికి ముందు కూడా ఆయన ఎంతో ఎనర్జీతో కనిపించారు' అని రాజేశ్ తన సంతాపాన్ని తెలియజేశారు.

మరాఠీ సీరియల్ 'భాగ్యలక్ష‍్మి'లో కీలక పాత్ర చేసిన సతీష్ జోషి.. బాగా పాపులర్ అయ్యారు. ఎప్పటికప్పుడు నాటకాల్లోనూ నటించేవారు. ఇప్పుడు ది క్రియేషన్ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా రామభూమిలో జరుగుతున్న వేడుకలో పాల్గొన్నారు. ఇందులోనే స్టేజీ ఫెర్ఫార్మెన్స్ ఇస్తూ తుదిశ్వాస విడిచారు. 

(ఇదీ చదవండి: ముట్టుకుంటే రూ.20 లక్షలు.. ఫొటోకి రూ.25 లక్షలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement