![Marathi Actors Hardeek Joshi, Akshaya Deodhar Gets Engaged, Photos Goes Viral - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/4/marathi-actor.jpg.webp?itok=iboaytCy)
ఆన్‌స్క్రీన్ మీద జంటగా కనిపించే తారలు నిజజీవితంలోనూ ఒక్కటైన సందర్భాలు చాలానే ఉన్నాయి. రీల్ లైఫ్‌లో హిట్ పెయిర్ అనిపించుకున్న మరాఠీ జంట రియల్ లైఫ్‌లోనే జత కట్టేందుకు రెడీ అయింది. 'తుజ్యత్ జీవ్ రంగ్ల' అనే సీరియల్‌లో హీరోహీరోయిన్‌గా నటించిన హార్దిక్ జోషి, అక్షయ డియోధర్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ మేరకు మే 3న నిశ్చితార్థం కూడా చేసుకున్నారు.
అతి కొద్దిమంది బంధుమిత్రుల మధ్య ఈ ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ విషయాన్ని అక్షయ 'ఎట్టకేలకు మా ఎంగేజ్‌మెంట్ జరిగిపోయింది' అన్న క్యాప్షన్ ఇస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పలు ఫొటోలు, వీడియోలు షేర్ చేసింది. అందులోని ఓ వీడియోలో అక్షయను తన మోకాలిపై కూర్చోబెట్టుకుని ఆమె వేలికి రింగ్ తొడిగి ప్రపోజ్ చేశాడు హార్దిక్. అనంతరం అక్షయ అతడి వేలికి ఉంగరం తొడిగి కాబోయే భర్తను హత్తుకుంది. ప్రస్తుతం వీరి ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాబోయే దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
చదవండి: సినీప్రియులకు ఆహా గుడ్‌న్యూస్, మేలో ఏకంగా 40కి పైగా సినిమాలు!
Comments
Please login to add a commentAdd a comment