నటుడితో ప్రేమ? అవమానిస్తున్నారంటూ నటి భావోద్వేగం | Actress Rekha Ratheesh Reacts on Welcoming New Member To Family | Sakshi
Sakshi News home page

నటుడితో ప్రేమ? అవమానిస్తున్నారంటూ నటి భావోద్వేగం

Published Thu, Apr 25 2024 6:19 PM | Last Updated on Thu, Apr 25 2024 6:23 PM

Actress Rekha Ratheesh Reacts on Welcoming New Member To Family

సెలబ్రిటీల చుట్టూ పుకార్లు వైఫైలా ఉంటాయి. దాదాపు ప్రతి సెలబ్రిటీ ఎప్పుడో ఓసారి ఇలాంటి గాసిప్‌ల బారిన పడినవారే! మలయాళ నటి రేఖ రతీశ్‌ కూడా 42 ఏళ్ల వయసులో ఓ వ్యక్తిపై మనసు పారేసుకుందని, అతడిని మనువాడబోతుందంటూ పుకార్లు వెలువడ్డాయి. తన కుటుంబంలోకి కొత్త వ్యక్తి వచ్చేశాడని రకరకాలుగా కథనాలు అల్లేశారు. ఇది చూసిన రేఖకు ఒళ్లు మండిపోయింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'నేను ఈ మధ్యే కొత్త కారు కొన్నాను.

కారు కొన్నా..
మీడియా నావెంట వెంటపడతుందనే షోరూమ్‌కు వెళ్లలేదు. నా కుమారుడు, మేనల్లుడు కలిసి షోరూమ్‌కు వెళ్లి కారు తీసుకున్నారు. నా సంతోషాన్ని అభిమానులతో పంచుకోవాలని సోషల్‌ మీడియాలో ఫోటోలు షేర్‌ చేశాను. అది చూసిన కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్‌ ఇష్టారీతిన కథనాలు అల్లేశాయి. నా కుటుంబంలోకి కొత్త వ్యక్తిని స్వాగతించానంటూ నాతో పని చేసిన ఓ నటుడి ఫోటోను జత చేసి ఏదేదో రాశారు. ఇంత నీచానికి దిగజారుతారా?

ఓపక్క చెత్త కామెంట్లు..
నాకంటూ ఓ కుమారుడున్నాడు. వీళ్ల వార్తలు చూసి చుట్టూ ఉన్నవాళ్లు అతడిని ఎంత హేళన చేస్తారో మీకేమైనా అర్థమవుతుందా? ఇప్పటికే ఆన్‌లైన్‌లో చెత్త కామెంట్లు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడిలా ఏది పడితే అది రాయడం వల్ల నా కుటుంబసభ్యులే నన్ను అనుమానిస్తూ అవమానించారు. ఎంతో బాధేసింది. నాతో లింక్‌ పెట్టిన ఆ నటుడు నన్ను చెల్లి అని పిలుస్తాడు. మీరు నా రిలేషన్‌షిప్‌ కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. కానీ నాకు మళ్లీ పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదు. నా కుమారుడే నా ప్రపంచం' అని నటి కుండ బద్ధలు కొట్టింది.

 

 

చదవండి: చాహల్‌.. ధనశ్రీని పెళ్లి చేసుకుని తప్పు చేశావ్‌! 'వీడియోలో అతడెవరు?'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement